Smartphone Applications
-
బీభత్సం: తొలి వారంలోనే రూ.32వేల కోట్లు..!
దసరా ఫెస్టివల్ సీజన్ ఈ కామర్స్ కంపెనీలకు వరంగా మారింది. ప్రముఖ కన్సెల్టింగ్ సంస్థ రెడ్‌సీర్ ప్రకారం..ఫ్లిప్‌కార్ట్, అమెజాన్లు ఫెస్టివల్ సేల్స్ ప్రారంభించిన మొదటి వారంలోనే వేలకోట్లలో అమ్మకాలు జరిపినట్లు పేర్కొంది. ఫ్లిప్ కార్ట్ అక్టోబర్ 3 నుండి అక్టోబర్ 10 వరకు బిగ్ బిలియన్ డేస్ సేల్ నిర్వహించింది. అమెజాన్ అక్టోబర్ 4 నుంచి గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్ నెల రోజుల పాటు కొనసాగుతుంది. ఈ సందర్భంగా దసరా ఫెస్టివల్ సీజన్ లో ఈ రెండు సంస్థలు అమ్మకాలు ఏ విధంగా జరిపిందనే విషయాలపై రెడ్‌సీర్ రిపోర్ట్‌ను విడుదల చేసింది. డిస్కౌంట్లు, ఎక్ఛేంజ్ ఆఫర్లు ప్రకటించడంతో భారీ కొనుగోళ్లు జరిపినట్లు వెల్లడించింది. మొదటి వారంలోనే 4.6 బిలియన్ డాలర్లు (32 వేల కోట్ల రూపాయలు) కోట్లు అమ్మకాలు జరిగాయని, ప్రతి గంటకు రూ. 68 కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్స్ అమ్మకాలు జరిగినట్లు రిపోర్ట్‌లో పేర్కొంది. ఇది వార్షిక ప్రాతిపదికన 32 శాతం వృద్ధిని నమోదు చేసింది. అమ్మకాల్లో ఫ్లిప్ కార్ట్ ముందంజ ఈ సంవత్సరం అమెజాన్ కంటే ఫ్లిప్‌కార్ట్ అమ్మకాలు ఎక్కువ జరిపినట్లు తేలింది. పండుగ సేల్స్‌లో ఫ్లిప్ కార్ట్ మార్కెట్ వాటా 64 శాతానికి దగ్గరగా ఉండగా..అమెజాన్ వాటా తక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. ఇక కరోనా కారణంగా గతేడాది కొనుగోళ్లు తగ్గినా.. ఈ ఏడాది మాత్రం పెరిగాయి. దీంతో టైర్ -2, టైర్ -3 నగరాల నుండి పెద్ద సంఖ్యలో కొత్త కస్టమర్లు చేరగా..వారిలో టైర్ -2 కస్టమర్లలో 61 శాతం మంది కొత్త కస్టమర్లేనని తెలిపింది. ఇక గతేడాది ప్రతి కస్టమర్ కొనుగోలుకు సగటు స్థూల వస్తువుల విలువ రూ.4980 ఉండగా ఈ ఏడాదిలో రూ .5034 కి పెరిగినట్లు రెడ్‌సీర్ కన్సల్టింగ్ అసోసియేట్ పార్ట్నర్ ఉజ్వల్ చౌదరి తెలిపారు. చదవండి: 'బిగ్ దివాళీ సేల్',మీ కోసం బోలెడు ఆఫర్లు ఉన్నాయ్! -
మార్కెట్లో విడుదల కానున్న బడ్జెట్ ఫోన్
హాంకాంగ్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఇన్ఫినిక్స్ మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను లాంఛ్ చేసేందుకు సిద్ధమైంది. వచ్చే (సెప్టెంబర్) నెలలో ఇన్ఫినిక్స్ హాట్ 11ను విడుదల చేయనున్నట్లు స్మార్ట్ ఫోన్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇప్పటికే ఇన్ఫినిక్స్ నోట్ 7, ఇన్ఫినిక్స్ హాట్ 9, ఇన్ఫినిక్స్ హాట్ 10ఎస్ బడ్జెట్ ఫోన్లతో రూరల్ ఇండియాను టార్గెట్ చేస్తున్న ఇన్ఫినిక్స్ సంస్థ తాజాగా ఇన్ఫినిక్స్ హాట్ 11 విడుదల ప్రకటనతో ఆఫోన్ ఫీచర్లు, ధర ఎంత? అనే విషయంపై స్మార్ట్ ఫోన్ యూజర్లు ఆసక్తిని కనబరుస్తున్నారు.