అంతర్ రాష్ట్ర పోటీలకు క్రీడాకారుల ఎంపిక
అనంతపురం టౌన్ : కర్ణాటక రాష్ట్రం బెల్గాంలో శుక్రవారం నుంచి 8వ తేదీ వరకు నిర్వహించే అంతర్ రాష్ట్ర సౌత్‌జోన్ వింటర్ అక్వాటిక్ చాంపియన్‌షిప్ పోటీలకు జిల్లా క్రీడాకారులు ఎంపికైనట్లు జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు రవిశేఖర్‌రెడ్డి, కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు. బాలుర విభాగంలో రాము, మణిదీప్, కుషిధర్రెడ్డి, బాలికల విభాగంలో శ్రేయ, నియతి, నాగవైష్ణవి, శ్రీహర్షిత ఎంపికయ్యారు. వీరు ఇటీవల కాకినాడలో జరిగిన అంతర్ జిల్లా వింటర్ అక్వాటిక్ చాంపియన్‌షిప్‌లో పతకాలు సాధించి సౌత్‌జోన్‌కు ఎంపికైనట్లు పేర్కొన్నారు.