Silk Air Lines
-
హైదరాబాద్‌కు బయల్దేరిన 146 తెలుగువారు
సింగపూర్ : లాక్డౌన్ కారణంగా సింగపూర్ చిక్కుకుపోయిన తెలుగు రాష్ట్రాలకు ప్రవాసులను అక్కడి తెలుగు సమాజం స్వదేశానికి పంపించే ఏర్పాట్లు చేసింది. తెలుగు సమాజం సౌజన్యంతో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 146 మంది సిల్క్ ఎయిర్ విమానంలో సింగపూర్ నుండి బయల్దేరారు. వీరిలో 82 మంది తెలంగాణ వారు, 62 మంది ఆంధ్రప్రదేశ్ వారు ఉండగా... ఇద్దరు తమిళనాడుకు చెందిన వారు ఉన్నారు. గురువారం మధ్యాహ్నం ఈ విమానం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటుంది. ఈ విమానం ఏర్పాటులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంతో సహకరించారని సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షుడు కోటి రెడ్డి అన్నారు. సకాలంలో అనుమతులు ఇచ్చిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ విమానం ఏర్పాటుకు సహకరించిన కపిల్ ఏరో సీఈఓ చిన్నబాబు, తెలంగాణ అండ్ ఏపీ ఏవియేషన్ ఎండీ భరత్ రెడ్డికి సింగపూర్ తెలుగు సమాజం తరపును జనరల్ సెక్రటరీ సత్యా చిర్ల ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఈ విమానంలో ఉన్న 62 మంది ఏపీ వాసులను హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకుని వెళ్లడంలో సాయం చేస్తున్న ఏపీఎన్ ఆర్టీ చైర్మన్ మేడపాటి వెంకట్‌కు తెలుగు సమాజం అధ్యక్షులు కోటి రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. -
సర్వీసులకు ‘సిల్క్’ టాటా!
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం–సింగపూర్ల మధ్య వారానికి మూడు రోజులు నడుస్తున్న సిల్క్ ఎయిర్ వేస్ తన సర్వీసులకు గుడ్‌బై చెప్పనుంది. 2011 నుంచి నడుస్తున్న ఈ సర్వీసు అంతగా లాభదాయకంగా లేకపోవడంతో వచ్చే అక్టోబర్ నుంచి సేవల నుంచి నిష్క్రమించనుంది. అప్పట్లో విశాఖ నుంచి నేరుగా సింగపూర్‌కు ప్రారంభమైన తొలి సర్వీసు ఇదే. గ్లోబల్ డెస్టినేషన్ సర్వీసు (జీడీఎస్)గా ఇది ఏడేళ్ల నుంచి నడుస్తోంది. ఈ ఎయిర్‌లైన్స్ టిక్కెట్టు ధరలోనే ప్రయాణికులకు భోజనం సమకూరుస్తుంది. అంతేకాదు.. 30 కేజీల వరకు లగేజీని ఉచితంగా అనుమతిస్తుంది. టిక్కెట్టు ధర డిమాండ్‌ను బట్టి రూ.14–20 వేల వరకు ఉంది. అయితే ఈ సర్వీసుకు ఆశించిన స్థాయిలో ఆదరణ లేకపోవడంతో రద్దు చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చింది. దాని స్థానంలో అదే యాజమాన్యానికి చెందిన స్కూట్ ఎయిర్వేస్ సర్వీసును నడపాలని తాజాగా నిర్ణయించింది. ఇది లోకాస్ట్ కారియర్ (ఎల్సీసీ). ఈ స్కూట్ సర్వీసులు దేశంలోని విశాఖలాంటి టైర్–2 శ్రేణి నగరాలకు సింగపూర్ ఎయిర్‌లైన్స్ నడుపుతోంది. ఈ విమాన చార్జీలు మధ్య తరగతి ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుత అంచనాల ప్రకారం ఈ విమాన టిక్కెట్టు విశాఖ నుంచి సింగపూర్‌కు రూ.11–14 వేల మధ్య ఉండవచ్చని తెలుస్తోంది. ఇందులో ఏడు కిలోల వరకు లగేజిని ఉచితంగా తీసుకెళ్లేందుకు అనుమతించే అవకాశం ఉంది. వచ్చే అక్టోబర్ 27 నుంచి ప్రస్తుతం నడుస్తున్న సిల్క్ ఎయిర్వేస్ సర్వీసు నిలిచిపోనుండగా, అదే నెల 29 నుంచి విశాఖ–సింగపూర్ల మధ్య కొత్త స్కూట్ ఎయిర్ సర్వీసు నడపాలని నిర్ణయించింది. దీంతో ఏడేళ్లుగా విశాఖలోని సిరిపురంలో నడుస్తున్న సిల్క్ ఎయిర్వేస్ కార్యాలయం మూతపడి, దాని స్థానంలో స్కూట్ ఎయిర్వేస్ ఆఫీసు ప్రారంభమవుతుందన్నమాట! -
విమానంలో మహిళ పట్ల అసభ్య ప్రవర్తన..
- ప్రయాణికుడి అరెస్ట్ హైదరాబాద్‌సిటీ సింగపూర్ నుంచి హైదరాబాద్ వస్తున్న సిల్క్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఓ మహిళ పట్ల ప్రయాణికుడు అసభ్యంగా ప్రవర్తించాడు. రాజీవ్‌గాంధీ ఎయిర్‌పోర్టులో దిగిన అనంతరం సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన మలేసియా ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.