ప్రస్తుతం ఆన్ లైన్లో విడుదలైన ధర, ఫీచర్లు ఇలా ఉన్నాయి. ఇన్ఫినిక్స్ హాట్ 11 ఫీచర్లు రెండు మెమరీల వేరియంట్ తో 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్,6జీబీ ర్యామ్, 64జీబీ స్టోర్‌తో ఇన్ఫినిక్స్ హాట్ 11 ధర రూ.9,999గా ఉండగా నుంది. మీడియాటెక్ హెలియో G88 సిస్టమ్-ఆన్-చిప్ తో అందుబాటులోకి రానుండగా.. పూర్తి స్థాయిలో ఫీచర్లను ఇన్ఫినిక్స్ సంస్థ విడుదల చేయలేదు. -
5జీ ఫోన్లు వచ్చేస్తున్నాయ్, ఫీచర్లతో అదరగొడుతున్నాయ్
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ గెలాక్సీ ఏ-సిరీస్ మోడల్ గెలాక్సీ ఎ - 22 5జీ యురేపియన్ మార్కెట్లో విడుదలైంది. త్వరలోనే ఈ ఫోన్లు ఇండియన్ మార్కెట్ లో విడుదలవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం యురేపియన్ మార్కెట్ లో విడుదలైన శాంసంగ్ గెలాక్సీ ఏ 22 5జీ ఫీచర్స్ ఇలా ఉన్నాయి శాంసంగ్ గెలాక్సీ ఏ 22 5జీ లో 6.6-అంగుళాల పొడవు. హెచ్డి + డిస్ప్లే 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉంది.పేరులేని డ్రాగన్ ఆక్టా కోర్ఉంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 700 అని తెలుస్తోంది. 8జీబీ ర్యామ్ తో పాటు 128జీబీ ఇంటర్నల్ స్టోరేజే తో 1టెరాబైట్ మైక్రో ఎస్డీ కార్డ్ ఉంది. ఆప్టిక్స్ విషయానికొస్తే శాంసంగ్ గెలాక్సీ ఏ 22 5జి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో ఎఫ్ / 1.8 లెన్స్, 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, అల్ట్రా వైడ్ యాంగిల్, ఎఫ్ / 2.2 లెన్స్, 5 మెగాపిక్సెల్ సెన్సార్, ఎ F / 2.4 లెన్స్ 2-మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది. ముందు భాగంలో ఫోన్ 8 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌తో పాటు ఎఫ్ / 2.0 ఎపర్చర్‌తో వస్తుంది. శామ్సంగ్ గెలాక్సీ ఎ 22 5జీ ధర ఎంతంటే గ్రే, మింట్, వైలెట్, వైట్ కలర్ లలో అందుబాటులో ఉన్న శాంసంగ్ గెలాక్సీ ఏ225జీ స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఉన్న బేస్ మోడల్ కోసం శాంసంగ్ గెలాక్సీ ఏ 22 5 జీ యూరో 229 (సుమారు రూ. 20,300) వద్ద ప్రారంభమవుతుంది. 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర యూరో 249 (సుమారు రూ .22,100). ఈ ఫోన్‌ను 6 జిబి ర్యామ్ + 128 జిబి స్టోరేజ్ మరియు 8 జిబి ర్యామ్ + 128 జిబి స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో అందుబాటులోకి వచ్చాయి. అయితే వాటి ధర ఎంత అనేది శాంసంగ్ నిర్ధారించలేదు. చదవండి : Realme C21y : రియల్ మీ సిరీస్ ఫీచర్స్ ఇలా.. -
