Siril Verma
-
రన్నరప్ సిరిల్ వర్మ
మాల్దీవ్స్ చాలెంజర్ బ్యాడ్మింటన్ టోర్నీలో హైదరాబాద్ షట్లర్ సిరిల్ వర్మ రన్నరప్‌గా నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో అతను 13–21, 18–21తో భారత్‌కే చెందిన కౌశల్ ధర్మామర్ చేతిలో వరుస గేముల్లో ఓడి రజతంతో సంతృప్తి చెందాడు. డబుల్స్ అన్ని విభాగాల్లో ఫైనల్‌కు చేరిన భారత షట్లర్లు... చివరి అడ్డంకిని మాత్రం దాటలేకపోయారు. మహిళల డబుల్స్ విభాగంలో అశ్విని పొన్నప్ప– సిక్కి రెడ్డి జోడి 10–21, 21–17, 12–21 సయక హొబర– నత్సుకి సోనె (జపాన్) జంట చేతిలో, పురుషుల డబుల్స్‌లో అరుణ్ జార్జ్– సన్యం శుక్లా జంట 9–21, 20–22తో కిచిరో ముత్సుయ్– యొషినోరి తకెచి (జపాన్) ద్వయం చేతిలో, మిక్స్డ్ డబుల్స్‌లో సాయి ప్రతీక్ కృష్ణ ప్రసాద్– అశ్విని భట్ జోడీ 11–21, 15–21తో చరోంకితమరోన్– చసినీ కొరెపాప్ (తైవాన్) జంట జోతిలో ఓడి రన్నరప్‌గా నిలిచారు. -
సిరిల్ వర్మకు సింగిల్స్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారుడు సిరిల్ వర్మ సత్తా చాటాడు. కేరళలోని కోజికోడ్‌లో జరిగిన ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్ విభాగంలో సిరిల్ వర్మ విజేతగా నిలిచి టైటిల్‌ను హస్తగతం చేసుకున్నాడు. ఫైనల్లో పదమూడో సీడ్ సిరిల్ వర్మ 21–17, 13–21, 21–8తో కిరణ్ జార్జ్ (కేరళ)పై విజయం సాధించాడు. మహిళల విభాగంలో మాల్విక బన్సోద్ (ఏఏఐ) చాంపియన్‌గా నిలిచింది. మరోవైపు డబుల్స్ విభాగంలో తెలంగాణ క్రీడాకారుడు పొదిలే శ్రీకృష్ణ సాయికుమార్‌కు నిరాశ ఎదురైంది. పురుషుల, మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ఫైనల్‌కు చేరిన శ్రీకృష్ణ రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. పురుషుల డబుల్స్ ఫైనల్లో శ్రీకృష్ణ సాయికుమార్ (తెలంగాణ)–గౌస్ షేక్ (ఏపీ) ద్వయం 20–22, 5–14తో రెండో సీడ్ కృష్ణ ప్రసాద్ (ఏపీ)–ధ్రువ్ కపిల (ఎయిరిండియా) జోడీ చేతిలో ఓడిపోయింది. మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో ఎనిమిదో సీడ్ రోహన్ కపూర్ (ఎయిరిండియా)–రుతుపర్ణ పండా (ఒడిశా) జంట 21–19, 21–14తో శ్రీకృష్ణ సాయికుమార్–కనిక కన్వల్ (రైల్వేస్) జోడీపై గెలుపొంది చాంపియన్‌గా నిలిచింది. మహిళల డబుల్స్ ఫైనల్లో మనీషా (ఆర్బీఐ)–రుతుపర్ణ (ఒడిశా) ద్వయం 21–18, 21–13తో టాప్ సీడ్ అపర్ణ బాలన్ (పెట్రోలియం)–ప్రజక్తా సావంత్ (ఎయిరిండియా) జోడీకి షాకిచ్చింది. -
క్వార్టర్స్‌లో రాహుల్, సిరిల్ వర్మ
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారులు చిట్టబోయిన రాహుల్ యాదవ్, సిరిల్ వర్మ ముందంజ వేశారు. కేరళలోని కోజికోడ్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో వీరిద్దరూ పురుషుల సింగిల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో మూడో సీడ్ రాహుల్ యాదవ్ 21–14, 21–9తో మునావర్ మొహమ్మద్ (కేరళ)పై గెలుపొందాడు. మరో మ్యాచ్‌లో పదమూడో సీడ్ సిరిల్ వర్మ (తెలంగాణ) 21–13, 21–15తో కార్తికేయ గుల్షన్ కుమార్ (ఢిల్లీ)పై నెగ్గాడు. ఏపీ ప్లేయర్ జశ్వంత్ 23–21, 13–21, 9–21తో మిథున్ (ఎయిరిండియా) చేతిలో ఓడిపోయి ప్రిక్వార్టర్స్‌లోనే నిష్క్రమించాడు. మహిళల సింగిల్స్‌లో ఏపీ క్రీడాకారిణి నిషిత వర్మ, తెలంగాణ ప్లేయర్ కేయూర మోపాటి ప్రిక్వార్టర్స్‌లో ఓడిపోయారు. నిషిత వర్మ 16–21, 12–21తో నమిత పథానియా (ఢిల్లీ) చేతిలో, కేయూర (తెలంగాణ) 21–19, 14–21, 10–21తో ఎనిమిదో సీడ్ ఐరా శర్మ (హరియాణా) ఓడింది. పురుషుల డబుల్స్‌లో శ్రీకృష్ణ సాయి కుమార్ జంట క్వార్టర్స్‌కు చేరుకోగా... కృష్ణ ప్రసాద్ జోడీ రెండో రౌండ్లో అడుగు పెట్టింది. ప్రిక్వార్టర్స్‌లో శ్రీకృష్ణ సాయికుమార్ (తెలంగాణ)–గౌస్ షేక్ (ఏపీ) జంట 21–8, 21–13తో మధుసూదన్ (కర్ణాటక)–సంజీత్ (రైల్వేస్) జోడీపై గెలుపొందింది. రెండోసీడ్ కృష్ణ ప్రసాద్ (ఏపీ)–ధ్రువ్ కపిల (ఎయిరిండియా) ద్వయం 21–16, 21–11తో అక్షయ్–అనిరుద్ధ మయేకర్ (మహారాష్ట్ర) జోడీపై గెలుపొందింది. మిక్స్డ్ డబుల్స్‌లో శ్రీకృష్ణ–కనిక కన్వల్ జోడీ, హేమనాగేంద్ర బాబు–శ్రీవిద్య గురజాడ జంటలు క్వార్టర్స్‌లో అడుగుపెట్టాయి. ప్రిక్వార్టర్స్‌లో శ్రీకృష్ణ సాయికుమార్ (తెలంగాణ)–కనిక కన్వల్ (రైల్వేస్) జంట 21–17, 22–24, 21–17తో టాప్ సీడ్ గౌస్ షేక్ (ఏపీ)–మనీషా (ఆర్బీఐ) జోడీకి షాకిచ్చింది. మరో మ్యాచ్‌లో హేమనాగేంద్ర బాబు (రైల్వేస్)–శ్రీవిద్య గురజాడ (తెలంగాణ) జంట 16–21, 21–6, 21–19తో ప్రతీక్ రనడే–అక్షయ వరంగ్ (మహారాష్ట్ర) జోడీపై నెగ్గింది. -
మెయిన్ ‘డ్రా’కు సిరిల్
లక్నో: సయ్యద్ మోదీ స్మారక వరల్డ్ టూర్ సూపర్ –300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ సిరిల్ వర్మ పురుషుల సింగిల్స్‌లో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. మంగళవారం జరిగిన క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో సిరిల్ వర్మ 24–22, 21–18తో చిరాగ్ సేన్ (భారత్)పై, 21–16, 21–13తో కెవిన్ అల్టర్ (భారత్)పై విజయం సాధించాడు. సిరిల్‌తోపాటు భారత్‌కే చెందిన హర్షీల్ డాని కూడా మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందాడు. మహిళల సింగిల్స్‌లో తెలుగమ్మాయి మామిళ్లపల్లి తనిష్క్‌తోపాటు రితిక, శ్రుతి ముందాడ, అమోలిక సింగ్ సిసోడియా కూడా మెయిన్ ‘డ్రా’కు చేరుకున్నారు. బుధవారం అన్ని విభాగాల్లో మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు మొదలవుతాయి. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సెనియా పొలికర్పోవా (ఇజ్రాయెల్)తో చుక్కా సాయి ఉత్తేజిత రావు; రసిక రాజేతో తనిష్క్; యిమాన్ జాంగ్ (చైనా)తో గుమ్మడి వృశాలి; ప్రాషి జోషితో శ్రీకృష్ణప్రియ; శ్రుతితో ఐరా శర్మ; కేట్ ఫూ కునె (మారిషస్)తో సైనా నెహ్వాల్ తలపడతారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో సమీర్ వర్మ (భారత్)తో సిరిల్ వర్మ; తనోంగ్సక్ సెన్సోమ్బున్సుక్ (థాయ్‌లాండ్)తో పారుపల్లి కశ్యప్; మిలాన్ లుడిక్ (చెక్ రిపబ్లిక్)తో రాహుల్ యాదవ్; సెర్గీ సిరాంట్ (రష్యా)తో సాయిప్రణీత్; పెర్సన్ (జర్మనీ)తో గురుసాయిదత్ ఆడతారు. -
విజేతలు సిరిల్‌వర్మ, అభిలాష
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో సిరిల్‌వర్మ (మెదక్), ఎ. అభిలాష (హైదరాబాద్) సత్తా చాటారు. కోదాడలో జరిగిన ఈ టోర్నీలో పురుషుల, మహిళల సింగిల్స్ విభాగాల్లో విజేతలుగా నిలిచి టైటిళ్లను కైవసం చేసుకున్నారు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో రెండోసీడ్ సిరిల్ వర్మ 21–17, 21–16తో టాప్‌సీడ్ సి. రాహుల్ యాదవ్ (హైదరాబాద్)కు షాకిచ్చాడు. మహిళల సింగిల్స్ విభాగంలో టాప్‌సీడ్‌గా బరిలోకి దిగిన అభిలాష ఫైనల్లో 21–18, 21–17తో మూడోసీడ్ కె. వైష్ణవిని ఓడించి తన స్థాయిని ప్రదర్శించింది. మరోవైపు డబుల్స్ విభాగంలో హైదరాబాద్ అమ్మాయి సృష్టి జూపూడి మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ కేటగిరీలో విజేతగా నిలిచి రెండు టైటిళ్లను అందుకుంది. మహిళల డబుల్స్ ఫైనల్లో టాప్‌సీడ్ సాహితి బండి (మెదక్)– సృష్టి జంట 21–12, 21–11తో శ్రీవిద్య– వై. సాయిప్రియ (మెదక్) జోడీపై... మిక్స్డ్ డబుల్స్ కేటగిరీలో టాప్‌సీడ్ పి. శ్రీకృష్ణ సాయికుమార్ (రంగారెడ్డి)– సృష్టి ద్వయం 21–18, 21–18తో మూడో సీడ్ బి. నవనీత్– సాహితి (మెదక్) జోడీపై విజయం సాధించాయి. పురుషుల డబుల్స్ ఫైనల్లో రెండోసీడ్ బి. నవనీత్ (మెదక్)– సిద్ధార్థ్ (రంగారెడ్డి) జంట 21–11, 16–21, 24–22తో టాప్‌సీడ్ పి. శ్రీకృష్ణ సాయికుమార్ (రంగారెడ్డి)– పి. విష్ణువర్ధన్ గౌడ్ (హైదరాబాద్) జోడీకి షాకిచ్చింది. 65 ఏళ్ల కేటగిరీలో పురుషుల సింగిల్స్ ఫైనల్లో పి. రాయలింగు (ఆదిలాబాద్) 21–5, 21–16తో దస్తగిరి (నల్లగొండ)పై, 70 ఏళ్ల పురుషుల సింగిల్స్ తుదిపోరులో వీవీఆర్ రావు (మెదక్) 21–6, 17–21, 21–17తో సి. విజయ్ కుమార్ (హైదరాబాద్)పై విజయం సాధించారు. -
సిరిల్ వర్మకు సింగిల్స్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా సీనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలంగాణ కుర్రాడు సిరిల్ వర్మ సత్తా చాటాడు. గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో అతను పురుషుల సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఫైనల్లో ఎ. సిరిల్ వర్మ (తెలంగాణ) 18–21, 21–16, 21–8తో సౌరభ్ వర్మపై విజయం సాధించాడు. తొలి గేమ్‌లో వెనుకబడిన సిరిల్ తర్వాతి రెండు గేముల్లో పుంజుకుని మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. మహిళల విభాగంలో తెలుగు అమ్మాయి సాయి ఉత్తేజిత రావు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఫైనల్లో పదహారో సీడ్ అష్మితా చలిహా (అస్సాం) 21–16, 14–21, 21–15తో మూడో సీడ్ ఉత్తేజిత (ఆంధ్రప్రదేశ్)కు షాకిచ్చింది. పురుషుల డబుల్స్ ఫైనల్లో కృష్ణ ప్రసాద్ (ఆంధ్రప్రదేశ్)– ధ్రువ్ కపిల (ఎయిరిండియా) ద్వయం 24–22, 21–13తో అరుణ్ జార్జి (కేరళ)–సన్యం శుక్లా (ఎయిరిండియా) జోడీపై నెగ్గి టైటిల్‌ను గెలుచుకుంది. మిక్స్డ్ డబుల్స్‌లో కె. నందగోపాల్ (కాగ్)–సంజన (ఎయిరిండియా) జంట 21–16, 13–21, 21–17తో