ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి
కేతేపల్లి : ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్సీ పూల రవీందర్ తెలిపారు. శుక్రవారం కేతేపల్లిలో నిర్వహించిన పీఆర్‌టీయూ మండల కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 398 వేతనంతో పని చేసిన ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంట్ల మంజూరు, పండిట్, పీఈటీ పదోన్నతలు, దశాబ్ద కాలంగా పరిష్కారానికి నోచుకోని ఏకీకృత సర్వీసు రూల్స్ సాధనం కోసం సంఘం పక్షాన నిరంతరంగా పోరాటం చేస్తున్నామని ఆయన అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించి ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం పాటుపడుతున్న కృషిలో ఉపాధ్యాయుల భాగస్వాములు కావాలని కోరారు. సమావేశంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు సుంకరి భిక్షం గౌడ్, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.నిరంజన్‌రెడ్డి, కె.వెంకట్‌రెడ్డి, ప్రతినిధులు జి.కుషలవరెడ్డి, కె.బుచ్చిరెడ్డి, అంబటి గోపి, వేణుగోపాలరావు, టి.శ్రీనివాస్, పాండురంగం, లక్ష్మి, నాగమణి, మంగమ్మ పాల్గొన్నారు.