జమ్మూ కశ్మీర్లో మంచు తుపాన్.. 30మందిని రక్షించిన ఆర్మీ సైనికులు
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో హిమపాతం బీభత్సం సృష్టించింది. చౌకీబాల్-తంగ్ధర్ రహదారిలో హిమపాతం పరిస్థితి తీవ్రంగా ఉంది. దట్టమైన మంచుదిబ్బల్లో సోమవారం 30 మంది పౌరులు చిక్కుకున్నారు. అక్కడే ఉన్న ఆర్మీ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి.. 30మంది పౌరులను సురక్షితంగా కాపాడారు. వీరంతా ఖూని నాలా, ఎస్ఏం హిల్ వద్ద కురుస్తున్న భారీ మంచుచరియల్లో చిక్కుకున్నారని తెలిపారు.
భారీగా కురుస్తున్న మంచు కారణంగా ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ 14 మంది పౌరులను నీలం పాస్ వద్దకు 16 మందిని సాధన పాస్ వద్దకు సురక్షితంగా తీసుకువచ్చామని తెలిపారు. పౌరులందరికీ రాత్రిపూట ఆహారం, వైద్యం, ఆశ్రయం కల్పించామని ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. రెస్క్యూ ఆపరేషన్ దాదాపు ఆరు గంటలు కొనసాగిందని తెలిపారు.
చదవండి: డాక్టర్కు 5 డోసుల వ్యాక్సిన్! దర్యాప్తు చేయాలన్న బిహార్ ప్రభుత్వం