కాబుల్: అఫ్గనిస్థాన్లో తాలిబన్లు రెచ్చిపోయారు. బాంబులతో ఆత్మాహుతి దాడులకు పాల్పడటంతో మొత్తం 12 మంది ప్రాణాలుకోల్పోయారు. స్పానిష్ రాయభార కార్యాలయానికి అతి సమీపంలో ఈ బాంబు దాడి జరిగింది. దీంతో స్పానిష్ జాతీయులు ఇద్దరు చనిపోయారు. మరో ఐదుగురు పోలీసు అధికారులు కూడా మృత్యువాత పడ్డారు.
' షైరీ పూర్ లోని అతిథి గృహం ప్రవేశ ద్వారం వద్దకు ఓ కారులో బాంబులను వేసుకొని, తాను కూడా బాంబుల జాకెట్ ధరించి ఓ ఉగ్రవాది లోపలికి ప్రవేశించగా మరో ముగ్గురు కూడా ఆయుధాలతో వచ్చి ఒక్కసారిగా పేల్చేసుకున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా ధ్వంసమైంది' అని అఫ్గనిస్థాన్ అధికారులు చెప్పారు. భూకంపం సంభవించిన మాదిరిగా పేలుడు ధాటికి భూమి కంపించిందని అధికారులు చెప్పారు. తాము నిజంగానే భూకంపం సంభవించిందన్నారు.
కారు నిండా బాంబులతో వచ్చి పేల్చుకున్నాడు
Published Sat, Dec 12 2015 3:17 PM | Last Updated on Sun, Sep 3 2017 1:53 PM
Advertisement
Advertisement