యువతి కిడ్నాప్‌కు విఫలయత్నం
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా ముంచంగిపుట్టు మండలం సొన్న గ్రామంలో యువతి కిడ్నాప్‌కు దుండగుడు విఫల యత్నం చేశాడు. మంచినీటి కోసం బయటికి వచ్చిన గౌరమ్మ అనే యువతి పై మత్తు మందు చల్లి కిడ్నాప్‌కు యత్నించాడు. మహిళలు అడ్డుకోవడంతో ఆగంతకుడు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. యువతిని అక్కడే విడిచి పెట్టి అక్కడి నుంచి పరారయ్యాడు.
ఇదాలా ఉండగా గత నెలరోజులుగా గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు సంచరిస్తున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సమీప పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించారు.