Spanish embassy
-
కారు నిండా బాంబులతో వచ్చి పేల్చుకున్నాడు
కాబుల్: అఫ్గనిస్థాన్‌లో తాలిబన్లు రెచ్చిపోయారు. బాంబులతో ఆత్మాహుతి దాడులకు పాల్పడటంతో మొత్తం 12 మంది ప్రాణాలుకోల్పోయారు. స్పానిష్ రాయభార కార్యాలయానికి అతి సమీపంలో ఈ బాంబు దాడి జరిగింది. దీంతో స్పానిష్ జాతీయులు ఇద్దరు చనిపోయారు. మరో ఐదుగురు పోలీసు అధికారులు కూడా మృత్యువాత పడ్డారు. ' షైరీ పూర్ లోని అతిథి గృహం ప్రవేశ ద్వారం వద్దకు ఓ కారులో బాంబులను వేసుకొని, తాను కూడా బాంబుల జాకెట్ ధరించి ఓ ఉగ్రవాది లోపలికి ప్రవేశించగా మరో ముగ్గురు కూడా ఆయుధాలతో వచ్చి ఒక్కసారిగా పేల్చేసుకున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా ధ్వంసమైంది' అని అఫ్గనిస్థాన్ అధికారులు చెప్పారు. భూకంపం సంభవించిన మాదిరిగా పేలుడు ధాటికి భూమి కంపించిందని అధికారులు చెప్పారు. తాము నిజంగానే భూకంపం సంభవించిందన్నారు. -
స్పానిష్ రాయబార కార్యాలయం వద్ద బాంబు పేలుడు
ట్రిపోలీ: లిబియా రాజధాని ట్రిపోలీలోని స్పానిష్ రాయబార కార్యాలయం వద్ద మంగళవారం శక్తిమంతమైన బాంబు పేలుడు సంభవించింది. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు... కానీ కార్యాలయంలోని సామాగ్రి ధ్వంసమైందని భద్రతాధికారులు వెల్లడించారు. రాయబార కార్యాలయాన్ని నెల క్రితమే ఖాళీ చేశామని తెలిపారు. గత వారం ట్రిపోలీలోని మొరాకో రాయబార కార్యాలయం వద్ద బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో రాయబార కార్యాలయం గోడ ధ్వంసమైంది. అలాగే ఈ బాంబు పేలుడుకు కొన్ని గంటల ముందు ట్రిపోలిలోని దక్షిణ కొరియా రాయబార కార్యాలయంపై తీవ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు భద్రత సిబ్బంది మాతి చెందగా... ఒకరు తీవ్రంగా గాయపడిన విషయం విదితమే.