కాల్ చేస్తే.. ఖాతా ఖాళీనే!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన ఓ వృద్ధుడు డబ్బు డ్రా చేసుకోవడానికి బషీర్‌బాగ్ సమీపంలోని ఓ ప్రైవేట్ బ్యాంక్ ఏటీఎం కేంద్రానికి వెళ్లారు. అక్కడ చేయాల్సిన తతంగం మొత్తం పూర్తయ్యాక ఆయన ఖాతా నుంచి డబ్బు కట్ అయినట్లు డిస్ప్లే, మెసేజ్ వచ్చాయి. అయితే ఏటీఎం నుంచి డబ్బు బయటకు రాకపోవడంతో ఆందోళనకులోనై సదరు బ్యాంక్ కాల్ సెంటర్ నంబర్ కోసం గూగుల్‌లో సెర్చ్ చేశారు. అక్కడ టాప్‌లో కనిపించిన 76+++++219 నంబర్‌కు కాల్ చేశారు. అవతలి వ్యక్తి చెప్పినట్లు చేసి తన ఖాతా నుంచి మరో రూ.80 వేలు పోగొట్టుకున్నారు. చివరకు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు మొదలైంది. ప్రజలకు టోకరా వేయడానికి సమయం, సందర్భాన్ని బట్టి ఒక్కో పంథాను అనుసరించే సైబర్ నేరగాళ్లు ఇటీవల కాలంలో ఇలా టోకరా వేస్తున్నారని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. ఆ అంతర్రాష్ట్ర నేరగాళ్లు ఏకంగా గూగుల్‌లోకే చొచ్చుకుపోయి బురిడీ కొట్టించే ఈ క్రైమ్ ఎలా సాగుతుందో ‘సాక్షి’కి వివరించారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఫిర్యాదులు పెరిగాయని, అంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెప్తున్నారు. అన్నింటికీ మూలం సిమ్కార్డులే.. ఎలాంటి మోసాలు చేయాలన్నా సైబర్ నేరగాళ్లకు ప్రాథమికంగా సిమ్‌కార్డులు అవసరం. వీటిని నకిలీ పేర్లు, చిరునామాలతో తీసుకుంటున్నారు. బోగస్ వివరాలతో కొన్ని యాప్స్, బ్యాంకు ఖాతాలు సైతం సిద్ధం చేసుకుంటున్నారు. కొందరైతే బ్యాంకు ఖాతాలకు బదులుగా మనీమ్యూల్స్‌గా పిలిచే దళారుల్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. మెట్రో నగరాలతోపాటు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన యువతకు కమీషన్ ఆశ చూపి సైబర్ నేరగాళ్లు వారిని తమ వైపు తిప్పుకుంటున్నారు. వీరికి చెందిన మనీ ట్రాన్స్ఫర్ యాప్స్, బ్యాంక్ ఖాతాలను తమకు అనుకూలంగా వాడుకుంటూ 5 శాతం చొప్పున కమీషన్ ఇస్తున్నారు. సిమ్‌కార్డులు, బేసిక్ మోడల్ సెల్ఫోన్లతోపాటు బ్యాంకు ఖాతాలు, యాప్స్ సిద్ధమయ్యాక ఈ సైబర్ నేరగాళ్లు దందా మొదలుపెడుతున్నారు. గూగుల్‌లో రిజిస్టర్ చేసుకుని... ఈ సైబర్ నేరగాళ్లు ఎక్కడా తమ ఉనికి బయటపకుండా ఉండేలా కొన్ని మెయిల్ ఐడీలు సృష్టిస్తున్నారు. వీటిని వినియోగించి గూగుల్లోకి ఎంటర్ అవుతున్న కేటుగాళ్లు అందులో రిజిస్టర్ చేసుకోవడం ద్వారా తమ నంబర్లను ఆయా బ్యాంకులకు చెందిన కాల్ సెంటర్లవిగా పేర్కొంటూ పొందుపరుస్తున్నారు. ట్రూ కాలర్‌లో సైతం వీటిని ‘బ్యాంక్’, ‘బ్యాంక్ మేనేజర్’పేర్లతోనే రిజిస్టర్ చేసుకున్నారు. అయితే గూగుల్ సెర్చ్‌లో పొందుపరిచిన వాటిలో వేటికి వ్యూస్ ఎక్కువగా ఉంటే అది పైభాగానికి వస్తుంది. దీంతో సదరు సైబర్ నేరగాళ్లు తమ అనుచరుల ద్వారా ఆయా నంబర్లకు వ్యూస్ పెరిగేలా చేసి సెర్చ్‌లో పైకి తీసుకువస్తున్నారు. ఇలా వచ్చిన తర్వాత ఎవరైనా ఖాతాదారుడు తన బ్యాంక్ కాల్ సెంటర్ కోసం సెర్చ్ చేస్తే ఈ నేరగాళ్లు పొందుపరిచిన తప్పుడు కాల్ సెంటర్ల నంబర్లే పైభాగంలో కనిపిస్తుంటాయి. ఇలా కనిపించిన కాల్ సెంటర్ నంబర్‌కు ఖాతాదారుడు కాల్ చేసిన వెంటనే అది సదరు సైబర్ నేరగాడికి వెళ్తుంది. తాను బ్యాంక్ మేనేజర్ని అంటూ మాట్లాడే అతగాడు డబ్బు తిరిగి రావాలంటే తాము మరో నంబర్ నుంచి ఓ ఎస్సెమ్మెస్ పంపుతామని, దాన్ని మళ్లీ అదే నంబర్‌కు పంపించాలని సూచిస్తుంటారు. ఎంపిన్‌తో ఎర.. ఎవరైనా సరే తమ బ్యాంకు ఖాతాలను మనీ ట్రాన్స్ఫర్ యాప్స్‌కు అనుసంధానం చేయాలంటే యూపీఐగా పిలిచే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ కచ్చితంగా ఉండాలి. ఇది కావాలంటే బ్యాంకు ఖాతాతో రిజిస్టర్ అయిన సెల్‌ఫోన్ నుంచి యూపీఏకు సంబంధించిన ఎంపిన్‌ను బ్యాంక్ నంబర్‌కు పంపాల్సి ఉంటుంది. దీన్నే ఈ సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. అత్యధికం హిందీలోనే.. ఇలాంటి సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఫోన్ చేసిన వారితో బ్యాంకు అధికారి, మేనేజర్ అంటూ పరిచయం చేసుకునే వీరిలో అత్యధికులు హిందీలోనే మాట్లాడుతుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంపిన్‌ను ఎవరి సెల్ నంబర్‌కు పంపకూడదు. మెసేజ్ వచ్చినా ఏటీఎం నుంచి డబ్బు రాకుంటే సంబంధిత బ్యాంకు శాఖను సంప్రదించాలి. గూగుల్‌లో చూసి అవి బ్యాంకుల కాల్ సెంటర్లు అని నమ్మితే నిండా మునిగినట్లే. అనేక సందర్భాల్లో ఏటీఎం మిషన్ నుంచి బయటకు రాని డబ్బులు రెండు మూడు పని దినాల్లో తిరిగి ఖాతాలోకి జమవుతూ ఉంటాయి. అపరిచితులు, ఫోన్ ద్వారా పరిచయమైన వారితో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు చేయకపోవడం ఉత్తమం. సాధారణంగా గూగుల్‌లో కనిపించే వివరాలన్నీ ఎవరో ఒకరు పోస్ట్ చేసిన, అప్లోడ్ చేసినవే అయి ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని అందులో కనిపించిన ప్రతి అంశాన్నీ గుడ్డిగా నమ్మకూడదు. – సైబర్ క్రైమ్ పోలీసులు యాప్స్‌ను అనుసంధానిస్తూ.. తమ వద్ద ఉన్న స్మార్ట్ఫోన్లలోకి అప్పటికే కొన్ని యాప్స్‌ను డౌన్లోడ్ చేసి ఉంచుకుంటున్న సైబర్ నేరగాళ్లు ఇలా కాల్ వచ్చినప్పుడు ఎంపిన్ క్రియేట్ చేస్తున్నారు. దీన్ని తొలుత తమకు కాల్ చేసిన ఖాతాదారుడికి వేరే నంబర్ నుంచి పంపిస్తున్నారు. అలా వచ్చిన ఎంపిన్‌ను బ్యాంక్ నంబర్‌కు సెండ్ చేయాలని సూచిస్తున్నారు. ఖాతాదారుడు ఇలా చేస్తే తన బ్యాంకు ఖాతాను వారి యాప్‌తో అనుసంధానించడానికి యాక్సస్ ఇచ్చినట్లే అవుతుంది. ఆ వెంటనే సదరు నంబర్‌ను వినియోగించి యాప్‌ను యాక్టివేట్ చేయడంతోపాటు ఖాతాదారుడి ఖాతా నుంచి నగదు కాజేస్తున్నారు. ఈ విధానంలో రోజుకు రూ.లక్ష వరకు బదిలీ చేసుకునే అవకాశం ఉండటంతో సైబర్ నేరగాళ్లు తమ యాప్స్‌కు లేదా మనీమ్యూల్స్ ఖాతాలోకి డబ్బు బదిలీ చేసి స్వాహా చేస్తున్నారు. -
గూగుల్‌కు మరో భారీ షాక్!
సెర్చింజిన్ దిగ్గజం గూగుల్‌కు ఐరోపా సమాఖ్య(ఈయూ) బుధవారం భారీ షాకిచ్చింది. మరోసారి భారీ మొత్తంలో 4.34 బిలియన్ యూరోలు(దాదాపు 5 బిలియన్ డాలర్లు) జరిమానా విధించింది. పోటీదారులను రానీయకుండా.. స్మార్ట్‌ఫోన్ యూజర్లు గూగుల్ యాప్స్‌నే వాడేలా అనుచిత విధానాలను గూగుల్ అనుసరిస్తుందనే ఆరోపణలతో ఈ జరిమానా వేసింది. యూరోపియన్, అమెరికన్ ప్రత్యర్థుల ఫిర్యాదులపై 2015 నుంచి విచారణ చేపట్టిన యూరప్, నేడు తన నిర్ణయాన్ని వెలువరించింది. గతేడాది కూడా గూగుల్ భారీ మొత్తంలో 2.8 బిలియన్ డాలర్ల( రూ.17,478 కోట్లకు పైగా) జరిమానాను ఎదుర్కొంది. అప్పుడు తన షాపింగ్ సర్వీసులకు అనుకూలంగా యాంటీ ట్రస్ట్ నిబంధనలను అది ఉల్లంఘించడంతో, జరిమానా పడింది. ఈ సెర్చింజిన్ దిగ్గజం గూగుల్‌తో పాటు, ఆపిల్, అమెజాన్, ఫేస్బుక్ లకు కూడా యూరోపియన్ రెగ్యులేటర్లు జరిమానాలు విధించాయి. గూగుల్ ప్రస్తుతం యాంటీ ట్రస్ట్ నిబంధనలను ఉల్లంఘించి, డివైజ్ విక్రయించడాని కంటే ముందస్తుగా స్మార్ట్ఫోన్లలో తన యాప్స్‌ను ఇన్స్టాల్ చేస్తుందని కమిషన్ ఆరోపించింది. తన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ప్రత్యామ్నాయాలను వాడకుండా నిరోధించేలా తయారీదారులతో ముందస్తుగానే గూగుల్ సంప్రదింపులు జరిపిందని రెగ్యులేటర్లు ఆరోపిస్తున్నాయి. తన వ్యాపార ధోరణిని మార్చుకోవాలని గూగుల్‌ను యూరోపియన్ యూనియన్ ఆదేశించింది. -
వార్నింగ్ : ఆ 42 యాప్స్ చాలా డేంజర్
స్మార్ట్‌ఫోన్‌లో స్టోరేజ్ ఉంది కదా? అని ఎడాపెడా యాప్స్‌ను డౌన్లోడ్ చేస్తుంటారు కొంతమంది యూజర్లు. కానీ యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకునే ముందు ఒక్కసారి ఆలోచించాలని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఈ యాప్స్‌తో మాల్వేర్ అటాక్‌లు జరుగుతున్నట్టు పేర్కొన్నాయి. ఈ మేరకు స్మార్ట్‌ఫోన్ యూజర్లకు పెనుముప్పు కలిగించే చైనీస్ యాప్స్ వివరాలను ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు వెల్లడించాయి. దీనిలో 42 మొబైల్ అప్లికేషన్లున్నాయి. ఈ యాప్స్ వల్ల భారత భద్రతా వ్యవస్థకు ముప్పు వాటిల్లి ఉందని హెచ్చరించాయి. వెంటనే మీ స్మార్ట్ఫోన్ల నుంచి ఈ యాప్స్‌ను తొలగించాలని దేశీయ సైన్యాన్ని, పార్లమెంటరీని ఆదేశించాయి. '' చైనీస్ డెవలపర్లు అభివృద్ధి చేసిన యాప్స్ వాడటం ద్వారా ఫోన్లలోని సమాచారం అంతా చైనాకి చేరిపోతుంది. ఈ యాప్స్ డౌన్లోడ్ వల్ల మాల్వేర్ అటాక్స్ జరుగుతున్నాయి'' అని వార్నింగ్ బెల్ మోగించింది. ఆ 42 మొబైల్ యాప్స్‌ను వెంటనే అన్ఇన్స్టాల్ చేసి, స్మార్ట్ఫోన్లను ఫార్మాట్ చేసుకోవాలని భారత సైన్యానికి ఇండియన్ ఇంటెలిజెన్స్ ఆదేశాలు జారీచేసింది. అదనంగా కొన్ని ఇంటర్నెట్ మోడల్స్‌ను కూడా హానికరమైన కార్యకలాపాలకు పాల్పడే అవకాశముందని పేర్కొంది. ఏ యాప్ అయినా డేటాను అధికంగా వినియోగిస్తుంటే.. అది కచ్చితంగా అదనపు సమాచారాన్ని సేకరిస్తుందని భావించాలని భద్రతా నిపుణులు సందీప్ సేన్ గుప్తా వెల్లడించారు. ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిత యాప్స్‌గా పేర్కొన్న వాటిలో అత్యంత పాపులర్ అయిన షేర్ ఇట్, ట్రూకాలర్, యాంటీ వైరస్, వెబ్ బ్రోజర్స్ వంటివి కూడా ఉన్నాయి. 42 డేంజర్ యాప్స్ ఇవే : వీబో, వి చాట్ , షేర్ఇట్ , ట్రూకాలర్, యూసీ న్యూస్, యూసీ బ్రౌజర్, బ్యూటీ ప్లస్, న్యూస్‌డాగ్, వివా వీడియో-క్యూయూ వీడియో ఇంక్, ప్యారెలల్ స్పేస్, ఏపీయూఎస్ బ్రౌజర్, ఫర్ఫెక్ట్ కార్ప్, వైరస్ క్లీనర్, సీఎం బ్రౌజర్, ఎంఐ కమ్యూనిటీ, డీయూ రికార్డర్, వాల్యుట్ హైడ్, యూక్యామ్ మేకప్, ఎంఐ స్టోర్, క్యాచి క్లీనర్ డీయూ యాప్స్ స్టూడియో, డీయూ బ్యాటరీ సేవర్, డీయూ క్లీనర్, డీయూ ప్రైవసీ, 360 సెక్యురిటీ, డీయూ బ్రౌజర్, క్లీన్ మాస్టర్ - చీతా మొబైల్, బైడు ట్రాన్స్‌లేట్, బైడు మ్యాప్, వండర్ కెమెరా, ఈఎస్ ఫైల్ ఎక్స్‌ప్లోరర్, ఫోటో వండర్, క్యూక్యూ ఇంటర్నేషనల్, క్యూక్యూ మ్యూజిక్, క్యూక్యూ మెయిల్, క్యూక్యూ ప్లేయర్, క్యూక్యూ న్యూస్‌ఫీడ్, విసింక్, క్యూక్యూ సెక్యురిటీ సెంటర్, సెల్ఫీసిటీ, మెయిల్ మాస్టర్, ఎంఐ వీడియో కాల్-షావోమి, క్యూక్యూ లాంచర్. దీనిపై స్పందించిన ట్రూకాలర్, తాము స్వీడన్‌కు చెందిన కంపెనీ అని, ఈ జాబితాలో తమ పేరు ఎందుకు వచ్చిందో విచారణ జరుపుతామని తెలిపింది. ట్రూకాలర్ మాల్వేర్ కాదని పేర్కొంది. -
పెడోమీటర్ ఎలా పని చేస్తుంది?
హౌ ఇట్ వర్క్స్ ఈ రోజు.. మీరు వేసిన అడుగులు.. 1900. జాగింగ్ చేసిన దూరం.. 35 నిమిషాల్లో మూడు కిలోమీటర్లు. స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ల ద్వారా మనకు ఎప్పటికప్పుడు తెలిసిపోతున్న సమాచారమిది. మన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఈ అప్లికేషన్లు పనికొస్తున్నప్పటికీ... ఇవి అచ్చంగా ఎలా పనిచేస్తాయన్న విషయం మాత్రం తక్కువ మందికి మాత్రమే తెలుసు. పైగా ఈ ఫిట్నెస్ అప్లికేషన్ల లెక్కల్ని ఏ మేరకు నమ్మవచ్చో కూడా తెలియదు. ఈ సందేహాలన్నింటికీ సమాధానం ఇదిగో... ఫిట్నెస్ అప్లికేషన్లన్నీ మన స్మార్ట్ఫోన్లలో ఉండే కొన్ని సెన్సర్ల ఆధారంగా పనిచేస్తాయి. నడక లెక్కలు తేల్చేందుకు పనికొచ్చే యంత్రాన్ని పెడోమీటర్ అంటారు. ఇది పాక్షికంగా ఎలక్ట్రానిక్ పరికరం. దీంట్లో ఒక లోలకం (పెండ్యులమ్), ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఉంటాయి. మనం నడిచేటప్పుడు ఏర్పడే కదలికలకు ఈ లోలకం ఒక చివరి నుంచి మరో చివరకు ఊగి అక్కడ ఉండే లోహపు పలకను తాకుతుంది. దీంతో ఎలక్ట్రిక్ సర్క్యూట్ పూర్తయి కరెంట్ ప్రవహిస్తుంది. మరో అడుగు వేయగానే సర్క్యూట్ విడిపోతుంది. సర్క్యూట్ కనెక్ట్ అయిన ప్రతిసారి దాన్ని ఒక అడుగుగా లెక్కపెడుతుంది. నిర్దిష్ట సమయంలో లెక్కించిన అంకెలను మీరు వేసే సగటు అడుగు పొడవుతో హెచ్చిస్తే మీరు నడిచిన దూరమెంతో తెలిసిపోతుంది. ఇన్ని అడుగులు వేస్తే ఇన్ని కేలరీలు ఖర్చవుతాయన్న లెక్కలు ఎలాగూ ఉంటాయి కాబట్టి... వాటిని కూడా స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌పై చూసుకోవచ్చు. పదిశాతం వరకూ తేడా... పెడోమీటర్ ద్వారా లెక్కించే అడుగులకు, వాస్తవంగా మీరు వేసిన అడుగులకూ కొంచెం తేడా ఉండే అవకాశముంది. ఈ తేడా పదిశాతం వరకూ ఉండవచ్చునని అంచనా. కారు, లేదా వాహనంలో వెళ్లేటప్పుడు ఎదురయ్యే కుదుపులను కూడా పెడోమీటర్లు అడుగులుగా లెక్కవేయడం దీనికి కారణం. స్మార్ట్‌ఫోన్‌ను భుజానికో, నడుముకో బిగించుకోవడం ద్వారా ఇది మరింత సమర్థంగా పనిచేసేలా చేయవచ్చు. -
స్మార్ట్‌ఫోన్ డాక్టర్ క్లీన్ మాస్టర్
స్మార్ట్‌ఫోన్ స్లో అయిపోయిందా? అప్లికేషన్లు ఓపెన్ అయ్యేందుకు, రన్ అయ్యేందుకు కూడా చాలా సమయం పడుతోందా? అయితే మీరు క్లీన్‌మాస్టర్ అప్లికేషన్ గురించి చదివితీరాల్సిందే. సమయం గడిచేకొద్దీ స్మార్ట్‌ఫోన్‌లోకి చేరిపోయి, పేరుకుపోయి చికాకుపెట్టే జంక్ఫైల్స్ను ఇట్టే తొలగించేందుకు, ఫోన్‌ను చురుగ్గా నడిపించేందుకు ఆండ్రాయిడ్ మార్కెట్లో ఎన్నో అప్లికేషన్లు ఉన్నప్పటికీ క్లీన్‌మాస్టర్ కొంచెం ప్రత్యేకం. వేగాన్ని పెంచేందుకు పనికొచ్చే వేర్వేరు పనులను ఒకే అప్లికేషన్‌తో చేసేయవచ్చు. జంక్ఫైల్స్ను క్లీన్ చేయడంపై ఎక్కువగా దృష్టిపెట్టే క్లీన్ మాస్టర్ గాడ్జెట్‌ను వీలైనంత కూల్‌గా ఉంచేందుకు, మెమరీ, సీపీయూలను బూస్ట్ చేయడం ద్వారా కూడా పనిచేస్తుంది. -
2014 బెస్ట్ ఆఫ్
2014కు వీడ్కోలు చెబుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలకాల్సిన సమయం వచ్చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది సాంకేతికరంగంలో జరిగిన మంచిని నెమరేసుకుంటూ కొత్త సంవత్సరంలో రాగల మరిన్ని సౌకర్యాలను, ఆనందాల కోసం ఆశగా ఎదురుచూడటం అందరూ చేసే పనే. ఇదే స్ఫూర్తితో స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో ఈ ఏడాది అందరినీ అలరించిన మేటి అప్లికేషన్లు కొన్నింటిని మీకు అందిస్తున్నాం.... 