solving
-
ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తోంది
మచిలీపట్నంటౌన్: ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరిస్తూనే.. మరికొన్ని డిమాండ్లను కూడా నెరవేర్చేందుకు సీఎం జగన్ సానుకూలంగా స్పందిస్తున్నారని ఏపీఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బండి శ్రీనివాసరావు, కె.వి.శివారెడ్డి చెప్పారు. ఆదివారం విజయవాడలో వారు.. ఉద్యోగులతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి అంచెలంచెలుగా పరిష్కరిస్తున్నారని చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజేషన్‌పై త్వరలోనే జీవో రాబోతోందన్నారు. సీఎం జగన్.. ఇంతటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవటం అభినందనీయమన్నారు. ఉద్యోగులపై సీఎం జగన్ ప్రేమాభిమానాలు చూపుతున్నారనే దానికి ఇది ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. 33 ఏళ్లుగా కార్పొరేషన్ కింద ఉన్న ఏపీ వైద్య విధాన పరిషత్ ఉద్యోగులను సీఎం జగన్ 010 పరిధిలోకి తెచ్చారని వివరించారు. ఈ ఉద్యోగులు గతంలో ఎప్పుడు జీతం పడుతుందో తెలియక ఇబ్బందులు పడేవారని.. ఇప్పుడు ప్రతి నెలా 1వ తేదీనే జీతం అందుకుంటున్నారని చెప్పారు. సీపీఎస్ కాకుండా జీపీఎస్ ఇస్తామని ప్రభుత్వం చెప్పిందని.. ఇది కూడా ఉపయోగకరమేనన్నారు. 71 డిమాండ్లను ప్రభుత్వానికి నివేదించగా.. 65 డిమాండ్లపై సానుకూలంగా స్పందించారని.. మిగిలిన వాటిని కూడా సీఎం జగన్ పరిష్కరిస్తారనే ఆశాభావం తమకు ఉందన్నారు. ఆగస్ట్ 21, 22 తేదీల్లో ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగే సంఘం మహాసభలను జయప్రదం చేయాలని ఉద్యోగులను కోరారు. ఈ సభలకు సీఎం జగన్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు కూడా హాజరవుతున్నారన్నారు. సమావేశంలో ఏపీఎన్జీవో సంఘం నాయకులు ఉల్లి కృష్ణ, ఎ.వెంకటేశ్వరరావు, దారపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
చిరునవ్వుతో ‘స్పందన’
నిత్యం ఏదో ఒక సమస్యతో ప్రజలు కలెక్టరేట్, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతుంటారు. అయితే సమస్యలకు మాత్రం పరిష్కారం దొరకని దుస్థితి. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చివేయడానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘స్పందన’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో జరిగే గ్రీవెన్స్ కార్యక్రమాన్ని స్పందన అనే పేరుతో నిర్వహించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజల నుంచి స్వీకరించే ప్రతి అర్జీకి జవాబుదారీతనంతో పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నేటితో ప్రారంభం కానున్న స్పందన కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం చేసిన ఏర్పాట్లు, తదితర వివరాలపై సాక్షి కథనం.. సాక్షి, చిత్తూరు కలెక్టరేట్: రేషన్ కార్డు లేదని.. పాఠశాల, కళాశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని.. పింఛన్లు, తాగునీరు, రోడ్లు, భూ ఆక్రమణలు.. ఇలా ఏదో ఒక సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటారు. మండల స్థాయిలో ఉన్న అధికారులను కలిసి వారి సమస్యలను విన్నవించుకుంటారు. అయితే ఆ స్థాయిలో వారి సమస్యలకు పరిష్కారం దొరకకపోవడంతో ప్రతి సోమవారమూ కలెక్టరేట్‌కు వస్తుంటారు. కలెక్టర్‌కు తమ సమస్యలను విన్నవించుకుంటే పరిష్కారం దొరుకుతుందని ఆశపడుతుంటారు. గత సర్కారు పాలనలో ప్రజల అర్జీల పరిష్కారానికి కృషి చేసిన పాపానపోలేదు. వైఎస్ జగన్ ప్రజాసంకల్ప పాదయాత్రలో ప్రజలు ఈ విషయాలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. తాము అధికారంలోకి వస్తే స్పందన పేరుతో ప్రజల అర్జీలకు ఎప్పటికప్పుడు పరిష్కారం చూపుతామని ఆయన హామీ ఇచ్చారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడంతో స్పందన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నేడు మొదటి కార్యక్రమం.. జిల్లా స్థాయిలో స్పందన పేరుతో గ్రీవెన్స్ కార్యక్రమం సోమవారం మొదటిసారి జరగనుంది. ఈ కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం పూర్తి చేసింది. నలుమూలల నుంచి వచ్చే ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వారి ఎదుటే వాటిని పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టనున్నారు. కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాల్లో ప్రత్యేకంగా ప్రజల కోసం కుర్చీలను ఏర్పాటు చేస్తున్నారు. అర్జీదారులను కూర్చోబెట్టి ఆయా శాఖల అధికారుల ఎదుట తక్షణమే సమస్యను పరిష్కరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. మరికొన్ని రోజుల్లో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను తయారు చేసి ప్రజల అర్జీలను నమోదు చేయనున్నారు. అర్జీదారులందరికీ స్పందన పేరుతో రశీదు ఇవ్వనున్నారు. జిల్లా అధికారులందరూ హాజరుకావాల్సిందే స్పందన కార్యక్రమానికి జిల్లాలోని ఆయా శాఖల హెచ్ఓడీలు హాజరుకావాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. గతంలో పలు శాఖల అధికారులు తమ కింది స్థాయి సిబ్బందిని పంపి చేతులు దులుపుకునేవారు. ఇకపై అలాంటి విధానం ఉండకుండా ప్రతి శాఖ జిల్లా అధికారే స్పందన కార్యక్రమానికి తప్పకుండా హాజరుకావాల్సి ఉంటుంది. గైర్హాజరైతే శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నారు. అన్ని ఏర్పాట్లు చేశాం.. స్పందన కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశాం. అర్జీదారులను చిరునవ్వుతో పలకరించి వారి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపడుతున్నాం. స్పందన కార్యక్రమం నిర్వహణపై ముఖ్యమంత్రి సూచనలను తూచా తప్పకుండా పాటిస్తాం. అర్జీ దారులను కూర్చోబెట్టి అప్పటికప్పుడే వారి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తాం. – డాక్టర్ నారాయణ భరత్ గుప్త, కలెక్టర్ -
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి
కేతేపల్లి : ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్సీ పూల రవీందర్ తెలిపారు. శుక్రవారం కేతేపల్లిలో నిర్వహించిన పీఆర్టీయూ మండల కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 398 వేతనంతో పని చేసిన ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంట్ల మంజూరు, పండిట్, పీఈటీ పదోన్నతలు, దశాబ్ద కాలంగా పరిష్కారానికి నోచుకోని ఏకీకృత సర్వీసు రూల్స్ సాధనం కోసం సంఘం పక్షాన నిరంతరంగా పోరాటం చేస్తున్నామని ఆయన అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించి ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం పాటుపడుతున్న కృషిలో ఉపాధ్యాయుల భాగస్వాములు కావాలని కోరారు. సమావేశంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు సుంకరి భిక్షం గౌడ్, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.నిరంజన్‌రెడ్డి, కె.వెంకట్‌రెడ్డి, ప్రతినిధులు జి.కుషలవరెడ్డి, కె.బుచ్చిరెడ్డి, అంబటి గోపి, వేణుగోపాలరావు, టి.శ్రీనివాస్, పాండురంగం, లక్ష్మి, నాగమణి, మంగమ్మ పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారంలో పీఆర్టీయూ ముందంజ
ఆలేరు: ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో పీఆర్టీయూ ముందంజలో ఉందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పూల రవీందర్ అన్నారు. ఆలేరులోని బీసీ కాలనీలో నూతనంగా నిర్మించిన టీఎన్ పీఆర్టీయూ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం మండలంలోని శారాజీపేట జెడ్పీ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు పంగ జనార్ధన్‌రెడ్డి ఉద్యోగ విరమణ అభినందన సభలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించాలని, త్వరలో పండిట్, పీఇటీల పోస్టులను ఆప్‌గ్రేడ్ చేసే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కాసగల్ల అనసూర్య, జెడ్పీటీసీ బొట్ల పరమేశ్వర్, ఎంపీడీఓ చిల్కూరి శ్రీనివాస్, ఎంఈఓ లక్ష్మినారాయణ, సర్పంచ్ బెంజారం రజని, పీఆర్టీయూ నాయకులు నరహరి లక్షా్మరెడ్డి, సుంకరి భిక్షంగౌడ్, కోమటిరెడ్డి నర్సింహారెడ్డి, హెచ్ఎం ఇందిరాదేవి, ఉపాధ్యాయులు గడసంతల మధుసూదన్, పరిగెల రాములు, మాదాని జోసెఫ్, మంద సోమరాజు, తునికి చంద్రశేఖర్ పాల్గొన్నారు.