Single roads
-
ఏళ్ల తరబడి సింగిల్ రోడ్డే!
సూళ్లూరుపేట–శ్రీకాళహస్తికి వెళ్లే రోడ్డు ఏళ్ల తరబడి సింగిల్‌రోడ్డుగానే ఉంది. ఈ రోడ్డుపై ప్రయాణం చేయాలంటే వాహనాల డ్రైవర్లు భయపడిపోతున్నారు. ఈ రోడ్డు మార్జిన్లో గుంతలు ఏర్పడ్డాయి. దీంతో ఎదురుగా వాహనాలు వచ్చినప్పుడు రోడ్డు పక్కకు దిగితే లారీల యాక్సిల్ లేదా కట్టలు ఎక్కడవిరిగిపోతాయోనని ఆందోళన చెందుతున్నారు. మన్నారుపోలూరు (సూళ్లూరుపేట): సూళ్లూరుపేట–శ్రీకాళహస్తికి వెళ్లే మార్గంలో చిత్తూరు జిల్లా బుచ్చినాయుడు కండ్రిగ దాకా అంటే 19.5 కిలోమీటర్లు రోడ్డు నాలుగు దశాబ్దాలుగా సింగిల్ రోడ్డుగా ఉంది. పదేళ్ల క్రితం ఈ రోడ్డుపై అంతగా ట్రాఫిక్ ఉండేది కాదు. ఇప్పుడు రోజూ సుమారు 10 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. చెన్నై–కోల్కత్తా ఏషియన్ రహదారి నుంచి సుమారు ఆరు కిలోమీటర్లు నెల్లూరు జిల్లా పరిధిలో 13.5 కిలోమీటర్లు రోడ్డు చిత్తూరు జిల్లా పరిధిలో ఉంది. ఆర్అండ్బీ అధికారులు కూడా ఈ రోడ్డుపై ఇటీవల సర్వే చేశారు. రోజుకు 7 వేల నుంచి 10 వేల వాహనాల దాకా వెళుతున్నట్టుగా సర్వేలో తేలింది. నాలుగు వేల వాహనాలు దాకా తిరిగితే దాన్ని డబుల్ రోడ్డుగా మార్చాలనే నిబంధనలున్నాయి. సూళ్లూరుపేట ఆర్అండ్బీ అధికారులు సర్వేచేసి సుమారు రూ.30 కోట్లతో అంచనాలు తయారు చేసి పంపించినట్టుగా తెలుస్తోంది. ఇటీవల ఈ రూట్‌పై ట్రాఫిక్ పెరిగినా అందుకు తగినట్టుగా డబుల్రోడ్దు వేయాలనే ఆలోచన ఈ రెండు జిల్లాల అధికారులు, పాలకుల్లో కలగకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సింగిల్ రోడ్డు కావడంతో ప్రమాదాల సంఖ్య పెరిగింది. ఇటీవల ఈ మార్గంలో నాలుగు కంపెనీలు ఏర్పాటు చేశారు. ఎన్టీర్ స్వగృహ పథకం కింద పక్కాఇళ్లు నిర్మిస్తుండడంతో ఈ మార్గంలో ట్రాఫిక్ మరింత పెరిగింది. ఈ మార్గంలో రాత్రిళ్లు ద్విచక్ర వాహనాల్లో వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గంలో గ్రామాలూ ఎక్కువే సూళ్లూరుపేట నుంచి శ్రీకాళహస్తికి వెళ్లే మార్గంలో గ్రామాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. సూళ్లూరుపేట మండలంలోని మన్నారుపోలూరు, ఇలుపూరు, పెరిమిటిపాడు, కొండుంబట్టు, మంగళంపాడు, దామానెల్లూరు, మతకామూడి, ఉగ్గుమూడి, సుగ్గుపల్లి గ్రామాల ప్రజలే కాకుండా చిత్తూరుజిల్లా వరదయ్యపాళెం, సంతవేలూరు, కువ్వాకొల్లి, పాదనవారిపాళెం, అయ్యవారిపాళెం, కళత్తూరు, వరదయ్యపాళెం, మరదవాడ, బుచ్చినాయుడుకండ్రిగ గాజుల పెళ్లూరు, బుచ్చినాయుడుకండ్రిగ, నీరుపోకకోట, కాంపాళెం, కుక్కంబాకం గ్రామాల ప్రజలు ఈ మార్గం గుండానే సూళ్లూరుపేటకు రాకపోకలు సాగిస్తున్నారు. అపాచి కంపెనీకి వెళ్లే కార్మికులు ఈ గ్రామాలకు చెందిన వారు ఎక్కువగా ఉండడంతో పలుమార్లు ప్రమాదాలబారిన పడుతున్నారు. ఈ మార్గంలో జరిగిన ప్రమాదాలను ఏడాదిగా తీసుకుంటే సుమారు 15 మంది ప్రాణాలు కోల్పోయారు. 58 మంది మంది క్షతగాత్రులయ్యారు. మంత్రి హామీలు నీటి మూటలేనా! గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్అండ్బీ మంత్రిగా పనిచేసిన పితాని సత్యనారాయణ ఓ మారు ఫ్లెమింగో ఫెస్టివల్‌కు వచ్చినపుడు ఈ రోడ్డును డబుల్ రోడ్డుగా విస్తరించేందుకు రూ.10 కోట్లు మంజూరు చేస్తున్నానని సూళ్లూరుపేటలో జరిగిన ప్రెస్మీట్లో చెప్పారు. అది ఇంతవరకు అమలు కాలేదు. ఈ రోడ్డులోనే మున్సిపాలిటీ అధికారులు ఎన్టీఆర్ స్వగృహకు సంబంధించిన ఇళ్లు నిర్మిస్తున్నారు. ఈ ఇళ్లు నిర్మాణాలను పరిశీలించేందుకు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పలుమార్లు ఈ మార్గంలో తిరిగినా రోడ్డు ఇలా ఉందేమిటి అని అధికారులను అడిగిన దాఖలాల్లేవు. ఈ రోడ్డు నిర్మాణం చేపట్టాలని టీడీపీ నాయకులు వేనాటి రామచంద్రారెడ్డి, పరసా రత్నం సీఎంకు పలుమార్లు విన్నవించామని, ఆయన టేబుల్మీద ఫైల్ పెట్టామని చెబుతూనే కాలం వెళ్లదీశారు. నరకం కనిపిస్తోంది సూళ్లూరుపేట నుంచి మన్నారుపోలూరు వెళ్లాలంటే నరకం కనిపిస్తోంది. ఈ మార్గంలో నాలుగు కంపెనీలు రావడంతో పాటు ఎన్టీఆర్ గృహాలు రావడంతో ట్రాఫిక్ పెరిగింది. దీనికి తగినట్టుగా రోడ్డు విస్తరణ చేయలేకపోయారు. టీడీపీ పాలకులు ఈ రోడ్డువైపు కనీసం కన్నెత్తి చూడలేదు.– శిరసనంబేటి కృష్ణారెడ్డి,వెలగలపొన్నూరు భయంగా వెళ్లాల్సి వస్తోంది సూళ్లూరుపేట–శ్రీకాళహస్తి మార్గంలో మోటార్‌సైకిల్‌పై భయం భయంగా వెళ్లాల్సి వస్తోంది. బుచ్చినాయుడుకండ్రిగ దాకా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని పోవాల్సి వస్తోంది. నేను చిన్నప్పటినుంచి చూస్తున్నా సింగిల్‌రోడ్డుగానే వదిలేశారు. మోటార్ సైకిల్‌పై వెళుతున్నపుడు ఎదురుగా వాహనం వస్తే కనీసం కిందకు దిగేందుకు కూడా వీలు లేకుంగా గుంతలు ఉన్నాయి. ఈ ప్రాంత ప్రజల రాకపోకలు క్షేమంగా సాగాలంటే డబుల్‌రోడ్డు వేయాల్సిందే.– హరీష్, సూళ్లూరుపేట -
సింగిల్ టు డబుల్
నల్లగొండ రూరల్ : ఇప్పటివరకు ఉన్న సింగిల్‌రోడ్లు ఇక డబుల్ రోడ్లుగా మారనున్నాయి. ప్రతినిత్యం రోడ్డు ప్రమాదాలతో ప్రయాణికులను హడలెత్తిస్తున్న గతుకులున్న, సింగిల్ రోడ్లను విస్తరించేందుకు ఆర్అండ్బీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నల్లగొండ ఆర్అండ్బీ డివిజన్ పరిధిలో ఉన్న పలు రోడ్లను విస్తరిస్తున్నారు. విస్తరించనున్న రోడ్లు ఇవే.. అత్యంత రద్దీగా ఉండే నల్లగొండ-కట్టంగూరు రోడ్డును 15 కిలోమీటర్ల మేర విస్తరించనున్నారు. ఈ విస్తరణ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మరోవారం రోజుల్లో ఇరువైపులా విస్తరింపజేసి కంకర వేసిన రోడ్డుపై బీటీ నిర్మాణం పూర్తి చేస్తారు. ఈ రోడ్డు 15 కిలోమీటర్ల మేర ఉండగా, అందులో 4.5 కిలోమీటర్లు సింగిల్ రోడ్డుగా ఉంది. ప్రస్తుతం