six lane road
-
ఆరు లేన్లుగా ఎన్‌హెచ్-65.. నితిన్ గడ్కరీ హామీ!
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్–విజయవాడను కలిపే జాతీయ రహదారి-65ని ఆరు లేన్లుగా మార్చాలని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన సందర్భంగా భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గ సమస్యలపై ఎంపీ కోమటిరెడ్డి చర్చించారు. ఈ సందర్భంగా జాతీయ రహదారి-65పై వాహనాల రద్దీ పెరగడంతో నిత్యం ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరుగుతున్నాయని కేంద్రమంత్రి దృష్టికి కోమటిరెడ్డి తీసుకెళ్లారు. ఈ రహదారిపై గుర్తించిన 17 బ్లాక్స్పాట్ల మరమ్మ తు పనులను యుద్ధప్రాతిపదికన చేయాలని అభ్యర్థించారు. ఎన్‌హెచ్-65ను ఆరు లేన్లుగా మార్చే పనులను రాబోయే 2 నెలల్లోగా ప్రారంభిస్తామని గడ్కరీ హామీ ఇచ్చారని ఎంపీ కోమటిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇది కూడా చదవండి: టీఎస్ ఆర్టీసీ బంపర్ ఆఫర్.. -
31 కిలోమీటర్ల రోడ్డుకు రూ.1,297 కోట్లా..!
సాక్షి, హైదరాబాద్: ఆరు వరుసలకు విస్తరిస్తున్న రోడ్డది.. నిడివి 31 కి.మీ. మాత్రమే. కానీ దాని నిర్మాణానికి మాత్రం ఏకంగా రూ. 1,297 కోట్లు ఖర్చు కానుంది! అంటే ఒక కిలోమీటర్‌కు దాదాపు రూ. 42 కోట్ల వ్యయం అన్నమాట. దీన్ని మరోలా చెప్పాలంటే ఎనిమిది వరుసలు, 158 కి.మీ. నిడివితో రూపుదిద్దుకున్న ఔటర్ రింగురోడ్డు నిర్మాణంలో ప్రతి కిలోమీటర్‌కు అయిన ఖర్చు స్థాయికి దాదాపు సమానమన్నమాట! ఈ కాస్త దూరానికే అంత ఖర్చు ఎందుకు అనుకుంటున్నారా? ఇందులో నిర్మించేది ప్రధాన రోడ్డొక్కటే కాదు.. సరీ్వసు రోడ్లు, క్రాష్ బ్యారియర్లు, ఎలివేటెడ్ కారిడార్లు, జంక్షన్ల వద్ద వంతెనలు, అండర్‌పాస్‌లు, కల్వర్టులు.. ఒకటేమిటి ఎక్స్‌ప్రెస్ వే అంటే ఇలా ఉండాలనే రీతిలో ఇది రూపుదిద్దుకోబోతోంది. ఓ రకంగా చెప్పాలంటే మోడల్ ఎక్స్‌ప్రెస్ వేగా నిలవబోతోంది. హైదరాబాద్–పుణే జాతీయ రహదారిపై మియాపూర్–సంగారెడ్డి మధ్య ఉన్న ఈ మార్గం ఎక్స్‌ప్రెస్ వే తరహాలో ముస్తాబుకానుంది. అందుకే ఖర్చు సైతం భారీగా ఉంది. ట్రాఫిక్ చిక్కులకు తెరదించేలా... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల్లో విస్తరించి ఉన్న 65వ నంబర్ జాతీయ రహదారిపై కొన్నేళ్లుగా ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో దాన్ని విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా హైదరాబాద్ శివార్లలో ఆ మార్గాన్ని యుద్ధప్రాతిపదికన 6 వరుసలకు విస్తరించనుంది. ఇందులో హయత్‌నగర్ దాటాక విజయవాడ రోడ్డులో జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాథికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) రోడ్డు విస్తరణను చేపట్టనుండగా ముంబై రహదారిలో మియాపూర్ సమీపంలోని మదీనాగూడ నుంచి సంగారెడ్డి వరకు రాష్ట్ర పీడబ్ల్యూడీ విభాగం అభివృద్ధి చేయనుంది. తాజాగా మదీనాగూడ–సంగారెడ్డి మధ్య 6 వరుసల విస్తరణ పనులకు సంబంధించిన డీపీఆర్‌కు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ అ«దీనంలోని స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ ఆమోదించింది. దీంతో ఇక టెండర్లు పిలిచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అవి ఖరారయ్యాక రెండున్నరేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయనున్నారు. రోజుకు సగటున లక్ష వాహనాలు.. నగరం నుంచి సంగారెడ్డి రోడ్డు అత్యంత బిజీగా మారిపోయింది. డీపీఆర్ తయారీలో భాగంగా గత ఆగస్టులో ఇస్నాపూర్, పటాన్చెరు మధ్య వెళ్తున్న వాహనాల సంఖ్యపై జాతీయ రహదారుల విభాగం సర్వే నిర్వహించగా ఒక రోజులో సగటున లక్ష వాహనాలు ప్రయాణిస్తున్నట్లు తేలింది. పటాన్చెరు వద్ద రోజుకు 30,683 కార్లు, 12,353 త్రిచక్ర వాహనాలు, 34,437 ద్విచక్ర వాహనాలు, 5,551 బస్సులు, 9 వేల ట్రక్కులు... ఇలా అన్నీ కలిపి రోజుకు లక్ష వరకు తిరుగుతున్నాయి. ఇక మదీనాగూడ ప్రాంతంలో ఆ సంఖ్య అంతకు రెట్టింపుగా ఉంటోంది. ఈ రోడ్డును విస్తరిస్తే ట్రాఫిక్ సమస్య పరిష్కారమవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పుడేం చేస్తారు..? మదీనాగూడ నుంచి సంగారెడ్డి వరకు 31 కి.మీ.మేర రోడ్డును 6 వరుసలకు విస్తరించనున్నారు. మూడు వరుసల సరీ్వసు రోడ్డు, ఫుట్‌పాత్, వరద నీటి డ్రెయిన్‌తో 11.66 కి.మీ., మిగతా నిడివిలో రెండు వరుసల సరీ్వసు రోడ్డు ఉండేలా నిర్మించనున్నారు. రుద్రారం వద్ద 1,020 మీటర్ల మేర, గంగారం వద్ద 840 మీటర్ల మేర రెండు ఎలివేటెడ్ కారిడార్లతోపాటు కొత్తగా 11 చిన్న వంతెనలు నిర్మించనున్నారు. ఏడు మేజర్, 19 మైనర్ జంక్షన్లను విస్తరించనున్నారు. ఏడు ప్రాంతాల్లో అండర్‌పాస్‌లు, ఆరు చోట్ల కల్వర్టులను కట్టనున్నారు. ఐదు ప్రాంతాల్లో లిఫ్టు వసతి ఉండే ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు, రోడ్డుకు రెండు వైపులా క్రాష్ బ్యారియర్లను ఏర్పాటు చేయనున్నారు. వెరసి ప్రధాన క్యారేజ్ వే మీదకు చుట్టుపక్కల నుంచి ఇతర వాహనాలు, మనుషులు, జంతువులు వచ్చే వీలుండదు. ప్రధాన క్యారేజ్ వే మీదుగా వెళ్లే వాహనాలకు, దీన్ని దాటుతూ అటూఇటూ పోయే వాహనాలకు పరస్పరం ఆటంకం లేని విధంగా డిజైన్ చేశారు. ఇందుకు వీలుగా అదనంగా కావాల్సిన భూమి కోసం రూ. 166 కోట్లు వెచి్చస్తున్నారు. అన్నీ కలిపి నిర్మాణానికి రూ. 1,297 కోట్లు ఖర్చు కానున్నట్టు డీపీఆర్‌లో పేర్కొనగా దానికి తాజాగా కేంద్రం ఆమోదముద్ర వేసింది. బీహెచ్ఈఎల్ వంతెన కాకుండా.. ఈ రోడ్డు విస్తరణలో భాగంగా బీహెచ్ఈఎల్ కూడలి వద్ద 131 కోట్లతో భారీ వంతెన నిర్మిస్తున్నారు. 