singara konda
-
ఉభయ దేవతా పుణ్యక్షేత్రం సింగరకొండ..!
ఆంద్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా అద్దంకికి చేరువలో ఉన్న పుణ్యక్షేత్రం సింగరకొండలో లక్ష్మీనరసింహస్వామి క్షేత్రపతిగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి క్షేత్రపాలకునిగా పూజలు అందుకుంటున్నారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి తిరునాళ్ల ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో అత్యంత వైభవంగా జరుపుతారు. ప్రస్తుతం 70వ తిరునాళ్ల మహోత్సవాలు ఫాల్గుణ శుద్ధ త్రయోదశి, బుధవారం ఆరంభం అయ్యాయి.ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి, ఉగ్ర నరసింహ స్వామి దేవాలయాలు ప్రసిద్ధి చెందినవి. శింగరకొండ అద్దంకి నుంచి 6 కి.మీ. దూరంలో భవనాసి చెరువు ఒడ్డున ఉంది. మొదట్లో సింగనకొండ అని పిలిచిన నరసింహ క్షేత్రం తర్వాత తర్వాత సింగరకొండ ఆంజనేయ స్వామి క్షేత్రం గానే ప్రఖ్యాతి గాంచింది. సింగరకొండపై లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉండగా కొండ దిగువన చెరువు ఒడ్డున ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం ఉంది. ప్రసన్నాంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకుంటే భూతప్రేత పిశాచ పీడలు నివారణ అవుతాయని, అనారోగ్య సమస్యలు నివారణ అవుతాయని, దీర్ఘకాలిక వ్యాధులు కూడా తగ్గుతాయని స్థానికులు చెబుతారు. ఇక కొండ దిగువన ఉన్న ప్రసన్నాంజనేయ స్వామికి స్థల పురాణం ఉంది. తమ తల్లి కోసం వెతుకుతూ దక్షిణాపథం బయలుదేరిన ఆంజనేయుడు, ఇక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకొన్నారని నమ్మకం. అందుకే ఇక్కడ ఆంజనేయుడు దక్షిణాముఖుడై కనపడతాడు. అద్దంకి తాతాచార్యులు అనే గొప్ప భక్తుడు సింగరకొండలో కొండపై గల నరసింహ స్వామి గుడియందు ధ్వజారోహణ చేస్తుండగా, కొండకింద ఒక దివ్యపురుషుడు ఒక ఆంజనేయ విగ్రహానికి హారతి ఇస్తూ కనిపించడంతో పరుగు పరుగున కిందికి వెళ్లగా తాతాచార్యుల వారికి ఆ పురుషుడు మాయం అయ్యాడు. దివ్యకాంతులు వెదజల్లుతూ ఆంజనేయ విగ్రహం కనపడింది.అలా మహర్షి ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించడాన్ని తాతాచార్యులతోబాటు కొండమీద ఆలయ పనిలో ఉన్నవారెందరో చూశారు. వాళ్ళు కొండ దిగి వచ్చి చూసేసరికి ఆ పుణ్యమూర్తి కనిపించలేదు. మహర్షి ప్రతిష్ఠించిన విగ్రహం మహోజ్వలంగా వెలిగిపోతూ కనిపించింది. దాంతో ఆ గ్రామస్తులు, చుట్టుపక్కలవారు కలిసి, లక్ష్మీ నసింహ దేవాలయ నిర్మాణం పూర్తయ్యాక కొండ దిగువన ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం కూడా కట్టించారు. సమీప దర్శనీయ ఆలయాలు: అయ్యప్పస్వామివారి ఆలయం, షిర్డీ సాయిబాబావారి ఆలయం, శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయం, శ్రీ గాయత్రీ మాత ఆలయం, కొండపై నెలకొని ఉన్న శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం, శ్రీ అభయాంజనేయస్వామి విగ్రహం, శ్రీ కోదండరామ స్వామివారి ఆలయం చూడదగ్గవి. వసతి: సింగరకొండలో వసతి పొందాలనుకునేవారు దేవస్థానం ఏర్పాటు చేసిన కాటేజీలలో బస చేయవచ్చు. కనుక ఇక్కడికి వచ్చే యాత్రికులు మారుతి భవన్లో వసతి ΄పొందవచ్చు. తక్కువ ధరకే అద్దెకు లభిస్తుంది. ఈ భవన్ రెండు అంతస్తుల సముదాయం.ఎలా చేరుకోవాలంటే..?హైదరాబాద్ నుంచి 290 కిలోమీటర్లు, విజయవాడ నుంచి 110 కిలోమీటర్లు, ఒంగోలు నుంచి 36 కిలోమీటర్లు, అద్దంకి నుంచి 5 కిలోమీటర్ల దూరం.విమాన మార్గం ద్వారా: సమీప విమానాశ్రయం విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్ట్. అక్కడ దిగి క్యాబ్ లేదా టాక్సీలలో సింగరకొండ చేరుకోవచ్చు.