South Dakota
-
రక్షణ మంత్రిగా హెగ్సెత్
వాషింగ్టన్: అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం పలు అనూహ్య నిర్ణయాలు తీసుకున్నారు. ఫాక్స్ న్యూస్ చానల్ హోస్ట్, మాజీ సైనికాధికారి పీట్ హెగ్సెత్ను రక్షణ మంత్రిగా, కీలకమైన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్‌గా జాన్ రాట్‌క్లిఫ్‌ను ఎంపిక చేశారు. సౌత్ డకోటా గవర్నర్ క్రిస్టీ నోయెమ్‌ను హోమ్‌లాండ్ సెక్యూరిటీ విభాగం చీఫ్‌గా, అర్కన్సాస్ మాజీ గవర్నర్ మైక్ హకబీ (69)ని ఇజ్రాయెల్‌లో అమెరికా రాయబారిగా నియమించాలని నిర్ణయించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి స్టీవెన్ విట్కాఫ్ను పశ్చిమాసియాకు తన ప్రత్యేక దూతగా నియమించారు. డొనాల్డ్ రమ్స్ఫెల్డ్ తర్వాత అతి పిన్న వయస్కుడైన రక్షణ మంత్రిగా 44 ఏళ్ల హెగ్సెత్ రికార్డు సృష్టించనున్నారు. ఆయన జీవితమంతా సైనికుల కోసం, దేశం కోసం యోధుడిగా గడిపారంటూ ట్రంప్ ప్రశంసించారు. ఇక క్రిస్టీది సరిహద్దు భద్రతపై ఏమాత్రం రాజీ పడని తత్వమంటూ కొనియాడారు. హెగ్సెత్ 2003లో సైన్యంలో చేరారు. ఇరాక్, ఆఫ్గానిస్తాన్‌లలో పని చేశారు. 2016 నుంచి ఫాక్స్ న్యూస్ వీకెండ్ మార్నింగ్ టాక్ షో నిర్వహిస్తున్నారు. ‘ది వార్ ఆఫ్ వారియర్స్’పేరుతో పుస్తకాలు రాశారు.సీఐఏ డైరెక్టర్‌గా సన్నిహితుడుకీలకమైన సీఐఏ డైరెక్టర్‌గా ఎంపికైన రాట్క్లిఫ్ ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడు. భారత సంతతికి చెందిన కశ్యప్ (కాష్) పటేల్‌కు ఈ పదవి దక్కుతుందని తొలుత ఊహాగానాలు వినిపించాయి. ‘‘2016 ఎన్నికలప్పుడు రష్యా కుట్ర అంటూ సాగిన తప్పుడు ప్రచారం డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ పనేనని బయట పెట్టడం మొదలుకుని సత్యం కోసం, నిజాయితీ కోసం పోరాడిన యోధుడు జాన్ రాట్క్లిఫ్. అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ ల్యాప్‌టాప్ గురించి 51 మంది ఇంటెలిజెన్స్ అధికారులు అబద్ధాలు చెప్పినా ఆయన మాత్రమే అమెరికన్ ప్రజలకు నిజం చెప్పారు’’అంటూ ట్రంప్ ప్రశంసించారు. ట్రంప్ తొలిసారి అధ్యక్షునిగా ఉన్నప్పుడు రాట్క్లిఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా పనిచేశారు. 2020లో ఆయన్ను అమెరికా అత్యున్నత గూఢచారిగా ధ్రువీకరించారు. -
అద్భుత దృశ్యం.. ఆకుపచ్చగా మారిన ఆకాశం.. ఫోటోలు వైరల్
అమెరికా: సాధారణంగా నీలిరంగులో ఉండే ఆకాశం పూర్తిగా ఆకుపచ్చ రంగులోకి మారింది. అమెరికాలోని దక్షిణ డకోటాలో ఈ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. సియాక్స్ ఫాల్స్ నగర వాసులు ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. హాలీవుడ్ సినిమాలో ఏలియన్స్ రావడానికి ముందు కన్పించే దశ్యాల్లా ఆకాశంలో ఈ మార్పులను చూసి నగరవాసులు ఆశ్చర్యంతో పాటు భయాందోళనకు గురయ్యారు. ఆ మార్పులే కారణం అయితే ఆకాశం ఆకుపచ్చగా మారడానికి వాతావరణంలో అనూహ్య మార్పులే కారణమని తెలుస్తోంది. దక్షిణ డకోటా, మిన్నెసొటా, అయోవ నగరార్లో మంగళవారం ప్రచండ గాలులతో తుపాను బీభత్సం సృష్టించింది. ఆ సమయంలోనే ఈ ప్రాంతాల్లో 'డెరోకో' ఏర్పడిందని వాతావరణ శాఖ ధ్రువీకరించింది. అందుకే ఆకాశం రంగు మారినట్లు పేర్కొంది. ఆకాశం ఆకుపచ్చ రంగులోకి మారినంత మాత్రాన టోర్నడోలు వస్తాయని భయాందోళన చెందాల్సిన అవసరం లేదని వాతావరణ నిపుణులు తెలిపారు. దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. The approach. @NWSSiouxFalls @keloland @dakotanews_now pic.twitter.com/NOl35jIlpt — jaden 🥞 🍦 (@jkarmill) July 5, 2022 #salemsd pic.twitter.com/ExbpCtV1tI — J (@Punkey_Power) July 5, 2022 ఆకుపచ్చగా ఎందుకు? ఆకాశం ఆకుపచ్చ రంగులోకి ఎందుకు మారుతుందో పూర్తిగా అర్థంకాకపోయినప్పటికీ పలు అమెరికా పరిశోధనా నివేదికలు దీని గురించి వివరించాయి. సూర్యాస్తమయం సమయంలో ఎరుపు కాంతి ఉన్నప్పుడు ఉరుములతో కూడిన వర్షం పడితే, గాలిలోని నీటి కణాల వల్ల ఆకాశం ఆకుపచ్చ రంగులో ఉన్నట్లుగా కనిపిస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు. తుపాను కారణంగా మంగళవారం రాత్రి నాలుగు గంటల పాటు దక్షిణ డకోటాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భారీ ఆస్తి నష్టం కూడా సంభవించింది. గాలివాన వల్ల ఆకాశం పలుమార్లు నలుపు, నీలం, బూడిద, ఆకుపచ్చ రంగుల్లోకి మారింది. -
విమానం కుప్పకూలి 9 మంది మృతి
న్యూయార్క్: అమెరికాలోని ఛాంబర్ లైన్లో దక్షిణ డకోటాకు చెందిన ఓ విమానం శనివారం మధ్యాహ్నం కుప్పకూలిపోంది. ఈ ప్రమాదంలో తూర్పు ఇడాహోకు చెందిన తొమ్మిది మంది ప్రయాణికులు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో మృతి చెందినవారిలో పైలట్‌తోపాటు, ఇద్దరు చిన్న పిల్లలు కూడా ఉన్నారని బ్రూల్ కౌంటీ రాష్ట్ర అటార్నీ థెరిసా మౌల్ వెల్లడించారు. ప్రాణాలతో బయటపడి, తీవ్రమైన గాయాలపాలైన వారిని చికిత్స కోసం సియోక్స్ ఫాల్స్ ఆస్పత్రికి తరలించినట్లు ఆమె పేర్కొన్నారు. పీలాటస్ పీసీ -12 విమానం శనివారం మధ్యాహ్నం 12:30 గంటలకు బయలుదేరింది. ఈ విమానం ఛాంబర్లైన్ మునిసిపల్ విమానాశ్రయం నుంచి ఇడాహోకు బయలుదేరింది. కాగా, ఛాంబర్లైన్కు దక్షిణంగా ఉన్న కార్న్ఫీల్డ్లో విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రమాదానికి సంబంధించిన కారణాలపై దర్యాప్తు చూస్తున్నామని రాష్ట్ర అటార్నీ థెరిసా మౌల్ వెల్లడించారు. తీవ్రమైన వాతావారణ పరిస్థితుల్లో బాధితులను రక్షించడానికి ముందుకు వచ్చిన అందరిని, వైద్యనిపుణులను మౌల్ ప్రశంసించారు. ఈ విమానంలో ఇడాహో చెందిన ఇద్దరు వ్యాపారవేత్తలు వారి కుటుంబ సభ్యులతో ప్రయణించినట్లు తెలుస్తోంది. ఈ నెలలో ఇది రెండో అతిపెద్ద విమాన ప్రమాదంగా తెలుస్తోంది. -
కిడ్నీలో రాళ్లని వెళ్లి.. ముగ్గురికి జన్మనిచ్చింది
వినడానికి, చదవడానికి, నమ్మశక్యంగా లేని వార్త ఒకటి ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఈ సంఘటన దక్షిణ డకోటాలో ఈ నెల 10న చోటు చేసుకుంది. వివరాలు.. గిల్ట్జ్(34) అనే మహిళ గత కొంతకాలంగా కిడ్నీలో రాళ్లతో బాధపడుతుంది. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం ఆమె తీవ్రమైన నడుము నొప్పితో బాధపడసాగింది. దాంతో ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ గిల్ట్జ్‌ను పరీక్షించిన వైద్యులు ఆమె ఎనిమిదిన్నర నెలల గర్భవతి అని తేల్చారు. అంతేకాక ఆమె కడుపులో కవలలు లేదా ముగ్గురు పిల్లలు పెరుగుతున్నట్లు గుర్తించారు. గిల్ట్జ్ బాధపడుతుంది కిడ్నీలో రాళ్ల వల్ల వచ్చిన నొప్పితో కాదని ప్రసవ వేదనతో అని పేర్కొన్నారు. అనంతరం 4 నిమిషాల వ్యవధిలో గిల్ట్జ్ ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చింది. చిన్నారులంతా 1.8కిలోగ్రాముల బరువుతో ఆరోగ్యంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఈ విషయం గురించి వైద్యులు మాట్లాడుతూ.. ‘ఎటువంటి ఆపరేషన్లు లేకుండా ముగ్గురు బిడ్డలకు జన్మనివ్వడం చాలా అరుదుగా జరిగే సంఘటన. డెలివరీ సమయానికి గిల్ట్జ్ 34 వారాల గర్భంతో ఉన్నారు. కానీ దాని గురించి ఆమెకు ఏమాత్రం అవగాహన లేకపోవడం ఆశ్చర్యం కల్గిస్తుంది. వైద్యుడిని అయినప్పటికి సాధరణ జనాల మాదిరిగానే నేను కూడా ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నాను. ఓ మహిళకు తాను గర్భవతిని అని తెలియకపోవడం.. నిజంగా వింతే. ఎందుకంటే గర్భవతి అయ్యాక నెలసరి ఆగిపోతుంది.. బిడ్డ పెరుగుతున్న కొద్ది ఉదర భాగం ముందుకు వస్తుంది. అంతేకాక ఆరు, ఏడో నెల నుంచి కడుపులో బిడ్డ కదలిక తెలుస్తుంది. కానీ గిల్ట్జ్ విషయంలో ఇవేవి జరగకపోవడం నిజంగా ఆశ్చర్యమే. ఇప్పటికి నేను ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నాను. కిడ్నీలో రాళ్లు అంటూ ఆస్పత్రిలో చేరిన మహిళ ఏకంగా ముగ్గురు బిడ్డలకు జన్మనివ్వడం బహుశా చరిత్రలో ఇదే ప్రథమం అనుకుంటా’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ వార్త చదివిన జనాలు కూడా సదరు వైద్యులు వ్యక్తం చేసిన అనుమానాలనే వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ అభినందనలు తెలుపుతున్నారు. గిల్ట్జ్‌కు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉండగా.. ప్రస్తుతం ఓ అమ్మాయికి, ఇద్దరు అబ్బాయిలకు జన్మనిచ్చింది. -
విమానాన్ని 10మైళ్ల దూరంలో ల్యాండ్ చేశారు
వాషింగ్టన్: అమెరికాలో డెల్టా విమానం నిర్దేశిత విమానాశ్రయంలో కాకుండా పొరపాటుగా 10 మైళ్ల దూరంలో ఎయిర్ ఫోర్స్ బేస్‌లో ల్యాండ్ అయ్యింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. గురువారం సాయంత్రం డెల్టా ఫ్లయిట్ 2845 మినీయాపోలిస్ నుంచి సౌత్ డకోటాకు 130 మంది ప్రయాణికులతో బయల్దేరింది. షెడ్యూల్ ప్రకారం ఈ విమానం రాపిడ్ సిటీ రీజనల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ కావాలి. అయితే ఇందుకు బదులుగా ఎల్స్‌వర్త్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో దిగినట్టు డెల్టా ఎయిర్‌లైన్స్ అధికారులు చెప్పారు. ఎయిర్‌పోర్ట్‌కు, ఎయిర్ ఫోర్స్ బేస్‌కు 10 మైళ్ల దూరం ఉంటుంది. కాగా రెండు చోట్ల రన్ వే పాయింట్ దాదాపుగా ఒకే దిశలో ఉంటాయి. కొన్ని గంటల తర్వాత అధికారులు సమన్వయం చేసుకుని డెల్టా విమానాన్ని రాపిడ్ సిటీ రీజనల్ ఎయిర్‌పోర్ట్‌కు తీసుకువచ్చారు. ఈ సంఘటనపై ఫెడరల్ అధికారులు విచారణ చేస్తున్నారు. విచారణకు పూర్తిగా సహకరిస్తామని, ఇప్పటికే సొంతంగా అంతర్గత సమీక్ష ప్రారంభించామని డెల్టా ఎయిర్‌లైన్స్ అధికారులు తెలిపారు. ప్రయాణికులకు అసౌకర్యం ఏర్పడినందుకు క్షమాపణలు చెప్పారు. కాగా గతంలో కూడా విమానాలను నిర్దేశిత విమానాశ్రయంలో కాకుండా పొరపాటున మరోచోట ల్యాండ్ చేసిన సంఘటనలు ఉన్నాయి.