Special Date
-
ఇవాళ వాట్సాప్‌లో విపరీతంగా వైరల్ అయ్యింది ఇదే!
22-02-2022.. అఫ్కోర్స్ ఇవాళ్టి ఈ తేదీ ప్రత్యేకత గురించి చెప్పనక్కర్లేదు. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఈ తేదీ మీద స్టేటస్లు, ఫార్వర్డ్ మెసేజ్‌లు చూస్తూ ఉన్నారు కదా. పొద్దున గుడ్‌మార్నింగ్ మెసేజ్ ప్లేస్‌లో చాలామంది ఈ మెసేజ్‌తో ఛాటింగ్ మొదలుపెట్టి ఉంటారు. Tuesday ను Twosdayగా వర్ణిస్తూ.. సోషల్ మీడియాలో విపరీతంగా మీమ్స్ వైరల్ అయ్యాయి.. అవుతున్నాయి కూడా. మరోపక్క ట్రోలింగ్ సంగతి సరేసరి!. మరి ఈ స్పెషల్ డేకు కొన్ని పేర్లుంటాయి అని తెలుసా? 2-2-22.. సాధారణంగా ఇలాంటి తేదీలను సిమ్మెట్రికల్ లేదంటే పాలిండ్రోమ్ అంటారు. ముందు, వెనకాల నుంచి చదివినా ఒకేలా ఉంటాయి కాబట్టి ఆ పేరొచ్చింది. రెండు అనే అంకె కారణంగా మళ్లీ రెండు వందల ఏళ్ల తర్వాతే 2 అనే నెంబర్ మీద ఇలాంటి తేదీ వస్తుంది. పాలిండ్రోమ్ చివరిసారిగా 11 జనవరి 2011(11-1-11)లో కనిపించింది. మళ్లీ 11 ఏళ్ల తర్వాత మార్చి 3, 2033లో.. 3-3-33గా వస్తుంది. Today's date (22/02/2022) is both a palindrome AND an ambigram! It reads the same left to right, right to left, and when turned upside down. pic.twitter.com/2fQwBWaTg0 — Royal Institution (@Ri_Science) February 22, 2022 me on 1-1-11 same me on 2-2-22 at 11:11 🌸 at 2:22 🔥 pic.twitter.com/FFOOc9NQHX — amazon prime video IN (@PrimeVideoIN) February 22, 2022 పోస్టులే.. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు మాత్రమే కాదు.. సెలబ్రిటీలు సైతం ఈ ప్రత్యేక డేట్‌ను సెలబ్రేట్ చేసుకున్నారు. నటి సమంత కొత్త చిత్రం ‘Kaathuvaakula Rendu Kaadhal’ టూ టూ టూ టూ సాంగ్ మీమ్స్‌లో మారుమోగిపోతోంది. ఇందులో విజయ్ సేతుపతి సామ్, నయన్ ఇద్దరినీ ఒకేసారి లవ్ చేస్తాడులేండి. నేహా ధూపియా, రవీనా టాండన్లాంటి బాలీవుడ్ వాళ్లూ ఈ తేదీని ఆస్వాదించారు. Happy TwosDay, people! Since it is 22022022 today, we remind you to think twice about your MOM and DAD before you speed!#RoadSafety#Palindrome — Delhi Police (@DelhiPolice) February 22, 2022 అంబిగ్రామ్ అంటే.. ఇవాళ్టి తేదీ పాలిండ్రోమ్ మాత్రమే కాదు.. అంబిగ్రామ్ కూడా. అటు ఇటు మాత్రమే కాదు.. పూర్తి తేదీని ఉల్టాపల్టా చేసినా కూడా అదే తేదీ కనిపిస్తుందట. 22-02-2022.. ఇలాగన్నమాట. ఇదిలా ఉంటే 21వ శతాబ్ధంలో మొత్తం 12 పాలిండ్రోమ్ తేదీలు ఉన్నాయి. మొదటిది.. అక్టోబర్ 2, 2001(10-02-2001). చివరిది.. 29 ఫిబ్రవరి 2092(29-02-2092)లో రానుంది. విశేషం ఏంటంటే.. లీప్ ఈయర్ కావడం వల్లే ఈ తేదీ రావడం. ఈ మధ్యలో వచ్చే Feb 8, 2080 (08-02-2080) దాకా మనం బతికి ఉంటామో లేదో అంటూ మీమ్స్ పెడుతున్నారు ఉన్నారు. When your phone knows it's #Twosday pic.twitter.com/eUiwLHEzZD — Vodafone UK (@VodafoneUK) February 22, 2022 సంబంధిత వార్త: మళ్లీ మళ్లీ ఇది రానిరోజు -
ఈ రోజు ఇరు జట్లకు ప్రత్యేకం