కట్టంగూరు-నల్లగొండ మధ్య పూర్తిస్థాయి డబుల్ రోడ్డుగా మారనుంది. దీంతో సూర్యాపేట నుంచి నల్లగొండకు వచ్చే ఆర్టీసీ, ఇతర పాల వ్యాపారులు, ఆటోల ప్రయాణికులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం చేయవచ్చు. నల్లగొండ-చౌటుప్పల్ రోడ్డును డబుల్ రోడ్డుగా విస్తరించేందుకు ప్రైవేట్ కన్సల్టెన్సీ ద్వారా సర్వే నిర్వహిస్తున్నారు. ఈ రోడ్డు సింగిల్ రోడ్డుగా, గుంతలమయంగా ఉండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పాటు నిత్యం రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. సర్వే పూర్తయిన వెంటనే టెండర్లు పిలిచి రోడ్డు వెడల్పు చేసే పనులు నిర్వహించనున్నారు. దీంతో పాటు కనగల్-మాల్ మధ్య సింగిల్ రోడ్డు, సూర్యాపేట-శెట్టిపాలెం, నార్కట్‌పల్లి-అమ్మనబోలు రోడ్లను కూడా సర్వే చేస్తున్నారు. సింగిల్ రోడ్లను వెడల్పు చేసే పనులను అధికారులు వేగవంతంగా నిర్వహిస్తున్నారు. నల్లగొండ-ముషంపల్లి సింగిల్ రోడ్డు కూడా గుంతలమయంగా ఉండటంతో దానిని కూడా విస్తరించనున్నారు. నల్లగొండ నుంచి జీకే అన్నారం వరకు 3 కిలోమీర్లమేర పటిష్టంగా నిర్మిస్తున్నారు. -
రోడ్లపై ‘నిధుల వరద’
వరంగల్ రూరల్ : జిల్లాలోని రహదారులు, భవనాల శాఖకు నిధుల వరద తాకింది. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాల వరకు ఉన్న సింగిల్ రోడ్లను డబుల్ లేన్ రహదారులుగా అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం జిల్లాకు రూ.453.35 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 24 సింగిల్ రోడ్లను డబుల్ లేన్‌గా అభివృద్ధి చేసేందుకు రూ.281.05 కోట్లు, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాల వరకు ఉన్న 13 సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా అభివృద్ధి చేసేందుకు రూ.172.30 కోట్లు కేటాయించింది. ఈ రోడ్ల మధ్యలో ఉన్న కల్వర్టులు, బ్రిడ్జిల నిర్మాణాల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. డబుల్‌గా మారనున్న సింగిల్ రోడ్లు... ⇒ ఊకల్ నుంచి తొర్రూరు రోడ్డు 9/0 నుంచి 53/0 కి.మీ వరకు రూ.45 కోట్లు ⇒ జంగిలిగొండ నుంచి నర్సింహులపేట రోడ్డు 0/0నుంచి 15/0 కి.మీ వరకు రూ.15కోట్లు ⇒ పరకాల నుంచి ఎర్రగట్టుగుట్ట వరకు 2/0నుంచి 14/4 కి.మీ వరకు రూ.15కోట్లు ⇒ పెద్దపెండ్యాల నుంచి పున్నేలు రోడ్డు 0/0నుంచి 13/0 కి.మీ వరకు రూ.15కోట్లు ⇒ ఘనపూర్ నుంచి వర్థన్నపేట రోడు 13/8నుంచి 17/3 కి. మీ వరకు రూ.4కోట్లు ⇒ పురుషోత్తమాయగూడేం నుంచి ఎల్లంపేట 0/0నుంచి 14/450కి.మీ వరకు రూ. 14కోట్లు ⇒ సిర్సేడు నుంచి మొగుళ్లపల్లి 2/0నుంచి 13/0 కి.మీ వరకు రూ.12కోట్లు ⇒ ములుగు-బుద్దారం రోడ్డు 1/0నుంచి 16/2 కి. మీ వరకు రూ.15కోట్లు ⇒ రేగొండ నుంచి జాకారం వరకు 0/0 నుంచి 17/866 కి.మీ వరకు రూ.20కోట్లు ⇒ నర్సింహులపేట నుంచి ఉగ్గంపల్లి వరకు 0/0నుంచి 7/0 కి.మీ వరకు 7కోట్లు ⇒ ఆలేరు బచ్చన్నపేట రోడ్డు 6/475నుంచి 17/070 కి.మీ వరకు రూ.14కోట్లు ⇒ డోర్నకల్ నుంచి సీతారాంపురం 0/0నుంచి 9/0 కి.మీ వరకు రూ. 10కోట్లు ⇒ కాజీపేట నుంచి ఉనికిచర్ల 3/2నుంచి 6/0 కి.మీ వరకు రూ.3కోట్లు ⇒ మొండ్రాయి పాలకుర్తి 12/0నుంచి 16/8 కి.మీ వరకు రూ. 5కోట్లు ⇒ వర్థన్నపేట నుంచి అన్నారం 0/0నుంచి 10/0 కి.మీ వరకు రూ.12కోట్లు ⇒ చేర్యాల నుంచి సల్వాపూర్ -యాదగిరిగుట్ట 0/0నుంచి 20/6 కి.మీ వరకు రూ.20కోట్లు ⇒ పిడబ్ల్యూడీ రోడ్ నుంచి పర్వతగిరి వయా వడ్లకొండ 12/5నుంచి 14/660 కి.మీ వరకు రూ.2.50కోట్లు ⇒ కురవీ నుంచి ఎల్లందు ఎక్స్‌రోడ్ 0/0నుంచి 2/660 కి.మీ వరకు రూ.3కోట్లు ⇒ పోతన కళామందిర్ 0/0నుంచి 1/675, చింతల్ నుంచి ఖమ్మం రోడ్ వయా ఫోర్ట్వరంగల్ 1/0నుంచి 3/4వరకు రూ.6కోట్లు ⇒ హన్మకొండ- నర్సంపేట-మహబూబాబాద్ 7/0నుంచి 8/0 కి.మీ వరకు 2.75కోట్లు ⇒ వెంకటాపూర్ బ్రాంచ్ రోడు 0/0నుంచి 1/4 వరకు రూ.2.80కోట్లు ⇒ కందికొండ నుంచి చిన్నగూడూరు 0/0నుంచి 14/100 కి.మీ వరకు రూ.18కోట్లు ⇒ గిరిపురం నుంచి ఎల్లంపేట 0/0నుంచి 6/0వరకు రూ.10కోట్లు మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రాలకు వెళ్లే... ⇒ శాయంపేట మండలంలో... ఆత్మకూరు టు శాయంపేట 0/0 నుంచి 5/0 కి.మీ వరకు రూ.6కోట్లు ⇒ నెక్కొండ నుంచి ఇనుగుర్తి వరకు 1/0నుంచి 3/0 వరకు చింత నెక్కొండ 23/2 నుంచి 27/960 కి.మీ వరకు రూ.8కోట్లు ⇒ ధర్మసాగర్మడికొండ నుంచి ధర్మసాగర్ వరకు 0/0 -6/240 కి.మీ వరకు రూ.7.50కోట్లు ⇒ సంగెం మండలంలోని ఊకల్ నుంచి తొర్రూరు వరకు 0/0 నుంచి 9/0వరకు రూ.10.80కోట్లు ⇒ పాలకుర్తి మండలంలోని స్టేషన్ఘనపూర్ నుంచి పాలకుర్తి 3/0నుంచి 14/0వరకురూ.13050కోట్లు ⇒ జఫర్గడ్ మండలంలోని స్టేషన్ఘనపూర్ నుంచి జఫర్‌గఢ్ వరకు 0/0నుంచి 9/50వరకు రూ.11.50కోట్లు ⇒ పర్వతగిరి మండలంలో పీడబ్ల్యూడీ రోడ్ నుంచి ఉప్పరపల్లి వయా వడ్లకొండ వరకు 7/0నుంచి 14/661వరకు రూ.9.50కోట్లు ⇒ కొడకండ్ల మండలంలో ఎలచల్ కొడకండ్ల రోడ్డుకు 0/0నుంచి 4/030 వరకు రూ.5కోట్లు ⇒ తొర్రూరు నుంచి వలిగొండ రోడ్డు 9/3 నుంచి 7/50 కి.మీ వరకు రూ.15 ⇒ కొత్తగూడ మండలం...ఎల్లందు పాఖాల్ 4/8 నుంచి 5/91 కి. మీ వరకుర రూ.13.50కోట్లు ⇒ దుగ్గొండి మండలంలో మహ్మద్ గౌస్‌పల్లి నుంచి గిర్నిబావి రోడ్ వయా నందిగామ-దుగ్గొండ 0/0నుంచి 11/00 వరకు 13.30కోట్లు ⇒ మద్దూరు మండలంలో.. మర్రిముచ్యాల నంచి వడ్లకొండ 7కిమీ (మద్దురు)జనగామ హుస్నాబాద్ 27కిమీవరకు(తరిగొప్పుల) రూ.23కోట్లు ⇒ నర్మెట్ట మండలంలో... రఘునాథపల్లి నుంచి నర్మెట్ట రోడ్డు 0/0 నుంచి 22/3వరకు రూ.27కోట్లు ⇒లింగాలఘనపూర్ మండలంలో.. జనగామ సూర్యాపేట ఎక్స్‌రోడ్ 4/2నుంచి నెల్లుట్ల-బండ్లగూడేం రోడ్డు 0/0 నుంచి 7/2 వరకు రూ.8.70 కోట్లు