sir gangaram hospital
-
‘డెల్టా’పై టీకాల ప్రభావం అంతంతే!
న్యూఢిల్లీ: డెల్టా వేరియంట్ (బి.1.617.2).. ఇప్పుడు ప్రపంచాన్ని వేగంగా చుట్టేస్తున్న కరోనా మహమ్మారిలోని కొత్తరకం ఇది. మరోవైపు కరోనా నియంత్రణ కోసం టీకాలు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే, ఈ టీకాలు చైనాలోని వూహాన్లో పుట్టిన ఒరిజినల్ వేరియంట్‌తో పోలిస్తే డెల్టా వేరియంట్‌కు వ్యతిరేకంగా 8 రెట్లు తక్కువ ప్రభావం చూపుతున్నట్లు ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రి నిర్వహించిన అధ్యయనంలో తేలింది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయన్న సంగతి తెలిసిందే. ఈ ప్రతిరక్షకాలు కరోనా దాడిని అడ్డుకుంటాయి. డెల్టా వేరియంట్‌పై టీకాల వల్ల ఉత్పత్తి అయిన యాంటీబాడీలు 8 రెట్లు తక్కువగా స్పందిస్తున్నట్లు గుర్తించారు. సర్ గంగారాం హాస్పిటల్ సహా దేశంలో మూడు కేంద్రాల్లో వంద మందికిపైగా హెల్త్‌కేర్ వర్కర్లపై ఈ అధ్యయనం నిర్వహించారు. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారిలోనూ డెల్టా వేరియంట్ వ్యాప్తి అధికంగా ఉన్నట్లు గమనించారు. అంటే కరోనా టీకాలు డెల్టాపై పెద్దగా ప్రభావం చూపడం లేదన్నమాట. డెల్టా రకం కరోనాను ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ఆందోళనకరమైన వేరియంట్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే. నాన్–డెల్టా ఇన్ఫెక్షన్లతో పోలిస్తే డెల్టాలో వైరల్ లోడ్ అధికం. వేగంగా వ్యాప్తి చెందే లక్షణాన్ని కలిగి ఉంది. ఇది డామినెంట్ (ఆధిపత్య) వేరియంట్‌గా డబ్ల్యూహెచ్ఓ నిర్ధారించింది. -
మాజీ డీజీపీ కేపీఎస్ గిల్ కన్నుమూత
-
మాజీ డీజీపీ కేపీఎస్ గిల్ కన్నుమూత
పంజాబ్ మాజీ డీజీపీ కేపీఎస్ గిల్ (82) మరణించారు. ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన పలు రకాల వ్యాధులతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. రెండుసార్లు పంజాబ్ డీజీపీగా పనిచేసిన ఆయన.. అక్కడ ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలించి వేశారని పేరుపొందారు. 1995లో ఆయన ఐపీఎస్ నుంచి రిటైరయ్యారు. సివిల్ సర్వీసెస్‌లో ఆయన చేసిన సేవలకు గాను 1989లో ఆయనను ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ ప్రెసిడెంటుగా చేసిన గిల్, ఆ తర్వాత ఇండియన్ హాకీ ఫెడరేషన్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. కార్డియాక్ ఆరిత్మియా కారణంగా సంభవించిన కార్డియాక్ అరెస్టుతో ఆయన మరణించారని సర్ గంగారామ్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. కొంత కాలంగా ఆయన తీవ్రమైన ఇషెమిక్ హార్ట్ డిసీజ్తోను, కిడ్నీ వ్యాధితోను బాధపడుతున్నారు. వాటితో పాటు ఉదరానికి సంబంధించిన ఒక సమస్యతో కూడా బాధపడి, దాన్నుంచి కోలుకుంటున్నారు. చివరకు కార్డియాక్ అరెస్టుతో మరణించారు. -
ఇంకా ఆస్పత్రిలోనే సోనియాగాంధీ
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఇంకా ఆస్పత్రిలోనే ఉన్నారు. ఆమెకు జ్వరం ఎక్కువగా ఉండటంతో మరికొన్నాళ్ల పాటు ఆమెను ఆస్పత్రిలోనే ఉంచుతామని వైద్యులు చెప్పారు. వారణాసిలో రోడ్‌షో నిర్వహించిన అనంతరం ఆమె తీవ్ర అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. అదేసమయంలో ఆమె కింద పడటంతో భుజానికి కూడా గాయమైంది. భుజం గాయంతో పాటు జ్వరం, డీహైడ్రేషన్ తదితర సమస్యలతో ఆమెను తొలుత ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రికి.. అక్కడి నుంచి సర్ గంగారామ్ ఆస్పత్రికి తరలించారు. శరీరంలో ఇన్ఫెక్షన్ కారణంగా జ్వరం వచ్చిందని, అందువల్ల మరికొన్నాళ్ల పాటు సోనియాగాంధీ ఆస్పత్రిలోనే ఉండాల్సి వస్తుందని, ఆమెకు ప్రస్తుతం యాంటీబయాటిక్స్ ఇస్తున్నామని ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ డీఎస్ రాణా తెలిపారు. ఆస్పత్రిలోని పల్మనాలజీ, చెస్ట్ మెడిసిన్ విభాగం సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ అరూప్ బసు నేతృత్వంలోని బృందం ఆమెకు చికిత్సలు అందిస్తోంది. ఆగస్టు మూడో తేదీన సోనియాగాంధీ ఎడమ భుజానికి శస్త్రచికిత్స జరిగింది. దాన్నుంచి ఆమె కోలుకున్నట్లు వైద్యులు చెప్పారు. -
ఐసీయూలో సోనియా గాంధీ!
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు! మంగళవారం నాడు వారణాసి రోడ్డుషోలో పాల్గొన్న తర్వాత మధ్యలోనే వెనుదిరిగిన సోనియా ప్రస్తుతం న్యూఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. తొలుత ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో ఆమెకు చికిత్స చేయించగా, అక్కడి నుంచి ఎస్ఆర్జీహెచ్కి తరలించారు. ఇమె ఇప్పటికీ డీహైడ్రేషన్, ఎలక్ట్రొలైట్ల అసమతౌల్యంతో బాధపడుతున్నారు. వారణాసి ర్యాలీలో పాల్గొన్న సమయంలో సోనియాగాంధీ పడిపోవడంతో ఆమె మోచేయి కూడా విరిగినట్లు చెబుతున్నారు. బుధవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఆమెను సర్ గంగారాం ఆస్పత్రికి తీసుకొచ్చారని, పల్మనాలజిస్టు డాక్టర్ అరూప్ బసు, ఆయన బృందం ఆమెకు చికిత్స చేస్తున్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని, పరీక్షలు నిర్వహిస్తున్నారని ఆస్పత్రి విడుదల చేసిన ఓ ప్రకటనలో చెప్పారు. అయితే, ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న సోనియాగాంధీ ఈ వారంలో మాత్రం ఆస్పత్రి నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదని తెలుస్తోంది. ప్రత్యేక విమానంలో ఆమెను వారణాసి నుంచి ఢిల్లీకి తరలించినప్పటి కంటే ఇప్పుడు ఆమె పరిస్థితి చాలా మెరుగుపడిందని, ఆర్మీ ఆస్పత్రికి తీసుకొచ్చేసరికి ఆమె బాగా మత్తుగా ఉన్నారని.. అసలు మాట కూడా రాలేదని తెలిసింది. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ కూడా సోనియా వెంటే ఉంటున్నారు. అల్లుడు రాబర్ట్ వాద్రా కూడా ఆస్పత్రికి వచ్చి అత్తను పలకరించి వెళ్లారు.