sleep less
-
Health Tips: ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టడం లేదా? చెర్రీ, తేనె, అరటి, వేడిపాలు.. తింటే..
ప్రస్తుత జీవన శైలి వల్ల చివరికి నిద్ర కూడా కరువైపోతుంది. ఉరుకుల పరుగుల పనులు, ఎలక్ట్రిక్ గాడ్జెట్స్ వినియోగం, మితిమీరిన ఒత్తిడి.. కారణమేదైనా ఎంతో మంది నిద్రలేమితో సతమతమౌతున్నారు. కేవలం శరీరానికి విశ్రాంతి ఇవ్వడానికి మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యానికి కూడా తగినంత నిద్ర అవసరం అంటున్నారు నిపుణులు. చర్మం ముడతలు పడటం, జుట్టు రాలిపోవడం ఇవన్నీ నిద్రలేమితో సంభవించేవే. సరైన నిద్ర లేకపోతే ఆరోగ్యంపై కూడా అనేక దుష్ఫభావాలు పడే అవకాశం ఉంది. మరి ఎలా ? ఎంత ప్రయత్నించినా నిద్రపట్టట్లేదని వాపోతున్నారా? రాత్రి పడుకునే ముందు ఈ ఆహారాలు తీసుకుంటే వెంటనే నిద్రపోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం.. వేడి పాలు మన పేరెంట్స్ నిద్రపోతే ముందు గ్లాస్ వేడిపాలు తాగడానికి ఇస్తారు. ఎందుకో తెలుసా? రోజు ముగింపు సమయంలో వేడిపాలు తాగితే వెంటనే నిద్ర పడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనిలోని ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది మెదడులోని మెలటోనిన్, సెరటోనిన్ లను ప్రభావితం చేసి నిద్రవచ్చేలా ప్రేరేపిస్తుంది. సెరోటోనిన్ మానసిక స్థితిని స్థిరీకరించడానికి, క్రమబద్ధీకరించడానికి సహాయపడుతుంది. చదవండి: డ్రీమ్ హౌస్ షిఫ్టింగ్.. సముద్రంపై పడవలతో గమ్యానికి చేర్చి..! సీమ చేమంతి టీ సీమ చేమంతి టీ నరాలపై ఎలా ఉపశమనం కలిగిస్తుంది, నిద్రను ప్రేరేపించడంలో ఎలా సహాయపడుతుందనే విషయాల గురించి కంప్లీట్ బుక్ ఆఫ్ ఆయుర్వేదిక్ హోమ్ రెమెడీస్ వివరంగా తెలుపుతుంది. దీనిలో యాంటీఆక్సిడెంట్ నిండుగా ఉంటాయి. ముఖ్యంగా సీమ చేమంతి టీ ఆందోళనను తగ్గించి, ప్రశాంతమైన నిద్రపట్టేలా చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. అరటి పండు అరటిపండ్లలో సహజంగానే కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉంటుంది. ఇది నిద్ర మత్తును కలిగించడానికి సహాయపడుతుంది. అరటిలోని ప్రీబయోటిక్స్ నిద్ర వచ్చేలా చేస్తుందని కొలొరడో బౌల్డర్ యూనివర్సిటీ తాజా అధ్యయనాలు వెల్లడించాయి. అంతేకాకుండా పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు తోడ్పడుంది. చెర్రీ పండ్లు పీనియల్ గ్రంథి మెలటోనిన్ అనే హార్మోన్‌ను విడుదల చేసేలా చెర్రీ పండ్లు ప్రేరేపిస్తాయి. ఈ హార్మోన్ మనసును ప్రశాతంగా ఉంచి నిద్ర వచ్చేలా చేస్తుంది. 'ది కంప్లీట్ బుక్ ఆఫ్ హోమ్ రెమెడీస్' పుస్తకం ప్రకారం.. రోజుకు 10-12 చెర్రీ పండ్లు తింటే మానసిక అలసట, ఒత్తిడి దూరం చేసి హాయిగా నిద్రవచ్చేలా చేస్తుంది. తేనె తేనెలోని సహజ చక్కెరలు శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను పెంచి, మెలటోనిన్, ట్రిప్టోఫాన్లు మెదడులో విడుదల్యేలా ప్రేరేపిస్తుంది. శరీరం విశ్రాంతి స్థితిలోకి వెళ్లడానికి సహాయపడుతుంది. తేనె సెరటోనిన్‌ను మెలటోనిన్‌గా మార్చి సుదీర్ఘ సమయం నిద్రపోయేలా చేస్తుందని శుఖ్థా హాస్పిటల్‌కు చెందిన డా. మనోజ్ కె అహుజ సూచించారు. చదవండి: ఢిల్లీలో హఠాత్తుగా పెరిగిన వాయుకాలుష్యం.. కారణం అదే! -
6 గంటల నిద్రతో..అనర్థమే
వాషింగ్టన్: రోజూ ఆరు గంటలే నిద్రపోయే వారిలో డీహైడ్రేషన్ సమస్య ఉత్పన్నమవుతున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. నిద్రకు, డీహైడ్రేషన్‌కు ఎలాంటి సంబంధం ఉందన్న కోణంలో అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్ వర్సిటీ పరిశోధకులు అధ్యయనం చేపట్టారు. అధ్యయనానికి చైనా, అమెరికాకు చెందిన యుక్త వయసు వారిని ఎంచుకున్నారు. రాత్రి 6, 8 గంటలు నిద్రపోతున్న వారి మూత్ర నమూనాలను పరీక్షించి పోల్చి చూడగా.. 6 గంటలు నిద్రపోతున్న వారిలో 16 నుంచి 59 శాతం డీహైడ్రేషన్ లక్షణాలున్నట్లు పరిశోధకులు గుర్తించారు. శరీరంలోని వాసొప్రెషన్ హార్మోనే దీనికి కారణమని తేల్చారు. ఈ హార్మోనే పగలు, రాత్రి శరీరంలో హైడ్రేషన్‌ను నియంత్రిస్తుందని చెప్పారు. నిద్రిస్తున్నప్పుడు ఆరు గంటల వ్యవధి తర్వాత ఈ హార్మోన్ అధిక మొత్తంలో విడుదలవుతుందని, ఒకవేళ 2 గంటలు ముందే నిద్రలేస్తే ఈ హార్మోన్ తగ్గి డీహైడ్రేషన్ బారిన పడుతున్నట్లు పరిశోధకుడు అషెర్ రోసింగర్ తెలిపారు. డీహైడ్రేషన్ వల్ల మూత్రంలో ఇన్ఫెక్షన్లు, కిడ్నీల్లో రాళ్లు వస్తాయని హెచ్చరించారు. అయితే 6 గంటలు నిద్రపోతే దానికి తగ్గట్టు ఎక్కువ నీటిని తాగితే ఏ సమస్యా ఉండదని ఆయన పేర్కొన్నారు. ఈ అధ్యయన వివరాలు జర్నల్ స్లీప్‌లో ప్రచురితమయ్యాయి. -
'మా వాళ్లకు నిద్ర లేకుండా డిస్ట్రబ్ చేస్తోంది'
స్టాక్‌హోమ్: స్వీడన్ దేశ భావితరాన్ని సోషల్ మీడియా పట్టి పీడిస్తోందట. వారిని సరిగా నిద్రకూడా పోనివ్వడం లేదట. డిజిటల్ డివైస్‌లను ఉపయోగించడం మూలంగా స్వీడన్ దేశ పిల్లలు, యువకులు నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారని ఓ అధ్యయనం తెలిపింది. ముఖ్యంగా సోషల్ మీడియానే ఆ డివైస్‌ను ఉపయోగించడానికి ప్రధాన కారణం అని స్వీడన్‌కు చెందిన పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ టెలివిజన్ తెలిపింది. నిద్రపోవడానికి ముందు ఆ దేశంలో 82శాతంమంది డిజిటల్ డివైస్‌లను ఉపయోగిస్తూ వారికి నిద్రలేకుండా చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ఏ పనిని సమర్థంగా చేయాలన్నా మెదడుకు విశ్రాంతి చాలా అవసరం అని, అది కేవలం నిద్ర ద్వారానే సాధ్యం అవుతుందని, ఈ విషయం మరిచిపోయిన యువకులు, చిన్నారులు అనవసరంగా డిజిటల్ వస్తువులను ఉపయోగిస్తూ సోషల్ మీడియాలో తలదూరుస్తున్నారని తెలిపింది. ముఖ్యంగా వీరంతా కూడా 15 నుంచి 29 ఏళ్లలోపు వారే కావడంతో ఓ రకంగా తమ దేశానికి ఆందోళన కలిగించే విషయం అని వెల్లడించింది. అంతేకాకుండా ఐదేళ్లకిందట ఎంతబాగా నిద్రపోయామో ఇప్పుడలా నిద్రపోలేకపోతున్నామని కూడా సగంమంది యువకులు ఫిర్యాదులు చేస్తున్నారని వివరించింది. దీనంతటికి సోషల్ మీడియానే ప్రధాన కారణం అని కూడా వారు చెప్పినట్లు పేర్కొంది. -
కాఫీ అతిగా సేవిస్తే ప్రమాదమే!
లండన్: కుదిరితే ఒక కప్పు కాఫీ అలవాటుకు ఇక దూరంగా ఉండాల్సిందేనా! ఆ అలవాటు తగ్గించుకుంటే మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాఫీని మితంగా తీసుకుంటే ఫర్వాలేదు కానీ, అతిగా సేవిస్తేనే ప్రమాదమంటున్నారు వీరు. తాజాగా దీనిపై బ్రిటన్ లోని 'గ్లెన్ హాస్పిటల్ బ్రిస్టల్' చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. కాఫీ, టీ, చాక్ లెట్ లో ఉండే కఫైన్ అనే పదార్థం అధికంగా శరీరంలోకి వెళ్తే ప్రమాదమేనట. కఫైన్ 400 మిల్లి గ్రాములకు మించి శరీరంలోకి పంపిస్తే.. గుండె జబ్బులతోపాటు, రక్తపోటు తదితర సమస్యలు వస్తాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. శారీరక వ్యాయామాలు చేసేవారు కాఫీని ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ అధికమయ్యే అవకాశాలే మెండుగా ఉంటాయని అభిప్రాయపడుతున్నారు. రోజుకు మూడు కప్పులు మించి కాఫీని సేవించే వారికి రాత్రిపూట నిద్రలేమి సమస్యలు కూడా అధికంగానే ఉంటాయట. ఈ తరహా అలవాటు ఉన్నవారికి పూర్తిస్థాయి నిద్ర పట్టకపోవడం సైంటిఫిక్ గా నిరూపితమైందని పరిశోధకులు బల్లగుద్దీ మరీ చెబుతున్నారు.