వచ్చేస్తోందీ | Rare date is coming for this century | Sakshi
Sakshi News home page

వచ్చేస్తోందీ

Published Sun, Dec 1 2013 10:03 AM | Last Updated on Sat, Sep 2 2017 1:10 AM

వచ్చేస్తోందీ

వచ్చేస్తోందీ

  • వందల వేల ఏళ్లకు ఒకసారి మాత్రమే వచ్చే ప్రత్యేకమైన తేదీలను మనకు ఒకటొకటిగా అందిస్తున్న మిలీనియం అదే కోవలో ఇప్పుడు మరో అపురూపమైన తేదీని మన ముందుకు తెస్తోంది. అదే 11-12-13. ఈ ప్రత్యేకమైన 
  •  సందర్భాన్ని వినియోగించుకునేందుకు ఎప్పటిలానే నగరవాసులు 
  •  ఉవ్విళ్లూరుతున్నారు. - సాక్షి, లైఫ్‌స్టైల్‌ప్రతినిధి, కాలేజ్ కరస్పాండెంట్
  •  
     2000 నుంచి 2012 వరకు వివిధ ప్రత్యేకమైన వందల ఏళ్లకు మాత్రమే మళ్లీ సాకారమయ్యే అరుదైన తేదీలను మనం చూశాం. అదే విధంగా అందివస్తోంది 11-12-13. ఇప్పటికే పలువురు కొన్ని ఒప్పందాలకు, కీలక నిర్ణయాలకు, కొత్త ప్రారంభాలకు.. ఈ తేదీ కోసం అట్టిపెట్టుకున్నారు. మరోవైపు పార్టీలకు, వేడుకలకు నెలవులాంటి చలికాలపు సంవత్సరాంతపు నెల కావడంతో యువ బృందాలు ఈ ప్రత్యేక తేదీని అందివచ్చిన అవకాశంగా సెలబ్రేట్ చేసుకునేందుకు తగిన ప్లేస్‌ల ఎంపికలో మునిగిపోయాయి. అలాగే కొన్ని హోటల్స్, రెస్టారెంట్స్ సైతం ఈ తేదీన స్పెషల్  పార్టీ ఈవెనింగ్స్‌ను నిర్వహిస్తున్నాయి. ఈ తేదీ సంప్రదాయంగా మంచిదా, చెడ్డదా అనే మీ మాంసల్ని పక్కన పెడితే.. యూత్ ఈ డేట్‌ను ఒక మరపురాని జ్ఞాపకంగా మలచుకోవడానికి యత్నిస్తున్నారు. ఆ తేదీకి సమయం 14 గంటల 15 నిమిషాల 16 సెకన్లు... (14:15:16)కూడా కలిపితే మరింత అరుదైన సందర్భం అవుతుందని భావిస్తున్న పలువురు సరిగ్గా అదే సమయానికి కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలతో సిద్ధమవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement