ఇద్దరు విపక్ష సభ్యుల సస్పెన్షన్
► ఆర్.శివప్రసాదరెడ్డి, మణిగాంధీపై వేటు
► బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకు సస్పెన్షన్
► తీర్మానం ప్రవేశపెట్టిన మంత్రి యనమల
► మూజువాణిఓటుతో ఆమోదం
► స్పీకర్ పోడియం వద్ద నిలబడి వైఎస్సార్సీపీ సభ్యుల నిరసన
► విపక్ష నేతకు మైక్ ఇచ్చినట్లే ఇచ్చి కట్ చేసిన స్పీకర్
► వెల్‌లో నిలబడి నినాదాలు చేసిన విపక్ష సభ్యులు
► గందరగోళ పరిస్థితుల మధ్య సభ నేటికి వాయిదా
హైదరాబాద్: అధికార, ప్రతిపక్ష పార్టీల పరస్పర ఆరోపణలు, సవాళ్లతో బడ్జెట్ సమావేశాల్లో ఏడో రోజైన మంగళవారం కూడా అసెంబ్లీ నల్లబ్యాడ్జీలు, బైఠాయింపులు, నినాదాలు, అరుపులు కేకలతో దద్దరిల్లింది. బడ్జెట్‌పై చర్చను ముగించేందుకు తమ పార్టీ నేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి అవకాశం ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు చేసిన డిమాండ్‌ను స్పీకర్ కోడెల శివప్రసాదరరావు తోసిపుచ్చడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా జరిగిన గందరగోళంలో స్పీకర్ ముందున్న మైకుల్ని ఎవరో లాగివేశారు. ఇందుకు విపక్ష వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు రాచమల్లు శివప్రసాదరెడ్డి, మణిగాంధీని బాధ్యులను చేస్తూ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేశారు. దీనిపై మాట్లాడుతున్న జగన్‌కు మైక్ కట్ చేశారు. తమ నేతకు మైక్ ఇవ్వాల్సిందేనంటూ విపక్ష సభ్యులు పట్టువీడకపోవడంతో 1.28 గంటలకు సభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
మంగళవారం 12.15గంటలకు సభ ప్రా రంభమైన వెంటనే.. విపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద నిలబడి స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. ఆ దశలో స్పీకర్ ముందున్న మైకుల్ని ఎవరో లాగివేసినట్టు సిబ్బంది గుర్తిం చారు. ఈ గందరగోళం మధ్య స్పీకర్ కోడెల ఉదయం 10.51 గంటల సమయంలో సభను రెండోసారి 15 నిమిషాలపాటు వాయిదా వేశా రు. అనంతరం సభ ప్రారంభం కాగా విపక్ష సభ్యులు తమ నిరసనను తెలియజేస్తున్న క్రమంలోనే శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ‘‘వైఎస్సార్సీపీ సభ్యులు రోజూ వెల్‌లోకి వస్తున్నారు. ఈరోజు స్పీకర్ మీద దాడి చేశారు. మైక్ విరగ్గొట్టారు. సభ ఆస్తులు విరగ్గొట్టిన సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేయాలి’’ అని తీర్మానం ప్రతిపాదించారు. సభ మూజు వాణి ఓటుతో తీర్మానం ఆమోదం పొందిందని, విపక్ష సభ్యులు ఆర్.శివప్రసాదరెడ్డి, ఎం.మణిగాంధీని బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
సస్పెండ్ అయిన సభ్యులు సభ నుంచి వెళ్లిపోవాలని స్పీకర్ కోరారు. ఆ వెంటనే టీడీపీ సభ్యుడు గొల్లపల్లి సూర్యారావుకు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారు. స్పీకర్ చర్యలకునిరసనగా విపక్ష సభ్యులు స్పీకర్ పోడియం వద్ద నిలబడి.. తమకు న్యాయం చేయాలని, విపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విపక్ష సభ్యుల నినాదాలతో సభ హోరెత్తున్న సమయంలోనే మంత్రులు రావెల కిషోర్‌బాబు, పీతల సుజాత, టీడీపీ సభ్యుడు గొల్లపల్లి సూర్యారావు మాట్లాడారు. వారు తీవ్ర పదజాలం, అన్‌పార్లమెంటరీ పదాలతో ప్రసంగాలు సాగించినా.. స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేయలేదు. సభలో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొనడంతో 12.35 గంటలకు సభను 15 నిమిషాల పాటు వాయిదావేశారు. 1.15 గంటల కు సభ తిరిగి ప్రారంభమైంది. విపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి స్పీకర్ మాట్లాడే అవకాశం ఇచ్చారు. ‘‘సస్పెన్షన్‌కు తావిచ్చే నిర్ణయాలు జరిగాయి. గత రెండు, మూడు రోజులుగా సభ జరుగుతున్న తీరును దయచేసి గమనించండి. శాంతిభద్రతల మీద చర్చ జరుగుతున్న సందర్భంలో... అధికార పక్షం తీరుకు నిరసనగా వాకౌట్ చేస్తామని చెబుతున్నా.. నిరసన తెలపడానికి ప్రతిపక్ష నేతకు మైక్ ఇవ్వలేదు...’’ అని జగన్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తుండగా స్పీకర్ మైక్ కట్ చేశారు. సభను తప్పుదోవ పట్టించవద్దంటూ స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా విపక్ష సభ్యులు పోడియం వద్ద నిలబడి తమ నేతకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు.
విపక్ష సభ్యులు నినాదాలు కొనసాగిస్తుండగానే.. ఉప ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి, మం త్రి అచ్చెన్నాయుడుకు స్పీకర్ అవకాశం ఇచ్చా రు. తర్వాత కూడా విపక్ష సభ్యులు పట్టువీడకపోవడంతో 1.28 గంటలకు సభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
ముగింపు వ్యాఖ్యలకు అవకాశం ఇవ్వండి...
ప్రశ్నోత్తరాల అనంతరం సభ తిరిగి ప్రారంభమైన వెంటనే బడ్జెట్‌పై చర్చను ప్రారంభించాల్సిందిగా స్పీకర్ కోడెల శివప్రసాదరావు టీడీపీ సభ్యుడు గొల్లపల్లి సూర్యారావును కోరారు. దీ నికి వైఎస్సార్సీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ నాయకుడు జగన్ ప్రారంభించిన చర్చ పూర్తి కాలేదని, మరో పది నిమిషాలు సమయమిస్తే దాన్ని ముగిస్తారని కోరారు. అందుకు స్పీకర్ నిరాకరించడంతో వారు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనకు దిగారు. బాధ్యత కలిగిన తమ నాయకుడు తన ప్రసంగాన్ని ముగించేం దుకు అవకాశం ఇవ్వాలని జ్యోతుల నెహ్రూ, శ్రీకాంత్‌రెడ్డి స్పీకర్‌ను కోరారు. ఈ సందర్భంలో స్పీకర్‌కు వైఎస్సార్సీపీ సభ్యులకు మధ్య వాగ్వా దం జరిగింది. ‘‘మీ నాయకుడు జగన్ గంటా 55 నిమిషాలు మాట్లాడారు. అందులో 21 నిమిషాల సమయం వృథా అయింది. అది పోయినా గంటా 34 నిమిషాలు మాట్లాడినట్టు. ప్రతిపక్షానికి ఇచ్చిన సమయం గంటన్నర. ఆ సమయం లో పూర్తి చేయలేకపోయారు. ముగించేందుకు పది నిమిషాల సమయం కావాలని పొద్దున నన్ను కలిసిన మీ పార్టీ నేతలు కోరారు. దానికి నేను సరే అన్నా’’ అని స్పీకర్ చెప్పారు.
ప్రజాస్వామ్యం నిజంగా ఉందా?: జగన్
స్పీకర్ వ్యాఖ్యలపై జగన్మోహన్రెడ్డి మాట్లా డుతూ ‘‘బడ్జెట్ై పె ప్రతిపక్షం మాట్లాడేందుకు గంటన్నర సమయం ఇస్తారా? ప్రజాస్వామ్యం నిజంగా ఉందా? నేను మాట్లాడుతున్నప్పుడు గంటా ఆరు నిమిషాల పాటు అంతరాయం కల్పించారు. అందుకు మీరు బాధ్యత వహించాలి’’ అని చెప్పారు. ఇంతలో శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు లేచి విపక్షంపై విరుచుకుపడ్డారు. బీ ఏసీలో నిర్ణయం మేరకే సమయం కేటాయిస్తే తిరిగి మళ్లీ కావాలనడం తమ అవకాశాన్ని అ డ్డుకోవడమేనని ఎదురుదాడికి దిగారు. అధికారపక్షం మాట్లాడిన తర్వాత సమయం ఉం టే విపక్షనేతకు ఇవ్వాలే తప్ప ముందు ఇవ్వ డం తగదన్నారు. దీనికి స్పీకర్ కూడా సుముఖత వ్యక్తం చేయడంతో వైఎస్సార్సీపీ సభ్యు లు జ్యోతుల నెహ్రూ, శ్రీకాంత్‌రెడ్డి అభ్యంత రం చెప్పారు. తమకు న్యాయం కావాలంటూ వైఎస్సార్సీపీ సభ్యులు పోడియంను చుట్టుముట్టారు. తెలుగుదేశం సభ్యులు కూడా తమ సీట్లలో నుంచి లేచి నిలబడి ప్రతిపక్ష సభ్యులతో వాగ్వావాదానికి దిగారు. ఇవేవీ పట్టిం చుకోని స్పీకర్.. టీడీపీ నేత ధూళిపాళ్ల నరేం ద్రను మాట్లాడమని కోరారు. ఓవైపు గందరగోళం, మరోవైపు నిరసన ధ్వనుల మధ్య నరేంద్ర విపక్షంపై దుమ్మెత్తిపోశారు. ఆ తర్వా త మాట్లాడిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, కాగిత వెంకట్రావ్, యనమల, కాలువ శ్రీనివాసులు కూడా ప్రతిపక్ష సభ్యుల నిరసనను తప్పుబట్టారు. ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేశారు. సభా కార్యక్రమాలను అడ్డుకునే వారిని సస్పెండ్ చేసైనా చర్చ కొనసాగించాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు.
మా సమయం తీసుకోండి: బీజేపీ
బీజేపీ సభ్యుడు విష్ణుకుమారరాజు మాట్లాడుతూ తమకిచ్చిన సమయంలో పది నిమిషాలను వైఎస్సార్సీపీకి ఇచ్చయినా సభను సజావుగా నడిపించాలని స్పీకర్‌ను కోరా రు. ఇది సమ్మతమేనని స్పీకర్ చెప్పారు. ఈ దశలో స్పీకర్ ముందున్న మైకుల్ని ఎవరో లాగివేసినట్టు సిబ్బంది గుర్తించి స్పీకర్ దృ ష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేయడం గందరగోళం మధ్య కోడెల ఉదయం 10.51 గంటలకు రెండోసారి 15 నిమిషాలు సభను వాయిదా వేశారు. సభ ప్రారంభమయ్యాక మంత్రి యనమల రా మకృష్ణుడు సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు రాచమల్లు శివప్రసాదరెడ్డి, మణిగాంధీని బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేశారు.