skyways
-
మేడ్ ఇన్ ఇండియాతో దేశాభివృద్ధి
‘మేడ్ ఇన్ ఇండియా’, ‘మేక్ ఇన్ ఇండియా’కారణంగా దేశం అభివృద్ధి వైపు పరుగులు తీస్తోందని స్కైవేస్ గ్రూప్ చైర్మన్ ఎస్ఎల్ శర్మ అన్నారు. సోమవారం చెన్నైలో లాజిస్టిక్స్ దిగ్గజమైన స్కైవేస్ గ్రూప్ 40 “వ్యవస్థాపక దినోత్సవం, చెన్నై శాఖ 20 వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో భారతదేశం, ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో విస్తరణ ప్రణాళికలను ప్రకటించారు. నిజాయితీ, నిబద్ధత, కస్టమర్లకు మెరుగైన సేవలు ప్రధానంగా చేసుకుని నాలుగు దశాబ్దాలుగా రాణిస్తున్నట్టు తెలిపారు. దక్షిణ భారతదేశంలోని ఉత్పాదక నగరాలకు తన సేవలను మరింత విస్తరించాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. చెన్నైతో పాటు తిరుచ్చి, మధురై, కోయంబత్తూర్, తిరుప్పూర్, కరూర్, వెల్లూరు, అంబూర్, తంజావూరు, వంటి అనేక నగరాలతోపాటు దక్షిణ భారత మార్కెట్‌పై స్కైవేస్ గ్రూప్ దృష్టి సారిస్తోందని ఈ సందర్భంగా వివరించారు. మేకిన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ఇండియాతో ఉత్పత్తి పెరిగి లాజిస్టిక్ సంస్థల్లో పనిచేస్తున్న కోట్లాది మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరిందని తెలిపారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ యాష్ పాల్ శర్మ పాల్గొన్నారు. చదవండి: ప్రభుత్వ ఉద్యోగుల ఆశలు ఆవిరి.. ఇప్పట్లో లేదని కేంద్రం క్లారిటీ! -
నగరంలో స్కైవేలు
సాక్షి, హైదరాబాద్ : ఇప్పటి వరకు ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ఫ్లై ఓవర్లు, స్టీల్ బ్రిడ్జిలకు సిద్ధమైన జీహెచ్ఎంసీ త్వరలో కేవలం పాదచారుల కోసం ప్రత్యేకంగా ఎనిమిది ప్రాంతాల్లో స్టీల్ స్కైవేలను అందుబాటులోకి తేనుంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో రోడ్లను దాటలేక పాదచారులు పడుతున్న వేదనలు వర్ణనాతీతం. ఇప్పటికే పాదచారులకు ఫుట్‌పాత్‌లను అందుబాటులోకి తెచ్చేందుకు ఫుట్‌పాత్‌లపై ఆక్రమణల కూల్చివేతలకు సిద్ధమైన జీహెచ్ఎంసీ మరోవైపు జంక్షన్లు.. తీవ్ర రద్దీ ప్రాంతాల్లో పాదచారులు రోడ్డుకు ఒక వైపు నుంచి మరోవైపు వెళ్లేందుకు స్కైవాక్‌లను నిర్మిచేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా తొలిదశలో ఎనిమిది ప్రాంతాల్లో ఈ స్కైవాక్‌లను నిర్మించనున్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న మార్గాలను బట్టి అందుకనుగుణంగా వర్తులాకారంలో, త్రిభుజారకారంలో, చతురస్రాకారంలో ఈ స్కైవేలు ఏర్పాటు చేస్తారు. ఇలా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో నాలుగు వైపులకు వెళ్లేలా, మెహదీపట్నంలో మూడు వైపులకు వెళ్లేలా స్కైవేలు నిర్మించనున్నారు. మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు 52 ప్రాంతాల్లో ఫుట్ఓవర్ బ్రిడ్జిలు(ఎఫ్‌ఓబీలు) నిర్మించనున్నారు. ఇవి రోడ్డుకు ఒక వైపు నుంచి మరోవైపు వెళ్లేందుకు ఉపకరిస్తాయి. వీటిల్లో ఎలివేటర్లు ఉండేవి కూడా ఉన్నాయి. ఎనిమిది స్కైవేలు, 52 ఎఫ్ఓబీల ఏర్పాటుకు అవసరమైన రూ. 