సిల్క్ ఎయిర్ లైన్స్ విమానంలో సాంకేతిక లోపం
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి సింగపూర్ వెళ్లవలసిన సిల్క్ ఎయిర్ లైన్స్ విమానంలో మంగళవారం ఉదయం సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో ఆ విమానం శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో నిలిచిపోయింది. దాంతో సిల్క్ ఎయిర్ లైన్స్ విమానంలోని ప్రయాణికులను మరోక విమానంలో సింగపూర్‌కు పంపారు. సిల్క్ ఎయిర్ లైన్స్ విమానంలో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని నివారించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.