సాక్షి, హైదరాబాద్: సరిగ్గా ఏడేళ్ల క్రితం ఇదే రోజు (డిసెంబర్ 15) వన్డే క్రికెట్ చరిత్రలోనే భారత్ - శ్రీలంక జట్లకు ప్రత్యేకం. రాజ్‌కోట్ వేదికగా నరాలు తెగేంత ఉత్కంఠ మధ్య సాగిన ఈ మ్యాచ్ సగటు భారత అభిమానికి గుర్తుండే ఉంటుంది. వన్డే క్రికెట్ చరిత్రలోనే ఇరు జట్లు 400కు పైగా పరుగులు చేయడం రెండోసారి మాత్రమే. అంతేకాకుండా క్రికెట్ చరిత్రలోనే ఇరు జట్ల టాప్-3 బ్యాట్స్మెన్లు 50పైగా పరుగులు చేయడం తొలి సారి. అప్పటికి వన్డేల్లో భారత్ కూడా అత్యధిక స్కోర్ ఇదే కావడం విశేషం. (తర్వాత 2011లో వెస్టిండీస్‌పై భారత్ 418 పరుగులు చేసింది.) ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల బ్యాట్స్‌మెన్ పరుగుల తుఫానునే సృష్టించారు. నువ్వా-నేనా అన్నట్లు చివరి వరకు సాగిన ఈ సమరంలో నెహ్రా అద్భుత బౌలింగ్‌తో విజయం భారత్‌నే వరించింది. మ్యాచ్ భారత్ గెలిచినా ఇరు జట్లకు ఈ మ్యాచ్ ఓ ప్రత్యేకంగా నిలిచిపోయింది. టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకోగా భారత్ బ్యాటింగ్‌కు దిగింది. డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(146) విరోచిత ఇన్నింగ్స్‌కు మాస్టర్ బ్లాస్టర్ సచిన్(63), మహేంద్ర సింగ్ ధోని(72)లు తోడవ్వడంతో భారత్ అలవోకగా శ్రీలంకకు 414 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఈ భారీ లక్ష్యానికి ఎంత మాత్రం భయపడని ఆతిథ్య జట్టు దిల్షాన్(160) భారీ ఇన్నింగ్స్‌కు సంగక్కర(90), ఉపుల్ తరంగ (67)లు చెలరేగడంతో 411 పరుగులు చేసి 3 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. ధోని మార్క్ కెప్టెన్సీ.. చివరి ఓవర్లో లంక విజయానికి 11 పరుగుల కావాలి.. క్రీజులో ఆలౌరౌండర్ బ్యాట్స్‌మన్ మాథ్యూస్ ఉన్నాడు. అప్పటి వరకు చాలా పరుగులిచ్చిన నెహ్రాకు బౌలింగ్ ఇచ్చాడు ధోని. ఇక శ్రీలంక విజయం సులవనుకున్నారు అందరూ.. కానీ ఇక్కడ ధోని మార్క్ కెప్టెన్సీ లంక విజయాన్ని అడ్డుకుంది. మాథ్యూస్ అవుట్ చేయడంలో సఫలమైన నెహ్రా ఒక్క బౌండరీ ఇవ్వకుండా కేవలం ఏడు పరుగులే ఇచ్చాడు. ఆసాంతం ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ పైచేయి సాధించడం భారత అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ఆ మధుర క్షణం ప్రతి అభిమాని గుండెల్లో నిలిచిపోయింది. -
వచ్చేస్తోందీ
వందల వేల ఏళ్లకు ఒకసారి మాత్రమే వచ్చే ప్రత్యేకమైన తేదీలను మనకు ఒకటొకటిగా అందిస్తున్న మిలీనియం అదే కోవలో ఇప్పుడు మరో అపురూపమైన తేదీని మన ముందుకు తెస్తోంది. అదే 11-12-13. ఈ ప్రత్యేకమైన సందర్భాన్ని వినియోగించుకునేందుకు ఎప్పటిలానే నగరవాసులు ఉవ్విళ్లూరుతున్నారు. - సాక్షి, లైఫ్‌స్టైల్‌ప్రతినిధి, కాలేజ్ కరస్పాండెంట్ 2000 నుంచి 2012 వరకు వివిధ ప్రత్యేకమైన వందల ఏళ్లకు మాత్రమే మళ్లీ సాకారమయ్యే అరుదైన తేదీలను మనం చూశాం. అదే విధంగా అందివస్తోంది 11-12-13. ఇప్పటికే పలువురు కొన్ని ఒప్పందాలకు, కీలక నిర్ణయాలకు, కొత్త ప్రారంభాలకు.. ఈ తేదీ కోసం అట్టిపెట్టుకున్నారు. మరోవైపు పార్టీలకు, వేడుకలకు నెలవులాంటి చలికాలపు సంవత్సరాంతపు నెల కావడంతో యువ బృందాలు ఈ ప్రత్యేక తేదీని అందివచ్చిన అవకాశంగా సెలబ్రేట్ చేసుకునేందుకు తగిన ప్లేస్‌ల ఎంపికలో మునిగిపోయాయి. అలాగే కొన్ని హోటల్స్, రెస్టారెంట్స్ సైతం ఈ తేదీన స్పెషల్ పార్టీ ఈవెనింగ్స్‌ను నిర్వహిస్తున్నాయి. ఈ తేదీ సంప్రదాయంగా మంచిదా, చెడ్డదా అనే మీ మాంసల్ని పక్కన పెడితే.. యూత్ ఈ డేట్‌ను ఒక మరపురాని జ్ఞాపకంగా మలచుకోవడానికి యత్నిస్తున్నారు. ఆ తేదీకి సమయం 14 గంటల 15 నిమిషాల 16 సెకన్లు... (14:15:16)కూడా కలిపితే మరింత అరుదైన సందర్భం అవుతుందని భావిస్తున్న పలువురు సరిగ్గా అదే సమయానికి కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలతో సిద్ధమవుతున్నారు.