S.J.Surya
-
‘గేమ్ ఛేంజర్’ HD మూవీ స్టిల్స్
-
సూర్య అవుట్... డాలీ ఇన్!
పవన్ కల్యాణ్ హీరోగా ఎస్.జె. సూర్య దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మించనున్న తాజా చిత్రం లాంచనంగా ప్రారంభమై దాదాపు రెండు నెలలు అవుతోంది. ఇంకా ఈ చిత్రం షూటింగ్ మొదలు కాకపోవడంతో కథా చర్చల దశలో ఉందనీ, రేపో మాపో చిత్రీకరణ మొదలుపెట్టేస్తారనే చర్చ జరుగుతోంది. అయితే అసలు విషయం అది కాదని నిర్ధారణ అయ్యింది. చిత్రదర్శకుడు ఎస్.జె. సూర్య డేట్స్ సర్దుబాటు చేయలేకపోవడంతోనే షూటింగ్ ప్రారంభం కాలేదు. ఈ విషయాన్ని ఆదివారం చిత్రనిర్మాత శరత్ మరార్ ఓ ప్రకటన ద్వారా పేర్కొన్నారు. తమిళంలో ఎస్.జె. సూర్య నటించిన ‘ఇరైవి’ ఇటీవల విడుదలైంది. ఆ చిత్రం తర్వాత సూర్యకు తమిళ, తెలుగు భాషల్లో నటుడిగా పలు అవకాశాలు రావడంతో పవన్ కల్యాణ్‌తో కమిట్ అయిన చిత్రానికి టైమ్ కేటాయించలేని పరిస్థితి. ఈ కారణంగా సినిమా ఆలస్యం అయ్యే అవకాశం ఉండటంతో పవన్ కల్యాణ్‌తో చర్చించి, సూర్య స్థానంలో వేరే దర్శకుణ్ణి తీసుకోవాలని శరత్ మరార్ నిర్ణయించుకున్నారు. సూర్యతో కూడా మాట్లాడిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చారట. ఎలాంటి భిన్నాభిప్రాయాలకూ తావు లేకుండా ముగ్గురూ ఒక అవగాహన వచ్చాకే వేరే దర్శకుణ్ణి నిర్ణయించారు. వెంకటేశ్-పవన్ కల్యాణ్ కాంబినేషన్లో ‘గోపాల గోపాల’ తెరకెక్కించిన డాలీ (కిశోర్‌కుమార్ పార్థసాని) ని దర్శకుడిగా ఫిక్స్ చేశారు. జూలై నెలాఖరున షూటింగ్ మొదలుపెట్టనున్నారు. -
విజయ్ నో అంటే నేనే హీరో అవుతా!
ఖుషీ చిత్రం తమిళం, తెలుగు భాషల్లో ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళంలో విజయ్‌కు, తెలుగులో పవన్‌కల్యాణ్‌కు అంత ఘన విజయాలను అందించిన దర్శకుడు ఎస్జే.సూర్య అన్నది తెలిసిందే. ఆ తరువాత ఎస్జే.సూర్య హీరోగా అవతారమెత్తి న్యూ,అఆ తదితర చిత్రాల్లో నటించారు. ఆ మధ్య ఇసై అనే చిత్రంలో నటించి దర్శకత్వం వహించారు. ఏదేమైనా హీరోగా అంతగా సక్సెస్‌ను అందుకోలేక పోయిన ఎస్జే.సూర్య క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రాధాన్యం ఉన్న పాత్రలో నటిస్తున్నారు. తాజాగా మళ్లీ మెగాఫోన్ పట్టడానికి సిద్ధమయ్యారు. ఖుషీ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించాలన్న నిర్ణయానికి వచ్చి కథను తయారు చేసుకున్నారు. ఇందులో విజయ్ను నటింపజేయడానికి పులి చిత్ర షూటింగ్లో ఉన్న ఆయన చుట్టూ తిరిగారు. ఒక దశలో వీరి కాంబినేషన్లో చిత్రం తెరకెక్కనుందనే ప్రచారం జరిగింది. అయితే విజయ్ వేరే దర్శకుడికి కాల్షీట్స్ ఇచ్చి ఎస్జే.సూర్యకు షాక్ ఇచ్చారు. దీంతో ఆయన ఖుషీ-2ను ముందుగా తెలుగు తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. అందుకు పవన్‌కల్యాణ్ ఓకే చెప్పడంతో అక్కడ ఖుషీ-2 తెర రూపం దాల్చనుంది. ఇందులో శ్రుతిహాసన్ నాయకిగా నటించనున్నట్లు ప్రచారంలో ఉంది. తెలుగులో నిర్మాణం పూర్తి అయిన తరువాత ఆ చిత్రాన్ని తమిళంలోనూ రీమేక్ చేయాలని ఎస్జే.సూర్య నిర్ణయించుకున్నారని సమాచారం.అప్పుడు మరోసారి విజయ్ను కాల్షీట్స్ అడగనున్నట్లు, అప్పటికీ ఆయన ముఖం చాటేస్తే తానే ఖుషీ-2లో హీరోనవ్వాలని ఎస్జే.సూర్య నిర్ణయించుకున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. -
పవన్‌తో మరోసారి?
పవన్ కల్యాణ్‌తో అద్భుతమైన కెమిస్ట్రీ కుదిరిన నాయికల్లో సమంత ఒకరు. ‘అత్తారింటికి దారేది’లో ఈ జంట చూడముచ్చటగా ఉంటుంది. మరోసారి ఈ ఇద్దరూ జతకట్టనున్నారన్నది చెన్నై టాక్. పవన్ కల్యాణ్ నటించిన చిత్రాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే వాటిలో ‘ఖుషీ’ ఒకటి. ఈ చిత్రదర్శకుడు ఎస్.జె. సూర్య దీనికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రానికి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఇందులో సమంతను నాయికగా తీసుకోవాలను కుంటున్నారట. -
ఇసైకి ముహూర్తం కుదిరింది
ఇసై చిత్రానికి ముహుర్తం కుదిరింది. దర్శక నటుడు ఎస్‌జె సూర్య హీరోగా నటించి దర్శకత్వం వహించిన చిత్రం ఇసై. ఇది ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా, ఏఆర్ రెహ్మాన్ మధ్య ఇగో ఇత్యాది అంశంతో కూడిన కథా చిత్రమంటూ ప్రచారం జరిగి కలకలం పుట్టించిన చిత్రం. ఈ చిత్రంలో ఇళయరాజా పాత్రను పోషించడానికి నటుడు ప్రకాష్‌రాజ్ నిరాకరించి చిత్రం నుంచి వైదొలగినట్లు సమాచారం. మొత్తం మీద చాలా కాలంగా నిర్మాణంలో వున్న ఇసై చిత్రానికి ఇప్పటికీ మోక్షం వచ్చింది. ఈ నెల 30న విడుదలకు సిద్ధమవుతోంది. ఇసై చిత్రం ఇంతకుముందు ఎప్పుడు చూడనటువంటి సరికొత్త అనుభూతిని ప్రేక్షకులకు అందిస్తుందంటున్నారు. చిత్ర దర్శక హీరో ఎస్‌జె సూర్య, ప్రకాష్‌రాజ్ తిరస్కరించిన పాత్రను సత్యరాజ్ పోషించడం విశేషం. కథా నటి సావిత్రి నాయకిగా పరిచ యం అవుతున్న ఈ చిత్రానికి ఎస్‌జె సూర్య నే సంగీత బాధ్యతలు చేపట్టడం మరో విశేషం. ఇసై చిత్రాన్ని ఈ నెల 30న 300థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.