Small and medium-sized enterprises
-
ముద్రా రుణాల పరిమితి రెట్టింపు చేయాలి
రాబోయే బడ్జెట్లో ముద్రా యోజన కింద ఇచ్చే రుణాల పరిమితిని రెట్టింపు చేయాలని, రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచాలని చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈ) కేంద్రాన్ని కోరుతున్నాయి. అలాగే అన్సెక్యూర్డ్ రుణాలకు రుణ హామీ కవరేజీని రూ. 2 కోట్ల నుంచి రూ. 5 కోట్లకు పెంచాలని ఆశిస్తున్నాయి. అటు అంతర్జాతీయంగా తమ ఉత్పత్తులను విక్రయించుకోవడానికి తగు మద్దతు కూడా కలి్పంచాలని కోరుకుంటున్నాయి. ఎంఎస్ఎంఈల వృద్ధికి ఊతమిచ్చేలా ప్రభుత్వం తన ఎజెండాను కొనసాగించే అవకాశం ఉందని బడ్జెట్‌పై నెలకొన్న అంచనాలను అర్క ఫిన్‌క్యాప్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ నవీన్ సైనీ తెలిపారు. ముద్రా రుణాల పరిమితిని పెంచడం తదితర అంశాలతో ఎంఎస్ఎంఈలకు మరిన్ని ఆర్థిక వనరులు అందుబాటులోకి రాగలవని, వాటి ఎదుగుదలతో పాటు ఎకానమీ వృద్ధికి కూడా దోహదపడగలవని వివరించారు. రియల్టీ ఆశలు.. బడ్జెట్‌పై రియల్ ఎస్టేట్ రంగానికి చాలా ఆశలు ఉన్నట్లు క్రిసుమి కార్పొరేషన్ ఎండీ మోహిత్ జైన్ తెలిపారు. ప్రత్యక్ష పన్ను వసూళ్లు రికార్డు స్థాయికి చేరడంలో వేతన జీవులు కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో గృహ రుణాలపై చెల్లించే అసలు, వడ్డీపై పన్ను మినహాయింపు పరిమితిని పెంచాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. గత కొన్నాళ్లుగా ప్రాపరీ్టల విలువ భారీగా పెరిగినందున గృహ రుణ వడ్డీపై పన్ను రిబేటును ప్రస్తుతమున్న రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచాలని పేర్కొన్నారు. మరోవైపు స్టార్టప్‌ల కోసం పన్నుల విధానాన్ని సరళతరం చేస్తే అంకుర సంస్థలకు ఊరట లభించగలదని సీఆర్ఐబీ సహ వ్యవస్థాపకుడు సన్నీ గర్గ్ తెలిపారు. ఏంజెల్ ట్యాక్స్‌ను తొలగించడం లేదా క్రమబదీ్ధకరించడమో చేస్తే దేశీయంగా నిధుల లభ్యత మెరుగుపడుతుందని, ప్రారంభ దశలోని అంకుర సంస్థలకు ఫండింగ్‌పరమైన వెసులుబాటు లభించగలదని పేర్కొన్నారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
పరిశ్రమలకు రెండో విడత బకాయిలు విడుదల
సాక్షి, అమరావతి: కరోనా విపత్తు సమయంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు రూ.1,168 కోట్లతో రీస్టార్ట్ ప్యాకేజీని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత రాయితీ బకాయిలను సోమవారం విడుదల చేసింది. రిస్టార్ట్ ప్యాకేజీలో భాగంగా మే నెలలో రూ.450 కోట్లను మే నెలలో విడుదల చేయగా, ఈ రోజు రూ.512 కోట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విడుదల చేశారు. దాదాపు లక్ష సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు 2014–15 నుంచి గత సర్కారు రూ.827.5 కోట్ల మేర బకాయిలు పెట్టింది. టీడీపీ సర్కారు బకాయిలతో పాటు ఈ ఏడాది రాయితీలు కూడా కలిపి రూ.962.62 కోట్లను రెండు విడతలుగా చెల్లించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మే నెలలో తొలివిడతగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.450.27 కోట్లను విడుదల చేశారు. మిగతా బకాయిలను జూన్ 29వ తేదీన విడుదల చేస్తామని అదే రోజు ఆయన ప్రకటించారు. అందుకు అనుగుణంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రెండో విడత బకాయిలను సోమవారం సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. చిన్న పరిశ్రమలకు తోడుగా ఉంటేనే వారి కాళ్లమీద వాళ్లు నిలబడటంతో పాటు కొంతమందికి ఉద్యోగాలు ఇవ్వగల్గుతారని పేర్కొన్నారు. వ్యవసాయరంగం తర్వాత ఉపాధి కల్పించే రంగం ఎంఎస్ఎంఈలదే అని సీఎం అన్నారు. గత ప్రభుత్వం రూ.800 కోట్లను బకాయిలుగా పెట్టిందని, వాటన్నింటిని తమ ప్రభుత్వం క్లియర్ చేసిందన్నారు. కరోనా వల్ల పరిశ్రమలు నడపలేని పరిస్థితుల్లో వెసులుబాటు ఇచ్చేందుకు ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో కరెంటు ఫిక్స్డ్ ఛార్జీలు రూ.180 కోట్లు మాఫీ చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఏపీఎస్ఎఫ్సీ ద్వారా రూ.200 కోట్లతో పెట్టుబడి రుణాలను తక్కువ వడ్డీకే అందిస్తున్నామని చెప్పారు. రుణాలకు 6 నెలల మారటోరియంతో పాటు మూడేళ్ల కాలపరిమితిలో చెల్లించే అవకాశం కల్పించామని చెప్పారు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల నుంచి 25శాతం ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. స్పిన్నింగ్ మిల్లులకు సబంధించిన రూ.1000 కోట్ల బకాయిలను వచ్చే ఏడాదిలో చెల్లిస్తామన్నారు.ఎంఎస్ఈలకు సంబంధించి బాగోగులు చూసేందుకు ఓ జేసిని పెడుతామన్నారు. పనుల కోసం అధికారుల చుట్టూ తిరినే పరిస్థితి రాకుండా చూస్తామన్నారు. ఎంఎస్ఈల పనులపై జేసీలు దృష్టిపెట్టేలా కలెక్టర్లులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులు వీరికి చేయూత నిచ్చేలా పనిచేయాలని, అప్పుడే నలుగురికి ఉద్యోగాలు వస్తాయని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. “రాష్ట్రంలో ఉన్న దాదాపు 98వేల ఎంఎస్ఎంఈ యూనిట్లలో 10 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. రాష్ట్ర ఆర్థికస్థితి బాగాలేకున్నా ఎంఎస్ఎంఈలను ఆదుకునేందుకు రూ.1,168 కోట్లతో రీస్టార్ట్ ప్యాకేజీని ప్రకటించాం.” pic.twitter.com/JSTLJ7byvN — YS Jagan Mohan Reddy (@ysjagan) June 29, 2020 -
పరిశ్రమలకు రాయితీ బకాయిలు
సాక్షి, అమరావతి: కరోనా విపత్తు సమయంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు రూ.1,168 కోట్లతో రీస్టార్ట్ ప్యాకేజీని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత రాయితీ బకాయిలను నేడు విడుదల చేయనుంది. దాదాపు లక్ష సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు 2014–15 నుంచి గత సర్కారు రూ.827.5 కోట్ల మేర బకాయిలు పెట్టింది. టీడీపీ సర్కారు బకాయిలతో పాటు ఈ ఏడాది రాయితీలు కూడా కలిపి రూ.962.62 కోట్లను రెండు విడతలుగా చెల్లించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈనెల 22వ తేదీన తొలివిడతగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.450.27 కోట్లను విడుదల చేశారు. మిగతా బకాయిలను జూన్ 29వ తేదీన విడుదల చేస్తామని అదే రోజు ఆయన ప్రకటించారు. అందుకు అనుగుణంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రెండో విడత బకాయిలను సోమవారం సీఎం క్యాంపు కార్యాలయం నుంచి విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. 10 లక్షల మంది జీవనోపాధికి సీఎం నిర్ణయంతో ఊరట.. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం గణనీయంగా తగ్గినప్పటికీ ఇచ్చిన మాట మేరకు రెండో విడత బకాయిలు రూ.512.35 కోట్లను (128 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు అదనపు ప్రోత్సాహకాలతో కలిపి) ముఖ్యమంత్రి జగన్ క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా ఆయా పరిశ్రమల బ్యాంకు ఖాతాలకు జమ చేయనున్నారు. రాష్ట్రంలో 98,000 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలుండగా వీటిపై ఆధారపడి దాదాపు పది లక్షల మంది జీవనోపాధి పొందుతున్నారు. ఇంత మంది జీవనోపాధికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకూడదనే ఉద్దేశంతో పరిశ్రమలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు కూడా చెల్లించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఏ ప్రభుత్వమూ పరిశ్రమలను ఈ విధంగా పట్టించుకున్న దాఖలాలు లేకపోవడం గమనార్హం. రీ స్టార్ట్ ప్యాకేజీలో చేయూత ఇలా.. రీ స్టార్ట్ ప్యాకేజీలో భాగంగా పరిశ్రమలు నిలదొక్కుకునేందుకు కరోనా సమయంలో మూతబడ్డ మూడు నెలలకు సంబంధించి కరెంట్ ఫిక్స్డ్ డిమాండ్ ఛార్జీలు మొత్తం రూ.187.80 కోట్లను మాఫీ చేశారు. ఈ మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. 98,000 పరిశ్రమలపై ఆధారపడ్డ 10 లక్షల మందికి మేలు చేసేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ► తక్కువ వడ్డీపై వర్కింగ్ క్యాపిటల్ రుణాల కోసం రూ.200 కోట్లతో కార్పస్ ఫండ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గరిష్టంగా రూ.10 లక్షల వరకు 6 నుంచి 8 శాతంతో రుణం మంజూరు చేసేలా చర్యలు తీసుకుంది. ఆరు నెలల మారటోరియం సమయంపోగా మూడేళ్లలో ఆ మొత్తం చెల్లించేలా నిర్ణయం తీసుకుంది. ► ప్రభుత్వానికి అవసరమైన 25 శాతం వస్తువులు, సామాగ్రిని సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించారు. అందులో 4 శాతం ఎస్సీ, ఎస్టీలకు చెందిన ఎంఎస్ఎంఈలు, 3 శాతం మహిళలకు చెందిన సంస్థల నుంచి సేకరించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ► సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల నుంచి కొనుగోలు చేసిన వస్తువులు, సామాగ్రికి కచ్చితంగా 45 రోజుల్లో బిల్లులు చెల్లించాలని సీఎం జగన్ గతంలోనే అదేశించారు. ప్రోత్సాహక బకాయిల విడుదలతో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రూ.280 కోట్లు, మహిళా పారిశ్రామికవేత్తలకు రూ.496 కోట్ల మేర ప్రయోజనం చేకూరనుంది. -
దేశీయ విపణిలో ఎస్‌ఎంఈలూ కీలకమే!
తెలంగాణ ప్రభుత్వ స్పెషల్ రిప్రజెంటేటివ్ రామచంద్రు నాయక్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ విపణిలో కీలకమైన చిన్న మరియు మధ్య తరహా సంస్థలు (ఎస్ఎంఈ) రంగంలో దళితులకూ తగిన స్థానం కల్పించాలని ఐఏఎస్ (రిటైర్డ్), తెలంగాణ ప్రభుత్వ స్పెషల్ రిప్రజెంటేటివ్ రామచంద్రు నాయక్ కోరారు. దళిత్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (డిక్కీ) పారిశ్రామిక, వాణిజ్య ప్రదర్శనలో భాగంగా శనివారమిక్కడ ‘ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఆఫ్ ఎస్సీ/ఎస్టీ ఇన్ ఎస్ఎంఈ’ అనే అంశంపై సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రామచంద్రు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని దళిత జనాభాలో 50 శాతం మందికి బ్యాంక్ ఖాతాలు కూడా లేవని.. ఇలాంటి పరిస్థితుల్లో దళితులు ఆదాయ వనరులను సృష్టించే వారిగా ఎలా ఎదుగుతారని ప్రశ్నించారు. అందుకే కేంద్రం, రాష్ట్రం రెండు ప్రభుత్వాలు దళిత ఎస్ఎంఈలను ప్రోత్సహించేలా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ఆర్థిక సంస్థలు, బ్యాంకులు దళిత పారిశ్రామికవేత్తల కోసం పథకాలు రచించడమే కాదు.. వాటి గురించిన పూర్తి అవగాహన కల్పించడంలోనూ కృషిచేయాలన్నారు. అప్పుడే మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా నిపుణుల కొరత ఉందని, దీన్ని ఎస్ఎంఈ రంగం అందిపుచ్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రబ్యాంక్ జీఎం (ఎంఎస్ఎంఈ) రాధాకృష్ణమూర్తి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ జే రాజు, బ్యాంక్ ఆఫ్ బరోడా జీఎం (ఫైనాన్షియల్ ఇంక్లూజన్) కిశోర్ కరప్ పాల్గొన్నారు.