చిన్న గ్రామం.. వంద శవాలు
కఠ్మాండు: అదొక చిన్న గ్రామం. పర్వతారోహణకు అనుకూలంగా ఉండే గ్రామం. ట్రెక్కింగ్‌కు వచ్చేవాళ్లంతా అక్కడి నుంచే వెళుతుంటారు. కానీ, దురదృష్టవశాత్తు ఆ గ్రామం కూడా గత నెలలో భయంకరమైన భూకంపానికి గురైంది. ఫలితంగా అక్కడ భారీ సంఖ్యలో మృతదేహాలు బయటపడ్డాయి. నేపాల్ పోలీసులు, కొందరు వాలంటీర్లు కలసి లాంగ్ తాంగ్ అనే గ్రామంలో శిధిలాలు తొలగించడం ప్రారంభించారు.
భారీగా పేరుకుపోయిన రాళ్లురప్పలు, మంచుముద్దలు తొలగించి చూడగా చాలామంది పర్వతారోహకులు, గ్రామస్థులు ప్రాణాలుకోల్పోయి శిథిలాల కింద ఉండిపోయారు. వీరంతా వందమందికి పైగా ఉంటారని అధికారులు తెలిపారు.