Slab construction
-
కుప్పకూలిన బతుకులు
భాగ్యనగర్‌కాలనీ (హైదరాబాద్): కూకట్‌పల్లిలో ఓ భవనం నాలుగో అంతస్తు స్లాబ్ నిర్మాణం అలా జరిగిందో లేదో.. ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో మూడో అంతస్తు సైతం కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. భవనం స్లాబ్‌లు పెద్దశబ్ధంతో కూలడంతో చుట్టుపక్కలవారు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్పల్లి గ్రామంలో మూడు అంతస్తుల నిర్మాణం జరిగిన ఓ భవనంపై శనివారం నాలుగో అంతస్తు స్లాబ్ వేశారు. అయితే స్లాబ్ పూర్తి అయిన కొద్ది సేపటికి ఊతంగా కట్టిన కర్రల తాడును కూలీలు తీస్తుండగా ఒక్కసారిగా నాలుగో అంతస్తు శ్లాబ్ కూలిపోయింది. ఆ సమయంలో స్లాబ్‌పై ఉన్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన దయాశంకర్ (25), ఆనంద్ (23) అనే ఇద్దరు కార్మికులు శిథిలాల కింద పడి అక్కడడిక్కడే మృతి చెందారు. స్లాబ్ కూలిన సమయంలో అక్కడే ఉన్న భవన యజమాని లక్ష్మణ్‌రావుకు తలపై గాయం కావటంతో వెంటనే ఆయనను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వాసు అనే మరో వ్యక్తికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. భవనం కూలిన విషయం తెలుసుకున్న కూకట్పల్లి పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్, డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బందికి వారు సమాచారం ఇవ్వడంతో ఆయా విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకోగా సకాలంలో అధికారులు చేరుకున్నప్పటికీ సహాయక చర్యలు చేపట్టడంలో ఆలస్యం చోటుచేసుకుంది. శిథిలాల కింద సాయంత్రం 5.30 గంటలకు మృతి చెందిన వారిలో ఒకరి చేయి బయటకు కనిపించింది. దీంతో స్లాబ్‌కు వాడిన ఇనుప చువ్వలను కట్ చేసి, సిమెంట్ పెచ్చులను తొలగించి అతికష్టంమీద రాత్రి కల్లా రెండు మృతదేహాలను వెలికి తీశారు. ఈ భవనానికి రెండు అంతస్తులకు అనుమతులు తీసుకొని నాలుగు అంతస్తుల నిర్మాణం చేపట్టినట్లు సమాచారం. మృతులు ఇద్దరికీ వివాహాలు కాగా బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. ‘సెంట్రింగ్’ లోపమే కారణమా? భవన స్లాబ్ నిర్మాణ సమయంలో సెంట్రింగ్ పనులు సరిగా చేయకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. స్లాబ్ నిర్మాణం జరిపే సమయంలో భారీగా సిమెంట్, కాంక్రీట్ మిశ్రమాన్ని పోస్తుంటారు. అయితే ఆ బరువుకు తగ్గట్లుగా సెంట్రింగ్ పనులు జరగలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. నాలుగో స్లాబ్ పరిస్థితి ఇలా ఉంటే.. మూడో స్లాబ్ కూడా కూలడంతో నాణ్యతలో డొల్ల తనం స్పష్టం తెలుస్తోంది. స్లాబ్లకు సరిగ్గా క్యూరింగ్ జరపకుండా అంతస్తులపై అంతస్తులు నిర్మించడం వల్ల కూడా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. అనుమతులకు మించి అంతస్తులు.. వాస్తవానికి జీహెచ్ఎంసీ నుంచి భవనం యజమాని జీ ప్లస్ 2 నిర్మాణానికి అనుమతి పొందినట్లు సమాచారం. అయితే అంతకుమించి 3, 4 అంతస్తులను అక్రమంగా నిర్మాణం ని ర్మించారు. ముందుగానే అధికారులు అడ్డుకుని ఉంటే ఇద్దరి ప్రాణాలు గాలిలో కలిసేవి కావని స్థానికులు అంటున్నారు. క్రిమినల్ కేసులు పెడతాం: డీసీ రవీందర్‌కుమార్ ఈ ఘటనపై జీహెచ్ఎంసీ కూకట్పల్లి డిప్యూటీ కమిషనర్ రవీందర్‌కుమార్ స్పందించారు. ముందుగా తీసుకున్న అనుమతులకు మించి అదనపు అంతస్తులు వేయడంతో.. ప్రమాదానికి కారణమైన భవన యజమాని, ఆర్కిటెక్ట్‌లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా అనుమతికి మించి అంతస్తులు నిర్మించినందుకు భవన యజమానికి జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఘటనా స్థలానికి ఎమ్మెల్యే మాధవరం.. స్లాబ్‌లు కూలిన భవనాన్ని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణలు పరిశీలించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులకు సూచించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. -
తల్లితో అప్పటిదాక చేయి పట్టుకుని తిరిగింది...కొద్ది క్షణాల్లోనే తల్లికళ్లముందే..
భాగ్యనగర్‌కాలనీ: భవనం స్లాబ్ శకలాలు ఆ చిన్నారి పాలిట మృత్యు పాశాలయ్యాయి. అభం శుభం ఎరగని నాలుగేళ్ల బాలిక నూరేళ్లు నిండేలా చేశాయి. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఒక్కగానొక్క కూతురు కళ్లముందే విగతజీవి కావడం ఆ తల్లిదండ్రులకు అశనిపాతంలా మారింది. తీరని శోకాన్నే మిగిల్చింది. తన చేయి పట్టుకొని నడుచుకుంటూ వస్తున్న కూతురు శాశ్వతంగా దూరం కావడం ఆ తల్లిని దుఃఖం సాగరంలో ముంచింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా మేడికొండూరుకు చెందిన లాం సునీల్ కుమార్, లోత్ మేరీ దంపతులు. కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చారు. హెచ్ఎంటీ హిల్స్‌లో నివాసం ఉంటూ శాతవాహన నగర్లో బేకరీ నడిపిస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి షరోన్ దిత్య (4) కూతురు ఉంది. మంగళవారం ఉదయం తల్లితో కలిసి ఆ చిన్నారి టిఫిన్ తీసుకొని బేకరికి వెళుతుండగా పక్కనే పాత ఇంటిపై నిర్మాణంలో ఉన్న శ్లాబ్ కూలి బాలిక తలపై పడింది. చిన్నారి తలకు తీవ్ర గాయాలై మెదడు బయటపడింది. బంధువుల సహాయంతో సమీపంలోని ఓ ఆస్పత్రికి తరలించగా అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు చెఆప్పరు. కూకట్పల్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని చిన్నారి మృతికి గల కారణాలు తెలుసుకున్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా భవనాన్ని నిర్మిస్తూ.. చిన్నారి మృతికి కారణమైన ఇంటి యజమాని శ్రీనివాస్‌పై కేసు నమోదు చేశారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. (చదవండి: చాటింగ్ చేయొద్దన్నందుకు చావే శరణ్యమనుకుంది) -
వారధికి ముప్పు
అది రాజీవ్ రహదారి. దానికి అనుసంధానంగా ఉన్న బ్రిడ్జిపై నిత్యం వందలాది వాహనాలు వెళ్తుంటాయి.. మేజర్ సిటీలైన హైదరాబాద్, వరంగల్ వరకు ప్రయాణం చేయాలంటే కరీంనగర్ గుండా వచ్చే వాహనదారులు ఈ బ్రిడ్జిపై నుంచి వెళ్లాల్సిందే. 25 ఏళ్ల నాటి నిర్మాణం. కానీ.. ఏం ఉపయోగం మెయింటనెన్స్ లేక ప్రమాదకరంగా మారింది. నిర్వహణ లోపం.. సామర్థ్యానికి మించిన వాహనాలు తిరుగుతుండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియకుండా ఉంది. పిల్లర్ల మధ్య ఉన్న స్లాబ్ క్రమంగా గ్యాప్ ఇస్తుండడంతో వాహనదారుల నడ్డి విరుగుతోంది. ద్విచక్ర వాహనదారుల ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. అల్గునూర్(మానకొండూర్): రాజీవ్ రహదారిపై అనుసంధానంగా తిమ్మాపూర్ మండలం అల్గునూర్, కరీంనగర్ మధ్యనున్న మానేరు పాత వంతెనపై ప్రమాదం తొంగిచూస్తోంది. వంతెన నిర్వహణలోపం, సామర్థ్యానికి మించిన వాహనాలు దీని మీదుగా ప్రయాణిస్తుండడంతో పిల్ల రుపై ఉన్న బేరింగ్లు ఇదివరకే చెడిపోయాయి. వంతెన స్లాబ్‌పై గ్యాప్ క్రమంగా పెరుగుతోంది. రాజీవ్ రహదారి నిర్మాణంలో భాగంగా కాంట్రాక్ట్ సంస్థనే వంతెన నిర్వహణ బాధ్యతలు చూడాలి. కానీ.. నిర్వహణలోపం, తాత్కాలిక మరమ్మతు చేపడుతోంది. నెలకోసారి చిన్నపాటి మరమ్మతు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. 18 పిల్లర్లు ఉన్న వంతెనపై ప్రతీ పిల్లర్ల మధ్య స్లాబ్ మధ్య గ్యాప్ వస్తోంది. దీంతో వాహనాలు భారీగా కుదుపునకు గురవుతున్నాయి. 25 ఏళ్ల క్రితం నిర్మాణం.. కరీంనగర్–హైదరాబాద్ రహదారి వెంట అల్గునూర్–కరీంనగర్‌ను అనుసంధానం చేసేలా గతంలో సింగిల్ రోడ్డుతో వంతెన ఉండేది. క్రమంగా వాహనాల రద్దీ పెరగడం రాతి కట్టడంతో నిర్మించిన వంతెన పాతది కావడంతో సుమారు 25 ఏళ్ల క్రితం కొత్త వంతెన (ప్రస్తుత పాతవెంతన) నిర్మించారు. వంతెనపై క్రమంగా వాహనాల రద్దీ పెరగడం.. గ్రానైట్, ఇసుక లారీలు, భారీ వాహనాల రాకపోకలు పెరగడం.. ఈ క్రమంలో వెంతన 10 ఏళ్ల క్రితం వంతెన బేరింగ్లు చెడిపోయాయి. ప్రభుత్వం నిధులు కేటాయించడంతో బేరింగ్లు మార్చేశారు. తర్వాత రాజీవ్ రహదారి విస్తరణ పనులు జరగడంతో వంతెన బాధ్యతలను కూడా ఆర్అండ్బీ అధికారులు రాజీవ్ రహదారి నిర్మాణ సంస్థ హెచ్కేఆర్కే అప్పగించారు. తరచూ తాత్కాలిక మరమ్మతు.. వాహనాల రద్దీ, భారీ వాహనాల రాకపోకల కారణంగా వంతెనపై స్లాబ్ మధ్య గ్యాప్ పెరుగుతోంది. రాజీవ్ రహదారి నిర్మాణ సంస్థ తాత్కాలికంగా తారు పోసి గ్యాప్‌లను మూసివేస్తోంది. పనులు చేసిన రెండు వారాల్లోనే పోసిన తారు చెదిరిపోవడంతోపాటు వంతెన స్లాబ్ మధ్య గ్యాప్ మరింత పెరుగుతోంది. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని వాహనదారులు భయపడుతున్నారు. వంతెన నిర్మించిన ప్రతీ 15 ఏళ్లకోసారి బేరింగ్లు మార్చాలి. రాజీవ్ రహదారి నిర్మాణ సంస్థ ఇప్పటివరకు బేరింగ్లు మాత్రం మార్చలేదు. దీంతో గ్యాప్‌లు కూడా పెరుగుతున్నాయని వాహనదారులు అభిప్రాయపడుతున్నా రు. వంతెనపై ఏర్పాటు చేసిన స్ట్రీట్‌లైట్లు కూడా కొన్ని వెలగడంలేదు. దీంతో రాత్రి వేళల్లో గుంతలు కనిపించకపోవడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. వినాయక నిమజ్జనం సందర్భంగా లైట్లకు కూడా మరమ్మతు చేయాలని వాహనదారులు, భక్తులు కోరుతున్నారు. కుదుపులతో ప్రమాదాలు.. వంతెన కింద ఉన్న 18 ఫిల్లర్లపై ప్రతీస్లాబ్ వద్ద గ్యాప్ ఏర్పడింది. దీంతో వంతెనపై నుంచి వెళ్లే స్కూటర్ నుంచి భారీ వాహనం వరకు అన్నీ కుదుపునకు లోనవుతున్నాయి. భారీ వాహనాలు వెళ్లినపుపడు జరిగే కుదుపునకు వంతెన కూలుతుందా అనే అంతగా చిన్న వాహనదారులు భయపడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు గ్యాప్‌ల మధ్య ఇటీవల పోసిన తారు పూర్తిగా చెదిరిపోయింది. దీంతో గ్యాప్ మరింత ఎక్కువైంది. ఇటీవల పలువురు ద్విచక్ర వాహనదారులు కుదుపుల కారణంగా అదుపుతప్పి కిందపడ్డారు. ఆరు నెలల క్రితం ఓ భారీ వాహనం సడెన్‌గా బ్రేక్ వేయడంతో వెనుక నుంచి వచ్చిన ఓ ద్విచక్రవాహనదారుడు ముందు వాహనాన్ని ఢీకొని కిందపడ్డాడు. వెనకాల నుంచి వచ్చిన మరో వాహనం అతడి తలపై నుంచి వెళ్లడంతో దుర్మరణం చెందాడు. ఇదే కాకుండా అనేక మంది రాత్రి వేళల్లో వేగంగా వచ్చే వాహనదారులు అదుపుతప్పి కిందపడి గాయపడ్డారు. వినాయక నిమజ్జనానికి ఇబ్బందే.. ప్రస్తుతం గణపతి నవరాత్రోత్సవాలు జరుగుతున్నాయి. మరో ఐదు రోజుల్లో నిమజ్జనం ప్రారంభమవుతుంది. కరీంనగర్ మండలంతోపాటు, కార్పొరేషన్ పరిధిలో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహాలను మానకొండూర్ చెరువుతోపాటు, అల్గునూర్ శివారులోని కాకతీయ కాలువలో ఏటా నిమజ్జనం చేస్తారు. ఈ ఏడాది కూడా నిమజ్జనానికి మానకొండూర్ చెరువు వద్ద ఏర్పాట్లు మొదలయ్యాయి. గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమై మూడు రోజులు గడిచింది. ఈ క్రమంలో వంతెనపై ఉన్న గుంతలతో భారీ విగ్రహాలు తీసుకొచ్చే వాహనాలు కుదుపునకు గురై విగ్రహాలు కిందపడే అవకాశం ఉంది. ఇలా అయితే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని ఆందోళన చెందుతున్నారు. మరమ్మతు షురూ.. వంతెన సమస్య మా దృష్టిలో ఉంది. దీనికి సబంధించిన ఇప్పటికే ప్రపోజల్స్ ప్రభుత్వానికి పంపించాం. రాజీవ్ రహదారిపై గుంతల మరమ్మతు మొదలైంది. వంతెన మరమ్మతు చేపడతాం. తాత్కాలికి మరమ్మతు కాకుండా ఈసారి తారు పూర్తిగా తొలగించి కొత్తగా తారు వేయాలని నిర్ణయించాం. నిపుణులతో వంతెనను పరిశీలించి ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరిస్తాం. – బీవీ.రాజు, హెచ్‌కేఆర్ మేనేజర్ -
అంతా మా ఇష్టం..
ఆగని ‘కళ్యాణలక్ష్మి’ కబ్జా నిబంధనలు హుష్‌కాకి కార్పొరేషన్ అధికారుల నిద్రమత్తు పార్కింగ్ కోసం నాలాపై స్లాబ్ నిర్మాణం విమర్శలు వెల్లువెత్తుతున్న వైనం హన్మకొండ : వరంగల్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చేపడుతు న్న పనుల్లో పారదర్శకత లోపిస్తోంది. ప్రభుత్వ నిబంధనలను కార్పొరేషన్ అధికారులు తమ ఇష్టానుసారంగా ఉపయోగించుకుంటున్నారనే ఆరోపణలకు కళ్యాణలక్ష్మి షాపిం గ్‌మాల్ ఎదుట ఉన్న నాలాపై జరుగుతున్న స్లాబ్ నిర్మాణమే అద్దం పడుతోంది. కేవలం పద్దెనిమిది రోజుల వ్యవధిలోనే బల్దియా అధికారులు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేయడం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. హన్మకొండ న గర నడిబొడ్డున ‘కళ్యాణలక్ష్మి నాలా స్లాబ్’ వ్యవహారంపై బల్దియా అధికారులు స్పందించిన తీరు ఇలా ఉంది. ఆగష్టు 2వ తేదీ.. ఫండ్ యువర్ సిటీలో నిబంధనల ప్రకారం.. ప్రైవేట్ వ్య క్తులు నగరంలో ఏదైనా పని చేపట్టాలంటే ముందుగా నగరపాలక సంస్థకు దరఖాస్తు చేసుకోవాలి. దీనిపై కార్పొరేష న్ బహిరంగ నోటీసులు జారీ చేస్తుంది. సదరు పనిపై ప్ర జాభిప్రాయ సేకరణ కూడా ఉంటుంది. అభ్యంతరాలు, సూచనలు పరిశీలించి అనుమతి ఇవ్వాలా లేదా