ధ్రువ్ కపిల–మేఘన జక్కంపూడి (ఆర్బీఐ) జోడీపై విజయం సాధించింది. మహిళల డబుల్స్ విభాగంలో అపర్ణ బాలన్ జంట చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో మూడో సీడ్ అపర్ణ బాలన్– శ్రుతి జోడీ 19–21, 21–19, 21–18తో సంయోగిత (ఎయిరిండియా)–ప్రజక్తా సావంత్ జంటను ఓడించింది. పోటీల అనంతరం జరిగిన బహు మతి ప్రదాన కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో భారత బ్యాడ్మింటన్ సంఘం కార్యదర్శి అజయ్ సింఘానియా, ఒమర్ రషీద్, జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు. -
టాప్ కు చేరిన సిరిల్ వర్మ
న్యూఢిల్లీ: గతేడాది చివర్లో జరిగిన ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నీలో రజత పతకం సాధించిన సిరిల్ వర్మ.. పురుషుల జూనియర్ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్(బీడబ్యూఎఫ్) తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో సిరిల్ వర్మ 11 స్థానాలు ఎగబాకి టాప్ కు చేరాడు. వరల్డ్ జూనియర్ చాంపియన్ షిప్ లో రన్నరప్‌గా నిలవడంతో సిరిల్ తన పాయింట్ల సంఖ్యను గణనీయంగా పెంచుకుని ప్రథమ స్థానాన్ని సాధించాడు. ఇదిలా ఉండగా, మరో జూనియర్ భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు చిరాగ్ సేన్ కు మూడో స్థానానికి చేజిక్కించుకోగా, ఫ్రాన్స్ కు చెందిన తోమా పావోవ్ కు రెండో స్థానంలో నిలిచాడు. మరోవైపు భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ తన రెండో ర్యాంకును కాపాడుకోగా, పివి సింధు 12వ ర్యాంకును నిలుపుకుంది. కాగా, స్పెయిన్ కు చెందిన కరోలినా మారిన్ అగ్రస్థానంలో , చైనాకు చెందిన లీ జురియ్ మూడో స్థానంలో నిలిచారు. పురుషుల సింగిల్స్ విభాగంలో కిడాంబి శ్రీకాంత్ కు ఒక్కడికే టాప్ -10 లో స్థానం దక్కింది. శ్రీకాంత్ 9వ ర్యాంకును కైవసం చేసుకోగా,పారుపల్లి కశ్యప్ 15వ స్థానం, ప్రణయ్ 20, అజయ్ జయరామ్ 21 వ స్థానాల్లో నిలిచారు. -
ప్రపంచ బ్యాడ్మింటన్‌లో సిరిల్ వర్మకు రజతం
-
‘రజత’ సిరిల్
* ఫైనల్లో పోరాడి ఓడిన తెలుగు తేజం * ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: టోర్నీ ఆసాంతం అంచనాలకు మించి రాణించిన హైదరాబాద్ యువ ఆటగాడు అల్లూరి శ్రీసాయి సిరిల్ వర్మ తుది సమరంలో తడబడ్డాడు. ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. అయితే ఈ మెగా ఈవెంట్ చరిత్రలో బాలుర సింగిల్స్ విభాగంలో రజత పతకం నెగ్గిన తొలి భారతీయ క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన బాలుర సింగిల్స్ ఫైనల్లో అన్‌సీడెడ్ సిరిల్ వర్మ 21-17, 10-21, 7-21తో ఆరో సీడ్ చియా హుంగ్ లూ (చైనీస్ తైపీ) చేతిలో పోరాడి ఓడిపోయాడు. 50 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో 15 ఏళ్ల సిరిల్ తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే చియా హుంగ్ లూ వెంటనే తేరుకొని తన సత్తా చాటుకున్నాడు. సిరిల్ వర్మకు మరో అవకాశం ఇవ్వకుండా తర్వాతి రెండు గేమ్‌లను నెగ్గి ప్రపంచ జూనియర్ చాంపియన్‌గా అవతరించాడు.