the solution of problems
-
రైతుకు అండగా ఉంటాం
- అన్నదాతల సంక్షేమాన్ని పాలకులు విస్మరిస్తున్నారు - సమస్యల పరిష్కారానికి ఆందోళనలు చేస్తాం - వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు సిద్దార్థరెడ్డి నిజాంసాగర్ : రైతుల సంక్షేమాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని, వారి పక్షాన ఉద్యమాలు చేసేందుకు వైఎస్సార్ సీపీ ముందుకు సాగుతోందని పార్టీ జిల్లా అధ్యక్షుడు పెద్దపట్లోళ్ల సిద్దార్థరెడ్డి అన్నారు. అన్నదాతలను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వాలు కూలిపోవడం ఖాయమని అన్నారు. వారికి అండగా ఉండేందుకు ఈ నెల 10న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కామారెడ్డిలో రైతు దీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నిజాంసాగర్ మండలం హసన్పల్లిలోని తన నివాసంలో గురువారం రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో సిద్దార్థరెడ్డి మాట్లాడారు. అడ్డదారుల్లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు రైతులు, ప్రజలను చిన్నచూపు చూస్తున్నాయని విమర్శించారు. ప్రజలకు పట్టెడన్నం పెట్టే రైతులు.. పంటలకు గిట్టుబాటు ధర లేక, పెట్టుబడి ఖర్చులు పెరిగి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని పూర్తిగా విస్మరించాయని విమర్శించారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం మాటేమో కానీ.. కనీసం వారిని పరామర్శించిన దాఖలాలు లేవని వాపోయూరు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉచిత కరెంట్, రుణమాఫీ పథకాలతో లక్షలాది రైతు కుటుంబాలను ఆదుకున్నారని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం రుణమాఫీ పథకానికి మొండిచెయ్యి చూపిందన్నారు. బ్యాంకు రుణాలు, విత్తనాలు సరిపడా అందక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. చెరువుల పునరుద్ధరణ పేరుతో మిషన్ కాకతీయ పథకానికి వేల కోట్లు ఖర్చు చేస్తున్నా ప్రయోజనం లేదన్నారు. రైతులకు భరోసా కల్పించాక చెరువుల పనరుద్ధరణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈనెల 10న చేపట్టే రైతుదీక్షకు భారీ సంఖ్యలో రైతులు, పార్టీ కార్యకర్తలు హాజరై విజయవంతం చేయూలని కోరారు. సమావేశంలో నాయకులు పట్లోళ్ల లక్ష్మికాంత్‌రెడ్డి, రాములు, ప్రభు, శ్రీధర్‌గౌడ్, శాంతికుమార్, రాజ్‌కుమార్, అనీస్, నర్సింహారెడ్డి, లచ్చానాయక్, శ్రీకాంత్, రమేష్ పాల్గొన్నారు. -
షరా మామూలే..!
కర్నూలు అగ్రికల్చర్: జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలతో ఎప్పటిలాగే ప్రజాదర్బార్ పోటెత్తింది. ఎన్ని సార్లు తిరిగినా తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని బాధితులు వాపోయారు. సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో కలెక్టర్ సీహెచ్ విజయ్‌మోహన్ వినతులు స్వీకరించారు. జేసీ హరికిరణ్, ఏజేసీ రామస్వామి, డీఆర్ఓ గంగాధర్ గౌడ్, జెడ్పీ సీఈఓ ఈశ్వర్, కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి పివి.రమణరావు, ల్యాండ్రిఫామ్స్ తహశీల్దారు ఎలిజబెత్ తదితరులు కూడా వినతులు స్వీకరించారు.వచ్చిన వినతులను అక్కడే స్కానింగ్ చేసి ప్రజావాణి వెబ్సైట్లో ఉంచి సంబంధిత అధికారులకు రెఫర్ చేశారు. ప్రజాదర్బార్‌కు వచ్చిన సమస్యల్లో కొన్ని ఇలా ఉన్నాయి. చాగలమర్రి మండలం చిన్న బోధనం గ్రామంలో రాంపుల్లయ్య పాయన్నలు 4.62 ఎకరాల ప్రభుత్వ భూమిని కొన్ని దశాబ్దాలుగా అనుభవిస్తున్నారు. ఇందులో రెండు ఎకరాలకు ప్రభుత్వం వీరికి పట్టా, పాస్ పుస్తకం కూడా ఇచ్చింది. అయితే ఓబుల్‌రెడ్డి అనే వ్యక్తి తన భార్య భారతి పేరు మీద 4.62 ఎకరాకు బోగస్ పట్టాదారు పాస్ పుస్తకం తీసుకుని ఆన్లైన్లో ఎక్కించుకున్నాడు. దీనిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని వారు కలెక్టర్‌ను కోరారు. ఉయ్యాలవాడ మండలం బోడెమ్మనూరు గ్రామంలో గ్రామ దేవత పెద్దమ్మ మాన్యం భూములను పెద్దలు ఆక్రమించుకున్నారు. కొన్నేళ్లుగా దీనిపై ఫిర్యాదులు చేస్తున్న పట్టించుకునే వారు లేరు. పేదలు అనుభవిస్తున్న మాన్యం భూములను పెద్దలు ఆక్రమించుకున్న విషయం తెలిసినా ఎవ్వరు స్పందించడం లేదు. ఇప్పటికైనా చర్యలు తీసుకొని మాన్యం భూములను పెద్దల నుండి స్వాధీనం చేసుకోవాలని ఓబులపతి, ఓబులేసు తదితరులు కోరారు. హామీలు అమలు చేయండి.. తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టి తొమ్మిది నెలలు గడిచిన ఇప్పటి వరకు రాష్ట్ర విభజన చట్టంలోని హామీల్లో ఏ ఒక్కదానిపైన దృష్టి సారించలేదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవ తీసుకుని విభజన చట్టంలోని హామీలను సాధించే దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రజాదర్బార్‌లో కలెక్టర్‌ను కోరారు. డీసీసీ అధ్యక్షుడు బీవై.రామయ్య, ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు, మాజీ జడ్పీ ఛైర్మన్ ఆకెపోగు వెంకటస్వామి, డీసీసీ ఉపాధ్యక్షుడు సర్దార్ బుచ్చిబాబు తదితరులు కలెక్టర్‌ను కలిసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు.