'పార్టీ మారిన వారిపై చర్యలు ఇంకెప్పుడు'
హైదరాబాద్: పార్టీమారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ఛాంబర్లో టీటీడీపీ ఎమ్మెల్యేలు సోమవారం బైఠాయించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ మధుసూదనాచారి వారితో చెప్పారు.ఎప్పటిలోగా నిర్ణయం తీసుకుంటారో కచ్చితంగా తేదీ చెప్పాలని టీటీడీపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.