soul peace
-
దిశ ఆత్మకు శాంతి
సాక్షి, శంషాబాద్ : దిశపై దారుణానికి ఒడిగట్టిన నిందితులు ఎన్కౌంటర్లో మృతిచెందారన్న వార్త ఆమె కుటుంబంలో సంతోషాన్ని నింపింది. దిశ తిరిగి రాదన్న బాధలో ఉన్న తమకు ఇప్పుడు కొంత ఉపశమనం కలిగిందని ఆమె కుటుంబ సభ్యులన్నారు. దిశ ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి దారుణ సంఘటనలు జరగకుండా ఇదో ఉదాహరణలా మారాలన్నారు. మీడియాతో దిశ తల్లిదండ్రులతో పాటు సోదరి తమ అభిప్రాయాలను వెల్లడించారు. తగిన శిక్ష పడింది.. మాకు మనశ్శాంతి కలిగింది.. మా బిడ్డ తిరిగి రాదు.. మేము అనుభవిస్తున్న బాధ మళ్లీ ఎవరికీ రాకూడదు. నాకు వాళ్లను (హంతకులను) చూడాలనిపిస్తోంది.. మా అమ్మాయి ఏం తప్పు చేసింది.. ఎంత నరకం అనుభవించిందో.. ఎప్పుడూ అంద రి మంచిని మాత్రమే ఆలోచించేంది. మీ సోదరిలాంటి దానిని అని చెప్పినా వినకుండా దారుణానికి ఒడిగట్టారు.. వారికి తగిన శిక్ష పడింది. –విజయమ్మ, దిశ తల్లి పోలీసులు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు ఎన్‌కౌంటర్‌ను అందరూ ప్రశంసిస్తున్నారు.. ప్రజలంతా మాకు అండగా నిలబడ్డారు. మా బిడ్డ అయితే తిరిగి రాదు.. ఇది కొంతవరకు ఉపశమనం మాత్రమే.. కేసు కోర్టుకు వెళ్తుందని, న్యాయం జరగడానికి ఎంత కాలం పడుతుందోనని అనుకున్నా. ఇంత త్వరగా వారికి శిక్ష పడుతుందని అనుకోలేదు. ప్రతి ఒక్కరూ దిశకు జరిగిన అన్యాయాన్ని వారి బిడ్డకు జరిగిన ఘోరంగానే భావించారు. దేశ విదేశాల నుంచి ఫోన్లు చేసి పరామర్శించారు. వారికి సరైన శిక్ష పడిందనే అనుకుంటా.. పోలీసులు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు. సమాజంలో జరుగుతున్న దారుణాలపై మహిళలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది.. –శ్రీధర్‌రెడ్డి, దిశ తండ్రి దీనిని ఉదాహరణగా తీసుకోవాలి ఈ ఘటనను ఉదాహరణగా తీసుకోవాలి.. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవని అనుకుంటున్నా.. పోలీసులు నిందితులను 24 గంటల్లో పట్టుకున్నారు. వారికి ఉరిశిక్ష పడుతుందని భావించాను. పోలీసులు ఆత్మరక్షణలో భాగంగా వారిని ఎన్కౌంటర్ చేశారని టీవీలో చూశాను. ఎన్కౌంటర్ వార్త నాకు సంతోషంగానే ఉంది. పోలీసులకు, ప్రభుత్వానికి, మీడియాకు కృతజ్ఞతలు.. సంఘటన జరిగిన రోజు నుంచి అందరూ మాకు అండగా ఉన్నారు. –భవ్య, దిశ సోదరి -
‘కొండగట్టు’ వద్ద నారాయణ బలిహోమం
జగిత్యాల జోన్/కొండగట్టు: కొండగట్టు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి ఆత్మశాంతి కోసం స్వామి పరిపూర్ణానంద ఆధ్వర్యంలో బుధవారం నారాయణ బలిహోమం నిర్వహించారు. బాచంపల్లి సంతోష్‌కుమార్ శాస్త్రీ, పులి సీతారామ శాస్త్రీ, శ్రీనివాసశర్మ తదితర వేద పండితుల బృందం రెండు గంటలపాటు హోమం నిర్వహించింది. యాగం నిర్వహిస్తున్న స్థలంలోని వేదికపై దాదాపు అరగంట పాటు స్వామిజీ ప్రత్యేక జపం చేస్తూ, మౌనంగా ఉండిపోయారు. ప్రమాద స్థలంలోనే 50 మందికిపైగా చనిపోయినందున సామూహికంగానే మృతులకు పిండ ప్రదానం చేశారు. యజ్ఞహోమం వద్ద పిండాలను ఏర్పాటు చేసి.. మృతుల కుటుం బాలతో పిండాలు ప్రదానం చేయించారు. అనం తరం ధర్మపురి గోదావరిలో కలిపేందుకు తీసుకెళ్లారు. కాగా, కొండగట్టు బస్సు ప్రమాద స్థలాన్ని గోదావరి నీటితోపాటు యజ్ఞ విభూతితో శుద్ధి చేశారు. ప్రత్యేక పూజలూ చేశారు. వస్త్రాల బహూకరణ: మృతుల కుటుంబాలకు పరిపూర్ణానంద స్వామి తన చేతుల మీదుగా వస్త్రాలను బహూకరించారు. ఆ సమయంలో బాధితులు తమవారిని తలుచుకుని స్వామివారి పాదాలపై పడి ఏడ్వడం చూసేవారికి సైతం కన్నీళ్లను తెప్పించింది. మృతుల కుటుంబీకులు సంతోషంగా ఉండాలని స్వామి ఆకాంక్షించారు. -
రాజయోగంతో శాంతియుత జీవనం
కడప కల్చరల్ : యోగాసనాల ద్వారా శారీరక నియంత్రణను మాత్రమే సాధించగలమని, రాజయోగం ద్వారా ఆత్మశాంతి పొంది జీవితాన్ని శాంతియుతంగా గడపవచ్చని కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సబ్ జోనల్ కో ఆర్డినేటర్ బ్రహ్మకుమార్ రాజయోగి ఆత్మప్రకాశ్ అన్నారు. మంగళవారం స్థానిక ఓం శాంతినగర్‌లోని బ్రహ్మకు మారి సంస్థ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మూడు రోజులుగా ఈ కార్యాలయంలో రాజయోగంపై శిక్షణను ఇచ్చామని తెలిపారు. కార్యక్రమంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సబ్ జోనల్ ఇన్చార్జి బీకే పద్మ బెహన్, ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరియా విశ్వవిద్యాలయం కడప శాఖ కో ఆర్డినేటర్ బీకే గీతా బెహన్, సంస్థ సభ్యులు పాల్గొన్నారు.