Soviet Union President Mikhail Gorbachev
-
గోర్బచెవ్కు నిరాడంబరంగా తుదివీడ్కోలు
సోవియట్ యూనియన్ చివరి అధ్యక్షుడు మిఖాయిల్ గోర్బచెవ్ (91) మృతదేహం వద్ద విలపిస్తున్న కుమార్తె ఇరినా. అనారోగ్యంతో మంగళవారం మరణించిన గోర్బచెవ్ అంత్యక్రియలు శనివారం మాస్కోలో నిరాడంబరంగా ముగిశాయి. భార్య రైసా సమాధి పక్కనే ఆయన పార్థివ దేహాన్ని ఖననంచేశారు. అభిమాన నేతను కడసారి చూసుకునేందుకు రష్యా పౌరులు భారీగా పోటెత్తారు. అంత్యక్రియల్లో అధ్యక్షుడు పుతిన్ పాల్గొనలేదు. సోవియట్ కుప్పకూలడానికి గోర్బచెవే కారకుడనే భావనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. తాను పాల్గొనాల్సి వస్తుందనే అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో జరపలేదని కూడా చెబుతున్నారు. -
సోవియట్ యూనియన్ చివరి అధ్యక్షుడు కన్నుమూత
మాస్కో: సోవియట్ యూనియన్ నేత మిఖాయిల్ గోర్బచేవ్(91) తుదిశ్వాస విడిచారు. చాలాకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆసత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మరణించినట్లు రష్యా వార్తా సంస్థలు తెలిపాయి. సోవియట్ యూనియన్ చివరి అధ్యక్షుడైన గోర్బచేవ్.. ప్రచ్ఛన్నయుద్ధం ముగింపులో కీలక పాత్ర పోషించారు. ఏడేళ్లు అధ్యక్షుడిగా ఉన్న సమయంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చి చెరగని ముద్ర వేశారు. సోవియట్ యూనియన్ అధ్యక్షుడిగా 1985-1991 వరకు కొనసాగారు గోర్బచేవ్. రష్యా-అమెరికా మధ్య ఉద్రిక్తతలు తగ్గించి ద్వైపాక్షిక సంబంధాలు బలపర్చిన నేతగా ఘనత సాధించారు. అంతేకాదు. ఆయన హయాంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. అంతకుముందు నేతల్లా నిరసనకారులపై ఉక్కుపాదం మోపకుండా శాంతియుతంగా వ్యవహరించారు. తూర్పు యూరప్‌కు సోవియట్ యూనియన్ పాలన నుంచి విముక్తి కల్పించారు. అప్పటి నుంచే సోవియట్ యూనియన్ విడిపోయింది. తనదైన మార్క్ పాలనతో పశ్చిమ దేశాల్లోనూ మంచి గుర్తింపు సాధించారు గోర్బచేవ్. 1990లో నోబెల్ శాంతి బహుమతి కూడా ఆయనను వరించింది. అయితే ప్రపంచానికి సూపర్‌పవర్‌గా ఉన్న తమను ఈయనే బలహీనపరిచారని రష్యా నేతల నుంచి విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. రష్యా నేతల్లో 90ఏళ్లకు పైగా జీవించిన తొలి వ్యక్తి గోర్బచేవ్ కావడం గమనార్హం. అందుకే ఆయన 90వ పుట్టినరోజు నాడు అమెరికా అధ్యక్షుడు జో బెైడెన్, జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ వంటి అగ్రనేతలు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. చదవండి: పాకిస్తాన్‌కి అమెరికా రూ. 200 కోట్ల మానవతా సాయం -
18 అక్టోబర్ 1989 ఎరిక్‌ను ఇంటికి పంపించారు!
ఆ నేడు ఎరిక్ హోనేకర్ (1912-1994) తూర్పు జర్మనీ కమ్యూనిస్టు నాయకుడు. ‘సోషలిస్టు యూనిటీ పార్టీ’ ప్రధాన కార్యదర్శి. 1971 నుండి 1989 వరకు ఆయన 18 ఏళ్ల పాటు జర్మన్ డె మొక్రటిక్ రిపబ్లిక్కి నాయకుడిగా ఉన్నారు. ఎరిక్ రాజకీయ విధానాల వల్ల తూర్పు జర్మనీ పౌరుల్లో అసంతృప్తి వెల్లువెత్తి ఆయన పదవికి ఎసరు తెచ్చింది. లక్షా 20 వేల మంది నిరసనకారులు తూర్పు జర్మనీలోని కీలక పట్టణమైన లీప్జింగ్లో పెద్ద ఎత్తున ప్రదర్శన జరిపారు. ఎరిక్ అవకతవకలపై ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు. అప్పటికే వేలాది మంది ఉద్యోగ అవకాశాల కోసం పొరుగు దేశాలకు తరలివెళ్లారు. ఈ పరిణామాల పర్యవసానంగా ఎరిక్ 1989 అక్టోబర్ 18న పదవీచ్యుతులయ్యారు. అయితే ఆయన ‘ఆరోగ్య కారణాలతో’ పదివి నుంచి వైదొలగవలసి వచ్చింద ని అధికారిక ప్రకటన వెలువడింది. అంతకుముందు సోవియెట్ యూనియన్ అధ్యక్షుడు మిఖాయెల్ గోర్బచెవ్ తూర్పు జర్మనీలో పర్యటించి, ఎరిక్‌కు వ్యతిరేకంగా స్థానిక పౌరులను ఉద్దేశించి ప్రసంగించడం కూడా ఎరిక్ రాజకీయ పతనానికి ఒక కారణమని చెబుతారు.