60 మీటర్ల వెడల్పుతో అది ఉండనుంది. దాన్ని ఈ రోడ్డు విస్తరణ ప్రాజెక్టులో కాకుండా విడిగా చూపారు. దానికి సంబంధించి ఎన్హెచ్ఏఐ రూపొందించిన నమూనా ప్రకారం పనులు సాధ్యం కాదంటూ రాష్ట్ర ప్రభుత్వ అ«దీనంలోని ఎన్‌హెచ్ విభాగం ఇటీవల ప్రతిపాదించింది. దీనిపై ఇరు విభాగాల మధ్య విభేదాలు తలెత్తడంతో పనుల్లో జాప్యం జరుగుతోంది. ఇందుకు కారణం మీరంటే మీరంటూ ఇరు విభాగాలు లేఖలు రాసుకోవడం వివాదాస్పదంగా మారింది. చదవండి: డేటా దేశం దాటిందా? -
మియాపూర్ టు సంగారెడ్డి ట్రాఫిక్ రద్దీకి చెక్.. ఆరు వరుసలుగా రోడ్డు
సాక్షి, హైదరాబాద్: మియాపూర్–సంగారెడ్డి మార్గంలో నిత్యం నరకప్రాయంగా ఉన్న ట్రాఫిక్ రద్దీకి తెరపడనుంది. ట్రాఫిక్ చిక్కులు తొలగిపోనున్నాయి. ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మియాపూర్ నుంచి సంగారెడ్డి కూడలి (పోత్రెడ్డిపల్లి చౌరస్తా) వరకు ప్రస్తుతం నాలుగు వరుసలుగా ఉన్న రోడ్డును ఆరు వరుసలుగా 60 మీటర్లకు విస్తరించనున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి డీపీఆర్ సిద్ధమైంది. వారం రోజుల్లో ఇది కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రిత్వ కార్యాలయ అనుమతి కోసం ఢిల్లీ చేరనుంది. అక్కడి నుంచి అనుమతులు రాగానే టెండర్లు పిలిచేందుకు జాతీయ రహదారుల విభాగం ఏర్పాట్లు చేస్తోంది. 31 కి.మీ. నిడివి ఉన్న ఈ రోడ్డు విస్తరణకు రూ.1,400 కోట్ల వ్యయం కానుంది. ఇందులో రోడ్డునిర్మాణ పనులకు రూ.వేయి కోట్లు, భూసేకరణ పరిహారానికి రూ.400 కోట్లు ఖర్చు కానుంది. నగరంలోనే పెద్ద రోడ్డుగా.. ఈ మార్గంలోనే ఉన్న కూకట్పల్లి వద్ద అత్యంత రద్దీ ట్రాఫిక్ వాహనదారులను బెంబేలెత్తిస్తోంది. మెట్రోరైలు ప్రాజెక్టులో భాగంగా జీహెచ్ఎంసీ ఇప్పటికే మియాపూర్ వరకు రోడ్డును విస్తరించింది. అక్కడి నుంచి రోడ్డు విస్తరణ బాధ్యతను జాతీయ రహదారుల విభాగం తీసుకుంది. ఈ రోడ్డు 60 మీటర్లకు వెడల్పు కానుంది. ప్రధాన క్యారేజ్ వే, దాని పక్కన సర్వీస్ రోడ్లు కలిపి 200 అడుగుల విశాలంతో రోడ్డు ఏర్పడుతుంది. నగరంలో విశాలంగా ఉన్న ప్రధాన రోడ్డు ఇదే కానుంది. ప్రస్తుతం రోడ్డు నాలుగు వరుసలుగా ఉన్నా.. 60 మీటర్ల స్థలం మాత్రం అందుబాటులో ఉంది. ఇప్పుడు ఆ మొత్తం రోడ్డుగా మారబోతోంది. అవసరమైన చోట్ల ఫ్లైఓవర్లు ఈ రోడ్డులో వాహనాలకు క్రాసింగ్ రోడ్లతో ఇబ్బంది లేకుండా ఫ్లైఓవర్లను నిర్మిస్తారు. ఇందులో బీహెచ్ఈఎల్ వద్ద ఫ్లైఓవర్ రానుంది. దీనిని ఈ రోడ్డులో భాగంగానే నిర్మించాల్సి ఉంది. అక్కడ ట్రాఫిక్ చిక్కుల దృష్ట్యా ఆ పనులను విడదీశారు. త్వరలో అక్కడ నిర్మాణ పనులు జరగబోతున్నాయి. ఇక పటాన్చెరు, ఇస్నాపూర్, ముత్తంగి, రుద్రారం,కంది ప్రాంతాల్లో ఫ్లైఓవర్లను నిర్మించనున్నారు. నగరంలో ప్రస్తుతం రోడ్డు విస్తరణకు వీలుగా 60 మీటర్ల స్థలం