Sinus infection
-
సైనసైటిస్‌తో బాధపడుతున్నారా? లక్షణాలు ఎలా ఉంటాయి?
సైనసైటిస్ వ్యాధి దీర్ఘకాలం బాధిస్తుంది. ముక్కు లోపలి భాగాల్లో ఉండే గాలి గదులను సైనస్ అని అంటారు. ఈ సైనస్‌లు ఇన్ఫెక్షన్కు గురికావడం వల్ల సైనసైటిస్ వస్తుంది. ముక్కుకు ఇరువైపులా నుదురు, కళ్ల చుట్టూ నొప్పులు ఉంటాయి. జలుబు, తలనొప్పి, ముక్కు దిబ్బడ వంటి లక్షణాలతో చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది. సైనస్‌ను తగ్గించుకోవడానికి ఎన్నో రకాల మందులు వాడినా పెద్దగా ఫలితం ఉండదు. అలాంటి వారు సహజసిద్ధ పద్ధతులతో సైనస్‌ను ఎలా తగ్గించుకోవచ్చో ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డా. నవీన్ నడిమింటి మాటల్లో తెలుసుకుందాం. అక్యూట్ సైనసైటిస్‌లో ముక్కు కారడం, ముఖంలో ఒత్తిడి, నొప్పి, వాసన గ్రహించే శక్తి తగ్గడం లాంటి లక్షణాలు ఉంటాయి. ఇది నాలుగు వారాల్లోగా తగ్గుతుంది. సాధారణ జలుబు వల్ల ఈ సమస్య వస్తుంది. పదే పదే సైనసైటిస్ రావడం వల్ల అది క్రానిక్ గా మారుతుంది. ఇది 12 వారాల వరకు ఉంటుంది. సాధారణంగా దీనికి బ్యాక్టీరియా కారణం అవుతుంది. ముక్కు కారుతూ, ముఖ భాగాల్లో నొప్పి ఉండి, పది రోజుల వరకు లక్షణాలు తగ్గకపోతే అది బ్యాక్టీరియా వల్ల వచ్చిన సైనసైటిస్ కావొచ్చు. "సైనసైటిస్ అనేది చాలా రకాల కారణాల నుంచి వస్తుంది. కాలుష్యం, వైరల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్, ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల సైనసైటిస్ వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. వీటితో పాటు అలర్జీ వల్ల కూడా దీని బారిన పడే ప్రమాదం ఉంది. ముక్కులో ఎముక వంకరగా ఉన్నా, పిల్లల్లో ఎడినాయిడ్ సమస్య ఉన్నా సైనసైటిస్ రావొచ్చు. డయాబెటిస్తో బాధపడేవారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అలాంటి వారు దీని బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. షుగర్ వ్యాధితో బాధడేవారికి ఫంగల్ ఇన్ఫెక్షన్లు కూడా త్వరగా వస్తాయి" అని ప్రముఖ ఈఎన్టీ వైద్యులు, డాక్టర్ సి.ఆంజనేయులు చెప్పుకొచ్చారు. సైనస్ లక్షణాలు ఇలా ఉంటాయి.. సైనస్ లక్షణాలు ఎలా ఉన్నాయి? అవి ఎంత కాలం నుంచి ఉన్నాయి? అనే దాన్ని బట్టి చికిత్స ఉంటుంది. జలుబు, అలర్జీలను తగ్గించే ముందులు, ముక్కు దిబ్బడను తగ్గించే డీ-కంజెస్టెంట్స్ను వాడటం ద్వారా ముక్కు రంధ్రాలను శుభ్రం చేయడంతో సైనస్ బాధలు తగ్గుతాయి. సైనస్‌తో బాధపడేవారు దాన్ని సాధ్యమైనంత త్వరగా తగ్గించుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణలు చెబుతున్నారు. సైనస్ లక్షణాలను త్వరగా గుర్తించి, చికిత్స చేయించుకుంటే మంచిదని సూచిస్తున్నారు. నేసల్ ఎండోస్కోపీ విధానం ద్వారా ముక్కులో ఏదైనా అనాటామికల్ సమస్య ఉందేమో తెలుసుకోవాలి. సీటీ స్కాన్ ద్వారా సైనస్ ఇన్ ఫ్లమేషన్‌ను తెలుసుకొని చికిత్స చేయించుకోవాలి. సైనస్‌తో బాధపడేవారు వ్యాయామం లాంటివి చేస్తూ దుమ్ము, ధూళికి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. ఇలాంటి వాళ్లకు ఆవిరి పట్టడం వల్ల ప్రయోజనం ఉంటుంది. చిక్కగా ఉండే శ్లేష్మం పలుచగా మారుతుంది. వేడినీళ్లతో స్నానం చేయాలి. 1.స్నానం చేసే నీళ్లలో యూకలిప్టస్ నూనెను కలపడం వల్ల మరింత ప్రయోజనం ఉంటుంది. 2.చక్కటి ప్రశాంతమైన నిద్ర అవసరం.. విశ్రాంతి తీసుకోవడం వల్ల వైరస్, బ్యాక్టీరియాతో పోరాడే తెల్ల రక్తకణాలను మన శరీరం మరింత ఎక్కువగా ఉత్పత్తి చేయగలుగుతుంది. 3. తల కింద దిండ్లను పెట్టుకొని తల,ఛాతీ భాగం పైకి ఉండేలా చూసుకోవాలి. దీని వల్ల సైనస్లో ద్రవాలు పేరుకుపోకుండా ఉంటాయి. 4. నీళ్లు, ఇతర ద్రవాలను ఎక్కువగా తాగాలి. 5. శారీరక వ్యాయామాల వల్ల రక్తప్రసరణ మెరుగై ముక్కు దిబ్బడ తగ్గుతుంది. 6. సైనసైటిస్ అంటువ్యాధి కానప్పటికీ.. దానికి కారణమైన బ్యాక్టీరియా, వైరస్లు ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ సమస్య ఉన్నవారు తరచూ చేతుల్ని శుభ్రం చేసుకోవాలి. 7. నీలగిరి తైలం,జీవన ధార తైలం తో Inhalation చేస్తే త్వరగా తగ్గుతుంది. 8. పసుపుకొమ్మును నిప్పుల్లో కాల్చి పీలిస్తే కూడా ముక్కు దిబ్బడ తగ్గుతుంది. 9. దాల్చిన చెక్క పొడి: 5 gr,మిరియాల పొడి : 5 gr,యాలకుల గింజల పొడి:5 gr,జీలకర్ర పొడి :5 gr.. ఇలా పొడులను కలిపి మూడు వేళ్ళతో పట్టుకొని నశ్యం లాగా పీలిస్తే ముక్కు దిబ్బడ వెంటనే తగ్గుతుంది. 10. జాజి కాయను మెత్తగా పొడి చేసి గంధం లాగా చేసి పాలలో కలుపుకొని తాగాలి. 11. పసుపు పొడి: అర టీ స్పూను,వెల్లుల్లి ముద్ద :పావు టీ స్పూను.. రెండింటిని కలిపి తీసుకుంటే జలుబు ద్వారా వచ్చే గొంతు నొప్పి త్వరగా తగ్గుతుంది. 12. శొంటి, పిప్పళ్ళు, మిరియాలు.. మూడింటిని విడివిడిగా దోరగా వేయించి దంచి చూర్ణాలు చేసుకోవాలి.ఈ పొడిని పావు టీ స్పూను లేదా అర టీ స్పూను వరకు తీసుకుంటే ఫ్లూ వల్ల వచ్చే జలుబు తగ్గుతుంది. 13. మిరియాల పొడి,యాలకుల పొడి,నల్ల జిలకర పొడి.. అన్ని పొడులను కలిపి నిల్వ చేసుకోవాలి. దీనిని పీలిస్తే ముక్కు దిబ్బడ, జలుబు కూడా తగ్గుతాయి 14. కొబ్బరి నూనెను వేడి చేసి దానిలో కర్పూరం వేసి కరిగించి ముక్కు మీద ,గొంతు మీద చాతీ మీద , మెడ మీద , పక్కటెముకల మీద పూసి బాగా మర్దన చేయాలి . ఈ విధంగా చేయడం వలన జలుబు అప్పటికప్పుడు తగ్గిపోతుంది. -
మంచి నిద్ర కోసం చేయాల్సినవి...
ఈఎన్టీ కౌన్సెలింగ్ నా వయసు 48 ఏళ్లు. చాలాకాలంగా సైనసైటిస్ సమస్య ఉంది. ఇటీవల నాకు గురక వస్తోంది. ఇది నా సైనస్ సమస్యల వల్లనే అని నా ఫ్రెండ్స్ చెబుతున్నారు. మన ముఖంలోని ఖాళీ ప్రదేశాల్లో ఉండే సైనస్ గదులలో ఎక్కువ ప్రతిధ్వనులు జరగడం వల్లనే గురక సౌండ్ కూడా పెరుగుతోందని అంటున్నారు. ఇది వాస్తవమేనా? నాకు తగిన సలహా ఇవ్వండి. - ఆర్. సుభాష్, మంచిర్యాల మీరు చెప్పిన అంశాలను బట్టి మీకు దీర్ఘకాలిక సైనస్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు తెలుస్తోంది. మీరు, మీ ఫ్రెండ్స్ అనుకుంటున్నట్లుగానే సైనస్ ఇన్ఫెక్షన్ పట్ల మనలో చాలా అపోహలు ఉన్నాయి. వాటి గురించి ఉన్న కొన్ని అపోహలూ, వాస్తవాల గురించి ఒక సంక్షిప్త పట్టిక ఇది... అపోహ : సైనసైటిస్‌తో పాటు తలనొప్పి తప్పక వస్తుంటుంది. వాస్తవం : నిజానికి చాలా తక్కువ సందర్భాల్లోనే సైనసైటిస్‌తో పాటు తలనొప్పి వస్తుంటుంది. అయితే చాలామంది సైనసైటిస్ ఉన్నవారికి మైగ్రేన్ తలనొప్పి తప్పక వస్తుందనుకుంటారు. నిజానికి మైగ్రేన్, టెన్షన్ తలనొప్పి ఈ రెండూ వేరు. సైనస్ సమస్య ఉన్నవారికి తప్పక మైగ్రేన్ వస్తుందనేది ఒక తప్పుడు అభిప్రాయమే. సైనస్ లేకపోయినా మైగ్రేన్ లేదా టెన్షన్ వల్ల వచ్చే తలనొప్పులు కనిపించవచ్చు. అపోహ : సైనస్ ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. వాస్తవం : నిజానికి సైనస్ ఇన్ఫెక్షన్ ఉన్నవారికి కలిగే జలుబు వంటి కండిషన్ వల్ల ఈ అపోహ ఏర్పడి ఉండవచ్చు. కానీ సైనస్ ఇన్ఫెక్షన్ ఎంతమాత్రమూ సాంక్రమిక వ్యాధి కాదు. ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు. అయితే సాధారణ జలుబు (కామన్ కోల్డ్) వైరస్ వల్ల వస్తుంది కాబట్టి ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుంటుంది. అపోహ : సైనస్ ఇన్ఫెక్షన్ ఉన్న ప్రతివారూ తప్పక యాంటీబయాటిక్స్ వాడాలి. వాస్తవం: సైనస్ ఇన్ఫెక్షన్స్ అన్నీ బ్యాక్టీరియా వల్ల కాకపోవచ్చు. కేవలం సైనస్లలో బ్యాక్టీరియా చేరినప్పుడు మాత్రమే యాంటీబయాటిక్స్ ఉపకరిస్తాయి. ఒకవేళ సైనస్లలో వైరల్ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటే, వాటికి యాంటీబయాటిక్స్ వాడినా ప్రయోజనం ఉండదు. కాబట్టి సైనస్ ఇన్ఫెక్షన్ ఏ రకానికి చెందినది అన్న అంశాన్ని బట్టే మందులూ వాడాల్సి ఉంటుంది. వైద్యపరమైన అంశాలలో మీరు మీ ఫ్రెండ్స్ మాటలను విశ్వసించకండి. నిపుణులను కలిసి, మీది నిర్దిష్టంగా ఏ సమస్య అన్నది కనుగొని, దానికి తగినట్లుగా