skiing accident
-
షుమాకర్ ఇంటికి
జెనీవా: స్కీయింగ్ ప్రమా దంలో గాయపడి కోలుకుంటున్న ఫార్ములావన్ దిగ్గజం మైకేల్ షుమాకర్ను స్విస్ ఆసుప్రతి నుంచి ఇంటికి తరలించారు. ఇంటి దగ్గరే అతనికి అవసరమైన చికిత్సను అందజేస్తున్నట్లు కుటుంబ సభ్యులు ఓ ప్రకటనలో తెలిపారు. ‘షుమాకర్కు పునరావాస చికిత్స అందుతోంది. అతనిలో గత కొన్ని నెలలుగా పురోగతి కనిపిస్తోంది. అయితే ఇంకా కోలుకోవాల్సి ఉంది. షుమీ కుటుంబ విషయాలను గోప్యంగా ఉంచాలని కోరుకుంటున్నాం. అతని ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న ఊహాగానాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అని షూమీ అధికార ప్రతినిధి సబీనా కెమ్ తెలిపారు. -
కోమా నుంచి బయటపడ్డ షుమాకర్
-
కోమా నుంచి బయటపడ్డ షుమాకర్
గ్రెనోబుల్ (ఫ్రాన్స్): స్కీయింగ్ ప్రమాదంలో గాయపడిన ఫార్ములా వన్ మాజీ ప్రపంచ ఛాంపియన్ మైకేల్ షుమాకర్ కోమా నుంచి బయటపడ్డాడు. గ్రెనోబుల్ ఆసుపత్రి నుంచి అతడు ఇంటికి చేరుకున్నాడని షుమాకర్ కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. అతడికి వైద్యపరమైన సపర్యలు కొనసాగుతాయని వెల్లడించింది. షుమాకర్ చికిత్స చేసిన వైద్యులు, సేవలు అందించిన నర్సులు, ప్రాథమిక చికిత్స చేసిన వారిని అతడి కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. షుమాకర్ కోలుకోవాలని ప్రార్థించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపింది. 45 ఏళ్ల మైకేల్ గతేడాది డిసెంబర్ 29న ఫ్రాన్సులో స్కీయింగ్ చేస్తూ పడిపోయాడు. బండరాయికి తల బలంగా మోదుకోవడంతో తీవ్రగాయాలపాలై కోమాలోకి వెళ్లిపోయాడు. ఆరు నెలల తర్వాత కోమా నుంచి బయటకు వచ్చాడు. -
స్కీయింగ్ చేస్తూ గాయపడిన షుమాకర్