1. మెయిల్‌బాక్స్... మెయిల్ ఇన్‌బాక్స్‌ను చక్కగా అమర్చకునేందుకు పనికొచ్చే ఆప్లికేషన్ ఇది. చిన్న స్వైప్‌తో అనవసరమైన మెయిళ్లను డిలీట్ చేయగలగడం, జీమెయిల్‌తో సులువైన ఇంటిగ్రేషన్, అంతగా అర్జెంట్ కాని మెయిళ్లను స్నూజ్ చేయగలగడం వంటి ప్రత్యేకతలు ఈ అప్లికేషన్‌ను ఈ ఏటి మేటి జాబితాలోకి చేర్చాయి. 2. హూ శాంపిల్డ్... మీకు సంగీతమంటే ఇష్టమా... అయితే ఈ అప్లికేషన్ మీ కోసమే. వందల, వేల పా.టల సమాచారం తెలుసుకోవడంతోపాటు ఆయా పాటలను ఇతర రూపాల్లో (రీమిక్స్‌లు వగైరా) ఎలా వాడారన్న విషయాలను కూడా ఈ అప్లికేషన్లో కీవర్డ్లను సెర్చ్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. ఆపిల్ ఐఫోన్‌కు ఎప్పటినుంచో అందుబాటులో ఉన్న ఈ అప్లికేషన్ ఇటీవలే ఆండ్రాయిడ్‌లోనూ లభిస్తోంది. 3. సన్‌రైజ్ క్యాలెండర్... గూగుల్ క్లౌడ్ క్యాలెండర్‌ను దీటైన ప్రత్యామ్నాయం ఇది. అపాయింట్మెంట్లను, రిమైండర్లను అందంగా అమర్చుకోవడం ఒక్కటే ఈ ఆర్గనైజర్ ప్రయోజనం కాదు. ఆయా అపాయింట్మెంట్లకు అనుబంధమైన సమాచారాన్ని కూడా అక్కడికక్కడే తెలుసుకోవచ్చు. ఉదాహరణకు ఓ మీకు తెలియని ఓ ప్రాంతంలో మీటింగ్ అని అనుకుందాం. అక్కడికి ఎలా చేరాలో మ్యాప్ ద్వారా అక్కడే తెలుసుకోవచ్చు. 4. ఫైర్ ఛాట్... ఇంటర్నెట్ సౌకర్యం లేకున్నా టెక్స్ట్ ఛాటింగ్‌కు అవకాశం కల్పించే అప్లికేషన్ ఇది. హాంకాంగ్‌లో ఈ ఏడాది సోషల్‌మీడియాపై ఆంక్షలు విధించినప్పుడు కూడా ఆందోళనకారులు సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు ఫైర్ఛాట్ను ఉపయోగించారు. మిగలిన అప్లికేషన్లు ఏవీ పనిచేయకపోయినా ఇది మాత్రం నిక్షేపంగా పనిచేసిందని సమాచారం. 5. జీమెయిల్ ఇన్‌బాక్స్... గూగుల్ అభివృద్ధి చేసిన జీమెయిల్ ప్రత్యామ్నాయమీ అప్లికేషన్. ముందుగా కేవలం ఇన్వైట్ల ఆధారంగా అందుబాటులోకి వచ్చినా ఆ తరువాత మామూలుగానే దొరికేలా ఏర్పాట్లు చేశారు. ఒకేరకమైన మెయిళ్లన్నింటినీ ఒకదగ్గరకు బండిల్ చేయడం మిగిలిన మెయిల్ అప్లికేషన్లను, ఇన్‌బాక్స్‌ను వేరుచేసే అంశం. 6. టింకర్... చిన్న పిల్లలు సైతం కంప్యూటర్ కోడింగ్ ఎలా చేయాలన్నది సులువుగా తెలుసుకునేందుకు పనికొచ్చే అప్లికేషన్ ఇది. రకరకాల కోడింగ్ పజిల్స్‌తో కూడిన ఈ అప్లికేషన్లో సొంతంగా గేమ్స్‌ను అభివృద్ధి చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా ఉన్నాయి. 7. వైర్.... టెక్స్ట్ మెసేజీలతోపాటు ఇంటర్నెట్ ప్రొటోకాల్ ఆధారంగా వీడియోకాల్స్ చేసుకునేందుకు పనికొచ్చే అప్లికేషన్ ఇది. కాల్స్ ఎన్క్రిప్షన్ దీని ప్రత్యేకత. ఇదే తరహా సేవలందించే స్కైప్‌ను అభివృద్ధి చేసిన వారిలో ఒకరు వేరుగా దీన్ని తయారు చేయడం విశేషం.