పువ్వు.. పారదర్శకంగా..
ఈ పువ్వు పేరు డైఫిలియా గ్రేయై. జపాన్, చైనాలో ఎక్కువగా కనిపిస్తుంది. దీని ప్రత్యేకత చూడగానే తెలిసిపోతుంది కదూ.. వర్షం పడినప్పుడు ఈ పుష్పం ఇలా పారదర్శకంగా మారిపోతుంది. మళ్లీ ఎండ రాగానే.. మామూలుగా అయిపోతుంది. దీన్ని స్థానికంగా ‘స్కెలెటన్ ఫ్లవర్’ అని కూడా పిలుస్తారు.