మైనింగ్ పరిధి దాటితే కఠిన చర్యలు: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: లీజు ప్రాంతాన్ని దాటి మైనింగ్ నిర్వహిస్తున్నట్లు తేలితే ఎమ్మెల్యే డి.కె.అరుణ కుమార్తె స్నిగ్ధారెడ్డిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని గనుల శాఖ అధికారులకు హైకోర్టు స్పష్టం చేసింది. ఆమె లీజుకు తీసుకున్న ప్రాంతంలో సర్వే చేయాలని ఆదేశించింది. అప్పటివరకు మైనింగ్ నిలిపేయాలని మంగళవారం ఉత్తర్వులిచ్చింది.
ఖనిజ రవాణా డిస్పాచ్ పర్మిట్లకు స్నిగ్ధారెడ్డి చేసుకున్న దరఖాస్తుపై గడువులోగా నిర్ణయం తీసుకోవాలని న్యాయమూర్తులు జస్టిస్ దిలీప్ బి.బోసాలే, జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.