మందులు తీసుకుంటే, మంచి ఫలితం ఉంటుంది. డాక్టర్ శ్రీనివాస్ కిశోర్ ఎస్., సీనియర్ ఈఎన్టీ వైద్య నిపుణులు, స్టార్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ స్లీప్ కౌన్సెలింగ్ నాకు రాత్రివేళ బాగా నిద్రపట్టడం లేదు. మూడు నుంచి నాలుగు గంటలు మాత్రమే నిద్ర పడుతోంది. అంత నిద్ర సరిపోవడం లేదని నాకు అనిపిస్తోంది. నిజానికి ఏ వయసు వాళ్లకు ఎంత నిద్ర కావాల్సి ఉంటుంది? రాత్రిపూట బాగా నిద్రపట్టాలంటే ఏం చేయాలి? సలహా ఇవ్వండి. - మహేశ్, విశాఖపట్నం ఫలానా వయసు వారు ఇంతే నిద్రపోవాలనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఏ వయసు వారికి ఎంత నిద్ర అవసరం అనే అంశంపై నేషనల్ స్లీప్ ఫౌండేషన్ ప్రకటించిన వివరాలివి... అప్పుడే పుట్టిన పిల్లలు (0-3 నెలలు) ... 14- 17 గంటలు పసిపిల్లలు (4-11 నెలల పిల్లలు) ... 12 - 15 గంటలు నిలబడే పిల్లలు (1- 2 ఏళ్లు) ...11 - 14 గంటలు ప్రీస్కూల్ పిల్లలు (3-5 ఏళ్లు) ... 10 - 13 గంటలు స్కూల్‌కు వెళ్లే పిల్లలు (6-13 ఏళ్లు) ... 9 - 11 గంటలు కౌమార బాలలు (14 - 17 ఏళ్లు) ... 8 - 10 గంటలు యుక్తవయసు వారు (18-25 ఏళ్లు) ... 7- 9 గంటలు పెద్దవారు (26 - 64 ఏళ్లు) ... 7 - 9 గంటలు 65 ఏళ్లు పైబడ్డవారు ... 7 - 8 గంటలు నిద్ర పోయే వ్యవధి పైన చెప్పిన దానికంటే కాస్త ఎక్కువ తక్కువ అయినా పరవాలేదు. అంతకు మించి మరీ ఎక్కువ నిద్రపోతున్నా లేదా మరీ తక్కువ నిద్రపోతున్నా, వారిలో ఏదైనా సమస్య ఉందా అన్న అంశాన్ని డాక్టర్లు నిర్ధారణ చేస్తారు. పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు, రాత్రి మిగతావారి కంటే కాస్త నిద్ర తగ్గినా మర్నాడు పగటి వేళంతా ఉల్లాసంగా ఉన్నప్పుడు మీరు దాని గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అయితే మంచి నిద్ర కోసం ఈ కింది సూచనలు పాటిస్తే ప్రయోజనం ఉంటుంది. అవి... పొగతాగే అలవాటును పూర్తిగా మానేయాలి. బెడ్రూమ్ నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి నిద్ర సమయంలో గదిలో ఎక్కువ వెలుగు లేకుండా చూసుకోవాలి సాయుంత్రం తర్వాత కాఫీ, టీ, కూల్‌డ్రింక్స్ తీసుకోకండి ప్రతీ రోజూ ఒకే వేళకి నిద్రపొండి పగలు చిన్నకునుకు (పవర్ న్యాప్) చాలు. ఎక్కువసేపు నిద్రపోవద్దు. రాత్రి బాగా నిద్ర పట్టాలంటే పగలు కనీసం అరగంట సేపరుునా పగటి వెలుగులో (డే లైట్) గడపాలి. గోరు వెచ్చని పాలు తాగాలి. పాలలో ట్రిప్టోఫ్యాన్ అనే అమైనో ఆసిడ్ ఉంటుంది. దాని వల్ల బాగా నిద్ర