రైలు మార్గం: ఒంగోలు రైల్వేస్టేషన్ సమీ΄ాన ఉంది. హైదరాబాద్, విజయవాడ నుంచి చెన్నై వెళ్ళే ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్ళన్నీ ఒంగోలు స్టేషన్లో ఆగుతాయి.రోడ్డు/ బస్సు మార్గం: సమీప బస్ స్టాప్ – అద్దంకి. హైదరాబాద్, విజయవాడ, ప్రకాశం నుంచి అద్దంకికి బస్సులు ఉన్నాయి. ఒంగోలు నుంచి: బస్సు ప్రయాణీకులు అద్దంకి వెళ్లే బస్సు ఎక్కాలి. అద్దంకి నుంచి సింగరకొండకు ప్రతి అరగంటకీ బస్సులు ఉన్నాయి. సింగరకొండ తిరునాళ్లగా ప్రసిద్ధికెక్కిన ఈ తిరునాళ్లు ఫాల్గుణ శుద్ధ త్రయోదశి నుంచి హోలీపూర్ణిమ వరకు మూడురోజులపాటు జరుగుతాయి. ఇరువురు స్వాములకూ విశేష పూజలు జరుగుతాయి. ( చదవండి: 'మిల్లెట్ కేక్' తయారీతో కోట్ల రూపాయల టర్నోవర్..! మోదీ ప్రశంసతో ఒక్కసారిగా..) -
పదేళ్ల తర్వాత నెరవేరుతున్న కల
సాక్షి, అద్దంకి(ప్రకాశం) : జిల్లాలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానానికి పదేళ్ల తర్వాత పాలక మండలి ఏర్పాటు కోసం దేవాదాయ శాఖ గత నెల 30న జీవో నంబర్ 986ను జారీ చేసింది. వార్షికాదాయం రూ.3 కోట్ల ఆదాయం ఉండి..అసిస్టెంట్ కమిషనర్ స్థాయి దేవస్థానమైన శింగరకొండకు జనవరి నాటికి తొమ్మిది మందితో కూడిన పాలక మండలి కొలువుదీరనుంది. పాలకమండలి ఏర్పాటుకు టీడీపీ ప్రభుత్వం మంగళం శింగరకొండ దేవస్థానానికి ప్రతి రెండేళ్లకు ఒకసారి పాలక మండలిని ఏర్పాటు చేస్తారు. 2008 ఆగస్టు వరకు ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన చిన్ని శ్రీమన్నారాయణ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన పదవీ కాలం పూర్తయింది. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కొనసాగుతూ గొట్టిపాటి రవికుమార్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పాలక మండలి నియామకం చేపట్టలేక పోయారు. ఆ తర్వాత టీడీపీ పాలనలో వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీకి ఫిరాయించిన ఎమ్మెల్యే రవికుమార్, అప్పటికే టీడీపీలో కొనసాగుతున్న కరణం బలరాంల మధ్య ఆధిపత్య పోరులో పాలక మండలి ఏర్పాటు కాలేదు. తాము చెప్పిన వారినే కమిటీలోకి తీసుకోవాలంటూ ఇద్దరు నేతలు పట్టుబట్టడంతో పాలక మండలిని నియమించలేకపోయారు. ఫలితంగా పదేళ్ల నుంచి దేవస్థానానికి పాలక మండలి లేకుండానే అధికారుల పాలనలో నడుస్తోంది. గత నెల 30న పాలక మండలి ఏర్పాటుకు జీవో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత గత నెల 30న దేవదాయ శాఖ జీవో నంబర్ 986 ద్వారా పాలక మండలి నియామకం కోసం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ జీవో ప్రకారం 9 మంది సభ్యులతో కూడిన పాలక మండలి ఏర్పాటుకు కసరత్తు మొదలైంది. ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 19న ఆఖరు తేదీగా ప్రకటించారు. మహిళలకు ప్రాధాన్యం దేవస్థానం కమిటీ సభ్యుల్లో 50 శాతం మంది మహిళలు ఉండాలి. మిగిలిన 50 శాతం మంది ఎస్సీ, ఎస్సీ, బీసీ (హిందువులై ఉండాలి) వర్గాలకు చెందిన వారికి కేటాయించనున్నారు. అర్హులైన వారు ఈ నెల 19వ తేదీ సాయంత్ర లోపు దేవస్థానం కార్యాలయంలో ఏసీ తిమ్మనాయుడుకి దరఖాస్తులు అందజేయాల్సి ఉంది. సభ్యులుగా దరఖాస్తు చేసే వారు కుల «ధ్రువీకరణ పత్రం, పాస్‌పోర్టు సైజు ఫొటోలు, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు జత చేయాలి. దరఖాస్తు గడువు ముగిసిన తర్వాత పరిశీలనతో జనవరి నాటికి నూతన పాలక మండలి ఏర్పాటు చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఆశావహులు మాత్రం తమను కమిటీ సభ్యులుగా నియమించాలంటూ ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. -
బీజేపీ, టీడీపీ పోలిటికల్ డ్రామ ఆడుతున్నారు
-
బడుగులపై పిడుగు
బల్లికురవ, ఇంకొల్లు, న్యూస్‌లైన్: బల్లికురవ మండలం కొత్తూరులో బత్తిన హనుమంతరావు, పెంట్యాల ఆంజనేయులుకు చెందిన మెట్టపొలం ఆరు ఎకరాలను అదే గ్రామానికి చెందిన పరిమి శింగరకొండ, యన్నం ఆంజనేయులు, మన్నెం అమరయ్యలు తలా రెండెకరాల చొప్పున కౌలుకు తీసుకుని మిర్చి సాగుచేశారు. వాతావరణం అనుకూలించడంతో పంట దిగుబడులు కూడా ఆశాజనకంగానే ఉన్నాయి. కోసిన మిర్చిని పొలాల్లోని కళ్లాలు చేసి ఎండబెట్టారు. సోమవారం ఉదయం ఆకాశం మేఘావృతమై ఉండటంతో వర్షం పడుతుందేమోనని పరిమి శింగరకొండ (45), యన్నం ఆంజనేయులు కుమారుడు రాఘవ (16), మన్నెం అమరయ్య కుమారుడు పవన్‌కుమార్ (12) కళ్లాల్లో ఉన్న మిర్చికి పరదాలు కప్పేందుకు పొలం వెళ్లారు. పరదాలు కప్పిన తరువాత వర్షం పెరగడంతో అక్కడే పరదాలతో వేసిన గుడారం కిందకు ముగ్గురూ చేరారు. ఆ గుడారమే వారి పాలిట మృత్యుకుహరమైంది. గుడారంపై పిడుగు పడటంతో ముగ్గురూ అక్కడికక్కడే మృతిచెందారు. పశువులు తోలుకుని ఉదయం 11 గంటల సమయంలో పొలం చేరుకున్న గ్రామస్తులు ముగ్గురూ మరణించడం గమనించి గ్రామస్తులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని అద్దంకి సీఐ వీవీ రమణకుమార్ సందర్శించి మృతుల కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. వీఆర్వో పోతురాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. రెక్కాడితేగానీ..డొక్కాడని కుటుంబాలు: పరిమి శింగరకొండ, యన్నం ఆంజనేయులు, మన్నెం అమరయ్యలు బంధువులు. వీరు ముగ్గురికీ సెంటు భూమిలేదు. రెక్కాడితేగానీ డొక్కాడని బతుకులు వారివి. వీరు కలిసి పొలం కౌలుకు తీసుకుని తలా రెండెకరాల మెట్ట, రెండెకరాల మాగాణిలో మిర్చి, వరి సాగు చేస్తూ కుటుంబాలు నెట్టుకొస్తున్నారు. పిడుగుపాటుకు మృతిచెందిన శింగరకొండకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆంజనేయులుకు కుమారుడు రాఘవ, కుమార్తె అంజమ్మ ఉన్నారు. అంజమ్మను శింగరకొండ కుమారుడు శివకు ఇచ్చి వివాహం చేశారు. రాఘవ ఇటీవల జరిగిన పదో తరగతి పరీక్షల్లో సీ గ్రేడులో ఉత్తీర్ణుడయ్యాడు. ఇంటర్మీడియెట్‌లో చేరే పనిలో ఉన్నాడు. అమరయ్యకు ఇద్దరు కుమారులు కాగా.. పెద్ద కుమారుడు పవన్‌కుమార్ చనిపోయాడు. దీంతో ఈ మూడు కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. మృతుల బంధువుల రోదనలతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. పూసపాడులో... ఇంకొల్లు మండలం పూసపాడుకు చెందిన గంటా వెంకట సుబ్బారావు మిరప సాగు చేశాడు. కోతలు పూర్తయి కళ్లాల్లో ఆరబెట్టారు. సోమవారం తెల్లవారుజామున ఆకాశం మేఘావృతమై ఉండటంతో మరో ఐదుగురితో కలిసి మిర్చిపై పరదాలు కప్పేందుకు వెళ్లారు. మిరపకాయలు తడవకుండా పట్టలు కప్పుతుండగా ఒక్కసారిగా పిడుగు పడింది. దీంతో శీలం కనకాంబరం (42) అనే కూలీ అక్కడికక్కడే మృతిచెందాడు. పక్కనే ఉన్న మృతుని కుమారుడు క్రాంతికుమార్, గంటా వెంకట సుబ్బయ్య, శీలం అనీల్, శీలం సన్ని, మద్దిరాల సుందరరావులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని హుటాహుటిన చీరాల ఆస్పత్రికి తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీఆర్ఓ జి.కోటయ్య ఫిర్యాదు మేరకు ఇంకొల్లు ఏఎస్ఐ ఆర్.ఎస్.ఎన్ మూర్తి కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబాలను గ్రామ సర్పంచ్ పర్చూరు సింగయ్యతో పాటు పరామర్శించారు. కనకాంబరం వ్యవసాయ కూలిపనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇద్దరు ఆడపిల్లలకు వివాహం చేశాడు. కుమారుడిని కష్టపడి చదివిస్తున్నాడు. పిడుగుపడి కనకాంబరం మృతిచెందగా..తండ్రికి సాయమందించేందుకు వెళ్లిన కొడుకు క్రాంతికుమార్ గాయాలపాలవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.