SOS option
-
క్యాబ్‌ల్లో ఎస్‌వోఎస్ బటన్ తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్ : దిశ హత్యాచార ఘటన నేపథ్యంలో మహిళల భద్రతపై పోలీసు విభాగం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా నగర పోలీసులు గురువారం 15 క్యాబ్ నిర్వాహక సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. బషీర్‌బాగ్‌లోని పోలీసు కమిషనరేట్‌లో కొత్వాల్ అంజనీకుమార్ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. ప్రతి క్యాబ్‌కు ట్రాకింగ్ డివైజ్‌లు, అత్యవసర సమ యంలో సాయం కోసం ఉపయోగపడే ఎస్‌వోఎస్ బటన్లు కచ్చితంగా ఉండాలని పోలీసులు స్పష్టం చేశారు. తమ క్యాబ్‌లకు ట్రాకింగ్ డివైజ్‌లు ఉన్నాయని, ఇక ఎస్వోఎస్ను తమ యాప్‌ల్లో ఏర్పాటు చేస్తున్నామంటూ క్యాబ్‌ల నిర్వాహకులు చెప్పగా.. మోటారు వాహనాల చట్టంలోని 125 (హెచ్) సెక్షన్ ప్రకారం వాహనంలోనే ఎస్‌వోఎస్ బటన్ ఉండాలని, దీన్ని అమలు చేయాలని స్పష్టం చేశారు. క్యాబ్ డ్రైవర్ల పూర్వాపరాలను అనునిత్యం పరిశీలించాలని, వారి గత చరిత్రను సైతం పరిగణనలోకి తీసుకున్న తర్వాతే నియమించాలని కొత్వాల్ తెలిపారు. క్యాబ్‌ల్లో ప్రయాణించే వారి నుంచి ప్రతి సందర్భంలోనూ డ్రైవర్ల ప్రవర్తనపై ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలని, దాని ఆధారంగా తదుపరి చర్యలు ఉండాలన్నారు. మహిళల భద్రత అంశానికి సంబంధించి ఫిర్యాదు వస్తే వెంటనే తమ దృష్టికి తేవాలని ఆదేశించారు. ప్రతి క్యాబ్ యాప్‌ను హాక్–ఐతో అనుసంధానించాలని సూచించారు. సమావేశంలో ట్రాఫిక్ చీఫ్ అనిల్‌కుమార్ పాల్గొన్నారు. -
‘హాక్-ఐ’లో మరో హంగు
- బాధితులు, ఫిర్యాదుదారుల లొకేషన్ ఇండికేషన్ .. - కదులుతున్నా... తెరపై కనిపించేలా ఏర్పాటు ఆపదలో ఉన్నా... కళ్ల ముందు అన్యాయం జరుగుతున్నా... పోలీసులకు సంబంధించిన సమాచారం కావాలన్నా... వారికి ఫిర్యాదు చేయాలన్నా ఉపకరించేలా నగర పోలీసు విభాగం రూపొందించిన మొబైల్ యాప్ ‘హాక్-ఐ’లో మరో హంగు చేరింది. అత్యవసర సమయాల్లో సహాయం కోరడం కోసం ఏర్పాటు చేసిన వర్చువల్ బటన్ ‘ఎస్ఓఎస్’కు లొకేషన్ తెలుసుకునే సౌకర్యం ఏర్పాటైంది. ఈ యాప్ ద్వారా ‘డయల్-100’కు కాల్ చేసినా ఇది వర్తించేలా రూపొందించారు. శుక్రవారం నుంచి ఇది ప్రయోగాత్మకంగా అందుబాటులోకి వచ్చింది. కాగా, ఇప్పటివరకు ‘హాక్-ఐ’ యాప్‌ను రెండు లక్షల మంది మొబైల్ వినియోగదారులు డౌన్లోడ్ చేసుకున్నారు. - సాక్షి, హైదరాబాద్ ఏమిటీ ఎస్ఓఎస్..? ‘హాక్-ఐ’ యాప్‌లో ఉన్న ఆప్షన్స్‌లో ఎస్ఓఎస్ ఒకటి. అత్యవసర సమయాల్లో మీట నొక్కడం ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఉపకరించే వర్చువల్ ఎమర్జెన్సీ బటన్ ఇది. ఈ ఆప్షన్‌లోకి ప్రవేశించిన తర్వాత వినియోగదారులు తమ పేరు, ఫోన్ నంబర్ వంటివి ఎంటర్ చెయ్యాలి. అత్యవసర సమయాల్లో ఎవరిని సంప్రదించాలని భావిస్తున్నామో వారి నంబర్లు సైతం పొందుపరచాలి. గరిష్టంగా ఐదుగురి సెల్‌ఫోన్ నంబర్లు ఎంటర్ చేసుకునే అవకాశం ఇచ్చారు. దీంతో ఎమర్జెన్సీ బటన్ యాక్టివేట్ అవుతుంది. ఇదెలా పనిచేస్తుంది..? తాజాగా ‘హాక్-ఐ’ యాప్‌ను నగర పోలీసు