పడుతుంది. నిద్రకు వుుందు పుస్తకాలు చదవడం, టీవీ చూడడం వంటివి చేయువద్దు. నిద్రకు ముందు ఆల్కహాల్ అస్సలు తీసుకోకూడదు. డాక్టర్ రమణ ప్రసాద్ కన్సల్టెంట్ పల్మునాలజిస్ట్ అండ్ స్లీప్ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్, సికింద్రాబాద్. పీడియాట్రిక్ కౌన్సెలింగ్ మా బాబుకుఎనిమిదేళ్లు. వాడికి నోట్లో పొక్కులు వస్తున్నాయి. పరిష్కారం చెప్పండి. - సుమ, ఖమ్మం మీ బాబుకు ఉన్న కండిషన్‌ను యాఫ్తస్ అల్సర్స్ లేదా యాఫ్తస్ స్టొమటైటిస్ అని అంటారు. ఈ పొక్కులు ముఖ్యంగా నోట్లో, పెదవులు, గొంతుపై భాగం (అప్పర్ థ్రోట్) లో ఎక్కువగా వస్తుంటాయి. అయితే ఇవి రావడానికి ఫలానా అంశమే కారణమని నిర్దిష్టంగా చెప్పడానికి ఉండదు. కాని నిమ్మజాతి (సిట్రస్) ఫ్రూట్స్, పులుపు పదార్థాలు ఎక్కువగా తిన్నప్పుడు, బాగా కారంగా ఎక్కువ మసాలాలతో ఉండే ఆహారం తీసుకున్నప్పుడు ఇవి రావచ్చు. కొందరిలో ఇవి విటమిన్ బి12, ఐరన్, ఫోలిక్ యాసిడ్, జింక్ లోపాలతోనూ రావచ్చు. ఎక్కువ సాంద్రత ఉన్న టూత్‌పేస్టులు వాడేవారిలో, ఎక్కువ మానసిక ఒత్తిడికి గురయ్యేవారిలో ఇవి కనిపిస్తాయి. కొందరిలో ఇవి బాగా అలసిపోయిన సందర్భాల్లో చూస్తూ ఉంటాం. మరికొందరిలో జబ్బుపడ్డప్పుడు కనిపిస్తాయి. కొన్ని హార్మోన్ల అసమతౌల్యత వల్ల, జీర్ణకోశవ్యాధులు ఉన్న సందర్భాల్లోనూ ఇవి కనిపించవచ్చు. ఇవి రాకుండా నివారించడానికి కొన్ని చర్యలు... నోటికి బాధ కలిగించే పదార్థాలు తీసుకోకపోవడం బాగా పుల్లగా ఉండే పదార్థాలు అవాయిడ్ చేయడం. నోరు ఒరుసుకుపోయే ఆహారపదార్థాలు (అబ్రేసివ్ ఫుడ్స్) తీసకోకపోవడం. నోటి పరిశుభ్రత పాటించడం వంటివి చేయాలి. ఈ సమస్య మరీ ఎక్కువగా ఉన్నప్పుడు లోకల్ అనస్థిటిక్ జెల్స్‌తో పాటు కార్టికోస్టెరాయిడ్స్, సిల్వర్ నైట్రేట్ వాడటంతో పాటు కొన్ని సందర్భాల్లో ఓరల్ యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది. సమస్య పదేపదే వస్తున్నట్లయితే నాన్ ఆల్కహాలిక్ మౌత్‌వాష్, తక్కువ (లో) కాన్సన్ట్రేటెడ్ మౌత్ వాష్ వంటివి ఉపయోగిస్తే కొంతవరకు ఉపయోగం ఉంటుంది. ఇక మీ బాబు విషయానికి వస్తే నోటి పరిశుభ్రత పాటించడంతో పాటు విటమిన్ బి12, జింక్ సప్లిమెంట్స్ ఇవ్వండి. లోకల్ అనస్థిటిక్ జెల్స్ కూడా వాడవచ్చు. సమస్య మరీ తీవ్రంగా ఉంటే మీ పిల్లల వైద్యనిపుణుడిని కలిసి చికిత్స తీసుకోండి. ఆందోళన పడాల్సిన అవసరం లేదు. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్ రోహన్ హాస్పిటల్స్ విజయనగర్ కాలనీ హైదరాబాద్