
'ఆ మార్పు నిశ్శబ్ద విప్లవం'
దీ,
న్యూఢిల్లీ: మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా తాను చాలా నేర్చుకున్నానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆదివారం ప్రధాని రేడియో కార్యక్రమం మన కీ బాత్ ద్వారా ప్రధాని మోదీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తక్కువ ఖర్చుతో దేశ ప్రజలు ఖాదీ వస్త్రాలు ధరించడం ద్వారా చేనేత కార్మికులను ప్రోత్సహించినట్లవుతుందని చెప్పారు. పర్యాటకరంగంలో భారత్కు చాలా అవకాశాలు ఉన్నాయని ప్రధాని చెప్పారు. ధనికులు గ్యాస్ రాయితీ వదులుకుని పేదలకు చేయూత నివ్వాలని, ఇప్పటికే 30 లక్షల మంది తమ గ్యాస్ సబ్సిడీలను వదులుకున్నారని ఇదొక నిశబ్ద విప్లవం అని ప్రధాని అన్నారు.
సెల్ఫీ విత్ డాటర్ కార్యక్రమం విజయవంతమైందని చెప్పిన ఆయన ప్రజల సలహాలు పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. బీహార్ ఎన్నికలు పూర్తయ్యే వరకు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నిషేధించాలని కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న విజ్ఞప్తిని ఈసీ తోసిపుచ్చడంపట్ల మోదీ సంతోషం వ్యక్తం చేశారు. అంతకుముందు ఎన్నికల కమిషన్ ఒక నియామక సంస్థగానే పనిచేసిదిగా ఉండేదని, ఇప్పుడు నిజమైన దోహదకారిగా పనిచేస్తుందని, ఈ సందర్భంగా ఈసీకి అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. దేశంలోని ప్రతి యువకుడు ఓటు రిజిస్ట్రేషన్ చేసుకొని సమయం వచ్చినప్పుడు దానిని వినయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.