Six MLC positions
-
ముగిసిన మండలి పోరు
సాక్షి, హైదరాబాద్: ప్రత్యర్థుల కొనుగోళ్లు.. జోరుగా వలసలు.. క్యాంపు రాజకీయాలు.. వెరసి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన స్థానిక కోటా శాసన మండలి ఎన్నికలు ఆదివారం ముగిశాయి. నాలుగు జిల్లాల పరిధిలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. ఆయా జిల్లాలకు చెందిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యు లు, కౌన్సిలర్ల ఓట్లను కాపాడుకునేందుకు అధికార టీఆర్ఎస్, విపక్ష కాంగ్రెస్, టీడీపీలు క్యాంపులు నిర్వహించాయి. వీరంతా పోలింగ్ సమయానికి క్యాంపుల నుంచి తిరిగి వచ్చి ఓటింగ్‌లో పాల్గొన్నారు. మహ బూబ్‌నగర్ , రంగారెడ్డి జిల్లాల్లో రెండే సి స్థానాలకు, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానానికి మొత్తంగా ఆరు సీట్లకు ఓటింగ్ జరగ్గా.. 99 శాతం పోలింగ్ నమోదైంది. తొమ్మిది జిల్లాల పరిధిలో స్థానిక సంస్థల కోటాలోని 12 స్థానాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. నామినేషన్ల ఉపసంహరణ నాటికే.. వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో ఒక్కో స్థానాన్ని కరీంనగర్ జిల్లాలో రెండు స్థానాలను మొత్తంగా ఆరు స్థానాలను టీఆర్ఎస్ ఏకగ్రీవంగా తన ఖాతాలో వేసుకుంది. దీంతో మిగిలిన ఆరు స్థానాలకే ఎన్నికలు జరిగాయి. 33 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బరిలో నిలిచినా.. ప్రధాన పోటీ టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే జరిగింది. ఖమ్మంలో కాంగ్రెస్ సహా టీడీపీ, బీజేపీ, సీపీఎం బలపరిచిన సీపీఐ, స్వతంత్రంగా బరిలోకి దిగిన వైఎస్సార్ కాంగ్రెస్ టీఆర్ఎస్తో పోటీ పడ్డాయి. నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే పోటీ నెలకొంది. ఎవరి ధీమాలో వారు.. స్థానిక సంస్థల్లో తమకున్న ఓట్ల సంఖ్యను బట్టి పోటీలో ఉన్న వివిధ పార్టీల అభ్యర్థులు తమ విజయంపై గట్టి నమ్మకంతో ఉన్నారు. ఎన్నికల ప్రచారం సమయంలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్ల బేరసారాలు జోరుగా సాగాయి. కాంగ్రెస్, టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి జోరుగా వలసలు సాగా యి. దీంతో ఆయా పార్టీల వాస్తవ ఓట్ల సంఖ్యలో భారీగా తేడాలు వచ్చాయి. దీంతో రెండేసి స్థానాలున్న మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్, టీడీపీలు ఒక్కో జిల్లాలో ఒక్కోస్థా నంలో పోటీ చేసి పరస్పర సహకారంపై అంగీకారానికి వచ్చాయి. నల్లగొండలో కాం గ్రెస్, టీఆర్ఎస్లు ఢీ అంటే ఢీ అన్నాయి. చివరకు పోలింగ్ ముగిశాక ఏ పార్టీకి ఆ పార్టీ సొంత అంచనాల్లో మునిగిపోయాయి. గెలుపు తమదే అంటూ పార్టీలు లెక్కలు చెబుతున్నా.. క్రాస్ ఓటింగ్ భయమూ వెంటాడుతోంది. నల్లగొండ జిల్లాలో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లు ప్రచారం జరుగుతోంది. ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసే వ్యవహారంలో సొంత పార్టీకి చెందిన ఓటర్ల కంటే ఇతర పార్టీల వారికే టీఆర్ఎస్ ప్రాధాన్యం ఇచ్చిందని, దీంతో ఆ పార్టీకి చెందిన కొం దరు ఓటర్లు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమైంది. 30న లెక్కింపు... ఈ నెల 30వ తేదీన ఆరు స్థానాల ఓట్ల లెక్కింపు జరగనుంది. నాలుగు జిల్లాల్లో ఆరు స్థానాల పరిధిలోని 3,893 ఓట్లకుగాను 3,817 ఓట్లు పోలయ్యాయి. నల్లగొండ జిల్లాలో 99 శాతం, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలో 99.7 శాతం చొప్పున పోలింగ్ జరిగింది. ఖమ్మంలో కాస్త తక్కువగా 95.72 శాతం ఓట్లు పోలయ్యాయి. -
మండలి ఎన్నికలు నేడే
-
మండలి ఎన్నికలు నేడే
