వెనక్కి తగ్గిన కేజ్రీవాల్!
వెనక్కి తగ్గిన కేజ్రీవాల్!
Published Fri, Sep 30 2016 12:49 PM | Last Updated on Mon, Sep 4 2017 3:39 PM
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోదీపై ఘాటైన విమర్శలతో విరుచుకుపడే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెనక్కి తగ్గారు. తమ మంత్రులపై, అనుచరులపై వ్యతిరేకంగా నమోదుచేసిన అభియోగాలు, కేసుల వెనుక దాగిఉన్న కేంద్ర కుట్రపూరిత చర్యను నేడు బయటపెడతామన్న కేజ్రీవాల్ దాన్ని విరమించుకున్నట్టు తెలుస్తోంది. నియంత్రణ రేఖ వెంబడి పాక్ ఉగ్రశిబిరాలపై భారత్ సైన్యం దాడి చేసిందనే వార్తతో కేజ్రీవాల్ సద్దుమణిగినట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్ర కుట్రపూరిత చర్యను బయటపెట్టడానికి కేజ్రీవాల్ నేడు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. కానీ ఈ సమావేశాల్లో కేజ్రీవాల్, మోదీ ప్రభుత్వంపై సానుకూలంగా స్పందించినున్నట్టు పేర్కొంటున్నాయి. కేజ్రీవాల్పై, ఆయన పార్టీ నేతలపై నమోదైన కుట్రపూరిత చర్యలను నిగ్గుతేల్చడాన్ని కేజ్రీవాల్ వాయిదా వేసిన్నట్టు తెలిపాయి.
కాగ, "ఆప్ ఎమ్మెల్యేలపై, నేతలపై కేంద్రం తప్పుడు కేసులు బనాయిస్తోంది. తనకు వ్యతిరేకంగా ఎఫ్ఆర్ఐ నమోదుచేసింది.నాపై సీబీఐ ఎందుకు దాడిచేసింది. ఇది కేంద్ర నిర్వహించిన అతిపెద్ద కుట్రపూరిత చర్యనే. ఈ విషయాన్ని శుక్రవారం జరుగబోయే ఢిల్లీ అసెంబ్లీ సమావేశంలో కచ్చితంగా బయటపెడతాం" అని కేజ్రీవాల్ మంగళవారం ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
నేడు జరుగబోయే సమావేశాల్లో కేవలం ఢిల్లీని పట్టిపీడిస్తున్న చికెన్గున్యా, డెంగ్యూ జ్వరాలపై మాత్రమే పార్టీ ఎమ్మెల్యేలు చర్చించనున్నట్టు ప్రభుత్వ అధికారులు చెప్పారు. నియంత్రణ రేఖ వెంబడి మోహరించిన ఉన్న పాక్ ఉగ్రశిబిరాలపై భారత్ సైన్యం మెరుపుదాడి చేసిందని డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రణ్‌బీర్‌సింగ్ ప్రకటించగానే, అరవింద్ కేజ్రీవాల్ ఆయన అధికారిక నివాసంలో నిర్వహించాల్సిన ప్రెస్ కాన్ఫరెన్స్ను సైతం వాయిదా వేశారు. ఆ ప్రకటన అనంతరం భారత్ మాతాకి జై, జాతి యావత్తు సైన్యం వెనుక ఉంటుందని ఆయన ట్వీట్ చేశారు.
Advertisement