ఐటీ సెల్ జీపీఎస్ పరిజ్ఞానంతో అనుసంధానించింది. దీంతో ఇకపై ఎవరైనా ఎస్ఓఎస్ బటన్ నొక్కితే వారు ఏ ప్రాంతంలో ఉన్నారనే విషయాన్నీ తెలుసుకునే అవకాశం ఏర్పడింది. గతంలో ఈ సౌకర్యం లేదు. నగరంలోని ఐదు జోన్లలో ఉన్న జోనల్ కంట్రోల్ రూమ్స్‌తో పాటు ప్రధాన కంట్రోల్‌రూమ్, హాక్-ఐ కంట్రోల్ రూమ్స్‌లో పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఎస్ఓఎస్ నొక్కిన వెంటనే వీటిపై ఉండే నగర మ్యాప్‌లో బాధితుడు ఏ ప్రాంతంలో ఉన్నారనేది ‘హాక్-ఐ’ మార్క్‌లోనే కనిపించడంతో పాటు ప్రత్యేక సైరన్ వస్తుంది. బాధితుడు ఎటైనా సంచరిస్తున్నా... ఫిర్యాదు క్లోజ్ అయ్యే వరకు తెరపై ఆ వివరాలు స్పష్టంగా కనిపిస్తాయి. ‘హాక్-ఐ’ మార్క్‌ను క్లిక్ చేస్తే బాధితుల పేరు, ఫోన్ నంబర్ డిస్ప్లే అవుతాయి. ఆ సమీపంలోని రక్షక్ వాహనం సైతం కనిపించడంతో దానికి ఆ సమాచారం ఇచ్చి వెంటనే బాధితుడు ఉన్న ప్రాంతానికి మళ్లిస్తారు. ‘100’కూ వర్తింపు.. ఫిర్యాదుదారులు, బాధితులు ఎవరైనా ‘100’కు నేరుగానే కాకుండా... ఈ యాప్ ద్వారానూ సంప్రదించే ఆస్కారం ఏర్పడింది. హాక్-ఐ ద్వారా కాల్ చేస్తే... ఫిర్యాదుదారుల లొకేషన్ సైతం ఎస్ఓఎస్ వినియోగించిన వారి మాదిరిగానే కంట్రోల్ రూమ్స్‌లో స్క్రీన్స్‌పై కనిపించేలా సిటీ పోలీసు ఐటీ సెల్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్న దీన్ని వినియోగంలో వచ్చే ఇబ్బందుల్ని గమనించడం ద్వారా అవసరమైన మార్పుచేర్పులు చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ‘హాక్-ఐ’ యాప్ నగర పోలీసులకు అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు సైతం తెచ్చిపెట్టిన విషయం తెలిసిందే. -
‘హాక్-ఐ’కు మరో హంగు
ఆపదలో ఉన్నా... పోలీసులకు సంబంధించిన సమాచారం కావాలన్నా... వారికి ఫిర్యాదు చేయాలన్నా ఉపకరించేలా నగర పోలీసు విభాగం రూపొందించిన మొబైల్ యాప్ హాక్-ఐలో మరో హంగు చేరింది. అత్యవసర సమయాల్లో సాయం కోరడం కోసం ఏర్పాటు చేసిన వర్చువల్ బటన్ ‘ఎస్ఓఎస్’కు లోకేషన్ తెలుసుకునే సౌకర్యం ఏర్పాటైంది. ఈ యాప్ ద్వారా ‘డయల్-100’కు కాల్ చేసినా ఇది వర్తిస్తుంది. ఇదీ ‘డేగ కన్ను’... సర్వకాల సర్వావస్థల్లోనూ ప్రజలకు అందుబాటులో ఉండటానికి, ఫిర్యాదులతో పాటు సూచనలు సలహాలు తీసుకోవడం, అవసరమైన సమాచారం అందించడంలో కోసం నగర పోలీసులు ఏర్పాటు చేసిన మొబైల్ యాప్ ‘హాక్-ఐ’. ఇప్పటి వరకు దీన్ని రెండు లక్షల మంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులు డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ యాప్ ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల నుంచి నేరాల వరకు ఫిర్యాదు చేయవచ్చు. అవసరమైనప్పుడు పోలీసుల సాయం సైతం పొందేలా సిటీ పోలీసు ఐటీ సెల్ అధికారులు ఈ యాప్‌ను రూపొందించారు. ఏమిటీ ఎస్ఓఎస్..? నగర పోలీసు మొబైల్ యాప్ హాక్-ఐలో ఉన్న వివిధ ఆప్షన్స్‌లో ఎస్ఓఎస్ ఒకటి. అత్యవసర సమయాల్లో మీట నొక్కడం ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఉపకరించే వర్చువల్ ఎమర్జెన్సీ బటన్ ఇది. ఈ ఆప్షన్‌లోకి ప్రవేశించిన తర్వాత వినియోగదారులు