Society President
-
సొసైటీ అధ్యక్షుడిపై హత్యాయత్నం
అంబాజీపేట :పాత కక్షల నేపథ్యంలో మండలంలోని చిరతపూడి సొసైటీ అధ్యక్షుడు పెదిరెడ్డి వెంకటేశ్వరరావుపై సోమవారం హత్యాయత్నం జరిగింది. సినీఫక్కీలో జరిగిన ఈ ఘటనపై అమలాపురం సీఐ జి.దేవకుమార్ కథనం ప్రకారం.. చిరతపూడి సొసైటీ అధ్యక్షుడు పెదిరెడ్డి వెంకటేశ్వరరావు సొసైటీలో విధులు ముగించుకుని తన స్వగ్రామమైన ఇసుకపూడి మోటారుసైకిల్‌పై వస్తున్నారు. ఆ సమయంలో వెంకటేశ్వరరావును ఆటో వెంబడించింది. ఇసుకపూడి మలుపు వద్దకు వచ్చే సరికి ఆటో వెంకటేశ్వరరావును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో వెంకటేశ్వరరావు కిందపడిపోయారు. ఆటో నడుపుతున్న సాధనాల కుమార్ కత్తితో పడిపోయిన వెంకటేశ్వరరావుపై దాడి చేశాడు. వెంకటేశ్వరరావు కత్తిపోటును తప్పించుకునే యత్నంలో ఎడమచేతి చిటికిన వేలుకు తీవ్ర గాయమైంది. వెంకటేశ్వరరావు కుమార్‌తో పెనుగులాడుతూ కేకలు వేయడంతో నింది తుడు కుమార్ అక్కడి నుంచి పరారయ్యాడు. గాది నెహ్రూ ఇంట్లో తలదాచుకున్నాడని వెంకటేశ్వరరావు చెబుతున్నారు. కొంతకాలంగా నెహ్రూ వర్గానికి వెంకటేశ్వరరావు వర్గానికి పాతకక్షలు ఉండడంతో పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు నుంచి సోమవారం ఇసుకపూడి వచ్చిన కుమార్ హత్యాయత్నానికి పాల్పడినట్లు సీఐ తెలిపారు. ఘటనా ప్రదేశాన్ని పరిశీలించామన్నారు. దాడికి ఉపయోగించిన ఆటో, కత్తితోపాటు పలు మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వెల్లడించారు. పరారీలో నిందితుడు హత్యాయత్నానికి పాల్పడిన సాధనాల కుమార్ పరారీలో ఉన్నాడని సీఐ దేవకుమార్ తెలిపారు. ప్రత్యేక పోలీసు బృందాలు నిందితుడు కుమార్ కోసం గాలిస్తున్నాయన్నారు. హత్యాయత్నానికి కారణాలు ఏమిటి, ఎంత మంది ఉన్నారు.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని, త్వరలో నిందితులను పట్టుకుంటామని సీఐ వివరించారు. పోలీస్ పికెట్ ఏర్పాటు ఈ నేపథ్యంలో ఇసుకపూడిలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశామని సీఐ వివరించారు. అక్కడ సాధారణ పరిస్థితి నెలకొనే వరకూ పికెట్ కొనసాగుతుందని పేర్కొన్నారు. అయినవిల్లి, అల్లవరం ఎస్సైలు, మరో ఆరుగురు సిబ్బందితో పికెట్ ఏర్పాటు చేశామన్నారు. -
టీడీపీకి షాక్
సాక్షి ప్రతినిధి, విజయనగరం : అధికారం అండతో బెదిరించి లబ్ధిపొందుదామనుకున్న టీడీపీకి మత్స్యకార సంఘ నాయకులిచ్చిన తీర్పు చెంప పెట్టు అయింది. రాజకీయాలకు అతీతంగా జరగవలసిన ఎన్నికల్లో తలదూర్చిచిన నే‘తల’కు బొప్పికట్టింది. జిల్లా మత్స్యకార సహకార సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో తమ మద్దతుదారులను గెలిపించుకోవాలని చివరి నిమిషం వరకు ఆ పార్టీ నాయకులు విశ్వ ప్రయత్నాలు చేశారు. పూర్తి స్థాయి మెజార్టీ లేకపోయినా కుట్ర పూరితంగా వ్యవహరించి ప్రలోభాలు, బెదిరింపులతో సొసైటీ అధ్యక్ష పదవిని దక్కించుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. జిల్లా మత్స్యకార సహకార సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలను ప్రతీ ఐదేళ్లకు నిర్వహిస్తారు. ఆ మేరకు గత ఏడాది జూన్ 28న నోటిఫికేషన్ విడుదల చేశారు. మత్స్యకార ప్రతినిధులుగా ఉన్న 11మంది డెరైక్టర్లు ఈ ఎన్నికలో ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఆ 11మంది తమలో ఇద్దర్ని అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ఎన్నుకోవాలి. షెడ్యూల్లో భాగంగా విజయనగరం రైల్వే స్టేషన్ రోడ్డులో గల మత్స్య అభివృద్ధి కార్యాలయంలో గత ఏడాది జూలై 8న ఎన్నిక నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. జిల్లా సహకార అసిస్టెంట్ రిజిస్టార్ కె.దక్షిణామూర్తి ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. అధ్యక్ష పదవికి చింతపల్లికి చెందిన జలపుత్ర సాగర సహకార సంఘం అధ్యక్షుడు బర్రి చిన్నప్పన్న, గరుగుబిల్లికి చెందిన షిర్డీ స్వదేశీ మత్స్యకార సహకార సంఘం అధ్యక్షుడు దాసరి లక్ష్మణ నామినేషన్ వేశారు. అలాగే, ఉపాధ్యక్ష పదవికి విజయనగరానికి చెందిన గంగ పుత్ర స్వదేశీ మత్స్యకార సహకార సంఘం అధ్యక్షుడు పైడిశెట్టి మోహన్ నామినేషన్ వేశారు. నామినేషన్ పత్రాల పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ షెడ్యూల్ ప్రకారం జరిగింది. కాకపోతే, అధ్యక్ష పదవికి రెండు నామినేషన్లలో ఏ ఒక్కటీ ఉపసంహరణకు నోచుకోకపోవడంతో ఎన్నిక అనివార్యమయింది. అయితే, టీడీపీ మద్దతుదారునికి తగిన మెజార్టీ లేకపోవడంతో గజపతినగరం ఎమ్మెల్యే కె.ఎ.నాయుడు రంగంలోకి దిగి హడావుడి చేశారు. ఈ సందర్భంలో బర్రి చిన్నప్పన్న, ఎమ్మెల్యే మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఇదే సందర్భంలో నెల్లిమర్ల ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడు తెరవెనుక ప్రయత్నాలు చేశారు. అప్పటి కలెక్టర్ కాంతిలాల్ దండేపై ఒత్తిడి తెచ్చి ఎన్నికల అధికారిని గైర్హాజర్ చేయించారు. ఎంత హైడ్రామా నడిపారంటే అప్పటికప్పుడు ఎన్నికల అధికారి అనారోగ్యానికి గుయ్యారని, ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారని, తప్పని పరిస్థితుల్లో ఎన్నికను నిలిపేస్తున్నట్టు మత్స్యశాఖ అసిస్టెంట్ డెరైక్టర్ ప్రకటించారు. కానీ తర్వాత తేదీ ప్రకటించలేదు. దీంతో వైఎస్సార్సీపీ మద్దతు దారునిగా ఉన్న బర్రి చిన్నప్పన్న, ఆయన అనుచరులు పలు పర్యాయాలు జాయింట్ కలెక్టర్, కలెక్టర్‌ను కలిసి తక్షణమే ఎన్నిక నిర్వహించాలని కోరారు. కానీ అధికారులు స్పందించలేదు. దీంతో బర్రి చిన్నప్పన్న హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికలను నిర్వహించాలని పిటీషన్ చేశారు. దీంతో స్పందించిన హైకోర్టు ఎన్నికలను నిర్వహించాలని జిల్లా అధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో గత ఏడాది సెప్టెంబర్ 19న మళ్లీ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి ఇద్దరు, ఉపాధ్యక్ష పదవికి ఒకరు నామినేషన్ వేశారు. కానీ పట్టు విడవని టీడీపీ నాయకులు ప్రతిష్టగా తీసుకుని సభ్యుల్ని తీవ్ర ప్రలోభాలకు గురి చేశారు. తమ అనుకూల అధ్యక్ష అభ్యర్థికి మద్దతివ్వాలని బెదిరింపులకు సైతం దిగారు. సభ్యులపైనే కాకుండా నామినేషన్లు వేసిన వారిని ఒత్తిళ్లకు గురి చేయడంతో భరించలేక అభ్యర్థులంతా వ్యూహాత్మకంగా నామినేషన్ ఉపసంహరించుకున్నారు. దీంతో మళ్లీ ఎన్నిక నిలిచిపోయింది. తాజాగా సోమవారం ముచ్చటగా మూడోసారి ఎన్నిక చేపట్టారు. ఈ సారి విజయనగరం ఎమ్మెల్యే మీసాల గీత, జిల్లా పార్టీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్ రంగంలోకి దిగారు. హైడ్రామా నడిచింది. ఎలాగైనా జిల్లా మత్స్యకార సహకార సంఘ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులను తమ పార్టీ నేతలకే దక్కాలని తీవ్రంగా ప్రయత్నించారు. వీరి ఎత్తుగడలన్నీ గమనించిన మెజార్టీ సభ్యులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. వ్యతిరేకంగా ఉన్నామని కనిపిస్తే ఇబ్బందులు పెడతారని, వాళ్లు చెప్పినట్టే వ్యవహరిస్తే ఏ ఇబ్బందీ ఉండదన్న ఆలోచనకొచ్చి రాజీ ఫార్మలాతో ముందుకెళ్లారు. ఆ పార్టీ నేతలు చెప్పినట్టే అధ్యక్ష పదవికి మురుముళ్లు నాయుడు, ఉపాధ్యక్ష పదవికి దాసరి లక్ష్మణ నామినేషన్ వేశారు. చివరి నిమిషంలో వైఎస్సార్సీపీ మద్దతుదారైన బర్రి చిన్నప్పన్న కూడా నామినేషన్ వేశారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు అవాక్కయ్యారు. నామినేషన్ ఉపసహరించుకోవాలని బర్రి చిన్నప్పన్నపై తీవ్రంగా ఒత్తిడి చేసినా లొంగలేదు. దీంతో ఓటు హక్కు గల 10మంది సభ్యుల్ని యుద్ధ ప్రాతిపదికన ఎన్నికల ప్రాంగణం నుంచి అశోక్ బంగ్లాకు తీసుకెళ్లి బలవంతంగా టీడీపీ కండువా వేయించేశారు. అయినా ఓటింగ్‌కు వచ్చేసరికి ఆంతరాత్మ ప్రభోదించినట్టు ఓటువేశారు. రాజకీయాలకు అతీతంగా జరగాల్సిన ఎన్నికల్లో టీడీపీ పెత్తనమేంటని ఆగ్రహంతో ఉన్న సభ్యులు ఓటు హక్కు ద్వారా దానిని వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ మద్దతుదారుడికి ఆరు ఓట్లు పడగా, టీడీపీ మద్దతుదారుడికి ఐదు ఓట్లు పడ్డాయి. దీంతో ఒక్క ఓటు తేడాతో వైఎస్సార్ సీపీ మద్దతుదారుడు బర్రి చిన్నప్పన్న విజయం సాధించారు. దీంతో టీడీపీ నేతలు షాక్‌కు గురయ్యారు. -
యూరియూ ఉన్నా.. కొరతే!
అన్నదాతకు అన్నింటా కష్టాలు తప్పడం లేదు. నిన్న మొన్నటి వరకు తీవ్రమైన వర్షాభావంతో అల్లాడిన రైతాంగం ఇటీవల కురిసిన వర్షాలతో కొంత తేరుకున్నారు. అరుుతే విత్తనాల నుంచి ఎరువుల వరకు అన్నింటా కృత్రిమ కొరత సృష్టిస్తుండడంతో వారు వేదనకు గురవుతున్నారు. అన్నదాతకు అన్ని విధాల అండ దండగా ఉండాల్సిన అధికార యంత్రాంగం పాలకుల ఒత్తిళ్ల నేపథ్యంలో వారి కష్టాలను విస్మరిస్తున్నారు. విత్తన సమయంలో అవస్థలు ఎదుర్కొన్న రైతులు ఇప్పుడు కావాల్సిన ఎరువుల కోసం కష్టాలు పడుతున్నారు. కావాల్సినంత మొత్తంలో ఎరువులు ఉన్నా పాలకుల కనుసన్నల్లో పంపిణీ జరుగుతుండడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విజయనగరం వ్యవసాయం : అష్టకష్టాలు నడుమ సాగు చేపట్టిన రైతులు ఎరువుల కోసం అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా అధికంగా వినియోగించే యూరియూ దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది ఎరువులను ప్రాథమిక పరపతి సహకార సంఘాల(పీఏసీఎస్) ద్వారా సరఫరా చేస్తున్నారు. అరుుతే సొసైటీ అధ్యక్షులు పంపిణీలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ నేతల సిఫారసులు ఉన్న వారికే ఎరువులను కేటారుుస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నారుు. సిఫారసులు చేసిన వారికి 40 నుంచి 50 బస్తాల వరకు ఇచ్చేస్తున్నారని, సాధారణ రైతులకు ఒక్క బస్తా కూడా ఇవ్వడానికి అవస్థల పాల్జేస్తున్నారని వారు వాపోతున్నారు. జిల్లాలో 95 సొసైటీలకుగాను 83 సొసైటీలకు ఈ ఏడాది ఎరువులను కేటారుుంచా రు. 15 వేల టన్నుల యూరియూను సొసైటీలకు అందజేశారు. అరుుతే సొసైటీలకు వెళ్లే రైతులకు మాత్రం అధికారులు మొండి చేరుు చూపిస్తున్నారు. కొందరు సొసైటీ అధ్యక్షులు ఎరువులను ప్రైవేటు డీలర్లకు తరలిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నారుు. డీఏపీ 50 కేజీల బస్తా రూ.1180 ఉండడంతో రైతులు ఎక్కువగా యూరియూ వాడకానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అరుుతే సొసైటీల్లో యూరియూ దొరక్కపోవడంతో ప్రైవేటు వ్యాపారుల వద్దకు వెళ్లాల్సి వస్తుందని వారు చెబుతున్నారు. ఇదే అదనుగా వ్యాపారులు రైతులను దోచుకుంటున్నారు. అధిక ధరలకు విక్రయూలు... ఎరువులను ఎంఆర్పీ ధరలకే విక్రరుుంచాలని జిల్లా ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నా.. అమలుకు నోచుకోవడం లేదు. ప్రతీ బస్తాకు రైతుల నుంచి అదనంగా రూ.10 నుంచి 30 వరకు వసూలు చేస్తున్నారు. అరుుతే గత్యంతరం లేని పరిస్థితుల్లో రైతులు కొనుగోలు చేస్తున్నారు. సొసైటీల్లో యూరియూ బస్తా రూ.283.84లకుగాను రూ.290, డీఏపీ రూ.280కుగాను రూ.290లకు విక్రరుుస్తున్నారు. వీటినే ప్రైవేటు డీలర్లు మరో పది నుంచి 30 రూపాయల వరకు అదనంగా కలిపి విక్రరుుస్తున్నారు. వీటిని పర్యవేక్షించాల్సిన అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు. దీంతో ప్రైవేటు వ్యాపారుల ఇష్టారాజ్యం సాగుతోంది. ఇదే విషయం వ్యవసాయ శాఖ జేడీ ప్రమీల వద్ద సాక్షి ప్రస్తావించగా యూరియూ ఇబ్బందులు తన దృష్టికి రాలేదని చెప్పారు. రేపటి నుంచి వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా సొసైటీల్లో యూరియూను విక్రరుుస్తామని, అధిక ధరలకు విక్రరుుస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.