South H Block
-
‘హెచ్’ బ్లాక్‌కు బాబు ఓకే
* సీమాంధ్ర సీఎం కార్యాలయం అదే * చంద్రబాబును కలిసిన సీఎస్, విభజన కమిటీ సభ్యులు * రాష్ట్ర విభజన ప్రక్రియపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ * మార్గదర్శకాల ప్రకారమే చర్యలని వివరణ * క్యాంపు కార్యాలయంగా లేక్‌వ్యూ వద్దన్న చంద్రబాబు * సీమాంధ్రలో క్యాంపు కార్యాలయం కావాలన్న టీడీపీ అధినేత * ఉద్యోగుల విభజన పొరపాట్లు లేకుండా చేయాలని సూచన సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర ముఖ్యమంత్రిగా సచివాలయంలోని సౌత్ ‘హెచ్’ బ్లాక్‌లో కొనసాగడానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సుముఖత వ్యక్తం చేశారు. ఈ విషయమై అధికారులు అన్నీ ఆలోచించే నిర్ణయాలు తీసుకుని ఉంటారని, అక్కడ కొనసాగడానికి తనకేమీ ఇబ్బంది లేదని, తమ మనుషులు వచ్చి పరిశీలిస్తారని ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం. రాష్ట్ర విభజన ప్రక్రియ జరుగుతున్న తీరును, ఇప్పటివరకు తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మహంతి, విభజన కమిటీలకు నేతృత్వం వహిస్తున్న పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు గురువారం ఆయనకు వివరించారు. విభజనకు జారీ చేసిన మార్గదర్శకాల ఆధారంగానే తాము ముందుకు సాగుతున్నట్లు మహంతి చెప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అధికారికంగా నియమితులైన కమిటీ సభ్యులు, సీఎస్ నేతృత్వంలో విభజన పై వాస్తవ పరిస్థితులను కేసీఆర్, చంద్రబాబులకు వివరించాలని భావించి ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రస్తుతం సీమాంధ్ర ముఖ్యమంత్రికి కేటాయించిన భవనంలోని సివిల్ పనులన్నీ జూన్ రెండో తేదీ నాటికి పూర్తవుతాయని తెలిపారు. సీమాంధ్ర రాజధాని నిర్మాణం త్వరగా జరగాలన ఈ సందర్భంగా చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే సీమాంధ్రలో క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయాలని కూడా సూచించారని అధికారవర్గాలు వివరించాయి. అయితే అది ఎక్కడన్న విషయాన్ని ఆయన స్పష్టం చేయలేదని ఓ అధికారి తెలిపారు. క్యాంపు కార్యాలయంగా లేక్‌వ్యూ అతిథి గృహం అవసరం లేదని, తన ఇంటి నుంచే క్యాంపు కార్యాలయం కొనసాగిస్తానన్నారని చెప్పారు. ఉద్యోగుల విభజనకు సంబంధించి పొరపాట్లు లేకుండా చేయాలని, ఉద్యోగులకు ఇబ్బంది కలిగించే నిర్ణయాలు తీసుకోకుండా పారదర్శకంగా వ్యవహరించాలని చంద్రబాబు సూచించారు. కాగా ఇప్పటివరకు ఉద్యోగుల విభజన జరగలేదని అధికారులు వివరించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న అతిథి గృహాలను ఇరు రాష్ట్రాలకు జనాభా దామాషా పద్ధతిలో గదులు కేటాయిస్తామని ఆ అధికారి తెలిపారు. మంత్రులకు బంజారాహిల్స్‌లోని మంత్రుల క్వార్టర్లు 30 మాత్రమే ఉన్నాయని వివరించారు. -
ఆంధ్రా సీఎం చాంబర్ కోసం పరిశీలన
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కోసం చాంబర్, సీఎం కార్యాలయం, కేబినెట్ హాల్ ఏర్పాట్లపై అధికారులు సోమవారం పరిశీలన జరిపారు. ఇందు కోసం సచివాలయంలోని హెచ్ బ్లాక్‌ను ఉన్నతాధికారులు పరిశీలించారు. గవర్నర్ నరసింహన్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి, కమలనాథన్ కలిసి ఈ సందర్భంగా చర్చలు జరిపారు. మరోవైపు ఐటీ శాఖతో గవర్నర్ సలహాదారు సలావుద్దీన్ సమీక్ష నిర్వహించారు. ఉద్యోగుల విభజన, పైళ్ల డిజిటలేషన్పై చర్చించారు. సచివాలయంలోని సౌత్ హెచ్ బ్లాకును ఆంధ్రప్రదేశ్ సీఎం, సీఎస్, సీఎం కార్యాలయ అధికారులకు కేటాయించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఆ బ్లాకులో ఉన్న ఆంధ్రా బ్యాంకును ఎల్ బ్లాకుకు తరలించాలని నిర్ణయించారు. సౌత్ హెచ్ బ్లాకులో ప్రస్తుతం ఆంధ్రాబ్యాంకు ఉన్న వైపు నుంచే ఆ బ్లాకులోకి సీఎం, సీఎస్, సీఎం కార్యాలయ అధికారులకు రాకపోకలకు ప్రధాన ద్వారం ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం సౌత్ హెచ్ బ్లాకుకు ప్రధాన ద్వారం జి బ్లాకు ముందు నుంచి ఉంది. జి బ్లాకు శిధిలావస్థలో ఉండటంతో పాటు జి బ్లాకు ముందు ప్రధాన ద్వారం వద్ద వాహనాల పార్కింగ్‌కు స్థలం లేదు. ఈ నేపథ్యంలో సౌత్ హెచ్ బ్లాకు ప్రధాన ద్వారాన్ని ఆంధ్రాబ్యాంకు వైపు ఏర్పాటు చేస్తారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అధికారిక నివాసం, క్యాంపు కార్యాలయంగా గ్రీన్లాండ్ అతిథి గృహాన్ని కేటాయించనున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అధికారిక నివాసం, క్యాంపు కార్యాలయంగా గ్రీన్‌లాండ్‌ను తీర్చిదిద్దడానికి గవర్నర్ ఇప్పటికే తగిన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సౌత్, నార్త్ హెచ్ బ్లాకులను, జె, కె, ఎల్ బ్లాకులను కేటాయించాలని నిర్ణయించగా.. తెలంగాణ ప్రభుత్వానికి ఎ,బి,సి, డి బ్లాకులను కేటాయించాలని నిర్ణయించారు. -
ఏపీ సీఎంకు సౌత్ హెచ్ బ్లాక్
-
ఏపీ సీఎంకు సౌత్ హెచ్ బ్లాక్
సాక్షి, హైదరాబాద్: సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కోసం సౌత్ హెచ్ బ్లాకు ముస్తాబవుతోంది. గవర్నర్ నర్సింహన్ స్వయంగా ఆదివారం సచివాలయం వచ్చి బ్లాకులను సందర్శించిన విషయం తెలిసిందే. ఆయన ఆదేశాలకు మేరకు బ్లాకుల విభజనతో పాటు బ్లాకుల ముస్తాబు కసరత్తును అధికారులు సోమవారం నుంచే ప్రారంభించారు. సచివాలయంలోని సౌత్ హెచ్ బ్లాకును ఆంధ్రప్రదేశ్ సీఎం, సీఎస్, సీఎం కార్యాలయ అధికారులకు కేటాయించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఆ బ్లాకులో ఉన్న ఆంధ్రా బ్యాంకును ఎల్ బ్లాకుకు తరలించాలని నిర్ణయించారు. పది రోజుల్లోగా ఆ పని పూర్తి చేయాలని బ్యాంకుకు నోటీసులు జారీ చేశారు. జె బ్లాకు వెనుకనున్న ఆంధ్రాబ్యాంకు ఇటీవలే లక్షల రూపాయల వ్యయం చేసి సౌత్ హెచ్ బ్లాకులో నిర్మాణాలను చేపట్టి అక్కడికి మారింది. కేవలం నెలల వ్యవధిలోనే మళ్లీ ఎల్ బ్లాకుకు తరలిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. సౌత్ హెచ్ బ్లాకులో ప్రస్తుతం ఆంధ్రాబ్యాంకు ఉన్న వైపు నుంచే ఆ బ్లాకులోకి సీఎం, సీఎస్, సీఎం కార్యాలయ అధికారులకు రాకపోకలకు ప్రధాన ద్వారం ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం సౌత్ హెచ్ బ్లాకుకు ప్రధాన ద్వారం జి బ్లాకు ముందు నుంచి ఉంది. జి బ్లాకు శిధిలావస్థలో ఉండటంతో పాటు జి బ్లాకు ముందు ప్రధాన ద్వారం వద్ద వాహనాల పార్కింగ్‌కు స్థలం లేదు. ఈ నేపథ్యంలో సౌత్ హెచ్ బ్లాకు ప్రధాన ద్వారాన్ని ఆంధ్రాబ్యాంకు వైపు ఏర్పాటు చేస్తారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అధికారిక నివాసం, క్యాంపు కార్యాలయంగా గ్రీన్లాండ్ అతిథి గృహాన్ని కేటాయించనున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ నర్సింహన్ సోమవారం సాయంత్రం గ్రీన్లాండ్ అతిథి గృహం వెళ్లి పరిశీలన చేశారు. ఆయనతోపాటు సీఎస్ ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అధికారిక నివాసం, క్యాంపు కార్యాలయంగా గ్రీన్‌లాండ్‌ను తీర్చిదిద్దడానికి గవర్నర్ తగిన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సౌత్. నార్త్ హెచ్ బ్లాకులను, జె, కె, ఎల్ బ్లాకులను కేటాయించాలని నిర్ణయించగా.. తెలంగాణ ప్రభుత్వానికి ఎ,బి,సి, డి బ్లాకులను కేటాయించాలని నిర్ణయించారు.