somany ceramics 2014-2015
-
సిరామిక్ టైల్స్ షేర్లు గెలాప్
ముంబై: కోవిడ్-19 నేపథ్యంలోనూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో అంచనాలకు అనుగుణమైన ఫలితాలు సాధించడంతో టైల్స్ తయారీ కంపెనీల కౌంటర్లు వెలుగులో నిలుస్తున్నాయి. దీనికితోడు ఇటీవల ఆర్థిక రికవరీ బలపడటం, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సహాయక ప్యాకేజీలు, చౌక వడ్డీ రేట్లు, రియల్టీ రంగ ప్రోత్సాహకాలు వంటి సానుకూల అంశాలు ఈ రంగానికి జోష్‌నిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి టైల్స్ తయారీ లిస్టెడ్ కంపెనీల కౌంటర్లకు డిమాండ్ పెరిగినట్లు చెబుతున్నారు. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో హెచ్చుతగ్గుల మార్కెట్లోనూ సిరామిక్ టైల్స్ కంపెనీల షేర్లు భారీ లాభాలతో దౌడు తీస్తున్నాయి. వివరాలు చూద్దాం.. పథకాల ఎఫెక్ట్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా పట్టణ గృహకల్పనకు రూ. 18,000 కోట్లు అదనంగా కేటాయించారు. తద్వారా నిలిచిపోయిన పలు హౌసింగ్ ప్రాజెక్టులకు నిధులు అందే వీలున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. రియల్టీ రంగం పుంజుకుంటే.. స్టీల్, సిమెంట్, టైల్స్ తదితర అనుబంధ విభాగాలకూ డిమాండ్ పుడుతుందని తెలియజేశాయి. మరోపక్క చైనాపై యూఎస్, బ్రెజిల్ తదితర దేశాలు యాంటిడంపింగ్ డ్యూటీ విధించడం టైల్స్ పరిశ్రమకు బూస్ట్‌నిస్తున్నట్లు వివరించారు. చదవండి: (ఐషర్ మోటార్స్- ఐబీ రియల్టీ.. హైజంప్) షేర్ల జోరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో కజారియా సిరామిక్స్ 4.7 శాతం జంప్‌చేసి రూ. 606 వద్ద ట్రేడవుతోంది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. సెరా శానిటరీవేర్ షేరు 7.3 శాతం దూసుకెళ్లి రూ. 2,900 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 2,937ను తాకింది. ఇది ఏడాది గరిష్టంకావడం గమనార్హం! ఈ బాటలో సొమానీ సిరామిక్స్ 9.4 శాతం ఎగసి రూ. 253 వద్ద ట్రేడవుతోంది. తద్వారా జనవరి 17న రూ. 252.50 వద్ద సాధించిన ఏడాది గరిష్టాన్ని అధిగమించింది. చదవండి: (చిన్న షేర్ల దన్ను- స్మాల్ క్యాప్ రికార్డ్) -
మరో మూడు కంపెనీల్లో వాటా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిరామిక్ రంగంలో ఉన్న సొమానీ సిరామిక్స్ 2014-15లో మరో మూడు కంపెనీల్లో వాటా తీసుకోనుంది. ఒక్కో కంపెనీలో 26 లేదా 51 శాతం వాటా చేజిక్కించుకోనుంది. తయారు చేసే ఉత్పత్తులు, ఆ కంపెనీ పనితనం ఆధారంగా వాటా నిర్ణయించనుంది. వాటా కొనుగోలుకుగాను రూ.150 కోట్ల దాకా వెచ్చించనుంది. గత ఆరు నెలల్లో రూ.120 కోట్లు వెచ్చించి వివిధ కంపెనీల్లో వాటా దక్కించుకుంది. 2 సొంత ప్లాంట్లు, 6 భాగస్వామ్య, 9 థర్డ్ పార్టీ ప్లాంట్లతో కలిపి వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 43 మిలియన్ మీటర్లు. 2015 మార్చి నాటికి ఇది 50 మిలియన్ మీటర్లకు చేరుకోనుందని సొమానీ సిరామిక్స్ జాయింట్ ఎండీ అభిషేక్ సొమానీ తెలిపారు. డిస్ప్లే సెంటర్‌ను ప్రారంభించేందుకు గురువారం హైదరాబాద్ వచ్చిన ఆయన సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. గ్యాస్ లేకనే విరమించాం.. ఆంధ్రప్రదేశ్‌లో గ్యాస్ కేటాయింపులు లేకనే ప్లాంటు ఏర్పాటు ఆలోచనను విరమించామని అభిషేక్ వెల్లడించారు. గ్యాస్ కేటాయించిన మరుసటి రోజే ప్లాంటు నెలకొల్పుతామని పేర్కొన్నారు. గ్యాస్ కష్టాలు ఇక్కడ మూడు నాలుగేళ్లుంటాయని చెప్పారు. మార్కెట్ తీరు.. టైల్స్ పరిశ్రమ భారత్‌లో రూ.20-22 వేల కోట్లుంది. వృద్ధి రేటు 12 శాతముంది. మొత్తం పరిశ్రమలో 50 శాతం వాటా వ్యవస్థీకృత రంగానిది. ఈ రంగంలో ఉన్న సొమానీ సిరామిక్స్కు 13.5 శాతం మార్కెట్ వాటా ఉంది. వృద్ధి రేటు 24 శాతం నమోదు చేస్తోంది. న్యూఢిల్లీ: దేశీయ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు గతేడాది 65 శాతం తగ్గి 120 కోట్ల డాలర్లకు చేరాయని గ్లోబల్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ కుష్మాన్ అండ్ వేక్ఫీల్డ్ (సీ అండ్ డబ్ల్యు) తెలిపింది. పెట్టుబడులపరంగా ఆసియా పసిఫిక్‌లో భారత్ పదో స్థానంలో కొనసాగుతోందని గురువారం విడుదల చేసిన ప్రకటనలో సంస్థ పేర్కొంది. ‘2013లో ఆసియా పసిఫిక్ రీజియన్‌లో రియల్టీ రంగంలో పెట్టుబడులు 48,700 కోట్ల డాలర్లకు చేరాయి. చైనా 35,800 కోట్ల డాలర్ల పెట్టుబడులతో అగ్రస్థానంలో ఉంది. జపాన్ (4,460 కోట్ల డాలర్లు) రెండో స్థానంలో నిలిచింది. సార్వత్రిక ఎన్నికలు సమీపించడమే రియల్టీలో ప్రస్తుత పరిస్థితికి కారణమని సీ అండ్ డబ్ల్యు ఎగ్జిక్యూటివ్ ఎండీ సంజయ్ దత్ వ్యాఖ్యానించారు. ఇన్వెస్టర్ల సెంటిమెంట్ చెక్కుచెదరలేదనీ, ఈ రంగం భవిష్యత్తు ఆశాజనంగా ఉందనీ చెప్పారు. వచ్చే ఏడాది నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ, ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ మార్కెట్లు గణనీయంగా పుంజుకుంటాయని ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు.