singer adnan sami
-
కూతురికి ప్రముఖ సింగర్ కాస్ట్లీ గిఫ్ట్
ప్రముఖ సింగర్, సంగీత కారుడు అద్నాన్ సమీ తన కూతురుకోసం విలువైన బహుమతిని కొనుగోలు చేశారు. తన చిన్నారిని ఈజీగా క్యారీ చేసేందుకు వీలుగా స్ట్రోలర్‌ను కొన్నారు. అద్నాన్, రొయా సమీ దంపతుల రెండేళ్ల కుమార్తె మెడీనా జాన్ మే 8వ తేదీన రెండవ పుట్టిన రోజు బహుమతిగా ఈ వెరీ స్పెషల్ స్ట్రోలర్‌ను ఇచ్చారు. అదీ ఐకానిక్ బ్రిటిష్ ఆటోమొబైల్ తయారీ దారు ఆస్టన్ మార్టిన్ కంపెనీది కావడం విశేషం. దీని ఖరీదు 4500 డాలర్లు (రూ. 3,14,696) తనకు అరుదైన కార్లు, జేమ్స్ బాండ్సినిమాలు అంటే చాలా ఇష్టమనీ అద్నాన్ చెప్పాడు. అలాగే తన కూతురికి కూడా స్పెషల్ స్ట్రోలర్ ఉండాలని కోరుకుంటున్నానని మీడియాకు తెలిపాడు. ఇందులో వుండే లెదర్‌ను చాలా స్మూత్‌గా ఉండేలా, స్పెషల్ కలర్‌తో డిజైన్ చేయించినట్టు తెలిపారు. అలాగే తన గారాలపట్టి పుట్టిన రోజు వేడుకలు కొనసాగుతున్నా యంటూ అద్నాన్ సమీ తన ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలియజేశాడు. ఈ సందర్భంగా పాపకోసం ఒక సందేశాన్ని కూడా యాన పోస్ట్ చేశాడు. కాగా అద్నాన్ సమీ తొలిసారి 1993లో పాకిస్థానీ నటి జీబా బక్తియార్ ని వివాహమాడాడు. వీరికి అజాన్ సమీ ఖాన్ అనే కుమారుడు ఉన్నాడు. ఆ తర్వాత అరబ్ సబా గలాదారి అనే యువతిని 2001లో వివాహమాడాడు. అయితే జెర్మన్ గార్ల్ రొయా సమీ ఖాన్ అద్నాన్ సమీకి మూడవ భార్య. వీరికి గత ఏడాది మే నెలలో మెడీనా సమీ ఖాన్‌కు జన్మించిన సంగతి తెలిసిందే A day at the Carnival in Munich, Germany with my angel Medina Jaan!😘😘💖💖🤗🤗🥰🥰😍😍 . .#babakijaan #daughterandfather #happybirthday #daughterlove #daddyslittlegirl #daddysangel #love #india #bollywood #munich #munchen #germany #carnival #fair pic.twitter.com/e7qAWrwdFM — Adnan Sami (@AdnanSamiLive) May 10, 2019 -
హీరోగా మారనున్న ప్రముఖ సింగర్
ముంబై: ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీ నటుడిగా మారనున్నారు. రాధికారావు, వినయ్ సప్రే దర్శకత్వంలో త్వరలో రూపుదదిద్దుకోనున్న‘అఫ్ఘాన్ ఇన్ సెర్చ్ ఆఫ్ ఏ హోమ్’ సినిమాలో ఆయన నటించనున్నారు. వీరిద్దరి దర్శకత్వంలో పనిచేయటం చాలా సంతోషంగా ఉందని సమీ పేర్కొన్నారు. దశాబ్ద కాలంగా వీరిద్దరితో స్నేహబంధం కొనసాగుతోందని తెలిపారు. ఈ సినిమాలో ఆయన అఫ్ఘానిస్తాన్‌లో పుట్టి పెరిగిన కళాకారుడిగా కనిపించనున్నారు. అనుకోని పరిస్థితుల్లో దేశం వదిలి వెళ్లిన ఆయన మరో దేశంలో ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారు ? అనేదే కథాంశం. భారత పౌరసత్వం లభించిన తర్వాత ఆయన చేపట్టిన మొదటి ప్రాజెక్టు ఇదే. బ్రిటన్‌లో పుట్టి పెరిగిన అద్నాన్కు ఏడాది క్రితం భారత పౌరసత్వం లభించింది. -
ఇక భారతీయుడిగా పాక్ సింగర్
న్యూఢిల్లీ: ప్రముఖ పాకిస్థాన్ గాయకుడు అద్నాన్ సమీ ఇక భారతీయుడు కానున్నాడు. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతీయ పౌరసత్వం ఇచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. జనవరి 1 నుంచి ఆయన అధికారికంగా భారతీయ పౌరుడిగా కొనసాగుతారని తెలిపింది. ఇటీవలె ఆయనకు శాశ్వత వీసాను కూడా ఇచ్చిన విషయం తెలిసిందే. తనకు భారతీయ పౌరసత్వం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సమీ గతంలోనే దరఖాస్తు చేసుకోగా రెండేళ్ల నుంచి దానిని అధికారులు తిరస్కరిస్తూ వచ్చారు. ఇటీవలె ఆ దరఖాస్తును తిరిగి విదేశాంగ శాఖకు పంపించగా దానికి తాజాగా ఆమోద ముద్ర వేసినట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. పాకిస్థాన్‌లోని లాహోర్ కు చెందిన అద్నాన్ తొలిసారి 2001, మార్చి 13న విసిటర్ వీసాపై భారత్‌లో అడుగుపెట్టాడు. అప్పుడు ఇస్లామాబాద్‌లోని భారతీయ హైకమిషన్ ఈ వీసాను మంజూరు చేసింది. కానీ, పాకిస్థాన్ మాత్రం ఆయనకు పాస్ పోర్టును 2010 మే 27న ఇవ్వగా దానికి 2015, మే 6తో కాలపరిమితి ముగిసింది. తిరిగి పాస్ పోర్టును ఆయన రెనివల్ కూడా చేసుకోలేదు. ఆ తర్వాత మానవత దృక్పథంతో ఆలోచించి తనకు భారత్‌లోనే చట్టబద్దంగా ఉండేందుకు అనుమతించాలని కోరుతూ సిటిజన్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోగా ఆమోదం లభించింది. దీంతో ఇక అద్నాన్ కూడా భారతీయుడిగా మారనున్నాడు.