జాతీయ స్థాయి ఇన్స్పైర్ పోటీలకు కృష్ణవేణి ప్రాజెక్టు ఎంపిక
పొదిలి: రాజమండ్రిలో జరిగిన ఇన్ స్పైర్ ప్రాజెక్టుల ప్రదర్శనలో పొదిలి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న మోరా కృష్ణవేణి ప్రాజెక్టు జాతీయ స్థారుుకి ఎంపికై ంది. ’స్మార్ట్ ఫోన్ మైక్రోస్కోప్’ ప్రాజెక్టును గైడ్ ఉపాధ్యాయుడు పూర్ణచంద్రరావు సహకారంతో కృష్ణవేణి తయారు చేశారు. స్మార్ట్ ఫోన్‌కు అదనంగా రూ.250 ఖర్చు చేయటం ద్వారా, మైక్రోస్కోప్ కంటే మరింత నాణ్యతగా ఈ యంత్రం పనిచేస్తుంది. రూ.20 వేల విలువ చేసే మైక్రోస్కోప్‌ను మరింత తక్కువగా అందుబాటులోకి తీసుకురావచ్చు. సాధారణ స్మార్ట్ ఫోన్‌ను మైక్రోస్కోప్‌గా ఏవిధంగా మార్చవచ్చో ప్రాజెక్టు ద్వారా కృష్ణవేణి నిరూపించింది.
ప్రభుత్వ పాఠశాలల్లోని ల్యాబ్‌లో ఈ మైక్రోస్కోప్‌ను అమర్చటం ద్వారా దాని సేవలను విద్యార్థులకు అందుబాటులోకి తేవచ్చు. కరెన్సీలో నిగూఢంగా ఉన్న సెక్యూరిటీ ఫొటోగ్రఫీని కూడా గుర్తించవచ్చు. జాతీయ స్థారుుకి ఎంపికై న ప్రాజెక్టును ప్రదర్శించిన కృష్ణవేణి, గైడ్‌గా వ్యవహరించిన పూర్ణచంద్రరావును, జిల్లా సైన్సు అధికారి ఎం.శ్రీనివాసరెడ్డి, ఎంఈవో బాషురాణి, ఉపాధ్యాయుడు చంద్రశేఖర్ అభినందించారు. న్యూఢిల్లీలో డిసెంబర్ 9-11వ తేదీల్లో జాతీయ స్థారుు ప్రాజెక్టుల ప్రదర్శన జరుగుతుందని గైడ్ టీచర్ పూర్ణచంద్రరావు తెలిపారు.