ముంచెత్తిన సోనా మసూరి
దేవరకద్ర, న్యూస్‌లైన్: దేవరకద్ర మార్కెట్‌కు ధాన్యం కళ సంతరించుకుంది. సోమవారం రైతులు పెద్దఎత్తున సోనామసూరి ధాన్యాన్ని అమ్మకానికి తెచ్చారు. గత రెండు రోజులుగా మార్కెట్‌యార్డుకు సెల వు ఇవ్వడం వల్ల ఒకేరోజు వివిధ ప్రాం తాల నుంచి రైతులు వేలబస్తాల ధాన్యాన్ని తీసుకొచ్చారు. దేవరకద్ర, ధన్వాడ, చిన్నచింతకుంట, కోయిల్‌కొండ, అడ్డాకుల, నర్వ, మండలాల నుంచి రైతులు ఇక్కడి మార్కెట్‌కు ధాన్యం పెద్దఎత్తున తెస్తున్నారు. మార్కెట్‌యార్డులోని పాత దుకాణ సముదాయాల ఆవరణతో పాటు కొత్త దుకాణాల ఆవరణమంతా ధాన్యం రాసులతో నిండిపోయింది. మార్కెట్లో ఉన్న షెడ్లుకూడా ధాన్యంతోనే నిండిపోగా కొంద రు రైతులు ధాన్యం తీసుకురావడానికి వ్యాపారులతో అనుమతి తీసుకుంటున్నా రు. గత నెల రోజులుగా ఎక్కువగా హంస ధాన్యం మార్కెట్ రాగా, ఇప్పుడు కోతలు పెరగడంతో సోనామసూరి ఎక్కువగా వస్తోంది. మార్కెట్‌కు దాదాపు పదివేల బస్తాల ధాన్యం మార్కెట్‌కు వచ్చినట్లు అంచనా. కానీ అధికారులు అంచనా ప్రకా రం దాదాపు నాలుగువేల బస్తాల ధాన్యం వచ్చినట్లు టెండర్లలో చూపించారు.
పెరగని ధాన్యం ధరలు
రైతులు పండించిన ధాన్యం ఎక్కువగా మా ర్కెట్ రావడం వల్ల ధరలు తగ్గి పోతున్నా యి. సోనామసూరి ధాన్యానికి ధరలు మా త్రం తక్కువగానే వస్తున్నది. క్వింటాలుకు ధర రూ.1500దాటడంలేదు. కొంత నాణ్య త లేని ధాన్యానికి ఏకంగా రూ.1300 వ్యా పారులు టెండర్లు వేస్తున్నారు. సోమవారం వచ్చిన ధరలు ఇలా ఉన్నాయి. సోనామసూరికి గరిష్ట ధర క్వింటాలుకు రూ.1582, తక్కువ ధర రూ. 1301 ఉండగా, హంస ధాన్యం గరిష్టధర రూ.1424, కనిష్టధర రూ.1310గా టెండర్లు ఖరారయ్యాయి.
తగ్గిన బియ్యం ధరలు
పాత సోనామసూరి బియ్యం రూ.నాలుగువేలకు క్వింటాలుకు ఉండగా, ప్రస్తుతం ఖ రీఫ్ సీజన్లో పండించిన సోనామసూరి కొ త్త బియ్యానికి క్వింటాలుకు రూ.2600 నుం చి రూ. 2700 వరకు ధరలు పలుకుతున్నాయి. ధాన్యం ధరలు తక్కువగా ఉండ టం వల్ల బియ్యం ధరలు కూడా తగ్గిపోయాయి. ధరలు తక్కువగా ఉన్నప్పుడే బియ్యం కొనాలనే ఉద్దేశంతో పలువురు రైస్‌మిల్లుల నుంచి నేరుగా బియ్యం కొనుగోలు చేస్తున్నారు. దీంతో మిల్లుల వద్ద వ్యాపారం జోరందుకుంది.