sncu
-
ఏజెన్సీ ప్రాంతాల్లో శిశు సంరక్షణ భేష్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో నవజాత శిశువుల కోసం ఏర్పాటుచేసిన ఎస్ఎన్సీయూ (స్పెషల్ న్యూకేర్ బార్న్ యూనిట్స్) సేవలు అద్భుతంగా ఉన్నాయని, ఇలాంటి విధానాన్ని తాము కూడా అనుసరిస్తామని ఇథియోపియా బృందం ప్రశంసించింది. ఈ దేశానికి చెందిన వైద్య బృందం సోమ, మంగళవారాల్లో ఏజెన్సీ ప్రాంతమైన బుట్టాయగూడెంతో పాటు పలు నవజాత శిశువుల వైద్య కేంద్రాలను సందర్శించింది. ఇథియోపియాలోని వొలైటా సొడు యూనివర్సిటీకి చెందిన ముగ్గురు వైద్యుల బృందం ఈ కేంద్రాల సందర్శనకు వచ్చింది. ఇందులో డా.మెస్ఫిన్ బిబిసొ, డా.ఇయోబ్ ఎషెటు, డా.లూకాస్ డింగాటో ఉన్నారు. శిశు సంరక్షణ కేంద్రాల్లో అందుతున్న సేవలను ఈ బృందం పరిశీలించి ఇక్కడ అందుతున్న సేవలు అద్భుతంగా ఉన్నాయని కొనియాడింది. ఈ కేంద్రాల్లో సాంకేతిక పరిజ్ఞానం, వైద్యులు అనుసరిస్తున్న వైద్య విధానాలను అడిగి తెలుసుకున్నారు. తమ దేశంలో కూడా ఈ విధానాన్ని అనుసరిస్తామని, సాంకేతిక సహకారాన్ని అందించాలని కోరారు. నవజాత శిశువుల కోసం ఇక్కడ 24 గంటలూ సేవలు అందుతుండటం గొప్ప విషయమని.. మరీ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఇలాంటి సేవలు అందుబాటులో ఉండటం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని వారు చెప్పారు. ఆరోగ్య రంగంలో ఆంధ్రప్రదేశ్ అనుసరిస్తున్న విధానాలను తమ దేశంలోనూ అమలుచేసేందుకు అక్కడి ప్రభుత్వంతో చర్చిస్తామని బృందం తెలిపింది. కాగా, జాతీయ ఆరోగ్య మిషన్ నిధులతో రాష్ట్రంలోని ఏడు ఏజెన్సీ ప్రాంతాల్లో 21 ఎస్ఎన్సీయూలు నడుస్తున్నాయి. 2018 మేలో ప్రారంభమైన వీటిల్లో 2019 డిసెంబర్ 20 నాటికి 7,500 నవజాత శిశువులకు వైద్యమందినట్లు ఇథియోపియా బృందానికి అధికారులు వివరించారు. ట్రాకింగ్ విధానంతో మెరుగైన సేవలు గర్భిణిని ఆస్పత్రికి తీసుకురావడం, సకాలంలో వైద్య పరీక్షలు చేయించడం, సుఖ ప్రసవానికి ప్రోత్సహించడం వంటి విషయాల్లో ట్రాకింగ్ విధానాన్ని అమలుచేస్తున్నాం. ప్రసవానికి గర్భిణి పుట్టింటికి వెళ్లినా అక్కడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో సమన్వయం చేసుకుని ప్రసవానికి అవసరమైన వైద్యసేవలు అందిస్తున్నాం. కేఆర్ పురం ఏజెన్సీ పరిధిలో మరో ఎస్ఎన్సీయూ పెడితే బాగుంటుంది. – ఆర్వీ సూర్యనారాయణ, ప్రాజెక్ట్ ఆఫీసర్, ఐటీడీఏ, కేఆర్ పురం -
ఆందోళనకరంగా శిశు మరణాలు
సాక్షి, అమరావతి: గత ఐదేళ్లలో సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల దక్షిణ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ శిశు మరణాలు చోటు చేసుకున్నాయని తేలింది. 2017లో రాష్ట్రంలో ప్రతి వెయ్యి ప్రసవాలకు 32 మంది శిశువులు అశువులు బాశారు. తాజాగా శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (ఎస్ఆర్ఎస్–బులెటిన్) ఈ నిజాలను వెల్లడించింది. 2017కు సంబంధించి దక్షిణాదిలో కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలతో పోలిస్తే ఏపీలోనే ఎక్కువ శిశు మరణాలు చోటు చేసుకున్నాయని తెలిపింది. తెలంగాణలో ప్రతి వెయ్యికి 29 మంది శిశువులు మృతి చెందగా ఈ సంఖ్య కర్ణాటకలో 25, తమిళనాడులో 16, కేరళలో 10గా ఉంది. జాతీయ సగటు 33 ఉండగా ఏపీ సగటు 32గా నమోదైంది. ఎస్ఎన్సీయూలే పెద్దదిక్కు ప్రస్తుతం రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతాల్లో స్పెషల్ న్యూ బార్న్ కేర్ యూనిట్లు (ఎస్ఎన్సీయూలు) ఏర్పాటు చేశారు. వీటిలో శిక్షణ పొందిన నర్సులు, వైద్యులతోపాటు అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉన్నాయి. మొత్తం ఐదు జిల్లాల్లో 21 సెంటర్లు ఏర్పాటు చేసి నవజాత శిశువులకు కేంద్ర నిధులతో ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు. దీనివల్ల ఆ ప్రాంతాల్లో శిశు మరణాలు గణనీయంగా తగ్గాయి. ఈ కేంద్రాలను మైదాన ప్రాంతాలకు కూడా విస్తరిస్తే శిశుమరణాలను నియంత్రించొచ్చని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎక్కువ శిశు మరణాలు ఉన్న ప్రాంతాలను గుర్తించాలి ఇక్కడ ఏర్పాటు చేసిన ఎస్ఎన్సీయూ వల్ల ఈ ప్రాంతంలో శిశు మరణాలు బాగా తగ్గాయి. ఏ ప్రాంతంలో ఎక్కువ శిశు మరణాలు చోటు చేసుకుంటున్నాయో గుర్తించి అక్కడ ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తే అద్భుత ఫలితాలు సాధించవచ్చు. –డా.జీవన్, చిన్నపిల్లల వైద్య నిపుణులు, ఎస్ఎన్సీయూ, అడ్డతీగల, తూర్పుగోదావరి -
మరో వివాదంలో ‘ఘోషా’
విజయనగరం ఆరోగ్యం, న్యూస్‌లైన్ : వివాదాలకు కేంద్ర బిందువైన ఘోషా ఆస్పత్రి మరోసారి వార్తల్లోకెక్కింది. సోమవారం ఉదయం ఘోషాలోని నవజాతి శిశువుల ప్రత్యేక సంరక్షణ కేంద్రం(ఎస్ఎన్సీయూ)లో ఇద్దరు శిశువులు మృతి చెందారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని శిశువుల మృతికి బంధువులు ఆందోళనకు దిగారు. ఈ మేరకు ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ రవిచంద్రకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే... పట్టణంలోని గాజులరేగ రాళ్లవీధికి చెందిన షేక్ స్వాతి ఈ నెల 9వ తేదీన ప్రసవం కోసం ఘోషా ఆస్పత్రిలో చేరింది. అదే రోజు రాత్రి 9 గంటల సమయంలో ఆమెకు సాధారణ ప్రసవమైంది. ఆమెకు ఇదే తొలికాన్పు. ఆడశిశువు జన్మించింది. శిశువుకు ఆరోగ్యం బాగోలేదని ఆస్పత్రిలో ఉన్న ఎస్‌ఎన్‌సీయూలో వైద్యులు చేర్చించారు. ఉమ్మనీరు తాగిందని వైద్యులు శిశువును వార్మర్లో పెట్టి చికిత్స అందించారు. సోమవారం ఉదయం 8 గంటల సమయంలో శిశువు మృతి చెందింది. అదే విధంగా పూసపాటిరేగ మండలం చినపతివాడకు చెందిన తమటాపు జయలక్ష్మి ఈ నెల 10న ప్రసవం కోసం ఘోషాలో చేరింది. 11వ తేదీ ఉదయం సాధారణ ప్రసవం ద్వారా మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈమెకు కూడా ఇదే తొలికాన్పు. ఈ శిశువుకు కూడా ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఎస్‌ఎన్‌సీయూలో చేర్పించారు. ఈ శిశువు కూడా చికిత్స పొందు తూ సోమవారం ఉదయం మృతి చెందాడు. ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే శిశువులు మృతి చెందారని బంధువులు సోమవారం ఆందోళనకు దిగారు. దీంతో ఆస్పత్రి ఎస్ఎన్సీయూ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితి ఉద్రిక్తంగా ఉండడంతో ఆస్పత్రి సిబ్బంది బయటకు రాకుండా లోపలే ఉండిపోయారు. చివరకు ఆస్పత్రి అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రావడంతో రోగి బంధువులు ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే పాప మృతి చెందింది.. ‘మొదటి రోజు బిడ్డ ఉమ్మనీరు తాగిందన్నారు. రెండో రోజు ఆయాసం ఉందని చెప్పారు. మూడో రోజు ఉబ్బసం ఉందని చెప్పారు. నాలుగో రోజు గుండెకు రంధ్రం పడిందన్నారు. ఆదివారం వరకూ పాప బాగానే ఉందని చెప్పారు. ఈ రోజు ఉదయం వచ్చి శిశువు మృతి చెందిందన్నారు.’ అంటూ ఆడ శిశువు తండ్రి షేక్ అల్లా బక్సుద్ భోరుమన్నాడు. పాప పరిస్థితి ఎలా ఉందని పదేపదే అడిగినా చెప్పేవారు కాదని, ప్రైవేట ఆస్పత్రికి తీసుకెళ్తామని చెప్పినా వినలేదని వాపోయాడు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన బిడ్డ ప్రాణాలు కోల్పోయిందని ఆరోపించాడు. సిబ్బంది అలసత్వం వల్లే.. ‘బిడ్డ పుట్టిన పది నిమిషాల్లోనే పరిస్థితి విషమంగా ఉందన్నారు. రెండు రోజుల తర్వాత శిశువు మృతి చెందిందని తెలిపారు. బాబు పరిస్థితి గురించి అడిగినా చెప్పేవారు కాదు. బాబు మృతి చెందడానికి సిబ్బంది అలసత్వమే కారణమ’ని మగశిశువు తండ్రి టి.రామారావు ఆరోపించాడు. వైద్యుని వివరణ ఇద్దరు శిశువులకూ పరిస్థితి విషమంగా ఉందని ముందే చెప్పామని ఘోషా ఆస్పత్రి పిల్లల వైద్యుడు బి.రవీంద్రబాబు చెప్పారు. స్వాతికి జన్మించిన శిశువు పుట్టగానే ఏడవలేదని, దీనికితోడు గుండెకు రంధ్రం పడి మెదడుకు శ్వాస అందక చనిపోయిందని తెలిపారు. మలం తాగేయడం వల్ల ఇన్ఫెక్షన్ సోకి జయలక్ష్మి శిశువు మృతి చెందినట్లు చెప్పారు. శిశువుల మృతిపై ఫిర్యాదు అందిందని, విచారణ జరుపుతామని ఘోషా సూపరింటెండెంట్ స్పష్టం చేశారు. శిశువుల మృతిపై విచారణ శిశువుల మృతిపై కేంద్రాస్పత్రి సూపరింటెండెంట్ సీతారామరాజు, ఇన్చార్జ్ ఆర్ఎంఓ బి.సత్యశ్రీనివాస్ సోమవారం సాయంత్రం విచారణ చేపట్టారు. సంఘటన జరిగిన తీరుపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. శిశువుల బంధువులతో బుధవారం మాట్లాడుతామని అధికారులు తెలిపారు. వైద్యుల తప్పు ఉన్నట్లయితే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ‘ఘోషా’లో కానరాని సౌకర్యాలు విజయనగరం ఆరోగ్యం, న్యూస్‌లైన్ : ఘోషా ఆస్పత్రిలో అధికారుల అలసత్వం.. సౌకర్యాల లేమి వల్ల చిన్నారులు మృత్యువాత పడుతున్నారు. ఆస్పత్రిలోని సమస్యలపై పలుమార్లు పత్రికల్లో కథనాలు ప్రచురితమైనా అధికారులు స్పందించడం లేదు. సంఘటనలు జరిగి నప్పుడు మాత్రం తూతూమంత్రంగా చర్యలు చేపట్టి చేతులు దులుపుకొంటున్నారు. ఆస్పత్రిలోని నవజాతి శిశువుల ప్రత్యేక సంరక్షణ కేంద్రం (ఎస్ఎన్సీయూ)లో సోమవారం ఉదయం ఇద్దరు శిశువులు మృతి చెందారు. వెంటిలేటర్లు లేకపోవడం, వైద్యుల కొరత వల్లే చిన్నారులు మరణించినట్లు తెలుస్తోంది. వెంటిలేటర్ ఉన్నట్లయితే శిశువును బతికించగలిగేవారమని ఎస్ ఎన్సీయూకు చెందిన వైద్యు డు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. అధికారులకు పలుమార్లు చెప్పినా వెంటిలేటర్లు మంజూరు చేయలేదని చెప్పారు. ఎస్ఎన్సీయూ యూనిట్లో కనీసం ఆరు వరకూ వెంటిలేటర్లు ఉండాలి. అయితే ఒకటి కూడా ఇక్కడ లేదు. ఈ యూనిట్లో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా శిశువులకు చికిత్స అందిస్తున్నారు. వెంటిలేటర్లు, వైద్యులు లేకుండా ఎలా అనుమతి ఇస్తారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. శిశువులకు ఆక్సిజన్ అందించడానికి ఏర్పాటు చేసిన సెంట్రల్ ఆక్సిజన్ కూడా గత ఏడాది కాలంగా పని చేయడం లేదు. గత ఏడాది కూడా శిశువు మృతి గత ఏడాది కూడా ఇక్కడ ఓ శిశువు మృతి చెందింది. దీనిపై ధర్మపురికి చెందిన శిశువు బంధువులు రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. పిల్లల వైద్యుల కొరత ఘోషా ఆస్పత్రిలో నలుగురు పిల్లల వైద్యులు ఉండాలి. ప్రస్తుతం ఇద్దరు మాత్రమే ఉన్నారు. వారిలో ఒకరు మెడికల్ లీవ్‌లో ఉన్నారు. ఎస్‌ఎన్‌సీయూలో నలుగురు వైద్యులు ఉండాల్సి ఉండగా.. ఇద్దరు మాత్రమే ఉన్నారు. సాయంత్ర ఆరు గంటలు దాటిన తర్వాత వైద్యులు అందుబాటులో ఉండడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైద్యం అందడంలో జాప్యం వల్లే శిశువులు మృతి చెందినట్లు సమాచారం. తర చూ ఇటువంటి సంఘటనలు ఇక్క డ జరుగుతున్నా సిబ్బందిలో మాత్రం మార్పు రావడం లేదు. -
‘ఎస్ఎన్సీయూ’లో విద్యుత్ అంతరాయం
తాండూరు టౌన్, న్యూస్‌లైన్: తాండూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో (ఎస్ఎన్సీయూ) ఏర్పడిన విద్యుత్ అంతరాయం చిన్నారులకు శాపంగా మారింది. విద్యుత్ సరఫరాలో ఏర్పడిన అంతరాయం వల్ల చికిత్స పొందుతున్న చిన్నారులను బయటకు తరలించారు. వివరాలిలా ఉన్నాయి. అనారోగ్యంతో జన్మించిన శిశువుల సంరక్షణార్థం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో రోజుకు రూ.3వేల నుంచి రూ.5వేల ఖర్చు అయ్యే అవకాశం ఉంది. దీనిని నివారించటానికి ఎస్ఎన్సీయూని ప్రభుత్వం ఏర్పాటుచేసింది. 20 పడకల సామర్థ్యం ఉన్న ఎస్‌ఎన్‌సీయూలో మంగళవారం విద్యుత్ సరఫరా చేసే ఇన్వర్టర్లు పాడయ్యాయి. దీంతో సరఫరాలో అంతరాయం ఏర్పడింది. జిల్లా ఆస్పత్రి టెక్నీషియన్లు మరమ్మతు చేసేందుకు విఫలయత్నం చేశారు. దీంతో తప్పనిసరి పరిస్థితిలో చికిత్స పొందుతున్న 13 మంది చిన్నారులను బయటకు తరలించాల్సి వచ్చింది. ఈ విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటరమణప్పను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా అకస్మాత్తుగా ఎస్ఎన్సీయూకి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందన్నారు. ఇన్వర్టర్లలో సమస్య తలె త్తిందని వెంటనే మరమ్మతు చేయిస్తామన్నారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న 13 మంది శిశువుల్లో 10మంది ఆరోగ్యంగానే ఉన్నారని, వారిని ఇంటికి తీసుకెళ్లవచ్చని కుటుంబసభ్యులకు చెప్పామన్నారు. అయితే ముగ్గురు చిన్నారుల పరిస్థితి బాగలేకపోవడంతో రిఫర్ చేశామన్నారు. కాగా సాయంత్రం ఇన్వర్టర్లకు మరమ్మతు చేయించి తిరిగి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.