* ఏర్పాట్లను పరిశీలించిన ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ * ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 4 గం. వరకు పోలింగ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసన మండలిలో ఆరు ఎమ్మెల్సీ స్థానాల భర్తీ కోసం సోమవారం ఎన్నిక జరగనుంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా పోలింగ్ జరగనుంది. అసెంబ్లీలోని ఒకటో నంబరు సమావేశ మందిరంలో పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ ఆదివారం సాయంత్రం ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, శాసన సభా కార్యదర్శి రాజ సదారాం ఏర్పాట్ల గురించి వివరించారు. ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు గాను ఏడుగురు అభ్యర్ధులు బరిలో ఉన్నారు. మొత్తం 120 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. కాగా, సీపీఎం, సీపీఐ తాము ఎన్నికలకు దూరంగా ఉంటామని ప్రకటించాయి. దీంతో 118 మంది ఓటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంది. పోలింగ్ ముగిశాక, ఇదే రోజు 5 గంటలకు ఓట్ల లెక్కింపును ప్రారంభించి... రాత్రికల్లా విజేతలను ప్రకటిస్తారు. -
మండలికి తప్పని ఎన్నిక
⇒ ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు ⇒ ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు బరిలో ఏడుగురు అభ్యర్థులు సాక్షి, హైదరాబాద్: రాష్ర్ట శాసన మండలికి ఎన్నికలు తప్పడం లేదు. ఎమ్మెల్యే కోటాలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఏడుగురు అభ్యర్థులు బరిలో ఉండటంతో పోటీ అనివార్యమైంది. నామినేషన్ల ఉపసంహరణకు సోమవారంతో గడువు ముగిసింది. నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులెవరూ ఉపసంహరించుకోలేదు. గడువు ముగిశాక పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను మండలి ఎన్నికల అధికారి, శాసనసభా కార్యదర్శి రాజాసదారాం అధికారికంగా ప్రకటించారు. కాంగ్రెస్ నుంచి ఆకుల లలిత, టీఆర్ఎస్ నుంచి తుమ్మల నాగేశ్వర్రావు, కడియం శ్రీహరి, నేతి విద్యాసాగర్, కె.యాదవరెడ్డి, బోడకుంటి వెంకటేశ్వర్లు, టీడీపీ నుంచి వేం నరేందర్‌రెడ్డి పోటీ పడుతున్నారు. ఎమ్మెల్యేల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే టీఆర్ఎస్కు నాలుగు, కాంగ్రెస్‌కు ఒకటి, ఇతర పార్టీల మద్దతుతో టీడీపీ ఒక స్థానం గెలుచుకోగలుగుతాయి. ఒకవేళ ఆరుగురు అభ్యర్థులే పోటీ పడి ఉంటే, మండలి ఎన్నిక ఏకగ్రీవమయ్యేది. కానీ, టీఆర్ఎస్ ఐదో స్థానంపై కన్నేసి అభ్యర్థిని పోటీకి దింపడంతో ఎన్నిక తప్పడం లేదు. టీడీపీ నేతలకు గాలం! ఎంతగా అంకెల గారడిని నమ్ముకున్నా, ఇతర పార్టీలకు చెందిన కొందరు ఎమ్మెల్యేల ఓట్లను సంపాదించడం టీఆర్ఎస్కు తప్పని పరిస్థితి. ఈ కారణంగానే టీడీపీకి చెందిన కొందరికి గాలమేస్తున్నట్లు సమాచారం. టీడీపీ ఎమ్మెల్యేలు మాధవరపు కృష్ణారావు, ప్రకాశ్ గౌడ్లు టీఆర్ఎస్లో చేరుతారని ప్రచారం జరుగుతోంది. కాబట్టి వీరి రెండు ఓట్లు టీఆర్ఎస్కే పడతాయన్న అంచనాలు మొదలయ్యాయి. మరోవైపు ఈ ఎన్నికకు కొందరు ఎమ్మెల్యేలను గైర్హాజరు చేయిస్తే తమకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్న నాయకులు సీపీఎం, సీపీఐ ఎమ్మెల్యేలు ఓటింగ్‌కు హాజరుకాకుండా చూసే పనిలో ఉన్నట్లు తెలిసింది. ఇది టీడీపీకి కొంత అనుకూలించే అంశమైనా, తమకు మరింత లాభకరమన్న అంచనాకు వచ్చారు. ఈ మేరకు ఓ మంత్రి ఇప్పటికే ఒకరిద్దరు ఎమ్మెల్యేలను ఓటింగ్‌కు హాజరుకావద్దని కోరినట్లు సమాచారం. ఆరు నూరైనా ఐదో ఎమ్మెల్సీని గెలిపించుకోవాలన్న పట్టుదల టీఆర్ఎస్ నేతల్లో కనిపిస్తోంది. ‘ఐదు’ కోసం టీఆర్ ఎస్ వ్యూహం ఒక్కో ఎమ్మెల్సీ పదవిని గెలుచుకోవడానికి 18 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుచుకున్న స్థానాలకుతోడు, ఆంగ్లో ఇండియన్(నామినేటెడ్) సభ్యుడు, వివిధ పార్టీల నుంచి గులాబీ తీర్థం పుచ్చుకున్న వారిని కలిపితే అధికార పార్టీ బలం 76కు చేరింది. అనధికార మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న ఎంఐఎంకు చెందిన మరో ఏడుగురు ఎమ్మెల్యేలను కలిపితే ఆ పార్టీ చేతిలో 83 ఓట్లు ఉన్నాయి. నలుగురు ఎమ్మెల్సీలను గెలుచుకోవడానికి 72 ఓట్లు పోగా, ఆ పార్టీకి ఇంకా 11 ఓట్లు ఉంటాయి. ఐదో ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకోవాలంటే టీఆర్ఎస్కు మరో ఏడు ఓట్లు అవసరమవుతాయి. దీంతో తొలి ప్రాధాన్య ఓటుతో కాకుండా, ద్వితీయ ప్రాధాన్య ఓటుతో బయట పడాలని టీఆర్ఎస్ లెక్కలు వేస్తోంది. ఇక బీజేపీ మద్దతిస్తున్న టీడీపీకి 16 ఎమ్మెల్యే ఓట్లు ఉన్నాయి. ఆ పార్టీ అభ్యర్థికి మరో రెండు ఓట్లు కావాలి. టీడీపీ ఎమ్మెల్యేలు కొందరు తమ అభ్యర్థికి ఓట్లేస్తారన్నది గులాబీ నేతల ధీమా. ఆత్మప్రబోధం మేరకు నడుచుకోవాలని టీఆర్ఎస్ ఇప్పటికే పిలుపునిస్తోంది.