తమ పేరు, ఫోన్ నంబర్ వంటివి ఎంటర్ చెయ్యాలి. అత్యవసర సమయాల్లో ఎవరిని సంప్రదించాలని భావిస్తున్నామో వారి నంబర్లు సైతం పొందుపరచాలి. గరిష్టంగా ఐదుగురికి చెందిన సెల్‌ఫోన్ నంబర్లు ఎంటర్ చేసుకునే అవకాశం ఇచ్చారు. దీంతో ఎమర్జెన్సీ బటన్ యాక్టివేట్ అయినట్లే. అత్యవసర సమయాల్లో దీన్ని నొక్కితే సరిపోయేలా పోలీసు విభాగం డిజైన్ చేసింది. ఇప్పటి వరకు ఎలా పని చేస్తోంది? ఎస్ఓఎస్ ఆప్షన్ ద్వారా ఈ యాప్‌లో ఓ ఎమర్జెన్సీ బటన్ క్రియేట్ అవుతుంది. వినియోగదారులు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, అత్యవసరంగా సాయం పొందాలని భావించినప్పుడు ఈ బటన్ నొక్కితే చాలు... ఎంటర్ చేసిన నంబర్లతో పాటు స్థానిక ఠాణా, ఏసీపీ, డీసీపీలకు సమాచారం వెళ్తుంది. ఆయా పోలీసు అధికారులు బటన్ నొక్కిన వారిని ఫోన్లో సంప్రదించడం ద్వారా వారు ఎక్కడ ఉన్నారో తెలుసుకుంటారు. ఆపై సమీపంలో ఉన్న పోలీసు వాహనాలపై రక్షక్, బ్లూకోల్ట్స్ ఎక్కడున్నాయో పరిశీలించి వాటిని సాయం అవసరమైన వ్యక్తి ఉన్న ప్రాంతానికి పంపుతారు. ఇప్పటి వరకు అమలులో ఉన్న ఈ విధానానికి బదులుగా అత్యాధునిక పరిజ్ఞానాన్ని జోడించారు. శుక్రవారం నుంచి ఇది ప్రయోగాత్మకంగా అందుబాటులోకి వచ్చింది. ఇకపై ఎలా పని చేస్తుంది? ఈ ‘హాక్-ఐ’ యాప్‌ను నగర పోలీసు ఐటీ సెల్ జీపీఎస్ పరిజ్ఞానంతో అనుసంధానింది. ఇలా చేయడంతో ఇకపై ఎవరైనా ఎస్ఓఎస్ బటన్ నొక్కితే వారు ఏ ప్రాంతంలో ఉన్నారనే విషయాన్నీ తెలుసుకునే అవకాశం ఏర్పడింది. నగరంలోని ఐదు జోన్లలో ఉన్న జోనల్ కంట్రోల్ రూమ్స్‌తో పాటు ప్రధాన కంట్రోల్‌రూమ్, హాక్-ఐ కంట్రోల్ రూమ్స్‌లో పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఎస్ఓఎస్ నొక్కిన వెంటనే వీటిపై ఉండే నగర మ్యాప్‌లో బాధితుడు ఏ ప్రాంతంలో ఉన్నారనేది ‘హాక్-ఐ’ మార్క్‌లోనే కనిపించడంతో పాటు ప్రత్యేక సైరన్ వస్తుంది. ఎస్ఓఎస్ నొక్కిన తర్వాత బాధితుడు ఎటైనా సంచరిస్తున్నా... ఫిర్యాదు క్లోజ్ అయ్యే వరకు తెరపై ఆ వివరాలు స్పష్టంగా కనిపిస్తాయి. ‘హాక్-ఐ’ మార్క్‌ను క్లిక్ చేస్తే బాధితుల పేరు, ఫోన్ నెంబర్ డిస్ప్లే అవుతాయి. ఆ సమీపంలోని రక్షక్ వాహనం సైతం కనిపించడంతో దానికి ఆ సమాచారం ఇచ్చి వెంటనే బాధితుడు ఉన్న ప్రాంతానికి మళ్ళిస్తారు. ‘వందకూ’ వర్తింపు... హాక్-ఐ మొబైల్ యాప్ ద్వారా ‘డయల్-100’కు సైతం ఫోన్ చేసే ఏర్పాటు చేశారు. ఫిర్యాదుదారులు, బాధితులు ఎవరైనా నేరుగా ‘100’ డయల్ చేసి కాకుండా ఈ యాప్ ద్వారానూ సంప్రదించే ఆస్కారం ఏర్పడింది. హాక్-ఐ ద్వారా కాల్ చేస్తే... ఆ ఫిర్యాదుదారుల లోకేషన్ సైతం ఎస్ఓఎస్ వినియోగించిన వారి మాదిరిగానే కంట్రోల్ రూమ్స్‌లో స్క్రీన్స్‌పై కనిపించేలా సిటీ పోలీసు ఐటీ సెల్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్న దీన్ని వినియోగంలో వచ్చే ఇబ్బందుల్ని గమనించడం ద్వారా అవసరమైన మార్పుచేర్పులు చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ‘హాక్-ఐ’ యాప్ నగర పోలీసులకు అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు సైతం తెచ్చిపెట్టిన విషయం తెలిసిందే.