అనేది నిర్ణయిస్తాం. అనుమతి ఇస్తేనే నిర్మాణాలు జరపాలి. అనుమతి రాకుండా నిర్మాణం చేపడితే కూల్చివేస్తాం. కళ్యాణలక్ష్మి షా పింగ్ మాల్ ఎదురు నాలాపై నిర్మాణం కోసం కొందరు దరఖాస్తు చేశారు. అయితే అనుమతి ఇవ్వకముందే పను లు ప్రారంభించినందున నిర్మాణాన్ని నిలిపివేశాం. ఆగష్టు 20వ తేదీ.. ఫండ్ యువర్సిటీ కార్యక్రమంలో భాగంగా కళ్యాణలక్ష్మి షాపింగ్‌మాల్ ఎదురు నాలాపై స్లాబ్ నిర్మాణం చేపట్టేందు కు బల్దియా కమిషనర్ సువర్ణపండాదాస్ అనుమతించారు. దాని ప్రకారమే వారు నిర్మాణం చేపడుతున్నారు. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. హన్మకొండ బస్‌స్టేషన్ నుంచి కాంగ్రెస్ భవన్‌కు వెళ్లే దారి నిత్యం ర ద్దీగా ఉంటుంది. అయితే ఈ మార్గంలో ఉన్న కళ్యాణలక్ష్మి షాపింగ్‌మాల్ యాజమాన్యం తమ దుకాణానికి వచ్చే కస్టమర్లు వాహనాలు పార్కింగ్ చేసేందుకు వీలుగా నాలాపై స్లాబ్ నిర్మాణం చేపట్టింది. దీంతో ట్రాఫిక్ సమస్య లు పెరుగుతాయని తెలిసినా పట్టించుకోకుండా తమ వ్యా పారం సాఫీగా సాగితే చాలనే విధంగా 2012లో సదరు యాజమాన్యం స్లాబ్ నిర్మాణాన్ని ప్రారంభించింది. అయితే నిబంధనలకు విరుద్ధమంటూ అప్పటి కలెక్టర్ రాహుల్బొ జ్జా, మునిసిపల్ కమిషనర్ వివేక్‌యాదవ్ యాజమాన్యం పై కన్నెర్ర జేశారు. అనంతరం అక్రమంగా చేపట్టిన నిర్మాణాన్ని కూల్చి వేయించారు. ఇదిలా ఉండగా, సరిగ్గా రెండేళ్ల తర్వాత ఈ ఏడాది నవంబర్ 30వ తేదీన కళ్యాణలక్ష్మి షాపింగ్ మాల్ యాజమాన్యం మరోసారి పనులు ప్రారంభించింది. కాగా, ఈ నిర్మాణంపై నగర పాలక సంస్థ సిటీ ప్లానింగ్ అధికారి రమేష్‌బాబును ‘సాక్షి’ వివరణ కోరగా... ఫండ్ యువర్ సిటీ పథకం ద్వారా నాలాపై స్లాబ్ నిర్మాణం చేపట్టేందుకు కళ్యాణలక్ష్మి షాపింగ్‌మాల్ యాజమాన్యం కార్పొరేషన్‌కు దరఖాస్తు చేసిందన్నారు. దీనిపై ప్రజాభి ప్రాయ సేకరణ చేపట్టి అభ్యంతరాలు స్వీకరిస్తామని, ఆ తర్వాత సంతృప్తి చెందినేతే నిర్మాణానికి అనుమతి ఇస్తామ ని పేర్కొన్నారు. కళ్యాణలక్ష్మి షాపింగ్‌మాల్ యాజమాన్యా నికి కార్పొరేషన్ అనుమతి రాకముందే నిర్మాణం ప్రారంభించినందున పనులు నిలిపేశామని చెప్పారు. కాగా, సరిగ్గా పద్దెనిమిది రోజుల తర్వాత కళ్యాణలక్ష్మి షాపింగ్‌మాల్ యాజమాన్యం నాలాపై తిరిగి స్లాబ్ నిర్మాణం చేపట్టడం గమనార్హం. ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వకుండా... ఎవరి నుంచి అభ్యంతరాలు స్వీకరిం చకుం డా పనులు ప్రారంభించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా, ఈ నిర్మాణంపై సిటీ ప్లానింగ్ అధికారిని ‘సాక్షి’ మరోసారి వివరణ అడగగా... ప్రజాభిప్రాయ సేకరణ.. అభ్యంతరాల స్వీకరణపై స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. కమిషనర్ సువర్ణపండాదాస్ అ నుమతి ప్రకారమే పనులు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.