Special Assembly session
-
సీఎంకు చివరి నిమిషంలో షాక్ ఇచ్చిన గవర్నర్
సాక్షి,న్యూఢిల్లీ: పంజాబ్ గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు. సెప్టెంబర్ 22న పంజాబ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి అనుమతి నిరాకరించారు. విశ్వాస పరీక్ష ఎదుర్కొనేందుకు సీఎం భగవంత్ మాన్ ఈ సెషన్ నిర్వహించనున్నట్లు రెండు రోజుల క్రితమే ప్రకటించారు. ఇప్పుడు గవర్నర్ నిర్ణయంతో షాక్‌కు గురయ్యారు. అసెంబ్లీ సెషన్‌కు గవర్నర్ అనుమతి నిరాకరించడంపై ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని మండిపడ్డారు. సభ నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించిందని, రెండు రోజుల క్రిత అనుమతి ఇచ్చిన గవర్నర్ ఇప్పుడు చివరి నిమిషంలో ఆదేశాలను ఎందుకు ఉపసంహరించుకున్నారని ప్రశ్నించారు. పంజాబ్‌లో ఆపరేషన్ లోటస్ విఫలమైందని, అందుకే కేంద్రం నుంచి ఒత్తిడితోనే గవర్నర్ ఇలా చేస్తున్నారని ఆరోపించారు. ఈమేరకు ట్వీట్ చేశారు. తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆప్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.25కోట్లు ఆశజూపారని పంజాబ్ మంత్రి అన్నారు. ఈ నేపథ్యంలోనే తమ బలం నిరూపించుకునేందుకు విశ్వాస పరీక్ష ఎదుర్కొంటామని, ఇందుకోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహిస్తామని సీఎం భగవంత్ మాన్ ఇటీవల ప్రకటించారు. ఇదే ఆరోపణలతో ఢిల్లీ అసెంబ్లీలో సెప్టెంబర్ మొదటివారంలోనే విశ్వాసపరీక్ష ప్రవేశపెట్టి బలం నిరూపించుకున్నారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. తమ పార్టీకి చెందిన ఒక్క ఎమ్మెల్యే కూడా బీజేపీ ప్రలోభాలకు లొంగలేదని స్పష్టం చేశారు. చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై అశోక్ గహ్లోత్ కీలక వ్యాఖ్యలు -
ఆప్ ఎమ్మెల్యేలకు బీజేపీ ఫోన్! విశ్వాస పరీక్ష ఎదుర్కోనున్న సీఎం
చండీగఢ్: ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ నెల మొదట్లో ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి బలం నిరూపించుకున్నారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఇప్పుడు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా విశ్వాస పరీక్షకు సిద్ధమవుతున్నారు. సెప్టెంబర్ 22న(గురువారం) పంజాబ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సభలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. పంజాబ్ ప్రజల కలలను సాకారం చేసేందుకు ఆప్ ఎమ్మెల్యేలు కృత నిశ్చయంతో ఉన్నారని రుజువు చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చెప్పారు. ప్రస్తుతం జర్మనీ పర్యటనలో ఉన్న ఆయన ఈమేరకు వీడియో సందేశం పంపారు. ਲੋਕਾਂ ਦੇ ਵਿਸ਼ਵਾਸ ਦੀ ਦੁਨੀਆਂ ਦੀ ਕਿਸੇ ਕਰੰਸੀ ਵਿੱਚ ਕੋਈ ਕੀਮਤ ਨਹੀਂ ਹੁੰਦੀ …22 September ਦਿਨ ਵੀਰਵਾਰ ਨੂੰ ਪੰਜਾਬ ਵਿਧਾਨ ਸਭਾ ਦਾ ਸਪੈਸ਼ਲ ਸ਼ੈਸ਼ਨ ਬੁਲਾ ਕੇ ਵਿਸ਼ਵਾਸ ਮਤਾ ਪੇਸ਼ ਕਰਕੇ ਕਾਨੂੰਨੀ ਤੌਰ ‘ਤੇ ਇਹ ਗੱਲ ਸਾਬਤ ਕਰ ਦਿੱਤੀ ਜਾਵੇਗੀ…ਇਨਕਲਾਬ ਜ਼ਿੰਦਾਬਾਦ..! pic.twitter.com/VM2zA1upDP — Bhagwant Mann (@BhagwantMann) September 19, 2022 తమ ఎమ్మెల్యేలను బీజేపీ సంప్రదిస్తోందని పంజాబ్ ఆర్థిక మంత్రి హర్పాల్ సింగ్ ఛీమ ఇటీవలే ఆరోపించారు. ఒక్క ఎమ్మెల్యేలకు రూ.25 కోట్లు ఇస్తామని ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. దాదాపు 11 మంది ఆప్ ఎమ్మెల్యేలకు బీజేపీ నుంచి ఫోన్ వచ్చినట్లు చెప్పారు. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతోందన్నారు. కాగా.. ఈ నెలలోనే ఢిల్లీ అసెంబ్లీలో బలం నిరూపించుకున్నారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. అనంతరం ఒక్క ఎమ్మెల్యే కూడా బీజేపీ ప్రలోభాలకు తలొగ్గలేదని చెప్పారు. ఈ విశ్వాస పరీక్షలో ఆప్‌కు 58 ఓట్లు వచ్చాయి. మరో నలుగురు ఎమ్మెల్యేలు వ్యక్తిగత కారణాలతో అసెంబ్లీకి హాజరు కాలేదు. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 సీట్లు కాగా.. ఆప్‌కు 62, బీజేపీకి 8 మంది సభ్యులున్నారు. చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష బరిలో శశి థరూర్! సోనియాతో కీలక భేటీ -
ఏపీ అసెంబ్లీ: ముగిసిన బీఏసీ సమావేశం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే ఏపీ కేబినెట్ ఆమోదించిన శాసనమండలి రద్దు తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాంకు ప్రభుత్వం అందించింది. అయితే ఈ రద్దు తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరగాలంటే బీఏసీ సమావేశం కావాలని స్పీకర్ సూచిస్తూ అసెంబ్లీని వాయిదా వేశారు. బీఏసీ సమావేశం అనంతరం తిరిగి సభ ప్రారంభం కానుంది. ముగిసిన బీఏసీ సమావేశం.. ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారం అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశం ముగిసింది. ఈ ఒక్క రోజు(సోమవారం) మాత్రమే అసెంబ్లీ జరపాలని నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా నేటి అసెంబ్లీ సమావేశంలో మండలి రద్దుపై సుదీర్ఘంగా చర్చించాలని నిర్ణయించింది. మండలి రద్దుతో పాటు మరికొన్ని బిల్లులను కూడా ప్రవేశపెట్టేందుకు బీఏసీ సుముఖత వ్యక్తం చేసింది. ఇక ఈ సమావేశానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, అనిల్‌కుమార్ యాదవ్, కన్నబాబు, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి సంబంధించిన పలు కీలక బిల్లులను శాసనమండలి అడ్డుకుంటున్న నేపథ్యంలో మండలిని రద్దుపై చర్చించనుంది. ఇప్పటికే ఏపీ కేబినెట్ శాసనమండలి రద్దుకు ఆమోదం తెలిపింది. దీంతో ఈ బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరగనుంది. అభివృద్ది-పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ వంటి కీలకబిల్లులను మండలిలో టీడీపీ అడ్డుకుంటూ సైంధవ పాత్ర పోషిస్తోందని అధికార పార్టీ ఆరోపిస్తోంది. అంతేకాకుండా ఈ రెండు బిల్లుల విషయంలో నిబంధనలను పాటించలేదని, ఇది తప్పేనని, అయినా సెలెక్ట్ కమిటీకి పంపిస్తామని శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. చదవండి: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం లోకేష్ తీరు... బాగా బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకెళ్లి -
వెనక్కి తగ్గిన కేజ్రీవాల్!
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోదీపై ఘాటైన విమర్శలతో విరుచుకుపడే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెనక్కి తగ్గారు. తమ మంత్రులపై, అనుచరులపై వ్యతిరేకంగా నమోదుచేసిన అభియోగాలు, కేసుల వెనుక దాగిఉన్న కేంద్ర కుట్రపూరిత చర్యను నేడు బయటపెడతామన్న కేజ్రీవాల్ దాన్ని విరమించుకున్నట్టు తెలుస్తోంది. నియంత్రణ రేఖ వెంబడి పాక్ ఉగ్రశిబిరాలపై భారత్ సైన్యం దాడి చేసిందనే వార్తతో కేజ్రీవాల్ సద్దుమణిగినట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్ర కుట్రపూరిత చర్యను బయటపెట్టడానికి కేజ్రీవాల్ నేడు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. కానీ ఈ సమావేశాల్లో కేజ్రీవాల్, మోదీ ప్రభుత్వంపై సానుకూలంగా స్పందించినున్నట్టు పేర్కొంటున్నాయి. కేజ్రీవాల్‌పై, ఆయన పార్టీ నేతలపై నమోదైన కుట్రపూరిత చర్యలను నిగ్గుతేల్చడాన్ని కేజ్రీవాల్ వాయిదా వేసిన్నట్టు తెలిపాయి. కాగ, "ఆప్ ఎమ్మెల్యేలపై, నేతలపై కేంద్రం తప్పుడు కేసులు బనాయిస్తోంది. తనకు వ్యతిరేకంగా ఎఫ్ఆర్ఐ నమోదుచేసింది.నాపై సీబీఐ ఎందుకు దాడిచేసింది. ఇది కేంద్ర నిర్వహించిన అతిపెద్ద కుట్రపూరిత చర్యనే. ఈ విషయాన్ని శుక్రవారం జరుగబోయే ఢిల్లీ అసెంబ్లీ సమావేశంలో కచ్చితంగా బయటపెడతాం" అని కేజ్రీవాల్ మంగళవారం ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. నేడు జరుగబోయే సమావేశాల్లో కేవలం ఢిల్లీని పట్టిపీడిస్తున్న చికెన్‌గున్యా, డెంగ్యూ జ్వరాలపై మాత్రమే పార్టీ ఎమ్మెల్యేలు చర్చించనున్నట్టు ప్రభుత్వ అధికారులు చెప్పారు. నియంత్రణ రేఖ వెంబడి మోహరించిన ఉన్న పాక్ ఉగ్రశిబిరాలపై భారత్ సైన్యం మెరుపుదాడి చేసిందని డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రణ్‌బీర్‌సింగ్ ప్రకటించగానే, అరవింద్ కేజ్రీవాల్ ఆయన అధికారిక నివాసంలో నిర్వహించాల్సిన ప్రెస్ కాన్ఫరెన్స్‌ను సైతం వాయిదా వేశారు. ఆ ప్రకటన అనంతరం భారత్ మాతాకి జై, జాతి యావత్తు సైన్యం వెనుక ఉంటుందని ఆయన ట్వీట్ చేశారు.