207 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు పరిపాలనపర అనుమతులిస్తూ మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ ప్రిన్సిపల్సెక్రటరీ అర్వింద్‌కుమార్ బుధవారం ఉత్తర్వు జారీ చేశారు. వీటిల్లో 39 ఎఫ్‌ఓబీలకు అవసరమైన రూ.75 కోట్లు హెచ్ఎండీఏ భరిస్తుంది. మిగతావి జీహెచ్ఎంసీ నుంచి ఖర్చు చేస్తారు. నగరంలో ఎఫ్ఓబీల ఏర్పాటుకు ఏళ్ల తరబడి జరుగుతున్న ప్రయత్నాలు కొలిక్కిరాలేదు. ఇటీవల 44 ప్రాంతాల్లో ఎఫ్‌ఓబీలు ఏర్పాటును ప్రభుత్వం జీహెచ్ఎంసీ నుంచి హెచ్ఎండీఏకు బదిలీ చేసింది. వాటిల్లో ఐదు ప్రాంతాల్లో మాత్రం ఏర్పాటుకు సిద్ధమైన హెచ్ఎండీయే మిగతావి తమవల్ల కాదంటూ చేతులెత్తేసింది. మిగతా 39 ఎఫ్‌ఓబీలను జీహెచ్ఎంసీకి బదిలీ చేసింది. వాటికయ్యే వ్యయాన్ని మాత్రం హెచ్‌ఎండీనే భరించాల్సి ఉంది. స్కైవేలను పాదచారులకు ఉపకరించేలా ఉండటంతో పాటు ఆకర్షణీయంగా, ప్రత్యేక డిజైన్లతో ఏర్పాటు చేయనున్నారు. పాదచారుల భద్రత కోసం ఎఫ్‌ఓబీలు అవసరమని ట్రాఫిక్ పోలీసులు సూచించడంతో సిద్ధమవుతున్నారు. స్కైవేలిక్కడ.. 1. ఉప్పల్రింగ్రోడ్డు 2. ఆరాంఘర్ చౌరస్తా 3. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ 4.లక్డికాపూల్ 5. రోడ్ నెంబర్ 1, 12 జంక్షన్, బంజారాహిల్స్ 6. మెహిదీపట్నం 7.సుచిత్రా జంక్షన్ 8. బోయిన్పల్లి క్రాస్‌రోడ్ ఎఫ్‌ఓబీలు.. రామకృష్ణమఠం(ఇందిరాపార్కు ఎదుట), చిలకలగూడ రింగ్‌రోడ్, మహవీర్ హాస్పిటల్, చెన్నయ్ షాపింగ్‌మాల్(మదీనగూడ), హైదరాబాద్ సెంట్రల్‌మాల్, ఆల్విన్‌క్రాస్‌రోడ్స్(మియాపూర్), ఉప్పల్ రింగ్‌రోడ్, హైదరాబాద్ పబ్లిక్‌స్కూల్(రామంతాపూర్), ఇందిరానగర్ జంక్షన్(గచ్చిబౌలి), నేరెడ్మెట్ బస్టాప్, గాంధీ హాస్పిటల్, కేవీఆర్ కాలేజ్(సంతోష్‌నగర్), గెలాక్సీ(టోలిచౌకి), ఆరెమైసమ్మ టెంపుల్(లంగర్‌హౌస్), సాయిసుధీర్‌కాలేజ్(ఏఎస్‌రావునగర్), రాయదుర్గం జంక్షన్, ఒయాసిస్ స్కూల్(షేక్‌పేట), ఈఎస్ఐ హాస్పిటల్(ఎర్రగడ్డ), విజేత సూపర్ మార్కెట్(చందానగర్), వర్డ్ అండ్ డీడ్ స్కూల్ (హయత్‌నగర్), హెచ్ఎండీఏ(మైత్రివనం), జీడిమెట్ల బస్టాప్, నోమ ఫంక్షన్ హాల్(మల్లాపూర్), రంగభుజంగ థియేటర్(షాపూర్‌నగర్), స్వప్న థియేటర్(రాజేంద్రనగర్), సన్‌సిటీ(బండ్లగూడ), సుచిత్ర సర్కిల్, ఐడీఏ ఉప్పల్, విశాల్‌మార్ట్(అంబర్‌పేట), బిగ్‌బజార్(ఐఎస్ సదన్), దుర్గానగర్ టి జంక్షన్, సుష్మ థియేటర్ (వనస్థలిపురం), నెహ్రుజూలాజికల్‌పార్క్, ఓల్డ్కర్నూల్రోడ్ టి జంక్షన్(ఉందానగర్ దగ్గర), అపోలో హాస్పిటల్(సంతోష్‌నగర్), ఒమర్ హోటల్, సైబర్‌గేట్‌వే(హెటెక్‌సిటీ) తదితర ప్రాంతాలున్నాయి. -
‘ఫ్లైఓవర్లతో ప్రయాణం ఇక సుఖమయం’
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ఉపరితల రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శనివారం నగరంలో రూ.1523 కోట్ల వ్యయంతో చేపట్టనున్న నాలుగు ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన చేశారు. హైదరాబాద్–బెంగళూరు మధ్య గల ఎన్‌హెచ్ 44లో ఆరాంఘర్–శంషాబాద్ సెక్షన్‌ను ఆరులేన్ల రహదారిగా మార్చడం, ఎన్‌హెచ్ 765డీలో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి మెదక్ వరకు రోడ్డు స్థాయిని పెంచడం, అంబర్పేట్ ఎక్స్ రోడ్డు వద్ద 4 లేన్ల ఫ్లై ఓవర్ నిర్మాణం, హైదరాబాద్–భూపాలపట్నం సెక్షన్లో ఉప్పల్ నుంచి నారపల్లి వరకు ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం వంటి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో గడ్కరీ, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా ట్రాఫిక్ సమస్యలతో సతమతమవుతోన్న హైదరాబాద్ ప్రజలకు మంచి రోజులు రాబోతున్నాయని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలో రోల్ మోడల్‌గా తయారు చేస్తున్నామని పేర్కొన్నారు. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకంలోని (ఎస్పీడీఆర్) ప్రాజెక్టులకు కూడా కేంద్ర సహకారం ఉంటే త్వరగా పూర్తి చేయొచ్చని తెలిపారు. సికింద్రాబాద్ నుంచి సుచిత్ర వరకు తెలంగాణ ప్రభుత్వం స్కైవే నిర్మించాలనే ప్రతిపాదన చేసిందని వివరించారు. ఈ స్కైవే నిర్మాణానికి రక్షణ శాఖ అధీనంలోని 100 ఎకరాల భూమి అవసరమవుతోందనీ, కానీ, రక్షణ మంత్రిత్వ శాఖ రాష్ట్రానికి సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 100 ఎకరాల రక్షణ శాఖ స్థలానికి బదులుగా తెలంగాణ ప్రభుత్వం 600 ఎకరాల భూమిని ఇచ్చేందుకు అంగీకరించిందని తెలిపారు. అయితే, శాశ్వత ప్రాతిపదికన ప్రతి ఏటా 30 కోట్లు ఇవ్వాలని కేంద్రం మెలిక పెట్టడం సరికాదని అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మండలి చైర్మన్ స్వామి గౌడ్, హోం మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మేయర్ బొంతు రామ్మోహన్, ఉప సభాపతి పద్మా దేవేందర్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. కాగా, కేంద్ర, రాష్ట్రాల నిధులతో ఈ ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టనున్నారు. -
గాలిలో మేడలు...
* సాగర్ తీరంలో ఆకాశ హర్మ్యాల నిర్మాణానికి అడ్డంకులెన్నో? * ఖరారు కాని సాగర్ ఎఫ్టీఎల్ తేలని శిఖం భూముల లెక్కలు * శాశ్వత కట్టడాలపై కోర్టుల నిషేధం.. సర్కారుకు నివేదించిన హెచ్ఎండీఏ! * ప్రాజెక్టుకు నిధుల విడుదలపై సందిగ్ధం సాక్షి, హైదరాబాద్: హుస్సేన్‌సాగర్ తీరంలో ఆకాశహర్మ్యాల నిర్మాణానికి ఎన్నో అడ్డంకులు ఎదురుకాబోతున్నాయి. కబ్జాలతో సాగర్ శిఖం భూములు కుంచించుకుపోవడంతో సరిహద్దులపై స్పష్టత లేదు. సాగర్ గరిష్ట నీటి మట్టం (ఎఫ్టీఎల్) కచ్చితంగా నిర్ధారణ కాలేదు. సాగర్ ఎఫ్టీఎల్ వెలుపలి భాగంలో ఎత్తైన ఆకాశహర్మ్యాలు, ఆకాశ మార్గాలు (స్కై లైన్లు) నిర్మించాలని టీ సర్కార్ భావిస్తున్నప్పటికీ అసలు ఎఫ్టీఎల్పైనే స్పష్టత లేదు. ఎఫ్టీఎల్ను నిర్ధారించకుండానే ఆకాశ హర్మ్యాల నిర్మాణానికి సాగర్ తీరంలోని సంజీవయ్య పార్కు స్థలాన్ని ప్రభుత్వం ఎంపిక చేయడాన్ని పర్యావరణవేత్తలు వ్యతిరేకిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా సాగర్ తీరంలో అనుమతి లేకుండా శాశ్వత కట్టడాలను నిర్మించరాదని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు సైతం మరో అడ్డంకిగా నిల వనుంది. దీనికి తోడు సాగర్ పరిరక్షణ కోసం పలువురు పర్యావరణ ప్రేమికులు వేసిన ఎన్నో వ్యాజ్యాలు హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. సాగర్ తీరంలో ఆకాశ హర్మ్యాల నిర్మాణానికి ఇవన్నీ అడ్డంకిగా మారనున్నాయని హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) ఇటీవల ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది. ఎత్తైన భవనాలు నిర్మిస్తామన్న సీఎం అత్యంత ఎత్తైన భవనాలను సాగర్ తీరంలో నిర్మిస్తామని సీఎం కేసీఆర్ కొద్ది నెలల కింద ప్రకటించారు. దాదాపు 60 నుంచి 100 అంతస్తుల ఆకాశ హర్మ్యాలను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని నెల కిందట జీహెచ్ఎంసీ అధికారులను సీఎం ఆదేశించారు. సాగర్ సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా జలాశయంలోకి మురుగునీటిని తీసుకు వస్తున్న నాలాల మళ్లింపుతో పాటు సాగర్ ఎఫ్టీఎల్ వెలుపల ఆకాశ హర్మ్యాలు, ఆకాశమార్గాల నిర్మాణంపై అధ్యయనం, ఇతర ఖర్చులకు రూ.100 కోట్లను కేటాయించాలని గత నవంబర్ 9న జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. హుస్సేన్‌సాగర్ సుందరీకరణ ప్రాజెక్టుకు రూ.100 కోట్లను విడుదల చేయాలని కోరుతూ జీహెచ్ఎంసీ రాష్ట్ర ప్రభుత్వానికీ ప్రతిపాదనలు సమర్పించింది. ఈ ప్రతిపాదనలతో పాటు సాగర్ పరిరక్షణ విషయంలో వివిధ న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను సైతం ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది. ప్రతిపాదనలు అంది నెలయినా నిధుల విడుదలపై ఆర్థిక శాఖ ఏ నిర్ణయం తీసుకోలేదు. పర్యావరణవేత్తల ఆందోళన సాగర్ తీరంలో ఆకాశ హర్మ్యాల నిర్మాణంపై పర్యావరణవేత్తలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాలుష్య కాసారంగా మారిన నాలాలు ఇప్పటికే సాగర్ తీరంలో పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయి. ఈ నాలాల మళ్లింపుపై ఇంకా ఎలాంటి ప్రణాళిక సిద్ధం కాలేదు. జైకా ఆర్థిక సహాయంతో గతంలో చేపట్టిన సాగర్ ప్రక్షాళన ప్రాజెక్టు ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే సాగర్ తీరంలో నిర్మాణాలకు గత ప్రభుత్వాలు అనుమతించగా.. తాజాగా ఆకాశ హర్మ్యాల రూపంలో భారీ కట్టడాలు నిర్మిస్తే తీరప్రాంతం మరింత కుంచించుకుపోయే ప్రమాదముందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
హైదరాబాద్ ట్రాఫిక్‌కు స్కైవేలతో చెక్
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఎలివేటెడ్ కారిడార్లు, మల్టీలెవెల్ గ్రేడ్ సెపరేటర్లు నిర్మించాలని నిర్ణయించారు. ప్రధాన జంక్షన్ల వద్ద ఎలివేటెడ్ కారిడార్లు, కన్సల్టెంట్ల సహకారంతో ప్రతిపాదనలు రూపొందించాలని తెలిపారు. హరిహర కళాభవన్ నుంచి ఉప్పల్ వరకు, నాగార్జున సర్కిల్ నుంచి మాదాపూర్ వరకు, తార్నాక నుంచి ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్ వరకు, చార్మినార్ నుంచి బీహెచ్ఈఎల్ వరకు స్కైవేల నిర్మాణం చేపట్టాలన్నారు. మెట్రోరైలు మార్గం ఎక్కడైనా ఈ స్కైవేలకు అడ్డం వస్తే.. దాని పైనుంచి ఈ నిర్మాణాలు చేపట్టాలని సీఎం కేసీఆర్ తెలిపారు.