small planes crash
-
గాల్లో ఢీకొట్టుకున్న చిన్న విమానాలు
వాషింగ్టన్ : గాల్లో ప్రయాణిస్తున్న రెండు చిన్న విమానాలు ఢీకొట్టుకున్న ఘటన అమెరికాలోని కొలరాడోలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు.. బుధవారం సర్రస్ ఎస్ఆర్-22 ఇద్దరు ప్రయాణికులతో.. స్వియర్ ఇంజిన్ మెట్రోలైనర్ ఎస్ఏ226టీసీ ఒక ప్రయాణికుడితో ఆకాశంలోకి చేరాయి. ఉదయం 10:25 ప్రాంతంలో సెంటెన్నియల్ ఎయిర్పోర్టు సమీపంలో రెండూ ఢీకొట్టుకున్నాయి. సర్రస్ ఎస్ఆర్-22 ప్యారాచూట్ సహాయంతో సురక్షితంగా భూమిపై ల్యాండ్ అయింది. స్వియర్ ఇంజిన్ మెట్రోలైనర్ ఎస్ఏ226టీసీ ఎమర్జన్సీ ల్యాండింగ్ డిక్లేర్ చేసి, క్షేమంగా భూమిపైకి చేరింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. -
రెండు విమానాలు ఢీ; భారత యువతి మృతి
వాషింగ్టన్ : పైలట్ శిక్షణలో ఉండగా రెండు విమానాలు ఆకాశంలో ఢీకొని ముగ్గురు మృతిచెందిన ఘటన అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో చోటుచేసుకుంది. మంగళవారం జరిగిన ఈ ప్రమాదంలో భారత్కు చెందిన నిషా సెజ్వాల్(19) అనే యువతితో పాటు జార్జ్ శాన్చెజ్(22), రాల్ఫ్ నైట్(72)లు మరణించారు. వీరితో పాటు ఉన్న మరోవ్యక్తి ఆచూకీ లభ్యం కాలేదు. డీన్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ స్కూల్కు చెందిన రెండు శిక్షణ విమానాలు ఆకాశంలో ఉన్నప్పుడు ఒకదానికొకటి తాకడంతో ఈ ప్రమాదం జరిగిందని అమెరికా విమానయాన శాఖ తెలిపింది. విమానాలు కూలిన ప్రాంతమంతా పూర్తిగా పొడవాటి గడ్డి ఉండటంతో అక్కడికి చేరుకోవడం కష్టతరంగా మారిందని విమానయాన శాఖ అధికారులు తెలిపారు. కేవలం ఎయిర్బోట్స్ ద్వారా మాత్రమే అక్కడికి చేరుకోగలమన్నారు. సహాయక చర్యలకు వాతావరణం కూడా అనుకూలించడం లేదని పేర్కొన్నారు. సోషల్ మీడియా అకౌంట్ ఆధారంగా నిషాను గుర్తించామన్నారు. మరో వ్యక్తి ఆచూకీ కోసం గాలింపు చేపట్టామని వెల్లడించారు. కాగా 2007 నుంచి 2017 మధ్య కాలంలో ఈ స్కూలుకు చెందిన రెండు డజన్లకు పైగా విమానాలు ప్రమాదానికి గురైనట్టు మియామి మేయర్ తెలిపారు. కాగా, నిషా సెజ్వాల్కు సంబంధించిన పూర్తి వివరాలు వెంటనే తెలియరాలేదు. -
రెండు విమానాలు ఢీ: నలుగురు మృతి
శాన్ డియాగో: అమెరికాలో శాన్ డియాగో కౌంటీలో జరిగిన విమాన ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. రెండు చిన్న విమానాలు గగనంలో గుద్దుకోవడంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని పౌర విమానయాన శాఖ తెలిపింది. బ్రౌన్ ఫీల్డ్ ప్రాంతానికి వెళుతుండగా రెండు విమానాలు గాల్లో ఢీకొని పొలాల్లో కూలిపోయాయి. రెండు ఇంజిన్ల సాబ్రిలైనర్ జెట్, సింగిల్ ఇంజిన్ సెస్ న్నా 172 విమానం పరస్పరం ఢీ కొన్నాయి. వెంటనే మంటలు వ్యాపించడంతో రెండు విమానాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో కనీసం నలుగురు మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. అగ్నిమాపక దళాలు మంటలను అదుపులోకి తెచ్చాయి. మంటలు ఆర్పుతుండగా అగ్నిమాపక దళానికి చెందిన ఒకరు గాయపడ్డారు.