నల్లగొండ రూరల్ : ఇప్పటివరకు ఉన్న సింగిల్‌రోడ్లు ఇక డబుల్ రోడ్లుగా మారనున్నాయి. ప్రతినిత్యం రోడ్డు ప్రమాదాలతో ప్రయాణికులను హడలెత్తిస్తున్న గతుకులున్న, సింగిల్ రోడ్లను విస్తరించేందుకు ఆర్‌అండ్‌బీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నల్లగొండ ఆర్‌అండ్‌బీ డివిజన్ పరిధిలో ఉన్న పలు రోడ్లను విస్తరిస్తున్నారు.
విస్తరించనున్న రోడ్లు ఇవే..
అత్యంత రద్దీగా ఉండే నల్లగొండ-కట్టంగూరు రోడ్డును 15 కిలోమీటర్ల మేర విస్తరించనున్నారు. ఈ విస్తరణ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మరోవారం రోజుల్లో ఇరువైపులా విస్తరింపజేసి కంకర వేసిన రోడ్డుపై బీటీ నిర్మాణం పూర్తి చేస్తారు. ఈ రోడ్డు 15 కిలోమీటర్ల మేర ఉండగా, అందులో 4.5 కిలోమీటర్లు సింగిల్ రోడ్డుగా ఉంది. ప్రస్తుతం కట్టంగూరు-నల్లగొండ మధ్య పూర్తిస్థాయి డబుల్ రోడ్డుగా మారనుంది. దీంతో సూర్యాపేట నుంచి నల్లగొండకు వచ్చే ఆర్టీసీ, ఇతర పాల వ్యాపారులు, ఆటోల ప్రయాణికులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం చేయవచ్చు. నల్లగొండ-చౌటుప్పల్ రోడ్డును డబుల్ రోడ్డుగా విస్తరించేందుకు ప్రైవేట్ కన్సల్టెన్సీ ద్వారా సర్వే నిర్వహిస్తున్నారు.
ఈ రోడ్డు సింగిల్ రోడ్డుగా, గుంతలమయంగా ఉండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పాటు నిత్యం రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. సర్వే పూర్తయిన వెంటనే టెండర్లు పిలిచి రోడ్డు వెడల్పు చేసే పనులు నిర్వహించనున్నారు. దీంతో పాటు కనగల్-మాల్ మధ్య సింగిల్ రోడ్డు, సూర్యాపేట-శెట్టిపాలెం, నార్కట్‌పల్లి-అమ్మనబోలు రోడ్లను కూడా సర్వే చేస్తున్నారు. సింగిల్ రోడ్లను వెడల్పు చేసే పనులను అధికారులు వేగవంతంగా నిర్వహిస్తున్నారు. నల్లగొండ-ముషంపల్లి సింగిల్ రోడ్డు కూడా గుంతలమయంగా ఉండటంతో దానిని కూడా విస్తరించనున్నారు. నల్లగొండ నుంచి జీకే అన్నారం వరకు 3 కిలోమీర్లమేర పటిష్టంగా నిర్మిస్తున్నారు.
సింగిల్ టు డబుల్
Published Thu, Jan 1 2015 2:56 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement