SP navadeep sing
-
స్పందన ఫిర్యాదులపై ప్రత్యేక శ్రద్ధ
సాక్షి, పశ్చిమగోదావరి(ఏలూరు టౌన్) : జిల్లావ్యాప్తంగా తమ సమస్యల పరిష్కారానికి పోలీస్స్టేషన్లకు వచ్చే బాధితులకు సత్వర న్యాయం జరిగేలా ప్రతి పోలీసు అధికారి బాధ్యతగా పనిచేయాలని, కేసుల దర్యాప్తులో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవల్ హెచ్చరికలు జారీచేశారు. ఏలూరు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితుల పట్ల మర్యాదగా నడచుకోవటంతోపాటు, వారి సమస్యలను న్యాయబద్ధంగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా కేసుల దర్యాప్తు విషయంలో తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తే సహించేదిలేదన్నారు. ఇక భూ సంబంధిత వివాదాలు కోర్టు పరిధిలో ఉంటే వాటిని సివిల్ కోర్టుల్లోనే తేల్చుకోవాలని, వాటిని పోలీసులు పరిష్కరించే అవకాశం లేదన్నారు. కోర్టుల్లో దావా ఉంటే ఆయా వ్యక్తులు కోర్టు ఆదేశాల మేరకే నడుచుకోవాలని కోరారు. భారీగా కురుస్తోన్న వర్షాలతో పోలవరం ముంపు గ్రామాలు జలమయం అయ్యాయని, అటువంటి ప్రాం తాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పో లీసు, రెవెన్యూ, అగ్నిమాపక శాఖ సిబ్బందితో కలిసి సంయుక్తంగా ప్రత్యేక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సమస్యల్లో కొన్ని.. ⇔ గుర్తుతెలియని వ్యక్తులు తమ మార్కెటింగ్ యార్డ్నకు సంబంధించిన రశీదులు నకిలీవి వినియోగిస్తూ ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, వారిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని జిల్లా మార్కెటింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ కోరారు ⇔ తణుకు మండలానికి చెందిన ఒక మహిళ తమ మరిది తమను ఇంటినుంచి పంపేయాలనే ఉద్దేశంతో కావాలని ఇబ్బందులకు గురిచేస్తున్నాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు ⇔ భీమవరానికి చెందిన మహిళ తన కోడలు వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని తన కుమారుడు, తనపై తప్పుడు కేసులు బనాయిస్తూ మానసికంగా వేధింపులకు పాల్పడుతుందని, విచారించి చర్యలు తీసుకోవాలని కోరారు ⇔ కొయ్యలగూడెం మండలానికి చెందిన ఒక వ్యక్తి డైట్ కాలేజీలో ప్రవేశం కల్పిస్తానని చెప్పి తన వద్ద డబ్బులు తీసుకుని మోసం చేశాడని, చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరారు. -
ఆకస్మిక తనిఖీలు
సాక్షి, పశ్చిమ గోదావరి : జిల్లాలో ప్రజలకు ఉత్తమ సేవలు అందించేందుకు పోలీసు శాఖ పనిచేయాలని, పోలీస్స్టేషన్లకు వచ్చే బాధితులు, ఫిర్యాదుదారులకు మౌలిక సదుపాయాలు కల్పించే విషయంపై దృష్టి పెట్టాలని జిల్లా ఎస్పీ నవదీప్‌సింగ్‌గ్రేవల్ అన్నారు. ఏలూరు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్‌స్టేషన్ పరిసరాలు, ఫిర్యాదుదారుల విభాగం, స్పందనకు వచ్చే ప్రజలకు అందించే సౌకర్యాలు తదితరాలపై ఆరా తీశారు. రికార్డ్ గది, కంప్యూటర్ రూమ్, స్టోర్ రూ మ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్స్టేషన్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రాంగణంలో మొక్కలు నాటి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చూడాలన్నారు. జిల్లాలోని అన్ని స్టేషన్లలో తాను తనిఖీలు చేపడతానన్నారు. స్పందన కార్యక్రమానికి వచ్చే బాధితులు, ఫిర్యాదుదారుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహించాలన్నారు. జిల్లా అదనపు ఎస్పీ కె.ఈశ్వరరా వు, ఏలూరు డీఎస్పీ ఓ.దిలీప్‌కిరణ్, ఎస్బీ సీఐ రజ నీకుమార్, వన్‌టౌన్ సీఐ వై.బాలబాలాజీ, ఎస్సైలు ఎన్ఆర్ కిషోర్‌బాబు, ఎస్.రామకృష్ణ, అధికారులు, సిబ్బంది ఉన్నారు. -
పేకాట క్లబ్బులపై దాడి.. 122 మంది అరెస్ట్
సాక్షి, పశ్చిమగోదావరి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ఎస్పీ నవదీప్ సింగ్ పేకాట క్లబ్బులపై జూలు విదిలారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పేకాట క్లబ్బులపై దాడుల నిర్వహించిన పలువురిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. 17 క్లబ్బుల్లో దాడులు చేపట్టినట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో 122 మందిని అరెస్ట్ చేసి రెండు లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ఇక ప్రతివారం దాడులు నిర్వహిస్తామని హెచ్చరించారు. పేకాట, కోడిపందెలు వంటి వాటిని నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజా సమస్యలపై నేరుగా సమాచారం తెలిపేందుకు వాట్సాప్ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చామని అన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ఫిర్యాదులు అందించాలనుకునే వారు 9550351100 నెంబర్‌కు వాట్సాప్ చేయాలని కోరారు. ఫిర్యాదులు, వివరాలు ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని అన్నారు. వాట్సాప్ నంబర్ 24గంటలు అందుబాటులో ఉంటుందన్నారు. -
తమిళనాడు, బెంగాల్ ముఠాలు దిగాయి జాగ్రత్త!
విజయనగరం: తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌కు చెందిన దొంగల ముఠాలు ఉత్తరాంధ్ర జిల్లాలలో తిరుగుతున్నట్లు విజయనగరం జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ గ్రావెల్ హెచ్చరించారు. ఈ ముఠా సభ్యులు బ్యాంకుల ప్రజల దృష్టి మరల్చి చోరీలకు పాల్పడుతున్నట్లు చెప్పారు. చిల్లర నోట్లతో ప్రజల దృష్టి మరల్చి, పెద్ద మొత్తంని దోచేస్తుంటారన్నారు. వీరు విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలలో చోరీలకు పాల్పడినట్లు వివరించారు. బ్యాంకుల వద్ద అజ్ఞాత వ్యక్తుల సాయం తీసుకోవద్దని ఎస్పీ సలహా ఇచ్చారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో 9440795915 వాట్సప్ నెంబర్‌ను అందుబాటులో ఉంచినట్లు ఎస్పీ తెలిపారు. కాలేజీలలో, ఆర్టీసీ బస్సులలో ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడినా, మహిళలను వేధింపులకు గురిచేసినా ఈ నెంబర్‌కు మెసేజ్ పంపితే వెంటనే స్పందిస్తామని ఆయన చెప్పారు. -
ఆస్ట్రేలియా పర్యాటకురాలి నిర్బంధం
తమిళనాడు సరిహద్దుల్లో ఆస్ట్రేలియా పర్యాటకురాలు బోటులో ఒంటరిగా సంచరిస్తుండటంతో అనుమానంతో స్థానిక మత్స్యకారులు ఆదివా రం ఆమెను నిర్బంధిచారు. కాగా, తనను నిర్బంధించిన విషయమై ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవాల్‌కు ఆ పర్యాటకురాలు ఫిర్యా దు చేశారు. దీంతో తీరప్రాంత గస్తీ దళాలు, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాలతో తడ ఎస్ఐ అబ్దుల్జ్రాక్ పర్యాటకురాలు ఉన్న పళవేర్కాడుకు వెళ్లి వివరాలు సేకరించారు. ఆస్ట్రేలియాకు చెందిన శాన్డి (40) అనే మహిళ కాళ్లతో తొక్కి నడిపే బోటు ద్వారా జర్మనీ నుంచి ఆస్ట్రేలియాకు సముద్ర మార్గంలో పర్యటించాలని లక్ష్యంగా పెట్టుకొంది. ఈ లక్ష్యంతో ఆమె 2011లో జర్మనీ నుంచి బయల్దేరింది. 2016 నాటికి ఆస్ట్రేలియాకు చేరుకునేలా రూట్‌మ్యాప్ తయారు చేసుకున్న శాన్డి జీపీఆర్ఎస్ సిస్టం ద్వారా ప్రయాణం సాగిస్తోంది. ఈ నేపథ్యంలో తమిళనాడు సరిహద్దుల్లోకి రాగానే మత్స్యకారులు ఆమె భాషను అర్థం చేసుకోలేక అనుమానించి ఒడ్డుకు తీసుకొచ్చారు. రోజుకు 60 నుంచి 70 కిలోమీటర్లు ప్రయాణించే శాన్డి 2012లో గుజరాత్లో ప్రవేశించింది. కాగా, సోమవారం ఉదయం ఆమె తిరిగి ప్రయాణం సాగించేలా ఏర్పాట్లు చేసినట్టు ఎస్ఐ చెప్పారు.