ఫుట్ పాత్‌ను ఢీకొన్న బైక్: కానిస్టేబుల్ మృతి
నల్లగొండ: పట్టణంలోని రైల్వే ఓవర్‌బ్రిడ్జి(ఆర్ఓబీ)పై జరిగిన ప్రమాదంలో ఒక కానిస్టేబుల్ దుర్మరణం చెందాడు. సోమ సురేష్(30) నకిరేకల్ పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. 2005 బ్యాచ్‌కు చెందిన ఇతని స్వగ్రామం సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం మొగలాయికుంట. తండ్రి పద్మారావు కూడా పోలీసు డిపార్టుమెంట్లోనే ఏఆర్ హెడ్ కానిస్టేబుల్. ఇతనికి భార్య, ఒక కుమార్తె ఉంది. ప్రస్తుతం ఆమె రెండో కాన్పు కోసం విజయవాడలోని పుట్టింటి వద్ద ఉంటోంది.
అతి వేగంతో నల్గొండ ఆర్‌ఓబీపై బైక్‌పై వెళ్తూ ఫుట్‌పాత్‌ను ఢీకొట్టాడు. ఫుట్‌పాత్ అంచుపై పడిపోవడంతో తీవ్ర గాయాలపాలై అక్కడిక్కడే దుర్మరణం చెందాడు. బైక్ వెనుక కూర్చున్న కాంట్రాక్టర్ చిన్నపురెడ్డి మణిపాల్‌రెడ్డికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. టూ టౌన్ ఎస్ఐ రామలింగ దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.