అందుబాటులో ఉంది. కొన్ని ప్రాంతాల్లో తప్ప పెద్దగా నిర్మాణాలు అడ్డుగా లేవు. బీహెచ్ఈఎల్ దాటిన తర్వాత చాలా ప్రాంతాల్లో నిర్మాణాలను తొలగించాల్సి ఉంది. ఏప్రిల్ నాటికి టెండర్లు పూర్తి చేసి జూలై నాటికి పనులు ప్రారంభించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పనులు ప్రారంభమైన రెండేళ్లలో పూర్తి చేయాలన్నది లక్ష్యం. కానీ, రెండున్నరేళ్లలో పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. -
యాదాద్రికి 6 లేన్ల రోడ్డు
సాక్షి, యాదాద్రి : హైదరాబాద్–భూపాలపట్నం జాతీయ రహదారి–163 విస్తరణకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇందుకు సంబంధిం చిన డీపీఆర్‌కు జాతీయ రహదారుల శాఖ ఆమోద ముద్ర వేసింది. భారతమాల పథకంలో భాగంగా విస్తరించనున్న ఈ రహదారిని హైదరాబాద్ నుంచి యాదాద్రి (33 కిలోమీటర్లు) వరకు 6 లేన్లుగా నిర్మించనున్నారు. అదనపు భూ సేకరణ లేకుండా రెండు వైపులా ప్రస్తుత రహదారుల హద్దులు, సర్వీస్ రోడ్లను కలుపుకుని రోడ్డును విస్తరించ నున్నారు. ప్రమాదాల నివారణకు బస్టాప్‌ల వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు, ఎస్కలేటర్లు, మినీ అండర్‌పాస్‌లు నిర్మించనున్నారు. అన్నింటికీ అనుసంధానంగా.. హైదరాబాద్–వరంగల్ రోడ్డు విస్తరణలో భాగంగా మొదటి విడతలో హైదరాబాద్–యాదాద్రి వరకు 33 కిలోమీటర్ల నాలుగు లేన్ల రోడ్డు నిర్మించారు. ప్రస్తుతం ఈ రోడ్డు మీదుగా శని, ఆదివారాల్లో 25 వేల వరకు.. మిగతా రోజుల్లో 20 వేల వరకు వాహనాల రాకపోకలు సాగిస్తున్నాయి. ఇక రాయగిరి నుంచి వరంగల్ వరకు 90 కిలోమీటర్లకు పైగా రోడ్డును 4 లేన్లుగా అభివృద్ధి చేస్తున్నారు. అయితే యాదాద్రి పుణ్యక్షేత్రం, ఉమ్మడి వరంగల్ జిల్లా మీదుగా కోస్తాంధ్ర, ఛత్తీస్‌గఢ్, మహా రాష్ట్రలకు రవాణా సౌకర్యం పెరిగింది. గోదావరి నదిపై ఏటూరు నాగారం, కాళేశ్వరం వద్ద నిర్మించిన వంతెనలతో హైదరాబాద్‌కు వాహనాల రాకపోకలు పెరిగాయి. రానున్న దసరా నాటికి యాదాద్రి పుణ్యక్షేత్రంలో ప్రధానాలయం నిర్మాణం పూర్తయితే భక్తుల రద్దీతో వాహనాల సంఖ్య రెండింతలయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రధానాలయం భక్తులకు అందుబాటులోకి వస్తే రోజూ లక్ష మంది వరకు భక్తులు రావొచ్చని, ఇందులో అధిక శాతం హైదరాబాద్ నుంచే వచ్చే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. అలాగే బీబీనగర్ వద్ద నిమ్స్, ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఏర్పాటు కాబోతున్నాయి. యాదాద్రి నుంచి రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. వీటన్నింటికీ అనుసంధానంగా ఉండేలా రోడ్డును 6 లేన్లుగా విస్తరించనున్నారు. నిమ్స్ వద్ద ఎస్కలేటర్లు ప్రస్తుత నాలుగు లేన్ల రహదారిపై జరుగుతున్న ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టారు. ప్రమాదకరంగా ఉన్న కూడళ్ల వద్ద సెఫ్టీ నిర్మాణాలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించారు. జాతీయ రహదారి పక్కన ఉన్న బీబీనగర్‌లోని నిమ్స్ ప్రాంగణం వద్ద ఎస్కలేటర్ నిర్మించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడే ఎయిమ్స్ ఏర్పాటు చేయబోతోంది. బీబీనగర్ పట్టణంలో పుట్ ఓవర్ బ్రిడ్జి, భువనగిరిలోని సింగన్నగూడెం వద్ద రూ. 6 కోట్ల వ్యయంతో మినీ అండర్‌పాస్ నిర్మించనున్నారు. కాగా, యాదాద్రి రోడ్డు మార్గంలో పలు చోట్ల భూ సేకరణ జరగాల్సి ఉండటంతో సర్వీస్ రోడ్ల నిర్మాణం నిలిచిపోయింది. దీంతో భూ సేకరణ వేగం పెంచాలని జాతీయ రహదారుల సంస్థ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. -
అనంత' నుంచి అమరావతికి ఆరు లైన్ల రహదారి
– 3 నెలల్లో భూ సేకరణ పూర్తి కావాలి – వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం ఆదేశం అనంతపురం అర్బన్ : అనంతపురం నుంచి అమరావతికి ఏర్పాటు చేయనున్న ఆరు లైన్ల రహదారికి అవసరమైన భూసేకరణ మూడు నెలల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గురువారం విజయవాడ నుంచి ఆయన ఇన్చార్జి కలెక్టర్, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ అనంతపురం, కర్నూలు, వైఎస్ఆర్ కడప, ప్రకాశం, గుంటూరు జిలాల నుంచి అమరావతికి 598 కిలో మీటర్ల ఆరు లైన్ల రహదారి ఏర్పాటుకు రూ.27,600 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపడుతున్నామని చెప్పారు. అనంతపురం జిల్లాలో 1,260 హెక్టార్ల భూమి అవసరమవుతుందన్నారు. ఇందులో అటవీ భూములు కూడా ఉన్నాయన్నారు. రోడ్డుకు ఇరువైపుల అభివృద్ధి జరిగితే భూమి విలువ పెరుగుతుందనే భావన ప్రజల్లో ఉంటుందన్నారు. అయితే ఇది ఎక్స్‌ప్రెస్ రోడ్డు కాబట్టి ఎలాంటి అభివృద్ధి ఉండదనే విషయాన్ని ప్రజలకు వివరించాలన్నారు. భూమి విలువ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో, నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో 1,017 హెక్టార్లు సేకరించాల్సి ఉంది. జిల్లా నుంచి అమరావతికి వెళ్లే మార్గం 72.85 కిలోమీటర్లు ఉంటుందని, ఇందుకు 1,017 హెక్టార్లు సేకరించాల్సి ఉంటుందని ముఖ్యమంత్రికి æఇన్చార్జి కలెక్టర్ బి.లక్ష్మీకాంతం తెలిపారు. అనంతపురం, రాప్తాడు, బుక్కరాయసముద్రం, పుట్లూరు, నార్పల, తాడిప్రతి మండలాల్లో ఈ భూమి సేకరించాల్సి వస్తుందన్నారు. ముచ్చుకోట, దూకుడు పల్లెల్లో రిజర్వు ఫారెస్టు ఉందన్నారు. ప్రభుత్వ భూములన్న చోట పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయాలన్నారు. శుక్రవారం నుంచి రహదారి అలైన్మెంట్ చూపేందుకు అధికారులను పంపుతామన్నారు. ఆర్డీఓ మలోలా, ఆర్ అండ్ బీ ఎస్ఈ శివకుమార్, ఈఈ శ్రీనాథ్, తదితరులు పాల్గొన్నారు.