రుణ హామీ కవరేజీనీ పెంచాలి
ఎంఎస్‌ఎంఈల వినతి
రాబోయే బడ్జెట్‌లో ముద్రా యోజన కింద ఇచ్చే రుణాల పరిమితిని రెట్టింపు చేయాలని, రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచాలని చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్‌ఎంఈ) కేంద్రాన్ని కోరుతున్నాయి. అలాగే అన్‌సెక్యూర్డ్ రుణాలకు రుణ హామీ కవరేజీని రూ. 2 కోట్ల నుంచి రూ. 5 కోట్లకు పెంచాలని ఆశిస్తున్నాయి. అటు అంతర్జాతీయంగా తమ ఉత్పత్తులను విక్రయించుకోవడానికి తగు మద్దతు కూడా కలి్పంచాలని కోరుకుంటున్నాయి.
ఎంఎస్‌ఎంఈల వృద్ధికి ఊతమిచ్చేలా ప్రభుత్వం తన ఎజెండాను కొనసాగించే అవకాశం ఉందని బడ్జెట్‌పై నెలకొన్న అంచనాలను అర్క ఫిన్‌క్యాప్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ నవీన్ సైనీ తెలిపారు. ముద్రా రుణాల పరిమితిని పెంచడం తదితర అంశాలతో ఎంఎస్‌ఎంఈలకు మరిన్ని ఆర్థిక వనరులు అందుబాటులోకి రాగలవని, వాటి ఎదుగుదలతో పాటు ఎకానమీ వృద్ధికి కూడా దోహదపడగలవని వివరించారు.
రియల్టీ ఆశలు..
బడ్జెట్‌పై రియల్ ఎస్టేట్ రంగానికి చాలా ఆశలు ఉన్నట్లు క్రిసుమి కార్పొరేషన్ ఎండీ మోహిత్ జైన్ తెలిపారు. ప్రత్యక్ష పన్ను వసూళ్లు రికార్డు స్థాయికి చేరడంలో వేతన జీవులు కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో గృహ రుణాలపై చెల్లించే అసలు, వడ్డీపై పన్ను మినహాయింపు పరిమితిని పెంచాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.
గత కొన్నాళ్లుగా ప్రాపరీ్టల విలువ భారీగా పెరిగినందున గృహ రుణ వడ్డీపై పన్ను రిబేటును ప్రస్తుతమున్న రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచాలని పేర్కొన్నారు. మరోవైపు స్టార్టప్‌ల కోసం పన్నుల విధానాన్ని సరళతరం చేస్తే అంకుర సంస్థలకు ఊరట లభించగలదని సీఆర్‌ఐబీ సహ వ్యవస్థాపకుడు సన్నీ గర్గ్ తెలిపారు. ఏంజెల్ ట్యాక్స్‌ను తొలగించడం లేదా క్రమబదీ్ధకరించడమో చేస్తే దేశీయంగా నిధుల లభ్యత మెరుగుపడుతుందని, ప్రారంభ దశలోని అంకుర సంస్థలకు ఫండింగ్‌పరమైన వెసులుబాటు లభించగలదని పేర్కొన్నారు.
– సాక్షి, బిజినెస్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment